మెయన్ ఫీచర్

పాక్ నెత్తిన చైనా ‘్భస్మాసుర హస్తం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అన్నీ మంచి శకునములే- కన్యాలాభ హేతువులే’ అని మాయాబజార్ సినిమాలో ఒక పాట ఉంది. ఇలాగే ఇప్పుడు మన దేశానికి ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థ కాస్త కుదుటపడుతుండగా, మరోవైపు అంతర్జాతీయంగా భారత్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ క్రమంగా చైనా వ్యూహంలో చిక్కుకుంటోంది. ఇది ఒక రకంగా భారత్‌కు మేలు జరిగే పరిణామమే. పాకిస్తాన్‌కు చెందిన ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక ఇటీవల ఓ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. చైనా, పాక్ కలిసి 4,600 కోట్ల రూపాయల వ్యయం కాగల ‘ఉమ్మడి ఆర్థిక కారిడార్’కు రూపకల్పన చేశాయన్నది ఆ వార్త సారాంశం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా సాగే ఈ కారిడార్‌తో చైనా అరేబియా సముద్రంపై ఆధిపత్యం సంపాదిస్తుంది. పాక్‌లోని బెలూచిస్థాన్ మధ్య నుండి చైనా ఇప్పటికే రోడ్డు నిర్మించడంతో బెలూచీలు ఆందోళనకు దిగారు. అత్యంత కీలకమైన గ్వాడార్ రేవుపై పట్టు సాధించడమే చైనా అసలు వ్యూహం. తన వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుని, వివిధ దేశాలపై ఆధిపత్యం చలాయించేందుకు చైనా బరితెగిస్తోంది. ఇందులో భాగంగానే చైనా పాకిస్తాన్‌ను అన్ని విధాలుగా వాడుకుంటోంది. ఒకప్పుడు అమెరికాతో సన్నిహితంగా మెలిగిన పాక్ ఇపుడు చైనా చంకనెక్కి భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. చైనా విసిరిన వలలో చిక్కుకున్న పాకిస్తాన్ భవిష్యత్‌లో అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొనక తప్పదు. వాణిజ్య మాయాజాలంతో లబ్ధిపొందే చైనా పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ- ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభాల ఫలితంగా పాక్ అన్ని విధాలా నష్టపోతుంది. ఈ పరిణామాలన్నీ భారత్‌కు కలిసి వచ్చేవే. చైనా వంటి అగ్రరాజ్యాలు చేసే వ్యాపార రాజకీయాలకు బలైపోయేది చిన్నదేశాలే అన్న నగ్నసత్యాన్ని పాకిస్తాన్ తెలుసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు.
ఇది దేశ భద్రతకు ఆందోళన కలిగించే విషయం. పాకిస్తాన్ జిహాదీ వర్గాలను ఇండియాకు వ్యతిరేకంగా చైనా ఎగదోస్తున్నది. 51 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పాకిస్తాన్‌లోకి చైనా డంప్ చేయడం ద్వారా పాకిస్తాన్ మరొక ఈస్టిండియా కంపెనీ నాటి అనుభవాన్ని చవిచూడబోతున్నది. 2016లో భారత ఆర్థిక వృద్ధిరేటు 7.6. 2015లో అది 7.3గా ఉండేది. కానీ, చైనా వృద్ధి రేటు 6.9 మాత్రమే. ఈ పరిణామం చైనాకు ఆందోళన కల్గించే విషయం. ఒకప్పుడు అమెరికా పాకిస్తాన్‌ను తన వలస దేశంగా మార్చుకొని ఆయుధాల వ్యాపారం చేసుకున్నట్లే ఇప్పుడు చైనా పాకిస్తాన్‌ను ఆవిధంగా ఉపయోగించుకుంటున్నది. ఇప్పటికే పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అందించిన ఆధికారిక సమాచారం ప్రకారం వారి విదేశీ ఋణం 74 లక్షల కోట్ల రూపాయలు. పాకిస్తాన్‌లో చాలా ప్రాంతాల్లో విద్యుత్తు లేదు. కొన్ని ప్రాంతాల్లో రోజుకు 20 గంటల సేపు విద్యుత్ కోత ఉంటుంది. దీనిని అదునుగా తీసుకొని చైనా 34.4 మిలియన్ల డాలర్ల పెట్టుబడితో పాకిస్తాన్‌లో విద్యుదుత్పత్తి కేంద్రాలు ప్రారంభించింది. పాకిస్తాన్‌లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 50 శాతం. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం 38.8 శాతం గర్భ దరిద్రులున్నారు. ఈ అవకాశాన్ని చైనా సద్వినియోగం చేసుకుంటున్నది.
గతంలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా పాకిస్తాన్‌ను వాడుకున్నది. ఇప్పుడు అమెరికా, భారత్‌లకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ను చైనా వాడుకుంటోంది. పాక్-చైనా సంయుక్త ఎకనమిక్ కారిడార్‌కు ఉగ్రవాద సంస్థల ముప్పు ఉంది. అయినప్పటికీ ఉగ్రవాదుల ఊసెత్తకుండా చైనా చాపకింద నీరులా తన పని తాను చేసుకుంటూపోతున్నది. అటు ఇండియా, ఇటు పాకిస్తాన్‌లను చైనా వ్యూహాత్మకంగా ఆక్రమించుకుంటున్నది. 1959లో టిబెట్‌ను కబళించింది. తర్వాత 2014లో భట్టారాయ్‌ను కీలుబొమ్మగా చేసుకుని నేపాల్‌ను ఆక్రమించుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో విధ్వంసక కార్యకలాపాలు మొదలుపెట్టింది. భారత్, నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో చైనా ‘రెడ్ కారిడార్’ను నిర్మించుకుని తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఆర్థిక, రక్షణ రంగాల్లో భారత్‌ను దెబ్బతీయడమే చైనా-పాక్‌ల ఉమ్మడి వ్యూహం. ఈ వ్యూహంలో చైనా ఎంతమేరకు విజయం సాధిస్తుందన్న సంగతిని పక్కన పెడితే, భవిష్యత్‌లో పాకిస్తాన్‌కు మాత్రం కష్టాలు తప్పవు. భారత్‌పైకి ఉసిగొల్పుతూ, క్రమంగా పాక్‌ను కబళించడమే చైనా అంతరంగం అని చెప్పక తప్పదు.
విదూషకుడైన రాహుల్
సహారా, బిర్లా డైరీల్లో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉందని కాంగ్రెస్ యువరాజావారు రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించారు. నిజానికి ఆ డైరీలు 2013 నాటివి. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఆనాడు ఆ డైరీల గురించి కాంగ్రెస్ నేతలెవరూ ఎందుకు నోరు విప్పలేదు? సుప్రీం కోర్టు మోదీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక, డైరీల బాగోతానికి వస్తే ‘కెజిబి’ డైరీల్లో ‘సోనియా గాంధీ సిఐఏ ఏజెంటు’-అని వ్రాసి ఉంది. మరి ‘కెజిబి’ డైరీని నమ్ముదామా? వద్దా? మోదీని ఎదుర్కొనడం సంగతి పక్కన పెడితే- కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఒక అంతర్యుద్ధం జరుగుతున్నది. రాహుల్ నాయకత్వం వల్ల పార్టీకి భవిష్యత్తు లేదు కాబట్టి సోనియా కుమార్తె ప్రియాంకను రంగంలోకి దింపాలని ఓ వర్గం వాదన. అందుకు భిన్నంగా రాహుల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగాలని మరో వర్గం ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌లో ఈ వర్గాల ఘర్షణ నానాటికీ శ్రుతిమించుతుండగా, రాహుల్ గాంధీ సంయమనం కోల్పోతూ ప్రధాని మోదీపై చౌకబారు ఆలోచనలకు దిగుతున్నాడు. ఇలాంటి ఆరోపణలతో కాంగ్రెస్ ప్రతిష్ట మరింతగా దిగజారుతోంది. బాధ్యతారాహిత్యంగా రాహుల్ మాట్లాడుతూ ‘విదూషక పాత్ర’ను సమర్ధవంతంగానే పోషిస్తున్నారు.
మరోవైపు అనేక అక్రమాలకు సంబంధించి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు పేరుకుపోతున్నాయి. వాద్రా అరెస్టును అడ్డుకునేందుకే కాంగ్రెస్ ఇలా మోదీపై బురద చల్లుతూ అల్లరి చేస్తోందా? ఇటీవల పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు- వాద్రాను ప్రభుత్వం వేధిస్తోందని పార్లమెంటులో ఎందుకు నోరు విప్పలేదు? మోదీ ప్రభుత్వం నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ విషయాన్ని చట్టసభలోనే ప్రస్తావించవచ్చు కదా? విలువైన పార్లమెంటు సమయాన్ని వృథా చేసిన రాహుల్ బృందం ప్రజల సమస్యలను సైతం పార్లమెంటులో ప్రస్తావించిన దాఖలాలు లేవు.
ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు.. వామపక్షాలు, ఇతర విపక్షాలు సైతం ప్రధాని మోదీపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్ప దేశ సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఇలాంటి పార్టీలకు అధికారం అప్పగిస్తే భారతదేశం భద్రంగా ఉంటుందా? కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బిజెపి ప్రభుత్వం ఇలాంటి ‘వెర్బల్ టెర్రరిస్టుల’ను అదుపుచేస్తుందని చాలామంది మేధావులు భావించారు. కానీ అది జరుగలేదు. కేరళలో వామపక్ష ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ చేస్తున్న ఘాతుకాలు కేంద్రానికి కన్పడటం లేదా? ఆ ప్రభుత్వాన్ని తప్పించి, రాష్టప్రతి పాలన ఎందుకు పెట్టరు? కేరళలో మాదిరి బంద్‌లతో ఇబ్బందులు కల్గించే దుర్మార్గాలను రష్యాలో, చైనాలో అనుమతిస్తారా? పెద్దనోట్ల రద్దు తర్వాత సహకార బ్యాంకులకు నగదు మార్పిడి వెసులుబాటు ఇవ్వలేదని కేరళలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి విజయన్ ధర్నాలు, రాస్తారోకోలు చేయించడం ఏమిటి? ఐటి అధికారులు జరిపిన సోదాల ఫలితంగా కేరళలోని సహకార బ్యాంకుల్లో అక్రమాలు వెలుగుచూశాయి. ఈ వాస్తవాలు తెలిసినప్పటికీ వామపక్ష నేతలకు నోరు పెగలదు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలని సంకల్పించిన మోదీపై వారు నిందారోపణలు చేస్తుంటారు.
మసకబారుతున్న ‘దీదీ’ ప్రతిష్ట
పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టుల శకం ముగిసింది. వామపక్ష పార్టీలకు చెందిన కింది స్థాయి కార్యకర్తలంతా దాదాపు తృణమూల్ కాంగ్రెస్ జెండా కిందకు చేరారు. వామపక్షాల సుదీర్ఘ పాలనకు తెరదించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తృణమూల్ అధినేత్రి, ‘బెంగాల్ దీదీ’ మమతా బెనర్జీ క్రమంగా జనాదరణకు దూరం అవుతున్నారు. రాష్ట్రంపై దృష్టి సారించడానికి బదులు ఆమె ప్రధాని మోదీతో ఢీకొనాలని విఫలయత్నం చేస్తున్నారు. ‘కల్చరల్ క్లబ్’ పేరుతో రాష్టవ్య్రాప్తంగా యువకుల కోసం ఒక సంస్థను మమత ప్రారంభించింది. ఒక్కొక్క క్లబ్బుకు రెండు లక్షల రూపాయల చొప్పున విరాళం ఇచ్చారు. ఈ క్లబ్బుల్లో యువకులంతా అశ్లీల నృత్యాలు చేస్తూ అర్ధరాత్రి పాటలు పాడుతూ గడుపుతున్నారు. శాంతిభద్రతలు క్షీణిస్తూ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు మమత ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌లోకి వలస వచ్చిన ముస్లింలకు ఆమె దగ్గరవుతున్నారు. మాల్దా ప్రాంతంలో నకిలీ నోట్ల చెలామణికి ఆటంకం ఏర్పడడంతో మమత ఇపుడు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కమ్యూనిస్టులు మమతా బెనర్జీ కార్యకలాపాలపై ప్రేక్షక పాత్ర వహించడం వర్తమాన బెంగాల్ ముఖ చిత్రం. సాయంత్రం కాగానే ప్రతి కల్చరల్ క్లబ్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని తిట్టడం ఒక ఉద్యమంగా సాగుతున్నది. పెద్దనోట్ల రద్దుపై విపక్షాలు చేపట్టే దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించాలని దిల్లీలో ప్రదక్షిణలు చేసిన మమత ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించి ‘జాతీయ ప్రభుత్వాన్ని’ ఏర్పాటు చేయాలన్న ఆమె డిమాండ్‌కు ఎలాంటి స్పందన లభించలేదు. దీంతో ఆమె తిరిగి బెంగాల్ రాజకీయాలకు పరిమితం కావల్సిన పరిస్థితి ఏర్పడింది.

- ముదిగొండ శివప్రసాద్