మెయిన్ ఫీచర్

అమ్మకోసం ఓ అద్భుత యంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతకింది మల్లేశం.. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం, శారాజీపేట అనే ఒక మారుమూల గ్రామీణ నేతకారుడు. నిరుపేద చేనేత కుటుంబం. రోజంతా పనిచేస్తేనేకానీ రాత్రికి పళ్లెంలో నాలుగు మెతుకులు కనిపించవు. ఒక చీర ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టూ 9వేల సార్లు (12-13 కిలోమీటర్లదూరం) అటూ ఇటూ తిప్పాలి. అలా రోజుకి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితేగానీ (25 కి.మీ దూరం) రెండు చీరలు తయారుకావు. మెడ లాగేస్తుంది. వేళ్లు పీక్కుపోతాయి. భుజం పట్టేస్తుంది. కంటిచూపు దెబ్బతింటుంది. తల్లి పడుతున్న బాధ మల్లేశాన్ని కదిలించింది. ఆలోచనలకు పదునుపెడితే ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. అదే ఆసు యంత్రానికి రూపకల్పన చేసింది. తోటి కార్మికులు ఈ పని నీవల్ల కాదు అని నిరుత్సాహపరిచినా.. అమ్మ కష్టం ముందు అవి నిలువలేదు. హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ ఆసు యంత్రాన్ని పార్టు లు పార్టులుగా తయారుచేశాడు. మొత్తం యంత్రం తయారుచేయడానికి ఏడేళ్లు పట్టింది. మిషన్ అంటే యంత్రాలతో హడావిడిగా వుండదు.
రెండు తక్కువ కెపాసిటీగల మోటార్లు, ఉడ్ ఫ్రేమ్.. అంతే. దీని ద్వారా ఎలాం టి ఫిజికల్ స్ట్రెయిన్ లేకుం డా ఒక చీరకు అవలీలగా ఆసు పోయవచ్చు. అలా ఒక రోజులో ఇంటిపని వంట పని చూసుకుంటూనే వీలైనన్ని చీరలకు ఆసు పోయవచ్చు. టైం చాలా ఆదా అవుతుంది. ప్రొడక్షనూ పెరుగుతుంది. రోజులో రెండు చీరలు నేసేవాళ్లు ఈ యంత్రం వచ్చాక 6-7 నేస్తున్నారు. మామూ లు ఆసు యంత్రం ద్వారా ఒక చీర నేయడానికి 5-6 గంటలు పడుతుంది. ఈ మిషన్ ద్వారా అయితే గంటన్నరలో అయిపోతుంది. దీన్ని జస్ట్ పర్యవేక్షిస్తే సరిపోతుంది.
ఆసియాలో గొప్ప యంత్రంగా ప్రశంస
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ డ్రాపవుట్ మేథావి తన మేధాశక్తితో ఈ యంత్రానికి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు జతచేశాడు. ఆసు యంత్రం ఆసియాలో ది బెస్ట్ అని అమెరికాకు చెందిన పాట్ లాబ్స్ ప్రశంసించింది.
అదే ఏడాది ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్టప్రతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. 2010లో యంత్రంమీద పేటెంట్ హక్కులొచ్చాయి. అదే సంవత్సరం చివర్లో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు వచ్చింది. 2011లో ఆసు యంత్రానికి సాఫ్ట్‌వేర్ జతచేస్తామని అమెరికా ముందుకు వచ్చింది. ఇలా అనేక ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకున్న మల్లేశం ఆశయం ఒక్కటే. వీలైనన్ని చేనేత కుటుంబాలకు లక్ష్మీ ఆసుయంత్రాన్ని సరఫరా చేయాలి.
అండగా నిలబడిన ఫుయెల్ ఏ డ్రీం
మారుమూల పల్లెలో పుట్టి, ప్రపంచం మెచ్చే యంత్రాన్ని తయారుచేసిన మల్లేశం ఆశయానికి అం డగా నిలబడింది ఫుయెల్ ఏ డ్రీం సంస్థ. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నాలుగు లక్షలు సేకరించి మల్లేశానికి సాయం చేయాలని లక్ష్యం గా పెట్టుకుంది.
క్యాంపెయిన్‌కు విపరీతమైన స్పందన రావడంతో టార్గెట్ నాలుగు లక్షలు చేశారు. ఈ మొత్తం 20 చేనేత కుటుంబాలను నిలబెట్టాలని సంకల్పించారు. ఇటీవలనే మల్లే శం ప్రధాని మోదీ చేతుల మీదుగా అమెజాన్ అవార్డు కూడా స్వీకరించాడు.

బెంగుళూరుకు చెందిన ఫుయెల్ ఏ డ్రీమ్.. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ద్వారా సామాజిక సేవ చేస్తుంది. ఆర్థిక స్థోమత లేక అడుగున పడిపోయిన క్రియేటివ్ ఐడియాలకు ఆర్థికంగా ఊపిరిపోయడం.. ఫుయెల్ డ్రీం సంస్థ ఆశయం. పేదరికం వల్ల మరుగునపడిపోతున్న ఎందరో ప్రతిభగల వ్యక్తులను పైకితెచ్చింది. ప్రపంచానికి దూరంగా బ్రతుకీడుస్తున్న నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపి, వారికి ఆర్థికంగా సామాజికంగా చేయూతనిస్తున్న ఫుయెల్ ఏ డ్రీమ్‌తో మరింతమంది వెలుగులోకి వస్తారని ఆశిద్దాం.

అమ్మకోసం పడ్డ తపన ఇప్పుడు పోచంపల్లి కార్మికుల కన్నీళ్లనూ తుడుస్తోంది. తల్లి భుజం కోసం పడిన శ్రమ అందరి జీవితాలను భుజాన వేసుకునేలా చేసింది. ఇప్పటిదాకా 800లకుపైగా ఆసు యంత్రాలను తయారుచేశాడు. ఒక్కోదాని ఖరీదు 25 వేలు. మొదట్లో 13 వేలకే అమ్మాడు. దేశవ్యాప్తంగా ఆసు యంత్రాలు కొనుగోలు చేస్తున్నారు.