మెయన్ ఫీచర్

రాజ్యాంగ సమీకృతికి చారిత్రక నేపథ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జాతి కంటె లేదా హైందవ జాతి కంటె అమెరికా జాతి ప్రాచీనమైనదన్నది జరిగిన ప్రచారం. ఈ ప్రచారానికి ప్రాతిపదిక బ్రిటన్ దురాక్రమణదారులు మనకు ప్రసాదించి వెళ్లిన విజ్ఞాన వారసత్వం. క్రీస్తుశకం 1970వ దశకం చివరిలో జేమ్స్ అర్ల్ కార్టర్ అనే అమెరికా అధ్యక్షుడు మన దేశానికి వచ్చి వెళ్లాడు. అప్పుడు మన ప్రధానమంత్రి మొరార్జీ దేశాయి. కార్టర్ ఆగమనం సందర్భంగా భారత-అమెరికా సంబంధాలను విశే్లషించిన ఒక ప్రముఖ పత్రికలో ఈ ప్రచారం జరిగింది. ‘్భరత్ ప్రాచీన దేశమైనప్పటికీ కొత్త జాతి, అమెరికా భారత్ కంటె కొత్త దేశమైనప్పటికీ భారత్ కంటె పాత జాతి..’అని ఆ పత్రికలో నిర్ధారించారు! బ్రిటన్ దురాక్రమణ నుంచి భారత్ కంటె ముందే అమెరికా విముక్తి పొందడం ఈ ‘నిర్ధారణ’కు ప్రాతిపదిక! ‘ఐరోపా వారు గుర్తించినవి మాత్రమే ఉన్నట్టు.. మిగిలినవి లేనట్టు..’ అన్న దురహంకారం ప్రపంచ చరిత్రను చెఱచింది! బ్రిటన్ వారి అనభిజ్ఞత- ఇగ్నోరెన్స్- తార్కికమైన గీటురాయిగా మారడం వల్ల యుగయుగాల భారతీయ విజ్ఞానం భావదాస్య గ్రహణగ్రస్తమైంది! ఈ ‘గ్రహణం’ ఇప్పటికీ పూర్తిగా వదలలేదు, వదిలించేందుకు ప్రయత్నాలు జరుగుతుండడం నడుస్తున్న చరిత్ర.. బ్రిటన్ ప్రసాదించి వెళ్లిన భావదాస్యానికి, సనాతన భారతీయ భావజాలానికి మధ్య సంఘర్షణ కొనసాగుతుండడం ‘గణతంత్ర దినోత్సవానికి’ నేపథ్యం. అతి ప్రాచీనమైనది మాత్రమేకాక సనాతనమైన భారతదేశం కొత్త జాతి ఎలా అయింది? కేవలం నాలుగువందల సంవత్సరాల ‘కొత్త’చరిత్రకల అమెరికా పాత ‘జాతి’ఎలా అయింది?? ఈ విచక్షణకు మనం దూరం కావడం బ్రిటన్ పాలన ఫలితం..
విదేశీయుల పాలనలో ఉన్న దేశాలకు ‘జాతి’స్థాయిని పొందే అర్హతలేదన్నది బ్రిటన్‌వారు కల్పించిన భ్రాంతి. ఏకీకృత రాజ్యాంగ వ్యవస్థ ఉన్న దేశం మాత్రమే ‘జాతి’ అన్నది మరో భ్రాంతి! ఈ రెండు భ్రాంతులను మాత్రమే కాదు ‘జాతి’, సంస్కృత భాషలో ‘రాష్ట్రం’ గురించి మరిన్ని భ్రాంతులను సైతం తెల్లదొరలు మన దేశంలో కల్పించి వెళ్లారు. ఇందుకు కారణం అనాది చరిత్రలో భారతీయ సంస్కారాలకు క్రమంగా దూరమైపోయిన పాశ్చాత్య దేశాలవారు ‘జాతీయత’- రాష్ట్రీయత-ను మరచిపోవడం. అందుకే పాశ్చాత్యులకు జ్ఞాపకం ఉన్న చరిత్రలో ‘నాగరికతలు’, ‘నగర రాజ్యాలు’, ‘దేశీయ రాజ్యాలు’మాత్రమే ఉన్నాయి. అందువల్లనే వారు గ్రీసు నాగరికత, రోము నాగరికత వంటి పదజాలాన్ని మాత్రమే ప్రచారం చేశారు. ‘తమకు తెలిసినది మాత్రమే సర్వస్వం కాబట్టి’ ఆంగ్లేయులు మన దేశంలోనూ ‘సింధు నాగరికత’, ‘వేద నాగరికత’ వంటి పదజాలాన్ని సృష్టించిపోయారు! తథాకథిత వేద నాగరికత, సింధు నాగరికత రెండూ ఒక్కటేనని, భిన్నం కాదని అది సనాతన ‘్భరత జాతి’లో అవిభాజ్యమని ఆంగ్లేయులకు తెలియదు, ఆంగ్లేయ దాస్యభావగ్రస్తులకు తెలియదు. ఎందుకంటె క్రీస్తుశకం పదహారు శతాబ్దిలో మాత్రమే ‘జాతీయత’, ‘దేశభక్తి’వంటివి పుట్టాయన్నది పాశ్చాత్యుల సిద్ధాంతం! ఇంగ్లాండులో పుట్టాయని కొందరు, ఫ్రాన్స్‌లో పుట్టాయని కొందరు వాదించడమే భేదం! క్రీస్తుశకం పదహారవ శతాబ్ది నుంచి మాత్రమే ‘జాతులు’ పుట్టుకొచ్చాయన్న సిద్ధాంతాన్ని బ్రిటనీయులు, వారి మన దేశపు వారసులు ప్రచారం చేశారు, చేస్తున్నారు!
క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో అలెగ్జాండర్ అన్న గ్రీసు బీభత్సకారుడు మన దేశంలోకి చొరబడినాడు! అది మనదేశంలో ఆంధ్ర శాతవాహన సమ్రాట్టుల పాలన ముగిసి, గుప్త సమ్రాట్టుల పాలన ఆరంభవౌతుండిన సమయం. గుప్త చంద్రగుప్తుడు అతని కుమారుడు పసిమి చెరగని మిసిమి వయసులోని సముద్రగుప్తుడు అలెగ్జాండర్‌ను హడలెత్తించారు. అలెగ్జాండర్ పారిపోయాడు. కానీ గ్రీసుదేశపు చరిత్రకారులు ఓటమిని గెలుపుగా చిత్రీకరించ ప్రయత్నించారు. అలెగ్జాండరు ‘తక్షశిల’ రాజ్యాన్ని గెలిచాడని, ‘మూలస్థాన’ రాజ్యాన్ని గెలిచాడని అబద్ధాలు వ్రాసుకున్నారు. వారి అబద్ధాలను ఈ లేని ‘నగర రాజ్యాలు’ పట్టించాయి. తమ గ్రీసులోను, ఐరోపాలోను అప్పుడు ‘నగర రాజ్యాలు’ ఉన్నాయి కాబట్టి భారతదేశంలో కూడ నగర రాజ్యాలు ఉన్నాయని క్రీస్తునకు పూర్వం నాటి ఈ బీభత్సకారులు భ్రమపడినారు. ‘తక్షశిల’ రాజ్యం కాదు, ఏ రాజ్యానికీ రాజధాని కూడ కాదు. తక్షశిల విద్యాకేంద్రం, ‘మూల స్థానం’- ఇప్పటి ముల్తాన్- ధార్మిక కేంద్రం. పాశ్చాత్యులకు ‘నగర రాజ్యాలు’ ఆ తరువాత ‘దేశీయ రాజ్యాల’ అవగాహన మాత్రమే ఉంది. ‘జాతి’ గురించి వారికి తెలీదు, భారతదేశం అనాదిగా పరిఢవిల్లుతోందన్న వాస్తవం తెల్లదొరలకు క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్దిలో తెలియదు. పంతొమ్మిదవ శతాబ్దిలో తెలిసినప్పటికీ ఓడిపోయి ఉండిన భారత జాతిని లేదా హైందవ జాతిని ‘జాతి’గా గుర్తించడానికి బ్రిటన్ దురాక్రమణదారులు ఇష్టపడలేదు, దురహంకారం,‘విజయ’గర్వం అడ్డువచ్చాయి! బ్రిటన్ విద్యాప్రభావగ్రస్తులైన మన దేశపు ఉన్నత విద్యావంతులు, మహనీయులు సైతం మన దేశం ‘అప్పటివరకు’ ఒక ‘జాతి’గా ఏర్పడలేదని ఏర్పరచడానికి తాము కృషిచేస్తున్నామని క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దంలో భ్రమించారు. సురేంద్రనాథ బెనర్జీవంటి గొప్ప స్వాతంత్య్ర ఉద్యమకారుడు ‘రూపొందుతున్న జాతి’- ఏ నేషన్ ఇన్ ది మేకింగ్- అన్న గ్రంథాన్ని వ్రాయడానికి ఇదీ కారణం..
క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది నాటికి మన దేశం విదేశీయుల పాలనలో ఉంది కనుక అప్పటికి మనం ‘జాతి’గా ఏర్పడలేదన్నది బ్రిటన్ విద్యావిధానం మప్పిన పాఠం. చరిత్రలో అంతవరకు మనం ‘జాతి’కాదని, బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశం నుండి నిష్క్రమించిన తరువాత, మనం రాజ్యాంగాన్ని రచించుకొన్న తరువాత మాత్రమే మనం ‘జాతి’గా ఏర్పడనున్నామని మన స్వాతంత్య్ర ఉద్యమ నాయకులలో అత్యధికులు భ్రమించారు, ప్రచారం చేశారు. క్రీస్తుశకం 1947లో బ్రిటన్ రాజకీయ దాస్యం నుండి విముక్తమైన తరువాత, 1950 జనవరి ఇరవై ఆరవ తేదీన కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత మాత్రమే భారతదేశం చరిత్రలో మొదటిసారి ‘జాతి’గా ఏర్పడిందన్నది ఇప్పటికీ కొనసాగుతున్న భ్రమ! అందువల్లనే ‘మన జాతికంటె అమెరికా ప్రాచీనమైన జాతి’ అన్న నిర్ధారణను క్రీస్తుశకం 1970వ దశకం నాటి ఆ పత్రికా రచయిత చేశాడు. అమెరికా క్రీస్తుశకం 1776 జూలై నాలుగవ తేదీన బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొంది. 1789 నాటికి రాజ్యాంగం ఏర్పడింది, జార్జి వాషింగ్టన్ మొదటి అధ్యక్షుడయ్యాడు. అందువల్ల పాశ్చాత్యుల ‘రాజ్యాంగ’ సిద్ధాంతం ప్రకారం అప్పటినుంచి అమెరికా ఒక ‘జాతి’. మన దేశం 1947లో మాత్రమే విముక్తం అయింది. 1950లో కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకొంది. మన దేశం అప్పటినుంచి మాత్రమే ఒక ‘జాతి’గా ఏర్పడిందన్నది పాశ్చాత్యుల సిద్ధాంతం! ఇలా వారిదృష్టిలో మన దేశం కంటె అమెరికా ప్రాచీన జాతిగా మారింది! రాజకీయ స్వాతంత్య్రం, రాజ్యాంగ వ్యవస్థల ప్రాతిపదికగా మాత్రమే ‘జాతి’ని నిర్ణయించడం పాశ్చాత్యుల పాక్షిక దృష్టికి నిదర్శనం. తాము కనుగొన్న నాటినుంచి మాత్రమే అమెరికా ఉందన్నది ఐరోపా వారి అహంకారానికి, అతార్కిక దృష్టికి మరో ఉదాహరణ.
సర్వ సమగ్ర జాతీయ స్వరూపంలో రాజ్యంగ వ్యవస్థ ఒక ప్రధాన అంశం! ఒక జన సముదాయం జాతిగా వికసించడానికి ప్రధాన ప్రాతిపదిక మాతృభూమి. ఆ మాతృభూమికి తాము సంతాన్న సహజమైన సనాతనమైన వాస్తవాన్ని గుర్తించిన జనసముదాయం ‘జాతి’గా ఏర్పడడం చరిత్ర, ఇలా గుర్తించలేని ‘జన సముదాయాలు’ జన సముదాయాలుగానే మిగిలిపోవడం చరిత్ర. ‘మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః’ అని అనాదిగా గుర్తించినవారు భారత జాతిగా ఏర్పడి ఉన్నారు. ‘సనాతనం’ అని అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతంగా ‘ఎల్లప్పుడూ’ ఉండేది! భూమికీ ‘జాతి’కి మధ్యకల ఈ ‘మాతాపుత్ర సంబంధం’ సుదూర గతంలో ప్రపంచమంతటా జాగృతమై ఉండేది. ఎందుకంటె భారతదేశం నుండి ఇతర ప్రాంతాలకు ప్రజలు విస్తరించడం యుగయుగాల చారిత్రక పరిణామక్రమం! క్రమంగా భారత ఖండం వెలుపలి ప్రజలు ఈ ‘పృథివీపుత్ర’ సంబంధానికి దూరమైపోయారు, అనాగరిక జన సముదాయాలుగా మిగిలిపోయారు. కలియుగం ఆరంభం నాటికి ఇదీ ప్రపంచ స్థితి. కలియుగం ఆరంభమై ఇప్పటికి ఐదువేల నూటపదిహేడు సంవత్సరాలు గడిచాయి. ఈ ‘దుర్ముఖ’ శుభవత్సరం ఐదువేల నూట పద్దెనిమిదవది.. అందువల్ల కలియుగంలో ఇది యాబయి రెండవ శతాబ్ది!
పృథివీపుత్ర సంబంధం నిరంతరం జాగృతంగా ఉన్న భారత జాతి లేదా హైందవ జాతి అనాదిగా ‘జాతి’గా ఏర్పడి ఉంది. అనాది జాతీయ జీవనంలో 1950లో మరోసారి సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడడం ఒక ప్రధాన పరిణామం. మన దేశంలో గతంలో కూడ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ఉంది, భగ్నమైంది, మళ్లీ ఏర్పడింది! ఇలా సమీకృత రాజ్యాంగ వ్యవస్థ భగ్నం కావడం, ఏర్పడడం పదే పదే ‘పునరావృత్తం’ కావడం మన జాతీయ చరిత్ర! కానీ ఈ రాజ్యాంగ ‘సంఘటన’తో కాని ‘విఘటన’తోకాని సంబంధం లేకుండా యుగాలుగా మన భారత ఖండం ఒకే జాతిగా ఏర్పడి ఉంది! ‘రాష్ట్రం ప్రజోః..’అని వేదద్రష్టలు ఎలుగెత్తిన నాటికి మన దేశం ఒక జాతి. జాతి అంటే ప్రజలు! ‘ద్వౌర్యః పితాపృథివీమాతా’ అన్న వేదం ‘జాతి’కి తండ్రి ఆకాశమని, తల్లి భూమి అని వాస్తవాన్ని చాటుతోంది. ప్రపంచంలోని అన్ని ‘జాతుల’కు వర్తించే ఈ ప్రాకృతిక, సృష్టిగత సత్యాన్ని భారతజాతి అనాదిగా గుర్తిస్తోంది! ఇలా మన జాతికి పిత అనాదిగా ఆకాశం. అంటే ఆకాశానికి ప్రతీక అయిన సూర్యుడు సనాతన జాతిపిత, భూమి జాతికి మాత! ఈ వాస్తవం తెలియని పాశ్చాత్యులు తెలిసిన మన ‘జాతి’ని నిర్దేశించగలగడం చారిత్రక వైపరీత్యం!
సమీకృత రాజ్యాంగ వ్యవస్థ కాని, భాషలు కాని, మతాలు కాని, ఆచార వ్యవహారాలు కాని, ఆర్థిక వాణిజ్య వ్యవసాయాలు కాని, ఆలోచనారీతులు కాని, ఆధ్యాత్మిక తత్త్వచింతన కాని జాతీయతకు ఏకైక ప్రాతిపదిక కాదు. జాతిలో జాతీయ జీవనప్రస్థానంలో ఇవన్నీ భాగాలు మాత్రమే! జాతి సమష్టి స్వభావం సంస్కృతి..
పూర్వయుగాలలో వలెనే కలియుగం ఆరంభం నాటికి భారత ఖండం ‘సమీకృత రాజ్యాంగ వ్యవస్థ’గా ఏర్పడి ఉంది. ఈ ‘సమాఖ్య’ కేంద్ర ప్రభుత్వం గిరివ్రజం రాజధానిగా క్రీస్తునకు పూర్వం 327వ సంవత్సరం- కలియుగం 2775వ సంవత్సరం వరకు పనిచేయడం చరిత్ర. కలియుగాది నుంచి ఎనిమిది రాజవంశాలవారు ఈ ‘సమాఖ్య’ను పాలించారు. మొత్తం యాబయి ఆరు- ఛప్పన్న- రాజ్యాలు ఈ ‘అఖండ భారత సమాఖ్య’ భాగమయ్యాయి. క్రీస్తునకు పూర్వం 833నుంచి క్రీస్తునకు పూర్వం 327 వరకు పాలించిన ఆంధ్ర శాతవాహనులు ఎనిమిదవ రాజవంశం. క్రీస్తునకు పూర్వం 433 నుంచి 408వ సంవత్సరం వరకు పాలించి గౌతమీపుత్ర శాతకర్ణి ఈ వంశంలోని వాడు. క్రీస్తునకు పూర్వం 327 నుంచి గుప్తసమ్రాట్టుల పాలనలో ‘పాటలీ పుత్రం’ ‘సమాఖ్య’ రాజధాని అయింది. పదవ రాజవంశం వారైన ‘ప్రమర’ సమ్రాట్టులు భారత రాజధానిని ‘ఉజ్జయిని’కి మార్చడం చరిత్ర.. ఈ సమాఖ్య రాజ్యంగ వ్యవస్థ క్రీస్తుశకం ఏడవ శతాబ్ది నుంచి విచ్ఛిన్నమై పోయింది, దేశం విదేశీయ దురాక్రమణగ్రస్తం అయింది.’’ గణతంత్ర దినోత్సవానికి ఇది చరిత్ర నేపథ్యం.. మన జాతి సనాతనం!!
*

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352