మెయిన్ ఫీచర్

గృహహింసకు కారకులెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనది పురుషాధిక్య సమాజం. అందువల్లనే మహిళలను అరిటాకులతోను, పురుషులను ముళ్ళతోను పోల్చుతా రు. అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి అరిటాకుమీద పడినా, నష్టం జరిగేది అరిటాకుకే అనే మెట్ట వేదాంతం చెప్పడంలో మనవాళ్లు బహునేర్పరులు. ఈ మెట్ట వేదాంతాన్ని తల్లులు తమ పిల్లలకు చిరుప్రాయం నుంచే బోధించి వారి బ్రెయిన్ వాష్ చేస్తారు. దీంతో బాలికలలో తాము పెద్ద అయిన తరువాత తమ భర్తలు ఏమి చేసినా నోరు మెదపకూడదు అనే భావనలో ఉంటున్నారు. అందువల్లనే మన దేశంలో గృహహింస నానాటికి పెరిగిపోతున్నది. మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించిన ఇటీవల జాతీయ స్థాయిలో సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం, వివాహిత మహిళలలో ఎనిమిది శాతంమంది లైంగిక హింసకు, 32 శాతం మంది శారీరక హింసకు, 10 శాతమంది తీవ్రమైన గృహహింసకు (కిరోసిన్ పోసి నిప్పంటించడం, పదునైన ఆయుధాలతో పొడవడం వంటివి) గురవుతున్నారు. దీనిని బట్టి చూస్తే వివాహత మహిళలలో సగానికి సగంమంది ఏదో ఒక విధంగా హింసకు గురవుతున్నార్నమాట.
మహిళలపై దాడులు పెరగడానికి కారణం మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన దేశంలో చిరుప్రాయం నుంచే తల్లులు తమ అమ్మాయిలకు మగవారికి అణిగిమణిగి ఉండాలని ఉద్బోధిస్తారు. అదే సమయంలో తమ మగ పిల్లలను అతి గారాబంగా పెంచుతారు. దీంతో చిరుప్రాయం నుంచే మగ పిల్లలకు తాము తమ అక్కలు లేదా చెల్లెళ్లకంటే అధికులమని, తాము తిట్టినా, కొట్టినా ఏమీ అనరు అనే భావన పెరిగిపోతోంది. వివాహం అయిన తరువాత కూడా వీరు తమ భార్యకంటే తాము అధికులమని భావిస్తారు. ఇదే గృహ హింస పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
గతంలో మహిళలలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం మహిళలు కూడా బాగానే చదువుకొంటున్నారు. మహిళలను వివిధ రకాల దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం పలు చట్టాలను కూడా తీసుకువచ్చింది. అయినప్పటికీ మహిళలపై జరిగే దాడులు మాత్రం తగ్గడంలేదు. దీనికి కారణం పిల్లల పెంపకంలో ఉన్న లోపమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. సమాజంలో గుర్తింపు పొందిన పలువురు సెలబ్రిటీలు కూడా గృహహింస పాలిట పడినవారే కావడం గమనార్హం.
మన సమాజంలో భర్త ఏమి చేసినా కరెక్ట్ అనే భావన మహిళలలో బలంగా నాటుకుపోయి ఉంది. ఈ భావననుంచి మహిళలు బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడుమాత్రమే మహిళలు గృహహింస అనే మహమ్మారినుంచి బయటపడగలుగుతారు. మహిళలు తమ మైండ్ సెట్‌ను మార్చుకోనంతవరకు వారు గృహహింసను ఎదుర్కొనక తప్పదు.

- పి.హైమావతి