మెయిన్ ఫీచర్

అఘముల్ని హరించే మాఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వవ్యాపక స్వరూపుడు, సర్వాన్తర్యామి, సకల దేవతా స్వరూపుడు- శ్రీ సూర్యనారాయణమూర్తి.
‘‘ఘాణ్ ప్రేరణౌ సువతి ప్రేరయతి వ్యామారేషు ఇతి సూర్యాః’’ సర్వ వ్యాపారములను అనగా సర్వకార్యములను చేయుటకు ప్రాణులను ప్రేరేపించువాడు- సూర్యభగవానుడు.
మఖా నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసము- మాఘమాసం. మఖా నక్షత్రం- సింహరాశిలో ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి. ఆరోగ్యాన్నిచ్చేవాడు భాస్కరుడు. కనుక, మాఘమాసంలో సూర్యారాధన విశేష ఫలితాల్నిస్తుంది. మాఘమాసంలో ముఖ్యంగా నదీ స్నానం. దీపారాధన, సూర్యునికి అర్ఘ్యప్రదానం, దానం చెప్పబడ్డాయి. నదీ స్నానంతో బాహ్యశుద్ధి, సూర్యారాధనతో, దానములతో అంతశ్శుద్ధి కలుగుతుంది. జీవనం సుసంపన్నమయి ఆనంనదయం అవుతుంది.
సూర్య సంబంధమైన విషయాలను మనకి తెలియపరచేవి. ఋగ్వేదంలోని మహాసౌరము, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం- అరుణమంత్రం, త్రుచ, పురాణేతిహాసములు, వాగ్గేయకారుల కీర్తనలు మున్నగునవి. మహిమాన్వితమైన మాఘమాసంలో వచ్చే సూర్య సంబంధమైన పండుగలు. మహనీయుల జయంత్యుత్సవములు, ఆరాధనలు, చదువుల తల్లి అనుగ్రహమును పొందే పర్వదినములు, జాతరలు, మహాశివరాత్రి మొదలగు వాటి వివరాలను విశదీకరించుకుందాము.
శ్రీ పంచమి:
మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. శ్రీ పంచమి విద్యారంభ దినం. ‘సరాంసి జరాని సంతి అస్యాః ఇతి సరస్వతీ అని పేర్కొన్నది మేదినీ కోశం. సరస్వతీదేవి రస రూపమైన సరస్సులో సదా వసించే విద్యాశక్తి, జ్ఞానశక్తి.
మానవ జీవితంలో ముఖ్యమైనది- వాక్కు మాట. అంటే, శబ్దశక్తి. ఒక వ్యక్తి గౌరవింపబడేటట్లు చేసేది అతని మాట అనగా శబ్ద శక్తి ఉపాసన. మాటతోనే మానవుడు తన మనసును మూటగట్టి ముందుతరం వారికిచ్చి మాన్యుడౌతాడు. మాట తీరు మనస్సుకు అద్దంపడుతుంది, మనిషి సంస్కారాన్ని తెలియజేస్తుంది. మాట తీరును మధురతరం చేసి, జీవన సరళిని ఆనందమయం చేసి మనశ్శాంతినిచ్చే మహాదాత్త శక్తివాగ్దేవి- మహా సరస్వతి.
మాఘ శుద్ధ పంచమి అనగా వృద్ధి చంద్రుడు. పంచమి అంటే అయిదు. ఐదు సంఖ్యకు అధిపతి- బుధుడు విజ్ఞాన కారకుడు. ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడిన మాఘ శుద్ధ పంచమి శ్రేష్ఠమైనదని శాస్తమ్రులు పేర్కొన్నాయి. ఉత్తరాభాద్ర మీన రాశిలో ఉంటుంది. మీనరాశికి అధిపతి గురుడు. విద్యాకారకుడు గురుడు. విద్యాదేవత మహా సరస్వతి. ఉత్తరాభాద్ర నక్షత్రాధిపతి- శని కనుక రుూరోజు సరస్వతీదేవి పూజతో పిల్లలలో భావవ్యక్తీకరణ బాగా వస్తుంది.
రథ సప్తమి: సూర్యజయంతి:
సూర్యుడు తొలిసారిగా భూమి మీద తన కిరణములను ప్రసరింపచేశాడని ‘‘సప్తమ్యాంఖలు సూర్యేణ మూర్తిశ్చకృతమన్ భువిః’’ అని చెప్పబడింది. ‘‘మాఘే మాసేతే పక్షే సప్తమీ కోటేభాస్కర కుర్యాత్ స్నానార్ఘ్యదానేభ్యః’’ మాఘమాస సప్తమినాడు నదీ స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యమిచ్చి, దానములు చేస్తే ఆయురారోగ్య సంపదలు కలుగుతాయని పురాణములు పేర్కొన్నాయి.
‘‘యస్మాన్మ న్వంతరాదేతు రథమాపుః దివాకరః మాఘమాసస్య సప్తమ్యా తస్మాత్యా రథ సప్తమీ’’- మాఘ మాస సప్తమి రోజున సూర్యుడు రథాన్ని అధిరోహించి భూమి మీద తొలిసారిగా సాక్షాత్కరించాడని మాఘశుద్ధ సప్తమిని రథ సప్తమి అని పిలుస్తారు. ఆరోజే సూర్య జయంతి అని పురాణములు పేర్కొన్నాయి.
మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యరథం ఉత్తర దిక్కువైపు తిరుగుతుంది. అందుకే మాఘ శుద్ధ సప్తమి రథ సప్తమి అని పేరు వచ్చింది. జిల్లేడు ఆకులకు అర్క పత్రములని పేరు. సూర్యునికి ‘‘అర్కః’’ అని పేరుంది. జిల్లేడులో సూర్యతేజస్సు, సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది. అందువలన రథ సప్తమినాడు, సప్త అశ్వములకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేస్తారు. రేగి ఆకులలోను, చిక్కుడు ఆకులలోనూ, సూర్యశక్తి నిక్షిప్తంగా ఉంటుంది. రేగి ఆకులను కూడా శిరస్సున ఉంచుకొని, స్నానం చేస్తారు. ‘‘సప్తార్క పత్రాణి సప్త బదరీ పత్రాణి సంయోజ్యశిరసి నిధాయ స్నానం కుర్యాత్’’. జిల్లేడు రేగు ఆకులను కలిపి శిరస్సు భుజముల మీద ఉంచి స్నానం చేస్తారు. సప్త అశ్వములే సప్త స్వరములు, సప్త ఛందస్సులు, సప్త ఋషులు రథ సప్తమీ సూర్యారాధన- ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం.
భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి:
ఒక ప్రతిజ్ఞను చేసి దాన్ని జీవితమంతా ఆచరించి ఆదర్శంగా ఉండటం మహోదాత్తమైన విషయం. అలా ప్రతిజ్ఞ చేసి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన కారణజన్ముడు భీష్ముడు. అందుకే ‘‘్భష్మ ప్రతిజ్ఞ’’ అని చెప్పారు. పాండవులకు శ్రీకృష్ణుడు అంపశయ్య మీద వున్న భీష్ముని చేతనే ధర్మ ప్రబోధం గావించాడు. మాఘ శుద్ధ అష్టమి, ఏకాదశి ద్వాదశి భీష్మ చరిత్రను జ్ఞప్తికి తెస్తాయి. మనశ్శాంతినిచ్చి సర్వకార్య జయమును చేకూర్చే ‘‘విష్ణుసహస్రనామం’’ ఆవిర్భావం జరిగింది. ఆ రోజు మహా పర్వదినం- భీష్మ ఏకాదశి.
శ్రీ శివనారాయణ తీర్థుల ఆరాధన:
తరంగ సాహిత్య సమ్రాట్, శ్రీ కృష్ణలీలా తరంగిణిని అందించిన పరమ భాగవతోత్తముడు శ్రీ నారాయణ తీర్థులు.ఆయన జన్మనామం తల్లావఝల గోవిందశాస్ర్తీ, కాశీక్షేత్రంలో చాలాకాలం గడిపి, శాస్త్రాలు అభ్యసించి, గోదావరి జిల్లాలో మూడు సంవత్సరములుండి, ఆ ప్రాంతంలో వేదాంతోపన్యాసాలను చేసి ప్రజలలో విజ్ఞాన వికాసాన్ని కలిగించారు. గుంటూరు జిల్లా వెల్లటూరు గ్రామంలో ఉండి శ్రీకృష్ణ లీలాతరంగిణిని పూర్తిచేశారని ప్రతీతి. తీర్థులు తమ ఎనభైయవ ఏట, దక్షిణాపధంలోని భూపతి రాజపురం సమీపంలోగల ‘‘తిరుప్పంతిరుత్తి’’ అనే గ్రామంలో కావేరీ నది ఒడ్డున, మాఘశుద్ధ అష్టమి రోజున బ్రహ్మైక్యం పొందారు. సజీవ సమాధి అయిన పర్వదినం.
మాఘపౌర్ణమి:
మాఘ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పర్వదినం మాఘ పౌర్ణమి.

చిత్రాలు..సూర్యభగవానుడు , నదీ స్నానం

- పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464