మెయన్ ఫీచర్

భారతీయులకు అమెరికా స్వర్గ్ధామమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్ర దేశాలు, భారత్ లాంటి పెద్ద దేశాలు ముందుగా మాట్లాడేది ఉగ్రవాదం, తీవ్రవాదం గూర్చే! ఈ దేశాల నేతలందరు వేదికలకు అతీతంగా వీటిని పదే పదే ప్రస్తావిస్తూ ఆయా దేశాల ప్రజలకు ఆందోళనతోపాటు ఆవేశాన్ని కూడా కల్గిస్తారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య సంబంధ సమస్యలు ఆయా దేశాల నాయకులకు పట్టవు. పైగా ఈ రంగాల వేదికలపై కూడా పై రెండు సమస్యల్ని ప్రస్తావిస్తూ ఆ వేదికల ప్రాముఖ్యతను మరుగున పడేస్తారు.
గత సంవత్సరం మోదీ అమెరికా కాంగ్రెస్‌లో మాట్లాడుతూ, ఉగ్రవాదం అంశాన్ని ఓ పదిసార్లు ప్రస్తావించగా, భారత్ ప్రజల దారిద్య్రం గూర్చి ఒకే ఒకసారి మాట్లాడారు. అలాగే గత జులైలో మొజాంబిక్‌లో కూడా ఇదే తీరుగా మాట్లాడారు. కాశ్మీర్‌లో, కన్యాకుమారిలో, అహమ్మదాబాద్‌లో, అస్సాంలో దేశ భద్రతకు తీవ్రవాద ముప్పు పొంచి వుందంటూ ప్రచారం సాగిస్తూ ప్రధానమైన దేశ సమస్యల గూర్చి, స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే నిత్యజీవిత సమస్యల్ని దాటవేస్తూ వుంటారు. వీటిని ఎదుర్కోవడానికి ప్రజలు నిత్య సన్నద్ధులు కావాలంటూ హెచ్చరిస్తూ వుంటారు. వీరి పరిపాలనా కాలంలో ఉగ్రవాద నిర్మూలనకై తిరిగి పొడసూపకుండా ఉండడానికై తీసుకున్న, తీసుకుంటున్న చర్యలేంటో, ఫలితాలేంటో ఏనాడు వివరించరు.
గత సెప్టెంబర్‌లో సిరియాలోని అలెప్పో నగరంపై జరిగిన దాడిలో మొత్తం కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న ఒమ్రాన్ అనే అయిదు సంవత్సరాల బాలుడు అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న దృశ్యాన్ని ఒబామా చూసి, ఓ లేఖ రాస్తూ, ఆ బాలుడిని తనకు అప్పగిస్తే అతడు కోల్పోయిన కుటుంబ మాధుర్యాన్ని అందిస్తానని తెలిపారు. అంతకుముందు మధ్యధరా సముద్ర తీరానికి చేరిన ఓ కుర్దు బాలుడి శవం ఒబామాకు కనిపించలేదు. ప్రపంచవ్యాపితంగా ఇలాంటి సంఘటనలెందుకు జరుగుతున్నాయో ఒబామాకు పట్టలేదు. యుద్ధాలకు, ఉగ్ర దాడులకు ప్రధాన కారణమైన ఆయుధాల వ్యాపారంలో సింహభాగం అమెరికాదేననే విషయాన్ని కూడా ఆయన గుర్తించలేదు. కనె్వన్షనల్ ఆర్మ్స్ ట్రాన్స్‌ఫర్ టు డెవలపింగ్ కంట్రీస్ (్ళ్యశ్పళశఆజ్యశ్ఘ ౄక ఘూశఒచిళూ ఆ్య ళ్పళ్యఔజశ ఘోఆజ్యశఒ) 2008-2015 మధ్య కాలంలో అమెరికాతోపాటు ఇతర దేశాలు అమ్మిన ఆయుధాలపై ప్రకటించిన గణాంకాల్ని చూస్తే అమెరికా ఎంత పెద్ద ఆయుధ వ్యాపారో తెలుస్తుంది. 2015లోనే అమెరికా అమ్మకం జరిపిన ఆయుధాలు 40 బిలియన్ డాలర్లు కాగా, ఫ్రాన్స్ 15 బి.డా., రష్యా 11.1 బి.డా, చైనా 6 బి.డా. వ్యాపారాన్ని చేసింది. ఎనిమిది సంవత్సరాల ఒబామా హయాంలో జరిగిన ఆయుధ వ్యాపారం 278 బి.డాలర్లు కాగా, 2016లో 33 బి.డా.వ్యాపారం చేసినట్లు స్వయంగా పెంటాగాన్ ప్రకటించడం గమనార్హం! ఈ ఆయుధాల్ని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో పాకిస్తాన్ ముందంజలో వుండగా, ఖతార్, ఈజిప్టు, సౌది అరేబియా, భారత్ లాంటి దేశాలు అత్యధికంగా ఆయుధాల్ని కొనుగోలు చేస్తున్నవే!
మొదటి నుంచి అమెరికా రాజకీయాల్ని నిశితంగా విమర్శించి, విశే్లషించే మేధావిగా గుర్తింపు పొందిన నోమ్‌చామ్‌స్కీ ఆ దేశం తీరును రాజకీయాల్ని పార్టీలకు అతీతంగా దశాబ్దాలుగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే! అగ్రరాజ్యం చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, దానే్న ప్రమాద ఘంటికలుగా చూపడం అమెరికాకు వెన్నతోపెట్టిన విద్య అని, నిజానికి ప్రపంచం ముందున్న సవాళ్ళు ఉగ్రవాదం కాదని, ఆయా దేశాలు ఎదుర్కొంటున్న నిత్యజీవిత సమస్యలని, అనారోగ్యం, ఆర్థిక బాధలని, ఆకలని, శీఘ్రంగా మార్పుచెందుతున్న వాతావరణ పరిస్థితులని, వీటన్నింటికి దోహదపడుతున్న అణు ఆయుధాలని వివిధ అంతర్జాతీయ వేదికల ద్వారా చెపుతూనే వున్నాడు. భారత్ కూడా వీటికి భిన్నంగాలేదనే విషయం తెలిసిందే! రాజ్యాంగాన్ని గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంత్రదండంగా మాట్లాడే మన నాయకులకు ఏనాడు దేశ దారిద్య్రం పట్టలేదు. విద్యా, వైద్య రంగాలు పట్టలేదు. పౌష్టికాహార లోపంతో ఏటా దాదాపు 5 లక్షల మంది చిన్నారులు మరణిస్తూంటే పట్టడం లేదు. నిరుద్యోగ సమస్య, ధ్వంసవౌతున్న సామాజిక వ్యవస్థ పట్టడం లేదు. గిరిజన, దళితుల సమస్యల్ని రాజకీయాలకు వాడుకోవడం తప్ప, వాటి పరిష్కారం పట్టడం లేదు. మహిళా భద్రత దిగజారుతుంటే, అందాల వర్ణన గూర్చి, పోటీల గూర్చి మాట్లాడుతారు. వీటిని రెచ్చగొట్టి సొమ్ముచేసుకుంటున్న ఎలక్ట్రానిక్ మీడియా గూర్చి మాట్లాడరు.
పైగా ఈ భావజాలం వున్న ఓ సూడో మేధావి వర్గాన్ని ఇంటా, బయట పోషించుకుంటూ, తమ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా చిత్రీకరించుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడిన ఇలాంటి వర్గమే అటు అమెరికా రాజకీయాలను శిరోధార్యంగా భావిస్తూ, భారతదేశాన్ని అప్పుడప్పుడు సందర్శిస్తూ, సన్మానాల్ని, సత్కారాల్ని పొందుతూ, ఆయా విశ్వవిద్యాలయాల్లో గెస్టు లెక్చర్లు దంచుతూ వుంటారు. సాధారణ ఫెలోషిప్‌ల నుంచి, నోబుల్ ప్రైజుల దాకా పొందిన ఇలాంటి వర్గం పాలక వర్గాలకు దండలో దారంగా వ్యవహరిస్తూ వుంటారు. మన దేశం వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రజల సొమ్ముతో ఘనమైన అతిథి సత్కారాలను చేయడం మనకో అలవాటుగా మారింది. అమర్త్యసేన్, వెంకటరమణ రామక్రిష్ణ, రఘురాం రాజన్, అవినాష్ దీక్షిత్ లాంటి ఆర్థికవేత్తలు, అమెరికన్ భారతీయులుగా ప్రచారం పొందుతున్నారు. అమెరికాలో కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లుగా ఎంపికైన బాబి జిందాల్, నిఖిహారే లాంటి వారు వీటికి అతీతులు కాలేరు.
ఈ నేపథ్యంలోనే దీపాంకర్ గుప్తా ఓ ఆంగ్ల పత్రికలో, అమెరికాలో స్థిరపడిన భారతీయుల్ని ఇండో-అమెరికన్స్‌గా వర్ణిస్తూ, రెండు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం రంగులో తప్ప ఆలోచనంతా అమెరికన్లలా చేస్తారని, రెండో వర్గం అమెరికాలో జీవిస్తున్నా, భారతీయులుగా భ్రమిస్తారని, శాస్తజ్ఞ్రులు, సామాజికవేత్తలు వీటికి అతీతంకాదని, వీరి మెదడనే ఆంటిన్నా (్ఘశఆళశశ్ఘ) ఎల్లప్పుడూ అమెరికా వైపే వుంటుందని, భారత్ వైపు ఏనాడు దృష్టిసారించదని వ్యాఖ్యానించడం జరిగింది. అమెరికాను సందర్శించే రాజకీయ నాయకుల్ని, ఇతర ప్రముఖుల్ని సన్మానించడం, సత్కరించడం, పొగడడం భారత్‌కు వచ్చినప్పుడల్లా వాటినే తిరిగి ఇచ్చిపుచ్చుకోవడం చేస్తారు. దేశాన్ని సందర్శించినప్పుడు సంస్కృతి, సంప్రదాయాల్ని పొగడడం, అమెరికా విమానం ఎక్కగానే ఈ భావజాలాన్ని గాలిలో వదిలి, ఓ దరిద్ర దేశమని, జనాలకో రీతి, రివాజ్ వుండదని తెగడడం చేస్తూ వుంటారు. కొందరు మంచివారుంటే వుండవచ్చు. కాని, ఈ దేశానికి వారి ఉపయోగం శూన్యమే! కొందరు మాత్రం వాస్తవాల్ని గుర్తించి, దేశానికి తిరిగివచ్చి దేశ ప్రజలతో మమేకం కావడం కూడా ఈ మధ్యన జరుగుతున్నది. నిజంగా ఇలాంటివారు అభినందనీయులే!
దేశ ప్రజల చమటపై, ఇక్కడి వసతులపై ఎదిగిన ఓ వర్గం అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వలసలుపోతూ, దేశాన్ని తిట్టి, చీల్చి చెండాడడం ఒకటైతే, కొడుకులు, కూతుళ్ల వలస జీవితాన్ని అక్కడి సంపదల్ని, వనరుల్ని, రమణీయ ప్రకృతి సౌందర్యాల్ని వెళ్లి, తనివితీరా చూసి, బాధ్యతతో మసలుకునే పౌర సమాజానికి ముగ్ధులై దేశానికి తిరిగి వచ్చి, తిట్టిన తిట్టు తిట్టకుండా ఆ దేశాల్ని ఆడిపోసుకోవడం మరో విచిత్రం. ఇలాంటి వారే అవకాశం వచ్చినప్పుడల్లా తిరిగి విమానం ఎక్కడం చేస్తూ వుంటారు. అక్కడున్న మంచిని, మానవీయ కోణాన్ని మన దగ్గర ఆవిష్కరించడానికి ఏనాడు వీరు ప్రయత్నం చేయరు. ఇలాంటి ఉదారవాద అవకాశవాదుల సంఖ్య ఈమధ్యన దేశంలో బాగా పెరిగింది.
బహుశా ఈ భావజాలమే, ఆశల పల్లకిలో అమెరికా వెళ్ళిన తెలుగు అమ్మాయి (్ఫస్ట్రేషన్)ను స్వాగతించలేకపోయింది. భ్రమలతో అమెరికాకు పోయిన ఈ బిటెక్ అమ్మాయి ఎలాటి టెక్కులకు పోకుండా, ఉన్నత చదువులకై, ఉన్నత స్థాయి డాలర్ల సంపాదనకై అమెరికా వెళ్లే యువత ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారో, భారత్‌లో వున్నప్పుడు ఊహకు కూడా తట్టని అతి కిందిస్థాయి పనుల్ని (మనదగ్గర సఫాయి కార్మిక వర్గం మాత్రమే చేసే పనులు) అమెరికాలో ఎలా ఆనందంగా చేస్తున్నారో సోషల్ మీడియాలో తెలపడంతో అమెరికాలోని ఇదే కోవకు చెందిన తెలుగు యువతకు ఆగ్రహానే్న తెప్పించింది. అమ్మాయి చెప్పిన విషయాలు వాస్తవమేనంటూ, అమెరికాలో ఎదగాలంటే ముందుగా ఈ పరీక్షలకు తట్టుకోవాలని, అందుకు సిద్ధపడే రావాలి గాని, వచ్చి విమర్శించడం తమ పరువుని న్యూయార్క్ వీధుల్లోకి ఈడ్చడమేనని ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది. ఏ రాంగోపాల్‌వర్మనో ఈ సంఘటనను సెల్యూలాయిడ్స్‌కు ఎక్కిస్తే (ఏ దర్శకుడు ఇలాంటి పనిని చేయడు) సోషల్ మీడియాలో ఎంతమంది లైకులు కొట్టేవారో తెలియదు.
ఏది ఏమైనా, ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత మాట్లాడుతున్న తీరు, జరుగుతున్న పరిణామాలు ముస్లింలతోపాటు, అమెరికాలో స్థిరపడిన ఇతర వర్గాల భారతీయులకు ఆందోళన కల్గిస్తున్నది వాస్తవమే! ఇప్పటికే బెంగళూరు కేంద్రంగా గల తమ కంపెనీలలో ఇన్ఫోసిస్ తొమ్మిదివేల మంది ఉద్యోగుల్ని ఆటోటెక్నోమిషన్ పేరున తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఉద్యోగిని తొలగించడానికి టీ/కాఫీ బ్రేక్ అనే సంప్రదాయాన్ని వాడడం నిజమని ఈ సందర్భంగా తెలుస్తున్నది. అలాగే అమెరికాలోని తమ కంపెనీలలో ఇకనుంచి అమెరికాలోని ఫ్రెషర్స్‌కే క్యాంపస్ రిక్రూట్‌మెంటు జరపాలన్న ఇన్ఫోసిస్, టిసిఎస్‌ల నిర్ణయం కూడా భారత యువతకు అశనిపాతంగా మారబోతున్నది. అమెరికాలో ఏటా 4 లక్షల ఐటి ఉద్యోగాల కల్పన జరుగుతుంటే, వీటికి అత్యధికంగా పోటీ పడేది భారతీయులు కాగా, అందులో అగ్ర భాగాన తెలుగు యువత వుండడం గమనార్హం. ఇరు రాష్ట్రాలనుంచి సంవత్సరానికి లక్ష మంది వీసాలకై దరఖాస్తు చేసుకుంటుంటే, సరాసరి నాలుగువేల మందికి అవకాశాలు వస్తున్నట్లు ఐటి రంగ నిపుణులు చెపుతున్నారు. రానున్న నాలుగేండ్లలో ఈ సంఖ్య తగ్గుతుందేమోననే భయం మన యువతకు పట్టుకున్నది. వీసా దొరికినా, ఉన్నత చదువులు గాని, మంచి ఉద్యోగాలు గాని దొరికేది ఎందరికో తెలియని స్థితి.
అందుకే, దేవుడి మీదకన్నా ట్రంప్‌పై భారంవేసే ఈ వర్గం, భారతదేశ ప్రయోజనాలకన్నా అమెరికా ప్రయోజనాల్నే మిన్నగా భావిస్తారు. ఆ దేశానికి తలవంచే మన నాయకుల్ని ఆరాధిస్తారు. కాదన్న వారినే ఇరు దేశాల దేశద్రోహులుగా చిత్రీకరిస్తారు.

- జి.లచ్చయ్య సెల్: 94401 16162