మెయిన్ ఫీచర్

రేడియో కోయిలమ్మ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమెకు పరిశోధనలో ఓ తీరని దాహం. ఆ పరిశోధనలకే తన జీవితానే్న అంకితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత్రి డాక్టర్ జోళపాళెం మంగమ్మ. మధురమైన కంఠంతో అఖిల భారత శ్రోతల్ని అలరించిన తొలి రేడియో ప్రయోక్త. దేశ విదేశాల్లో పర్యటించి పలు పరిశోధక గ్రంథాలను లోకానికి అందించిన అధ్యయన కర్త. దేశంలోనే తొలి మహిళా వ్యాఖ్యాతగా తనదైన శైలిలో ఆకాశవాణిలో సేవలు అందించిన మంగమ్మ చారిత్రక అంశాలపై ఆమె చేసిన పరిశోధనలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆమె మృతి సందర్భంగా..

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం మదనపల్లె (మదనపురి) ప్రాంతంలో 1925 సెప్టెంబర్ 12న వ్యవసాయ కుటుంబంలో జోళపాళెం మంగమ్మ జన్మించారు. ఇండియన్ బ్రిటీష్ ప్రెసిడెన్సీ పాఠశాలలో పదవ తరగతి వరకు, మదనపల్లె బిటి కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తిచేస్తునే కాలేజీలో పురుషులతో సమానంగా క్రికెట్‌లో క్రీడాకారణిగా రాణించారు. గుంటూరు స్టెన్‌జోషఫ్ కళాశాలలో బిఇడి పూర్తిచేశారు. అదే కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తునే మద్రాసు రాష్ట్రంలోనే తిరువూరులోని ఇండియన్ బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తిచేశారు. చదువుపూర్తి చేసుకున్న మంగమ్మ మద్రాస్‌లోని బాలభారతి పాఠశాలలో పనిచేస్తునే స్వయం ఉపాధిపై పేదలలో చైతన్యం కల్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్ముడు ఇచ్చిన పిలుపునకు స్పందించి స్వాతంత్య్ర పోరాటం లోనూ పాల్గొన్నారు. 1962లో న్యూఢిల్లీ విశ్వవిద్యాలయంలో బుక్‌ప్రింటింగ్ ఇన్ ఇండియా అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా అందుకున్నారు. అనంతరం ఇండియన్ ఇన్మర్మేషన్ సర్వీసులోని ఆల్‌ఇండియా న్యూస్‌రీడర్‌గా, ఇండియన్ కౌన్సిల్ కల్చరల్ రిలేషన్ (ఐసిసిఆర్), డైరెక్టర్ ఆఫ్ అడ్వర్‌టైజ్ అండ్ విజువల్స్ కల్చివేషన్స్ డిపార్ట్‌మెంట్ క్లాస్-1 అధికారిగా విధులు నిర్వహించారు. 1983లో ఆమె ఉద్యోగ విరమణ చేశారు.
మంగమ్మ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ఆకాశవాణి ఆల్‌ఇండియా రేడియోలో న్యూస్‌రీడర్‌గా ఏడాది కాలంపాటు సర్వీసుపొడిగించారు. ఇంగ్లీష్, ఎస్పెరెంటో, తమిళ్, హిందీ, ఫ్రెంచ్ భాషలలో ప్రావీణ్యం గడించిన మంగమ్మ నిత్యం పరిశోధనలో నిమగ్నమై ఉండేవారు. తన పరిశోధనలకై దేశంలో అనేక గ్రంథాలయాలను, శాసనాలను పరిశీలించారు. ప్రధానంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో తెల్లదొరలపై వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఏజెన్సీ ప్రాంతాలను సైతం ఆమె పరిశీలించి ఆ విప్లవ వీరుని జీవిత విశేషాలను తెలుసుకున్నారు. మంగమ్మ చరిత్ర పరిశోధనకు సంబంధించి అనేక అంశాలపై రూపొందించిన దాదాపు 30 పత్రాలను ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌లో సమర్పించారు. ఆమె పరిశోధనా కృషికిగానూ ఆ సంస్థ జీవిత సభ్యత్వాన్ని కల్పించారు.
రేడియో వ్యాఖ్యాతగా..
రచయిత్రిగా..
యురోపియన్ పరిశోధకులు తెలుగుభాషకు చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో గ్రంథ ముద్రణపై మంగమ్మ రచించిన ‘బుక్‌ప్రింటింగ్ ఇన్ ఇండియా’ భాషాసాహిత్యాలు అనే గ్రంథాలు పరిశోధకులకు ఓ కరదీపికగా చెప్పవచ్చు. రేడియో వ్యాఖ్యాతగా పదవీ విరమణ అనంతరం నిత్య అధ్యయనంలో రచయిత్రిగా మంగమ్మ ఆంగ్లం, తెలుగుభాషలలో పలు గ్రంథాలు వెలువరించారు. సాంకేతిక, వ్యవసాయం ప్రెసిడెన్సీ మద్రాస్(1746-1857)పై, రేట్ స్కూల్ ఆఫ్ గోదావరి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ (1891)పై, బుక్‌ప్రింటింగ్ ఇన్ ఇండి యా(1746-1857), తెలుగుభాష, ముద్రణపై యూరోషియన్ స్కాలర్స్ చేసిన ప్రయత్నాలపై ప్రత్యేక కథనంతో పుస్తకాలు రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోక్రిష్టియన్ మిషనరీస్‌పై వివిధ దేశాల దినపత్రికలలో వచ్చిన 150ఆర్టికల్స్ సేకరించి పుస్తకంగా వెలువరించారు.
ఇండియన్ హిస్టరీ లైఫ్ మెంబర్‌గా ఉంటూనే మూడేళ్ళపాటు 36పరిశోధనపత్రాలను అందజేయటం ఆమె పరిశోధనా తృష్ణకు తార్కాణం. ఇంగ్లాండ్, ప్రిన్స్‌లలోని సెమినార్ కేంబ్రిడ్జ్‌పై, మద్రాస్ ప్రెసిడెన్సీలపై పరిశోధనాపత్రం అందజేశారు. భారత పార్లమెంట్ సమగ్ర స్వరూపాన్ని, భారత పార్లమెంట్ చరిత్ర, అరవిందుల తత్వాన్ని వివరించే శ్రీ అరవిందో, సరోజనీనాయుడు జీవితచరిత్ర, విప్లవవీరుడు అల్లూరి సీతారామారాజు వీరోచిత గాథ, ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ మిషనరీల సేవపై చేసిన రచనలు తెలుగులో అచ్చయిన ఆమె తొలి పుస్తకాలు. మంగమ్మ పాతికేళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో విశేష అనుభవం గడించి అనంతరం సమాచార మంత్రిత్వశాఖలో ఇండియన్ ఇన్‌ర్మేషన్ సర్వీస్‌లో ఎ-క్లాస్ అధికారిగా సేవలందించారు. అమె పుస్తక ప్రచురణలకు సంబంధించి అనేకగ్రంథాలకు సంపాదకత్వం వహించారు. సామాజిక సేవలో భాగంగా వివిధ విద్యాసంస్థలకు సలహాదారుగా కొనసాగారు.తొమ్మిది పదులు పైబడినా ఆమె పరిశోధన తృష్ణ కొనసాగించారు.

-కుర్రా శ్రీధర్‌బాబు