మెయిన్ ఫీచర్

కదిలే బార్బీ బొమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడి ఆడపిల్లలు చాలామంది కదిలే బొమ్మలే. అచ్చంగా బార్బీ బొమ్మల్లానే ఉంటారట. ఒక్క వలేరియానే కాదు.. ఆమెలాగే చాలామంది యువతులు జీవితాన్ని బొమ్మలాట చేసుకుంటున్నారు. ఉక్రెయిన్‌కే చెందిన అలీనా కోవలెస్కాయా.. ప్లాస్టిక్ సర్జరీలతో బార్బీ బొమ్మలా మారింది. గూగుల్‌లో ఆమె పేరు టైప్ చేస్తే చాలు.. కొన్ని వం దల బార్బీ బొమ్మలు దర్శనమిస్తాయి. అవి నిజంగా బార్బీలు కాదు.. ఈ వయ్యారి బొమ్మలే. ఈ లావణ్యన్ని చూసి ఇప్పుడు బార్బీకి కూడా కొత్త అందాలు చెక్కాల్సిన పరిస్థితి వచ్చిందట. చిన్నప్పుడు బార్బీ బొమ్మను అందరిలాగా అపురూపంగా చూసుకుంది. చివరికి.. అచ్చంగా బొమ్మలాగా కనపడే లివింగ్ బార్బీ తానే బార్బీ బొమ్మగా మారిపోయింది. ఈమె రష్యన్ యువతి. అసలు బార్బీ బొమ్మలాగా శరీరాన్ని కుదించుకోవడమే ఒక అద్భుతమైన విషయం అంటోంది.
కృషితో నాస్తి దుర్భిక్షం!
కృషి, పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా ఎదిరించి విజయ తీరాలకు చేరవచ్చు. ఇది ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. విజయం సాధించాలంటే ఆశావహ దృక్పథం అత్యవసరం. పుట్టుకతో వచ్చిన రూపం ఒకెత్తు అయితే, హ్యూమన్ బార్బీగా కనిపించడానికి ఆమె మేకప్ మరో ఎత్తు. ఆమె రూప లావణ్యాలను అచ్చం బొమ్మలా ప్రదర్శించడానికి వందలసార్లు మేకప్ వేయించుకోవాల్సి వస్తుందట. బార్బీలాగా శరీర సౌష్టవం కనిపించేందుకు జిమ్ముకు వెళుతుంది. పింక్ కలర్‌లో సింథటిక్ దుస్తులే వేసుకుంటుంది. 365 రోజులూ ఇదే గెటప్ కనిపిస్తుంది. బార్బీ అభిమానులైన అమ్మాయిలంతా లివింగ్ బార్బీ ఇమేజెస్ చూసి తెగ ముచ్చటపడుతున్నారు. ఉక్రెయిన్‌లో అలీనా కోవలెస్కాయా ఓ స్పెషల్ అట్రాక్షన్.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి