Others

ప్రశ్నించే తత్వం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు తమ సొంత నిర్ణయాలపై జీవితాన్ని నిర్మించుకోవాలి. ఆలోచనా విధానంలో స్పష్టతతోనే అది సాధ్యమవుతుంది. స్వీయశిక్షణ, నియంత్రణ, సాధ్యాసాధ్యాలపై క్లారిటీ అవసరం. అప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. మహిళల్లో ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే అసలు మార్పు మొదలవుతుంది. హక్కుల సాధనకు బాధ్యతాయుతమైన ప్రవర్తన ముఖ్యం. మహిళ సామాజికంగా తన బాధ్యతలను నిర్వర్తించాలంటే సాధికారత అవసరమే.

- స్వాతిలక్రా, నగర అదనపు
పోలీసు కమిషనర్ (నేర పరిశోధనలు),హైదరాబాద్

అడిగి సాధించాలి

పట్టణాలలో పుట్టిపెరిగిన మహిళల్లోకన్నా పల్లెల్లోవారికి ధైర్యంపాలు ఎక్కువే. పట్టణాలవారికే అభద్రతాభావం వేధిస్తోంది. అయితే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, వౌలిక సదుపాయాలకోసం పోరాడటం, పురుషులతో సమానంగా అధికారం కోరుకోవడం అన్నది ఇంకా వారికి తెలియడం లేదు. ఈ విషయంలో పట్టణాల్లో కొంత మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. విద్యపై శ్రద్ధ పెడితే పరిస్థితుల్లో మార్పు వస్తుంది.

- గీతారాధిక, చీఫ్ వ్యాలుయేషన్ ఆఫీసర్
జిహెచ్‌ఎంసి, హైదరాబాద్

స్వేచ్ఛనిస్తే అద్భుతాలు..

మగవారికన్నా, మహిళల ఆలోచన శక్తి అమోఘం. ప్రతి విషయాన్ని నిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలగే శక్తి మాకు ఉంది. ఏమీ చేయలేరు. సాధించలేరన్న ఒక ముసుగు మహిళలపై కప్పి, మగవారు పబ్బం గడుపుకొంటూ వస్తున్నారు. చట్ట సభలకు మహిళలు ఎన్నికైనా, వారి వెనుక నీడలా వారి భర్తలే వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలి. మహిళలు స్వతహాగా ఆలోచిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నది మగవారు గుర్తించాలి.

- వంగలపూడి అనిత, ఎమ్మెల్యే,
పాయకరావుపేట, విశాఖపట్నం

విద్యతోనే ..

మహిళలు విద్యావంతులైతేనే సాధికారిత సాధ్యమవుతుంది. ప్రతి విషయాన్ని వారు కూలంకషంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఉద్యోగాల్లో ఉన్నవారు కొంత మెరుగైన జీవనాన్ని సాగిస్తున్నా, నాలుగు గోడలకు పరిమితమైన మహిళలు ఇంకా బానిసత్వానే్న అనుభవిస్తున్నారు. మహిళలకు ఆలోచనా శక్తి విద్య ద్వారానే మెరుగుపడుతుంది. వివేచనాశక్తి పెరుగుతుంది. తద్వారా సమాజాన్ని అర్థం చేసుకుని కావల్సిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సామాజికంగా ఆమెకు గౌరవం లభిస్తే ఆమె ఎంచుకున్న రంగంలో రాణించగలదు.
- ఎన్ చంద్రలేఖ, మహిళా సంరక్షణ అధికారి,
విశాఖపట్నం

పల్లెల్లోనే మార్పు మొదలవ్వాలి

మహిళా సాధికారిత అనేది గ్రామీణ మహిళల నుంచి ఆరంభం కావాలి. పట్టణ మహిళల పరిస్థితి కొంత బాగానే ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఇళ్లల్లో పనిచేసి, కష్టపడి భార్య సంపాదించిన డబ్బును భర్త దుర్వినియోగం చేసే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. పల్లెల్లో ఇది మరీ ఎక్కువ. అసలే పేదరికంతో అల్లాడేవారు ప్రస్తుత పరిస్థితుల వల్ల మరింత దిగజారుతున్నారు. మహిళల విషయంలో మార్పు జరగనిదే వారు ముందడుగు వేయలేరు. అందుకే అక్కడే మార్పు మొదలవ్వాలి.
- జె సరోజిని, డిఎం అండ్ హెచ్‌ఓ,
విశాఖపట్నం

పరిపూర్ణతతోనే సాధ్యం

మహిళా సాధికారిత సాధించాలంటే, ఆమె పరిపూర్ణంగా ఎదగాలి. కేవలం విద్యావంతురాలు, ఉద్యోగస్తురాలు అయితే సాధికారిత రాదు. ఒక మహిళ తనంతట తాను నిర్ణయం తీసుకోగలిగినప్పుడే సాధికారికతకు అర్థం. మహిళ ఒకరిమీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. భారత సంస్కృతి, సంప్రదాయాలను కుటుంబ వ్యవస్థను గౌరవించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నా, కీలక నిర్ణయాల్లో మహిళదే పైచేయిగా ఉండాలి. స్థానిక సంస్థలకు, చట్ట సభలకు మహిళలు ఎన్నికైనా, వారు స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఈ పరిస్థితి మారాలి.
- జి చిన్మయిదేవి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరక్టర్, విశాఖపట్నం