మెయిన్ ఫీచర్

ప్రశ్నిస్తేనే ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పవిత్రసంగమం వద్ద నిర్వహించిన మహిళా పార్లమెంటు సదస్సులో నిజామాబాద్ ఎంపి, కెసిఆర్ కుమార్తె కె.కవిత ప్రధాన ఆకర్షణగా నిలిచారు. భోజనానంతరం జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ఆమె తన ప్రసంగాన్ని జై తెలంగాణ... జై ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రారంభించడంతో అక్కడ ఉన్న తెలంగాణ అభిమానులు జై తెలంగాణ అంటూ జయజయధ్వానాలు చేశారు. పక్కనే ఉన్న మరికొందరు జై ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రతిస్పందించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతి ఇంద్రుని అమరావతిలాగ వైభవంగా పూర్వవైభవంతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. 100 సంవత్సరాల క్రితమే గురజాడ అప్పారావు మహిళా సాధికారత గురించి ప్రస్తావించారని, వితంతువులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని గుర్తు చేశారు. ఆధునిక చరిత్రను భారతీయ స్ర్తి పునర్లిఖిస్తోందన్నారు. భారతీయ మహిళల రక్తంలోనే పోరాట పటిమ ఉందని రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరా గాంధీ వంటి వారు దేశం కోసం త్యాగాలు చేశారన్నారు. మద్య నిషేధం కోసం దూబగుంట రోశమ్మ ఒంటరిగా పోరాడిన స్పూర్తిని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చాలా దేశాల్లో ఇప్పటికీ మహిళలకు ఓటుహక్కు, విద్య, ఆర్థిక సమానత్వం లేదని తెలిపారు. అయితే భారతదేశంలో 1960 నుంచే చట్టసభల్లో మహిళలకు అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు. మహిళలపై పెరుగుతున్న హింస, వివక్షపై ఈ సదస్సులో చర్చించాలని సూచించారు. ప్రశ్నించే తత్వాన్ని యువతులు అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించే విధంగా ఎదగాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ మహిళలు రిజర్వు బ్యాంకు గవర్నర్ కన్నా తెలివిగలవారన్నారని, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చదువు లేకపోయినా జీవితాన్ని చదివిన అనుభవంతో పరిస్థితిని అధిగమించారన్నారు.
వంటింట్లోకెళ్లారా!
వంటింట్లోకి ఎప్పుడైనా వెళ్లారా అంటూ అక్కడున్న యువతులను ఆమె ప్రశ్నించారు. ఇంటి ఇల్లాలును ఈ ఇంటి మహారాణి అంటారని, అయితే ఆమె వంటింటికే మహారాణిగా పరిమితం చేశారన్నారు. అక్కడున్న పాత్రలన్నింటిపై నాన్న పేరు ఉంటుందని, అమ్మపేరు ఉండదని గుర్తు చేశారు. ఈ పరిస్థితిని మార్చాలని పిలుపిచ్చారు. స్పీకర్ కోడెల అభిమానం, అనుభవం దృష్టిలో ఉంచుకుని ఈ సదస్సుకు హాజరయినట్లు ఆమె తెలిపారు. ఆమె తన ప్రసంగాన్ని జై తెలంగాణ.. జై ఆంధ్రప్రదేశ్, జైహింద్ అంటూ ముగించారు.