మెయిన్ ఫీచర్

రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని వైకాపా ఎంపి బుట్టా రేణుక అన్నారు. జనాభాలో 50 శాతం మేరకు మహిళలు ఉన్నప్పటికీ 10 శాతం మాత్రమే చట్టసభలకు వెళుతున్నారని గుర్తు చేశారు. పురుషులు, మహిళల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉందన్నారు. గతంలో ఈ అసమానతలను మహిళలు ఆమోదించారని, కానీ అక్షరాస్యత పెరగడంతో సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఫలితంగా గృహ హింస తగ్గుతోందన్నారు. మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. చాలాకాలం పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలని ఆమె అన్నారు. ఇంజనీరింగ్ చదివే యువతులకు ఐటి తదితర రంగాల్లో 60 శాతం ఉపాథి అవకాశం పొందుతున్నప్పటికీ కీలకమైన ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలేకపోతున్నారన్నారు.