మెయిన్ ఫీచర్

దాడులను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడులను నియంత్రించాల్సిన అవసరం ఉందని స్టాప్ యాసిడ్ ఎటాక్ మిషన్ ఉద్యమకారిణి లక్ష్మీ అగర్వాల్ పిలుపునిచ్చారు. యాసిడ్ దాడి చేసేవారికి చట్టం అంటే భయం లేకుండా ఉందన్నారు. తనపై 2005 సంవత్సరంలో దాడి జరిగిందని తెలిపారు. తనను పెళ్లి చేసుకోమని ఒక యువకుడు కోరాడని, తాను తిరస్కరించడంతోతనపై యాసిడ్ దాడికి దిగాడని తెలిపారు. యాసిడ్ దాడులను నియంత్రించాలని తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని దీనిపై యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ అమల్లోకి వచ్చిందన్నారు. తాను ఉద్యోగం కోసం ప్రయత్నించగా అందంగా లేనంటూ ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారని గుర్తు చేశారు. అయితే తాను మరికొందరు యాసిడ్ బాధితులతో కలిసి ఆగ్రాలో ఒక కేఫ్‌ను నిర్వహించడం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నానన్నారు. కేఫ్ విజయవంతంగా నడుస్తోందని, అక్కడికి వచ్చే వారికి దాడి పరిస్థితి తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సు ద్వారా సమాజంలో మార్పు వస్తుందని ఆశించారు. యాసిడ్ బాధితురాలైన లక్ష్మిని అక్కడున్న ప్రతినిధులందరూ లేచి నిలబడి కరతాళధ్వనులతో అభినందించారు.