మెయిన్ ఫీచర్

మహిళాశక్తికి ఎదురే ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, అదే జరిగితే ఇక వారిని అడ్డుకునే శక్తి ఏదీ ఉండదని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి అన్నారు. వారు అనుకున్నది సాధించేందుకు అవకాశాలు ఇవ్వాలని ఆమె సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తొలి మహిళా పార్లమెంట్‌కు హాజరైన ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయులుగా, మాతృమూర్తులుగా, నాయకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు బాలికలకు, యువతులకు మంచి అవకాశాలు ఇవ్వాలని, అందువల్ల తమతమ కలలను సాకారం చేసుకునే ఉత్సాహం వారికి వస్తుందని అన్నారు. అసలు అవకాశాలను దొరకబుచ్చుకోవడం, వాటి ద్వారా ఏం సాధించాలో తెలుసుకోవడం ముఖ్యమని, అదే ఫలితాన్ని సాధిస్తుందని అన్నారు. ‘నాయకత్వం అనేది బయట ఎక్కడో లేదు. మనలోనే ఉంటుంది. మనం అవకాశాలను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అన్నదానిపై అది ఆధారపడి ఉంటుంది. నాయకత్వాని సాధించడం, సృష్టించడం మన చేతుల్లో ఉంటుంది. అదే అవకాశాలు బాలికలకు ఇవ్వండి. అప్పుడు ఇక వారిని ఆపడం ఎవరివల్లాకాదు’ అని ఆమె అన్నారు. మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో, సాహసికులుగా తయారు చేస్తున్నామో పరిశీలించుకోవాలని అన్నారు. వీరు చక్కగా ఎదిగితే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. పరిశుభ్రత కోసం ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న స్వచ్ఛ్భారత్ అభియాన్ అన్నది కేవలం పరిసరాలకు సంబంధించినది కాదని, ఇది మనసు, శరీరం, ఆత్మలకు సంబంధినదని అన్నారు. మహిళా పార్లమెంట్ కార్యక్రమం ఏటా నిర్వహించాల్సిన అవసరం ఉందని కిరణ్‌బేడి సూచించారు.