మెయిన్ ఫీచర్

కుటుంబం అండ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల అన్ని రంగాల్లో రాణించాలంటే వారికి వారుగా ఆలోచించగలిగి, నిర్ణయాలు తీసుకోగలిగి ఉండాలి. వాటిని ధైర్యంగా అమలు చేయగలగాలి. అలా చేయాలంటే కుటుంబం తోడుగా నిలవాలి. తన విషయంలో తల్లిదండ్రులు అలా నిలబడటం వల్లే ఇవాళ ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఆడమగ భేదం లేకుండా పిల్లల్ని సాకడం, ప్రోత్సహించడం చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. నైతిక విలువలతో కూడిన విద్య అందిస్తే మహిళలు చక్కటి ఫలితాలు సాధించగలరు. జీవితంలో ఎదురైన సమస్యలను అవకాశాలుగా మార్చుకోగలగే శక్తి మహిళలు సాధించాలి. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యంలో తగిన సౌకర్యాలు, సదుపాయాలు లేక మహిళలు వెనుకబడిపోతున్నారు. ప్రభుత్వాలు వారికి అండగా నిలబడాలి. గృహహింస, వరకట్న వేధింపులు వంటి సమస్యలను అధిగమించడానికి విద్య ఎంతో అవసరం. అతివలు బాగా చదుకున్నప్పుడు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. రాజ్యాంగం ఎన్నో హక్కులు ఇచ్చింది. వాటిని సద్వినియోగం చేసుకునే విచక్షణ విద్యవల్ల ఒనగూరుతుంది. కేవలం రాజకీయాలో, అధికార పీఠాలో లక్ష్యం కాకూడదు. పారిశ్రామిక, సేవారంగాల్లోనూ అతివలు రాణించే అవకాశాలు ఉన్నాయి. అసలు ఆలోచనాధోరణిలో మార్పువస్తే సాధికారత సాధ్యమే. నావరకు కుటుంబం అండగా ఉండబట్టే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కాగలిగా. మా స్వస్థలం విశాఖపట్నం. కానీ న్యాయవిద్యపై నా ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు నా కోసం హైదరాబాద్‌కు తరలివచ్చారు. ప్రతిభ ఉన్నప్పటికీ మహిళ రిజర్వేషన్లవల్ల నాకు న్యాయమూర్తి పదవి వచ్చింది. ఆ తరువాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినయ్యా. అడుగడుగునా కుటుంబం అండగా నిలబడటం వల్లే ఇది సాధ్యమైంది. ఈ సదస్సుకు వచ్చినవారంతా తమతమ కుటుంబంలోని ఆడపిల్లలకు ఇదే ఇలాగే ప్రోత్సహిస్తే వారుకూడా అద్భుతమైన ఫలితాలు సాధించగలరు.
-జస్టిస్ జి.రోహిణి
ఢిల్లి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి