మెయిన్ ఫీచర్

ఆత్మవిశ్వాసంతో అడుగేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధికారతే లక్ష్యంగా విజయవాడ వేదికగా మొదలైన జాతీయ మహిళా పార్లమెంట్ రెండోరోజూ ఉత్సాహంగా కొనసాగింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు గళం విప్పారు. తాము ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది, వాటిని ఎలా అధిగమించారో వివరిస్తూ యువతులకు మార్గనిర్దేశం చేశారు. స్ఫూర్తి రగిలించారు. విద్య, కుటుంబం, సమాజం తోడ్పాటు ఎంత అవసరమో స్వానుభవాలను వివరించారు. కేవలం ఇలాంటి సదస్సులకు హాజరైతే చాలదని, ఇక్కడ నేర్చుకున్న, తెలుసుకున్న విషయాలను నిజజీవితంలో అమలు పరిస్తేనే ఫలితం ఉంటుందని వారు సూచించారు. మొత్తమీద ఉరిమే ఉత్సాహంతో సాగుతున్న ఈ సదస్సులో అందరిలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. అదే నిష్టతో ముందడుగు వేయాలని వారంతా పిలుపునిస్తున్నారు.

చిత్రాలు..మహిళా పార్లమెంట్‌కు హాజరైన యువతులు

*విజయవాడ సంగమం సమీపంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం వద్ద మహిళల సందడి