మెయిన్ ఫీచర్

మంచిని గ్రహించుటే మానవ ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమద్రామాయణంలో బాలకాండ మంచిగానే ఆనందంగానే సాగింది. రామాయణంలో బాలకాండ ముగిసింది. అయోధ్యకాండ మొదలైంది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టేందుకు మందర ప్రవేశించింది.
ఓ రోజు దశరథ మహారాజు అద్దంలో ముఖము చూసుకుంటూ అక్కడక్కడ తెల్లబడ్డ తల వెంట్రుకలు చూసుకొని, ఇక తనకు వానప్రస్థ కాలము సమీపించిందని శ్రీరామునకు రాజపట్ట్భాషేకం చేయ నిశ్చయించాడు. ఇందుకుగాను ప్రజాభిప్రాయము, బంధుమిత్రుల అభిప్రాయాలు తెలుసుకొని, వశిష్టుల వారితో సంప్రదించి, శ్రీరామ పట్ట్భాషేకానికి పట్టమహిషులు, కౌసల్య, సుమిత్ర, కైకలకు తెలియజేశాడు. అందరూ ఇష్టపడ్డారు, ఆనందించారు. పట్ట్భాషేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇంతలో మందర కైకేయి, బాల్య స్నేహితురాలు, తల పండిన వృద్ధురాలు, గూనాకారము గల మందర ప్రవేశించింది. అంతఃపురమంతా, సంతోషముతో పందిళ్ల తోరణాలతో, రంగు రంగుల దీపాలంకరణతో వెలగటం చూసింది. అసలు విషయం, శ్రీరాముడి పట్ట్భాషేక వార్త తెలుసుకుంది. కైకేయి మందిరానికి వచ్చింది. కైకేయితో తాను చూసింది, విన్నది చెప్పింది. కైకేయి మిక్కిలి సంతోషించింది. ఈ శుభవార్త చెప్పినందుకు, వెంటనే ఆమె మెళ్లో హారాన్ని, బహూకరించి, మంచి వార్త చెప్పావని, మందరను కౌగలించబోయింది. మందర వెంటనే వెనుకకు జరిగింది. హారాన్ని కిందపడేసింది. కన్నీరుతో దుఃఖంతో కన్నీరు తుడుచుకుంటూ ఇలా అంది.
మందర నోరుతెరచింది. ఆమె నోరుతెరిచిందంటే దుష్ట ఆలోచన చేసినట్లు, మాట మొదలుపెట్టింది. మాట కత్తి వంటిది. పదునైంది. తేనేకంటే తియ్యనిది. దానిని ఉపయోగించటంలో ఉంటుంది. ఒక్క మాటతో, అగ్ని పుట్టియవచ్చు. ఒక మాటతో, నీటిని పుట్టియ్యవచ్చు. మాటతో ప్రాణం తియ్యవచ్చు, ప్రాణం పోయవచ్చు. మాటకు ప్రాణం రామాయణం అయింది. ఒసే/ పిచ్చిదాన/ రామపట్ట్భాషేకానికి మురిసిపోతున్నావా/ రాముడంటే ఎవరనుకున్నావు. నీ సవతి కౌసల్య కొడుకు. రాజు తల్లి మహారాణి అవుతుంది. నీవు ఆమె వెనకాల, వెళ్తూ చేతులు కట్టుకొని నడవాల్సి ఉంటుంది. ఆమె కనిపించినప్పుడల్లా, వంగి వంగి నమస్కరించవలసి ఉంటుంది. ఆమె చెప్పినట్లు, వినవల్సి ఉంటుంది. ఇక ముందు రాముడి వంశస్తులే రాజ్యపాలన చేస్తూ ఉంటారు. ఇక నీ భరతుడికి ఎప్పుడు, రాజ్యం వస్తుంది? మన జీవితం బానిస జీవితమే అవుతుంది. నా భరతుడెప్పుడు, రాజవుతాడు, నీవెప్పుడు పట్టరాణివవుతావు?
నీ పతి దశరథుడు చేసిన కుట్ర. నీ మీద కపటప్రేమ చూపుతున్నాడు. పగలు నా మందిరంలో రాత్రి ఆమె మందిరములో ఉంటున్నాడు. భరతుడు లేని సమయంలో శ్రీరామ పట్ట్భాషేకానికి పూనుకున్నాడు. భరతుడుంటే పోటీపడతాడని అతను లేని సమయం చూసుకొని కుట్ర చేస్తున్నాడు. ఇప్పటికైనా కళ్లుతెరువు. రాముడి తరువాత భరతుడే పెద్దవాడు. రాజ్యాధికారానికి అర్హుడు కాబట్టి దశరథున్ని నిలదీయి. అలంకరణలు తీసివేయి, అలక గృహములో, చీకటిలో పడుకొని, బాగా ఏడు. నిజంగా, నీ మీద ప్రేమ ఉంటే భరతుడి పట్ట్భాషేకానికి ఒప్పుకుంటాడు. త్వరపడు అంటూ మందర విష బీజాలు నాటింది. ‘మందర మాట పదునైంది. మాటకు ప్రాణం అయింది రామాయణం. మందర మాటలు, కైకేయిపై బాగా పనిచేశాయి. అప్పటివరకు రామునిపై ఉన్న ప్రేమ తొలగిపోయింది. స్వార్థం పెరిగింది. ద్వేషం మొదలైంది. ఆలోచనలో పడింది. సలహా కూడా మందరనే అడిగింది. నీకు లోగడ దశరథ మహారాజు రెండు వరాలు కోరుకోమన్నాడు. కానీ నీవు అప్పుడు సమయంకాదని, మరెప్పుడైనా కోరుకుంటానని చెప్పావు. ఇప్పుడా సమయమొచ్చింది. ఒకటి భరతుని పట్ట్భాషేకం, రెండు రామునికి పధ్నాలుగేండ్లు వనవాసం చేయాలని కోరుకోమంది. కైకేయికి ఒకటి నచ్చింది. కానీ రెండవది రాముని 14 ఏండ్లు వనవాసమెందుకని సందేహం తెల్పింది. ఒసే/ పిచ్చిదానా/ రాముడుకనక నగరంలో ఉంటే, తిరిగి కుట్ర చేస్తాడు. రాజ్యాన్ని సంపాదిస్తాడు. ఈ పధ్నాలుగేండ్లు వనవాసంలో రామున్ని క్రూరమృగాలుగానీ రాక్షసులు కానీ తినివేస్తాయి. ఇక భరతుడికి అడ్డంకి ఉండదని, దుష్ట సలహా ఇస్తుంది. కైకేయికి మందర మాటలు నచ్చాయి. మందర సలహా కైకేయి కోరికతో రామాయణం కదిలింది. శ్రీరాముడు పితృవాక్య పరిపాలనంటూ కదిలివెళ్లాడు. సీత సహ ధర్మచారిణిగా, పతివ్రతగా అతని వెంట కదలి వెళ్లింది. వారిద్దరితో లక్ష్మణుడు తల్లి ఆజ్ఞతో రాముని వెంట బయలుదేరి వెళ్లినాడు. వృద్ధుడు దశరథ మహారాజు, రామ వియోగంతో మరణించాడు. ముగ్గురు తల్లులు విధవరాలైనారు. అయోధ్య నగరమంతా దుఃఖం చెందింది. అతని వెంట వెళ్లుటకుఅంతా సిద్ధమైనారు. వారిని రాముడు వారించాడు. శ్రీరాముడు ఎందుకు వెళ్లినా, సీత అతనితో వెళ్లినా, మనకు కనిపించేది, మందర మాట, శ్రీరాముడి ధర్మపాలన. మందర ఒక మాటతో, కైకేయి మాట, దశరథ మాట శ్రీరాముడి మాట, సీతా, లక్ష్మణ మాటలు, చివరకు భరతుడి మాటతో శ్రీరాముడి పాదుకలు కదిలి భరతుడి శిరస్సుపై నుండి నంది గ్రామములో రాజసింహాసనంపై పాదుకా పట్ట్భాషేకం చేసుకుంది. చివరకు శ్రీరాముడి పట్ట్భాషేకం బదులు పాదుకా పట్ట్భాషేకం జరిగింది. విధి బలీయం. ఎప్పుడు ఏదీ జరగాలో, దైవం నిర్ణయిస్తుందని రామాయణం తెల్పుతున్నది. శ్రీరాముడు త్యాగమూర్తి, ధర్మమూర్తియని లోకానికి చాటి చెప్పాడు. డబ్బుకు లోకం దాసోహం అన్న మానవుడిలో సర్వభోగాలు వదిలి, రాజ్యం వదిలి అడవి దారి పట్టిన ధర్మమూర్తియని లోకం తెలుసుకుంటుంది.
ఒక మాటలో ధర్మం ఉంది. ఒక మాటలో స్ర్తి పాతివ్రత్యం ఉంది. ఒక మాటలో లక్ష్మణుడి సోదర ప్రేమ ఉంది. ఒక మాటలో భరతుడి సహనం ఉంది. ఒక మాటలో శ్రీరామ పాదుకాపట్ట్భాషేకం జరిగింది. దీన్నిబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. లేకుంటే, ఆ ఒక్క మాట ఎన్నో ఆలోచనలకు దారితీస్తుంది. మనిషి పొగడ్తలకు, తెగడ్తలకు కుట్రలకు కుతంత్రాలకు తావివ్వకూడదని రామాయణం తెల్పుతున్నది. ఒక మాటనేటపుడు సత్యాన్ని గ్రహించాలి. మందరలా దుర్భోద చేసేవారుంటారు. అగ్నిలో నెయ్య పోసే వారుంటారు. చల్లని నీరు పోసేవారు కూడా ఉంటారు. సత్యాన్ని గ్రహించటమే, వివేకమనిపిస్తుంది. లేకుంటే మాటలు పరిణామం ఎలా ఉంటుందో రామాయణ, మహాభారతాలు తెలిపాయి. తెలుసుకున్న వాడికి తెలుసుకున్నంత ఉంటుంది. మానవుడికి మంచి మాటలు చెప్పేవారు ఇలా ఉండాలంటుంది ధర్మశాస్త్రం. అందరి మాటలు కలిసి రామాయణం అయింది. దీనిలో స్వార్థం ఉంది. త్యాగం ఉంది. ప్రేమ ఉంది. స్నేహం ఉంది, శౌర్యం ఉంది. శాంతి ఉంది, సహనం ఉంది. మోసం ఉంది, మోహం ఉంది. మనసుంది. చివరకు మనం తెలుసుకోలేని మాయ ఉంది. ‘తెలుసుకునే వాడికి, తెలుసుకున్నంత నీతి ఉంది. నిజాయితీ ఉంది. చివరకు కర్మఫలం ఉంది.’ చివరకు రామాయణం మాటలది కాదని, చేతలదని నిరూపించింది. నేటికది మానవ జాతికి ఆదర్శమయింది. మంచి గ్రహించటమే మానవ లక్షణం.
రామాయణం మహామాల. రత్నాల నిలయం. ఆంజనేయుడు రామాయణంలో రత్నంలాగే మెరుస్తూ ఉంటాడు. దారి చూపిస్తూ ఉంటాడు. చీకటి నుండి మానవుడు వెలుగులోకి రావటానికి మార్గదర్శి ఆంజనేయుడు. రామాయణంలో ఏమాట పట్టుకున్నా ఎవరినీ ఆదర్శంగా తీసుకొన్నా ధర్మాచరణలో ముందుకు పోవచ్చు. అధర్మం, ధర్మం ఏది చేస్తే ఏమి వస్తుందో అద్దంలా వివరించింది రామాయణం. ఇక మనం మన వివేకంతో రాముడిలాగా మసలగలగడం నేర్చుకోవాలి. అదే పద్ధతి.

- జమలాపురం ప్రసాదరావు