మెయన్ ఫీచర్

ఎటు చూసినా సమాధానాల్లేని ప్రశ్నలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేవాధర్మం దైవస్వరూపం. సేవ ముసుగులో అక్రమ కార్యకలాపాలు సాగించడం దుర్మార్గం. కొన్ని విదేశీ మిషనరీలు సేవా కార్యక్రమాలను అందించటం మానవాళిపై ప్రేమతో అనేది అర్ధసత్యం. ఎందుకంటే కేవలం మతం మార్పిడులకు ఈ ‘సేవ’ ఓ ఆచ్ఛాదనగా ఉపయోగపడుతోంది. మదర్ థెరిసాకు వాటికన్ ‘సెయింట్‌హుడ్’ ప్రసాదించింది. ఆమెను ‘్భరతరత్న’గా గుర్తించారు. కోల్‌కత మురికివాడల్లో ఆమె చేసిన సేవలు ఆదర్శప్రాయం. ఇంతవరకూ బాగానే ఉంది. మరి సాథ్వీ రితంబర, జిల్లెళ్లమూడి అమ్మ, అమృతానంద మాయి, పెంచలకోన విజయేశ్వరీ మాత వంటివారు అందించిన సేవలు ప్రభుత్వ గుర్తింపునకు ఎందుకు రాలేదు? వీరంతా హిందూ సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ సందర్భంగా ఓ చిన్న కథను గుర్తుచేసుకోవాలి. రామాయణ కాలంలో ఒక కప్ప శ్రీరాముడి వద్దకు వచ్చింది. ‘కప్పా.. ఎందుకు ఏడుస్తున్నావు’ అని రాముడు ప్రశ్నించాడు. ‘ఎవరికైనా కష్టం వస్తే రామా రామా అంటూ నీతో చెప్పుకుంటారు. కానీ, నా బిడ్డ చిరుకప్ప నీ రథం కింద పడిపోయింది. నేనిక ఎవరికి చెప్పుకోవాలి?’ అని కప్ప ఏడ్చిందని కథ.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే మెక్సికోకు, అమెరికాకు మధ్య గోడ కట్టేపనికి శ్రీకారం చుట్టాడు. మెక్సికో నుండి అమెరికాలోకి వలసలను నిరోధించాలనే ఈ ప్రయత్నం. దీంతో ప్రపంచ క్రైస్తవ మతపెద్ద వాటికన్ పోప్ మాట్లాడుతూ, ‘మనం వారధులు నిర్మించాలే తప్ప గోడలు కట్టడం కాదు’ అని హితబోధ చేశాడు. బెర్లిన్‌లో గోడ కట్టి జర్మనీని రెండు ముక్కలు చేసినపుడు, ఇండియాని మూడు ముక్కలు చేసినపుడు ఈ ‘వారథి’ సిద్ధాంతం వాటికన్ మరచిపోయిందా? భారత్‌లో జరుగుతున్న మతం మార్పిడులను పోప్ ఎందుకు ఖండించరు?
ఇప్పుడు దేశంలో దుర్మార్గులు విజృంభించారు. ‘మానవ చరిత్ర మొత్తం ఆర్థిక సంబంధాల చరిత్ర’ అంటూ మానవతకు కొత్త్భాష్యం చెప్పారు. ఈ దశలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ‘అభయహస్తం ఇస్తున్నాం’ అని జాతికి చెప్పింది. కానీ, మోదీ ప్రభుత్వంలోనూ అన్యాయాలు జరిగితే ఇక ఎవరికి చెప్పుకోవాలి? కోర్టు కేసులు నడుస్తున్నవారికి, ఐటి దాడులు జరిగిన వారికి ‘పద్మ’ పురస్కారాలు ఇవ్వడం సమంజసమేనా?
***
ప్రజాస్వామ్యంలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నవాడే అందలం ఎక్కుతాడు. అతని గుణగణాలతో ఎవరికీ అవసరం లేదు. తమిళనాడులో శశికళ-నటరాజన్ దంపతులు ‘మన్నారుగుడి మాఫియా’ను నడుపుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత, శశికళ సహా మరో ఇద్దరిని సుప్రీం కోర్టు దోషులుగా తేల్చింది. అవినీతికి పాల్పడిన జయకు జనం గతంలో పట్టం కట్టారు. అదే అవినీతిలో భాగస్వామి అయిన శశికళ ముఖ్యమంత్రి పదవి కోసం మంత్రాంగం నడిపింది. శశికళ జైలుకు పోవడంతో ఆమె చేతిలోని కీలుబొమ్మ పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు.
రెండు దశాబ్దాలకు పైగా నలుగుతున్న జయలలిత అక్రమాస్తుల కేసుపై ఎట్టకేలకు తుది తీర్పు వెలువడి శశికళతో పాటు ఆమె బంధువులు ఇలవరసి, సుధాకరన్‌లు జైలుకు వెళ్లారు. ఈ కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలితను కూడా న్యాయస్థానం దోషిగా తేల్చింది. జయలలిత, శశికళ సంపాదించిన ఆస్తుల చిట్టా చూస్తే ఎవరికైనా విస్మయం కలుగుతుంద. ఇదంతా అక్రమంగా కూడబెట్టిన ఆస్తులే. లోగడ ‘పశుదాణా కుంభకోణం’లో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు శిక్షపడినా ఆయన గత రెండున్నరేళ్లుగా బెయిల్ పొంది బయటే ఉన్నాడు. లాలూను పోలీసులు అరెస్టు చేయగా- ‘నేను జైలు నుంచే పరిపాలన చేస్తాను’ అన్నాడు. తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి పరోక్షంగా లాలూయే ప్రభుత్వాన్ని నడిపాడు. ఇప్పుడు తమిళనాడులో శశికళ జైలులో ఉన్నా, తన నమ్మినబంటు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. గతంలో జయలలిత పలుసార్లు జైలుకు వెళ్లినపుడు పన్నీర్ సెల్వం, ఇప్పుడు పళనిస్వామి ‘పాదుకా పట్ట్భాషేకం’ చేసి పాలనకు సిద్ధమైనవారే. అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన శశికళకు ఇప్పుడు సుబ్రమణ్య స్వామి మద్దతుగా మాట్లాడడం మరీ విడ్డూరం. మానవులకు ఆశ ఉండటం సహజం. కానీ, దురాశ దుఃఖాన్ని తెస్తుందని జయలలిత, శశికళ ఉదంతం నిరూపించింది. ఇది చూచిన తర్వాతైనా దేశంలోని రాజకీయవేత్తలకు జ్ఞానోదయం అవుతుందా? ఒకప్పుడు జయలలితకు ‘టీ’ అందించిన సహాయకురాలైన శశికళ గుడినీ, గుడిలోని లింగాన్ని మింగేసింది. ఇలాంటివారు అవినీతి అంతస్తులను నిర్మించుకుని ముఖ్యమంత్రి పదవికి పోటీ పడడం ఏమిటి?
ఇక, యుపిలో ములాయం సింగ్ యాదవ్‌కు దావూద్ ఇబ్రహీం అనే అంతర్జాతీయ జిహాదీ టెర్రరిస్టుతో ప్రత్యక్ష సం బంధాలున్నాయి. ఇలాంటి ములాయంను తమ నాయకునిగా ప్రజలు ఎట్లా అంగీకరించారు? ఆజం ఖాన్ ముజఫర్‌నగర్‌లోని మాఫియాకు, జిహాదీలకు నాయకుడు. ఈయన మద్దతు కోసం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ప్రాధేయపడటం ఏమిటి? దీనే్న ప్రజాస్వామ్యం అంటారా?
***
ఆనాటి శ్యాంప్రసాద్ ముఖర్జీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాలం నుండి లాల్‌బహదూర్ శాస్ర్తీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వరకు- అన్నీ రాజకీయ హత్యలే. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి గుట్టు విప్పుతారని ఆశించినవారికి నిరాశే మిగిలింది. దివంగత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా ఈ ఏడాది ఆయనకు ‘్భరతరత్న’ ప్రకటించాలని ఎంతోమంది జాతీయవాదులు కేంద్రానికి విన్నవించినా ఫలితం లేకపోయింది. కనీసం బిజెపి హయాంలోనైనా నిజాయితీపరులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తే వెనుకటి దుర్మార్గమే కొనసాగుతున్నది. 1968 ఫిబ్రవరి 11న ఉత్తరప్రదేశ్‌లోని మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్ వద్ద జనసంఘ్ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ హత్య చేయబడ్డాడు. కేరళలోని కోజికోడ్‌లో జనసంఘ్ జాతీయ మహాసభలు జరిగిన తర్వాత ఆయనపై ప్రత్యర్థులు కక్షకట్టారు. ఆయన మరణానంతరం పూర్తిస్థాయి విచారం జరగలేదు. ఈ నెల 11న బిజెపి కార్యకర్తలు దీన్‌దయాళ్‌జీ వర్థంతిని మొక్కుబడిగా జరిపారు. నిజంగా ఆ మహాపురుషుడికి నివాళి సమర్పించడం అంటే ఆయనకు ‘్భరతరత్న’ ప్రకటించడమే. పాటలు పాడి డబ్బు సంపాదించుకున్నవారికి, క్రికెట్‌లో తరించినవారికి ‘్భరతరత్న’ ఇచ్చి ధన్యోస్మి అనిపించుకున్న జాతి మనది. అక్రమాస్తుల కేసులో నేరస్థురాలైన జయలలితకు ‘్భరతరత్న’ ఇవ్వాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఆమోదించిందంటే నేడు రాజకీయ సాంస్కృతిక ప్రమాణాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు.
***
పంజాబ్ ప్రజలు ప్రతినెలా ఎన్నికలు వస్తే బాగుండునని కోరుకుంటున్నారు. ఎందుకంటే మత్తుమందును ఓటర్లకు పాకెట్లలో ఆయా అభ్యర్థులు ఇళ్లకే పంపుతున్నారు. ఎలక్షన్ కమిషన్ దాదాపు 2.6 టన్నుల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నదంటే ఈ వ్యాపారం ఎంత జోరుగా జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ మాదక ద్రవ్యాలు పాకిస్తాన్ నుండి పఠాన్‌కోట్ మీదుగా పంజాబ్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ డ్రగ్ మాఫియా చేస్తున్న వ్యాపారం మాత్రమే కాదు, భారత్‌ను బలహీనపరిచే అంతర్జాతీయ కుట్రలో అంతర్భాగం. చైనా, పాకిస్తాన్‌లు కలిసి చేస్తున్న ఈ దుర్మార్గాన్ని అడ్డుకోకపోవటం భారత జాతి చేసుకున్న ఖర్మ. భగత్‌సింగ్ వంటి విప్లవ సింహాలు సంచరించిన అయిదు నదుల తీరంలో నేడు మాదక ద్రవ్యాలు ఆరో నదిగా ప్రవహిస్తున్నాయి!
***
చైనా న్యూక్లియర్ సబ్‌మెరైన్ కరాచీ తీరానికి చేరింది. పది అణ్వస్త్ర క్షిపణులతో కూడిన బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. ఇది తప్పు అనేవాడు ఒక్కడు కూడా ఎందుకు లేకుండాపోయారు? అలనాడు ప్రధాని వాజపేయి హయాంలో పోఖ్రాన్‌లో అణుపరీక్ష నిర్వహిస్తే లోక్‌సభలో ‘్భరతదేశం ఇక సర్వనాశనమైపోతుంది’ అని వామపక్ష నేత సోమనాథ్ ఛటర్జీ శాపాలు పెట్టాడు. మరి పది న్యూక్లియర్ వార్‌హెడ్స్‌తో చైనా భారతదేశం లక్ష్యంగా అణుపాటవ పరీక్ష చేస్తే ఉభయ కమూనిస్టు పార్టీల నోళ్లు ఎందుకు మూతపడ్డాయి? ఇండియాకు ఒక నీతి, చైనాకు మరొక నీతి వర్తిస్తుందా? బిహార్ నుంచి వచ్చిన హిందీ భాషీయులు ముంబయిలో నివసించకూడదు. ఉంటే వారిపై శివసైనికులు దాడి చేస్తారు. కర్నాటకలో కన్నడం మాట్లాడేవారికే ఉద్యోగాలు ఇస్తారు. కాశ్మీరు తమ జన్మస్థలమైనా కాశ్మీరీ పండిట్లు అక్కడ ఉండడానికి వీలులేదు. చెన్నైలో తమిళం తప్ప తెలుగు భాష మాట్లాడకూడదు. నాగాలాండ్, మణిపూర్, అసోం, అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాల్లో హింసాత్మక ఉద్యమాల వెనుక చైనా ప్రత్యక్ష ప్రమేయం ఉన్నా మన వామపక్ష నేతలు నోరు మెదపరు.
***
తిరుగుబాట్లకు బిజెపి (ఒకప్పటి జనసంఘ్) కూడా అతీతం కాదు. వౌళీ చంద్ర శర్మ 1948లో న్యూఢిల్లీలో జనసంఘ్‌పై తిరుగుబాటు చేశాడు. తరువాత వాజపేయిపై బలరాజ్ మధోక్ తిరగబడ్డాడు. మోదీపై అద్వానీ వర్గం తిరగబడింది. గుజరాత్‌లో శంకర్ సింగ్ వాఘేలా బిజెపిపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరాడు. సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు బిజెపిపై తిరగబడ్డాడు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరు. కానీ, శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి అని ఒక సూక్తి. శాశ్వత ప్రయోజనాల పేరే ‘వ్యక్తిగత స్వార్థం’. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌తో కలసి పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు తెలంగాణ సర్కారుపై ఎందుకు తిరగబడినట్లు?

- ముదిగొండ శివప్రసాద్