మెయన్ ఫీచర్

క్రియాశీలత కోల్పోతున్న యూరప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ తూర్పు ఐరోపా ఖండ రాజ్యాలకు మాత్రమే కుదించుకుపోతుందా? ఎందుకంటే ఈయూ ఏర్పడిన తొలినాళ్లనాటి స్వర్ణయుగం ఇప్పుడు గడచిపోయన చరిత్ర. అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. దీంతో పాటు ప్రపంచం కూడా మారిపోయింది. నాటి సోవియట్ యూనియన్ అదృశ్యమైపోయింది. తూర్పు యూరప్‌కు చెందిన కొన్ని దేశాల్లో కమ్యూనిస్టు వ్యవస్థ తొలగిపోయి, సంప్రదాయ, ఛాందసవాద క్రైస్తవ వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. ఈయూ దేశాలకు పునాది వంటి సరళీకృత ప్రజాస్వామ్యం ఇప్పుడు అంతరించిపోయే జాబితాలో చేరిపోయింది.
---
ఇంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని సరికొత్త సంక్షోభంలో యూరప్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తొలినాళ్లలో ‘‘కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ’’గాను తర్వాత ‘‘యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ’’గాను మార్పులు చెంది చివరకు ‘‘యూరోపియన్ యూనియన్’’ (ఈయూ)గా ఐరోపా పరిణామ క్రమం స్థిరపడింది. ఈయూగా పేరు స్థిరపడినప్పటికీ ఇందులోని దేశాలు ఎన్నడూ సన్నిహితంగా లేవు. అసలు బ్రిటన్ ‘ఈయూ’ భావననే తిరస్కరించింది మరి! ఉమ్మడి ‘యూరో’ కరెన్సీని ప్రారంభించినప్పుడు ‘ఈయూ’లోని అన్ని దేశా లు ఇందులో చేరలేదు. ఇది చాలదా ఈ యూనియన్‌లో ‘సమైక్యత’పాలు ఎంతుం దో చెప్పడానికి!
మరిప్పుడు యూరప్ దేశాలను చుట్టుముట్టిన ప్రధాన సంక్షోభం ఏమిటి? అంతర్యుద్ధం కారణంగా సిరియానుంచి పారిపోయి, వచ్చి పడుతున్న లక్షలాది మంది శరణార్థుల వెల్లువ యూరప్ దేశాలను కుదిపేస్తున్నది. ఈ సమస్యపై యూరప్ దేశాధినేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నప్పటికీ ‘మానవతా’ దృక్కోణం కఠిన చర్యలకు ఉపక్రమించకుండా అడ్డుకుంటోంది. దీన్న లా ఉంచితే యూరప్ దేశాల్లో శరణార్థి సమస్యపై వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలకు చాలా కారణాలున్నాయి. వాటిల్లో మొదటిది, తూర్పు ఈయూ దేశాలపై ముఖ్యంగా తొలినాళ్లలో అత్యుత్సాహం ప్రదర్శించిన సభ్యదేశాలపై గతంలో ఉన్న ప్రపంచ దృక్పథంలో ప్రస్తుతం మార్పు రావడం. ‘యూరో’ భావన చెప్పడానికి ఎంతో బాగున్నప్పటికీ, వాస్తవంలోకి వచ్చేసరికి అది ఆశించినంత పలితాలివ్వకపోవడం రెండో కారణం. ఇందులో గ్రీసు పరిణామాలే అందుకు ఉదాహరణ. ఇక మూడో కారణం వెల్లువెత్తుతున్న శరణార్ధులు. వీరి పట్ల వ్యవహరించే విషయంలో సభ్యదేశాల మధ్య పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక చివరి కారణం..జర్మనీకి దశాబ్దకాలంగా ఛాన్సలర్‌గా కొనసాగుతున్న ఎంజెలా మార్కెల్, బెర్లిన్‌ను ఒక చిన్నపాటి సంస్థగా మార్చివేయడం.
యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై బ్రిటన్ ఈ ఏడాది జూన్ 23న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నది. ఈయూలో సభ్యత్వానికి వ్యతిరేకంగా ప్రజల తీర్పు వస్తే, ఐరోపా సమాజానికి అది తిరుగులేని దెబ్బే అవుతుంది. ఎందుకంటే ఈయూ సభ్యదేశాల మధ్య వీసా అవసరం లేకుండానే ఆయా దేశాల ప్రజలు రాకపోకలు సాగించవచ్చు. ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో సభ్యదేశాల యువజనులకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగావకాశాలకోసం వారు స్వేచ్ఛగా ఈయూ దేశాల్లో సంచరించే వీలుంది. కాని సభ్య దేశాల్లో ఇప్పటి వరకు బ్రిటన్ మాత్రమే దారుణంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇప్పటికీ బ్రిటన్ ఒకనాటి తన సామ్రాజ్యం, అపార సైనికశక్తికి సంబంధించిన వ్యామోహాన్నుంచి బయటపడక పోవడమే ఇందుకు కారణం. మొట్టమొదట అమెరికాకు తోకగా మారింది, తర్వాత ఈయూలో సభ్యురాలిగా ఉన్న తన రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి శత్రువు జర్మనీతో విభేదించింది.
ప్రస్తుతం శరణార్థి సమస్య తూర్పు యూరోపియన్ దేశాల్లో విభిన్న వైఖరులు వ్యక్తం కావడానికి కారణమవుతోంది. ఈ సమస్యపై సభ్యదేశాలు ఎవరికి వారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాయి. ఇందుకు ఉత్తమ ఉదాహరణ, పోలెండ్! ఈయూ నుంచి ఎంతో సహాయాన్ని పొందిన దేశమిది! కానీ ప్రభుత్వం మారిన తర్వాత పోలెండ్ వ్యవహారశైలిలో పూర్తి మార్పు వచ్చింది. ఇప్పుడు ఈయూ దేశాల్లో అత్యంత స్వతంత్రంగా, ఏ నిబంధనలకు కట్టుబడకుండా వ్యవహరిస్తున్న దేశమేదైనా ఉన్నదంటే అది కేవలం పోలెండ్ మాత్రమే. ఇక ఉదార విలువలను చెత్తబుట్టదాఖలు చేసిన రెండో దేశం హంగెరీ. విక్టర్ ఓర్బన్ నేతృత్వంలో హంగెరీ సర్వ స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. తన దేశాన్ని నడిపే విషయంలో విక్టర్ ఓర్బన్ ధిక్కార స్వరం అడుగడుగునా ధ్వనిస్తోంది. ఇక చెక్ రిపబ్లిక్, హంగెరీ, పోలెండ్, స్లొవేకియా దేశాలు ‘విస్‌గార్డ్’ పేరుతో ఒక గ్రూపుగా ఏర్పడ్డాయి. శరణార్థుల రూపంలో వచ్చిపడుతున్న ముస్లింల వెల్లువ కారణంగా తమ దేశాల్లో క్రైస్తవ వ్యవస్థ బలహీన పడుతుందంటూ అవి వాదిస్తున్నాయి. అయితే ఈయూ నాయకత్వం మాత్రం వీరిని పరిగణలోకి తీసుకోవడానికి ఎంతమాత్రం ఉత్సాహం చూపడం లేదు.
శరణార్థుల సమస్యకు ముందు గ్రీస్ ఆర్థిక సంక్షోభం కుదిపేసింది. యూరో గ్రూపులో సభ్యదేశం కావడంలో అంతర్జాతీయంగా ఈ సమస్య విపరీతమైన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్టకేలకు ఎంజెల్లా మర్కెల్ కఠిన చర్యలు తీసుకోవడానికి అంగీకరించక తప్పలేదు. ఇక యూరోజోన్ దేశాల్లో కొనసాగాలంటే మితవ్యయం పేరుతో జర్మనీ నేతృత్వంలో యూరో దేశాలు ఇచ్చిన చేదుమాత్రను తనకు ఎంతమాత్రం అంగీకారం కాకపోయినా గ్రీస్ దిగమింగక తప్పలేదు. కానీ ఈ మితవ్యయం పేరుతో తీసుకున్న కఠిన చర్యలు దేశీయంగా గ్రీస్‌లో తీవ్ర అస్థిరతకు, ఆందోళకు దారితీశాయి. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమై, చివరకు రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఆవిధంగా ఎంజె లా మర్కెల్, గ్రీస్ విషయంలో అమలు పరచిన మితవ్యయ చర్యలు సభ్య దేశాల్లో అప్రదిష్టను మూటకట్టుకున్నాయి.
ఇక శరణార్ధుల సమస్య పుణ్యమాని మర్కెల్ దేశీయంగా కూడా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరణార్ధులను ఆహ్వానించినందుకు ప్రపంచం ఆమెను అభినందించింది. ప్రస్తుతం పదిలక్షల కంటే అధిక సంఖ్యలో శరణార్థులు గత ఏడాది జర్మనీలో స్థిరపడ్డారు. అయితే సమస్య ఇంతటితో ముగిసిపోలేదు. శరణార్థుల వెల్లువ మరింతగా పెరిగింది. ఫలితంగా జర్మనీలో ‘సంప్రదాయ’ పార్టీల ప్రాబల్యం ఒక్కసారిగా పెరిగింది. ఇటీవల జర్మనీలో జరిగిన స్థానిక ఎన్నికలే ఇందుకు నిదర్శనం. శరణార్థులను అనుమతిస్తూ జర్మనీ తీసుకున్న నిర్ణయంపై ఈయూ సభ్యదేశాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయ. పర్యవసానంగా నిరంతరం వచ్చిపడుతున్న శరణార్ధుల ప్రవాహాన్ని నిలువరించేందుకు ఆయా దేశాలు అడ్డంకులు సృష్టించడం మొదలైంది. ఆవిధంగా ఈయూ దేశాలు ఇప్పటివరకు సాధించిన విజయంగా చెప్పుకుంటున్న ‘స్కెహెన్‌జన్’ పేరుతో అనుసరిస్తున్న ‘తెరచి ఉన్న సరిహద్దుల’ విధానంపై దెబ్బకొడుతూ, తమ సరిహద్దుల మూసివేతకు ఉపక్రమించాయి.
విచిత్రమేమంటే యూరప్ దేశాలను కుదిపేస్తున్న వరుస సంక్షోభాల పర్యవసానమే ఈయూ-టర్కీల మధ్య కుదిరిన ఒప్పందం. ఈయూ దేశాల్లోకి పెద్ద ఎత్తున శరణార్ధుల వెల్లువ ప్రారంభం కావడానికి ప్రధార కారణం ఇదే. దీని ప్రకారం టర్కీకి, యూరోపియన్ యూనియన్ దేశాలు 6 బిలియన్ యూరోలు ఆర్థిక సహాయం చేస్తాయి. ఇందుకు ప్రతిగా యూరప్ దేశాల్లోని ‘సిరియాయేతర’ శరణార్థులందరిని టర్కీ వెనక్కి తీసుకుంటుంది. ఇదే సమయంలో టర్కీ క్యాంపుల్లో ఉన్న శరణార్థులను ఈయూ దేశాలు స్వీకరించాలి. జర్మనీ నేతృత్వంలోని యూరప్ దేశాలు ఈ ఒప్పందంపై తప్పనిసరి పరిస్థితుల్లో సంతకాలు చేశాయి. యూరప్ భవితవ్యం దృష్ట్యా ఈ పరిణామాలు ఎంతమాత్రం శ్రేయస్కరమైనవి కావు. బ్రిటన్ ఈయూలో కొనసాగినా లేక కొనసాగకపోయినా ఈయూ మాత్రం తన క్రియాశీలతను కోల్పోయిందన్న మాట వాస్తవం.
చాలాకాలంగా ఫ్రాన్స్, జర్మనీలు ఈయూ ‘రైలు’కు ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. రాజకీయంగా ముందుండాలనేది ఫ్రాన్స్ ఉద్దేశం కాగా, నాజీ గతం నుంచి బయటపడాలనేది జర్మనీ తాపత్రయం. అయితే మర్కెల్ తూర్పు జర్మనీకి చెందివారు కావడంతో ప్రస్తుతం ఆ దేశం ‘నాజీ గతం’నుంచి చాలావరకు బయటపడ్డట్టే. ఇక శరణార్థుల విషయంలో ఫ్రాన్స్ తటస్థవైఖరితో ఉంది. మరి భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ తూర్పు ఐరోపా ఖండ రాజ్యాలకు మాత్రమే కుదించుకుపోతుందా? ఎందుకంటే ఈయూ ఏర్పడిన తొలినాళ్లనాటి స్వర్ణయుగం ఇప్పుడు గడచిపోయన చరిత్ర. అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. దీంతో పాటు ప్రపంచం కూడా మారిపోయింది. నాటి సోవియట్ యూనియన్ అదృశ్యమైపోయింది. తూర్పు యూరప్‌కు చెందిన కొన్ని దేశాల్లో కమ్యూనిస్టు వ్యవస్థ తొలగిపోయి, సంప్రదాయ, ఛాందసవాద క్రైస్తవ వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. ఈయూ దేశాలకు పునాది వంటి సరళీకృత ప్రజాస్వామ్యం ఇప్పుడు అంతరించిపోయే జాబితాలో చేరిపోయింది.
అయితే కొన్ని గందరగోళ సంఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ, మిగిలిన సానుకూలాంశాలను వినియోగించుకొని, కలిసి ఉండటానికే యత్నించాలన్నది ప్రపంచ అభిప్రాయం. ఉక్రెయిన్ విషయంలో అమెరికా జోక్యాన్ని కోరడం వంటి తెలివితక్కువ విధానాలను ఈయూ దేశాలు మార్చుకున్నట్లయితే బహుశా పరిష్కారం దొరికి ఉండేది. ఎందుకంటే సోవియట్ యూనియన్ రోజులు, అమెరికాకు వంతపాడిన బోరిస్ ఎలిస్తిన్ కాలం చరిత్ర పుటల్లో కలిసిపోయాయి. ఇప్పుడు రష్యాకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆయన తన దేశ ప్రయోజనాలు కాపాడుతున్నాడు. కాని వాషింగ్టన్ మాత్రం రష్యాను ప్రచ్ఛన్న యుద్ధంలో ఓటమిపాలైన శక్తిగానే పరిగణిస్తోంది. ఉక్రెయిన్ జనాభా, సంస్కృతి,మతం, రష్యన్లతో వారికున్న కుటుంబ పరమైన బంధుత్వాలను ఒక్కసారి పరిశీలిస్తే, ఈయూ దేశాల జోక్యాన్ని మాస్కో ఎట్టిపరిస్థితుల్లో సహించబోదన్నది సుస్ప ష్టం. ఉక్రెయిన్‌ను తనకు దూరం చేసే ఈయూ యత్నాలను అడుగడుగునా రష్యా ప్రతిఘటించకమానదు.
పశ్చిమ దేశాల రాజకీయాలు, అవి అనుసరిస్తున్న విధానాలను బాగా ఆకళింపు చేసుకున్న పుతిన్, క్రిమియాను కలిపేసుకోవడమే వివేకమైన పని అని భావించి తక్షణమే అమలు జరిపాడు. నిజానికి క్రిమి యా ఒకప్పుడు రష్యా నల్లసముద్రపు యుద్ధ నౌకల స్థావరం. దీన్ని నికిత కృచ్చేవ్ సోవియట్ యూనియన్ కాలంలో ఉక్రెయిన్‌కు ఇచ్చివేశారు. ఇప్పుడు మాస్కో, తూర్పు ఉక్రెయన్ ప్రాంతంలో రష్యన్ భాష మాట్లాడే ప్రజలను తిరుగుబాటుకు రెచ్చగొడుతోంది.

- ఎస్. నిహాల్ సింగ్