మెయిన్ ఫీచర్

ఏడవ తరగతే చదువు.. ఎందరికో స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల జరిగిన లాక్మీ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ ముగ్గురు అమ్మాయిలు సంచలనం సృష్టించారు. వీరు పుట్టి పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో. చదివింది ఏడవ తరగతి లోపే. ఫ్యాషన్ డిజైనింగ్‌లో కనీసం పట్టా కూడా లేదు. కట్టుబాట్లు, ఆచారాల మధ్య సహజీవనం చేస్తూనే పొట్టకూటి కోసం నేర్చుకున్న చేతవృత్తి పనిలో చూపిన ప్రతిభ వీరిని అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేసింది. సరికొత్త ఆలోచనలతో చేసే డిజైన్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. పేదరికంతో ఇబ్బందులు పడుతూనే.. ప్రతిభా పాటవాలతో కొద్దిపాటి పెట్టుబడితో స్టోర్‌ను ప్రారంభించిన అతికొద్దికాలంలోనే అందరి దృష్టిలో పడ్డారు. సంప్రదాయ డిజైన్లకు ఆధునిక సొగసులు అద్దుతూ అబ్బురపరిచేలా డిజైన్లు రూపకల్పన చేస్తున్నారు. దుస్తుల డిజైనింగ్‌లో తమ పనితనాన్ని చూపిస్తూ
దూసుకుపోతున్నారు.

తార, తులసి, లక్ష్మి- ఈ ముగ్గురు గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని వేర్వేరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువతులు. వీరిలో తులసి, లక్ష్మి ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. తార అయితే ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ఆడపిల్లలను బయటకు పంపించి చదివించే స్తోమత లేకపోవటం, ఊరుదాటి బయటకు వెళ్లకూడదనే సామాజిక కుల కట్టుబాట్ల నుంచి వాచ్చినవారే. పద్మవిభూషణ్ కె.జె. సోమయ్య నెలకొల్పిన ట్రస్ట్‌లో చేరారు. ఇక్కడ క్రాఫ్ట్ డిజైన్‌లో శిక్షణపొందారు. ఇక్కడ కలిగిన పరిచయం వీరిని జత కలిపింది. సంప్రదాయ డిజైన్లకు సొగసులు అద్దటంలో నేర్పు సంపాదించారు. తొలుత వీరికి రోజూ వేతనం కేవలం రూ. 600లు మాత్రమే వచ్చేది. వీరు చేసే డిజైన్లలో ఎక్కువ పచ్చటి ప్రకృతికి సంబంధించినవే ఉంటాయి. చెట్టు, దాని కొమ్మలు విస్తరించినట్లు వీరి సాంప్రదాయ డిజైన్లలో ఆధునిక సొగసులు అద్దుకుని లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనే స్థాయికి ఎదిగారు.
ఊరుదాటి వెళ్లటం మహానేరం
తులసి స్వగ్రామంలో ఆడపిల్లలు ఊరుదాటి బయటకు వెళ్లటం మహా నేరంగా పరిగణిస్తారు. ఆ ఊళ్లో అప్పర్ ప్రైమరీ స్కూలు మాత్రమే ఉంది. 7వ తరగతి వరకు ఆడపిల్లలు చదివి స్కూలు మానేయాల్సిందే. కుట్లు, అల్లికలు వంటి చేతి వృత్తి పనులు నేర్చుకోవాలి. తులసి కూడా ఏడవ తరగతి వరకు చదివి, ఇంటి వద్దే కుట్టుపని నేర్చుకుంది. ఆ తర్వాత సోమయ్య కళా విద్యాలయంలో డిజైన్ ఆర్ట్స్‌లో చేరి శిక్షణ తీసుకుంది. డిజైనింగ్ వర్క్‌లో తులసి, లక్ష్మి చక్కటి నేర్పరులు.
ఫ్యాబ్రిక్ వస్త్రాలపై సహజ రంగులతో..
ఫ్యాబ్రిక్ వస్త్రాల మీదే సహజ రంగులతో ఎక్కువగా డిజైన్ చేస్తుంటారు. డైరెక్ట్‌గా ఫ్యాబ్రిక్ దుకాణ యజమానులను సంప్రదించి వారికి డిజైన్ చేసిన వస్త్రాలను అందిస్తారు.వ్యాపారం చేయగా వచ్చిన డబ్బులనే తిరిగి పెట్టుబడిగా పెట్టి కొత్త వస్త్రాలను కొని డిజైన్ చేస్తారు. బ్యాంకులు, ఇతరుల నుంచి రుణాలు తీసుకుని ఆ భారాన్ని మోసే ఆర్థిక పరిస్థితి లేకపోవటంతో మాకు వచ్చే ఆదాయంతోనే ఆమేరకే బిజినెస్ చేస్తుంటాం. ఈ లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనటానికి ముగ్గురం కలిసి రెండు లక్షల రూపాయలు ఇనె్వస్ట్ చేసి మా సృజనాత్మకత, శ్రమంతా ధారపోసి పాల్గొన్నాం. మేము ఆశించినదానికంటే ఎక్కువ ఆదరణ లభించిందని లక్ష్మీ చెబుతుంది. ఎక్కడ ఎగ్గిబిషన్లు ఏర్పాటుచేసినా అందరికంటే ముందే ఉంటారు. ఇపుడిపుడే వీరి కుటుంబాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. సొంత వ్యాపారం కాబట్టి ముగ్గురుం కలిసి మా కోసమే అన్నట్లు పారదర్శకంగా పనిచేస్తారు. వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా బాధ్యత ముగ్గురం పంచుకుంటారు. తులసి కూడా చక్కగా డిజైన్లు రూపొందిస్తుంది. వర్కర్స్‌ని సొంతవారీగా భావించి వారితో కలిసి పనిచేయటం వల్ల కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నాం. తొలుత తల్లిదండ్రులు సహకరించకపోయినా ఎన్జీఓ సహకారంతో ముందుకు వెళ్లాం. మరింతగా మార్కెట్లో స్థిరపడాల్సిన అవసరం ఉందని అంటుంది లక్ష్మీ. లక్ష్మి చదివింది ఏడవ తరగతి అయినప్పటికీ చిన్న చిన్న కవితలు రాస్తుంది. ఈమె అభిమాన తారలు సల్మాన్ ఖాన్, కరీష్మాకపూర్. ఎప్పటికైనా సినిమా తారాల వస్త్రాలు డిజైన్ చేసి తాము కూడా సొంతంగా సినిమా తీసే స్థాయికి వెళతామనే ధీమాను వ్యక్తంచేస్తుంది. ఇక తారా అంతా ఈ బిజినెస్ వ్యవహారాలను, వస్త్రాల మార్కెటింగ్ వ్యవహారాలను చూస్తుంది. ఇందులో ఈమె దిట్టి. స్థానిక మూలాలను మరువకుండా నాలుగు గోడల మధ్య బంధీ అయిన అమ్మాయిల్లోనూ సృజనాత్మతకు కొదవలేదని నిరూపిస్తూ వీరు ముందుకు సాగుతున్నారు.