మెయిన్ ఫీచర్

అందం.. ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఆస్కార్ వేడుక మరికొద్ది గంటల్లో మొదలవుతుంది. అవార్డుల ప్రదానం సందర్భంగా నిర్వహించే రెడ్‌కార్పెట్‌పై అందచందాలతో ఆహూతుల మనసు దోచుకునేందుకు ప్రఖ్యాత తారలు తహతహలాడుతున్నారు. ఈ వేడుకల్లో ఆస్కార్ అవార్డులకు ఎంత ప్రాధా న్యం ఉంటుందో రెడ్‌కార్పెట్ ప్రదర్శనగూ అంత ఆదరణ ఉంటుంది. సృజన, కొత్తదనం, అందం, శ్రమకు అద్దం పట్టే సరికొత్త రూపురేఖల్లో తారలు తళుక్కున మెరసిపోవడం రెడ్‌కార్పెట్ ప్రత్యేకత. ఇటీవలి కాలంలో హాలీవుడ్ తారలకు దీటు గా బాలీవుడ్ నుంచి నటీనటులు హా జరై తమ ప్రతిభను చాటుతున్నారు. ఎప్పటిలా ఈసారి కూడా బాలీవుడ్ భామ ప్రియాం క చోప్రా ఈ వేడుకలకు హాజరవుతూండగా దీపి క పదుకొనే ఈసారి వెళ్లలేకపోతున్నట్లు వెల్లడించింది. అయితే ఈ రెడ్‌కార్పెట్‌పై మెరిసిపోయేందుకు ఉబలాటపడే తారలు ఎంత శ్రమ పడతారో, ఎంత ఖర్చు చేస్తారో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ముఖ్యంగా నాలుగు అంశాల్లో వారు శ్రద్ధ చూపిస్తారు. రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయే వారికి కూడా ప్రత్యేక బహుమతులు ఉంటాయి. ముఖ్యంగా డ్రెస్‌కు ప్రత్యేక అవార్డు ఇస్తారు. శరీరాకృతి, హెయిర్‌స్టైల్, దుస్తులు, మేకప్ విషయాలపై వీరంతా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.
హంగామాఎందుకంటే: రెడ్‌కార్పెట్‌పై అందాల తారలు హోయలుపోవడం వల్ల ఎవరికి లాభం అంటే అదో పెద్ద విశేషమేనని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ రంగంపై ఈ వేడుక ప్రభావం చూపిస్తుంది. దాదాపు వెయ్యి బ్రాండ్లకు చెందిన వ్యాపారం ఈ షోపై ఆధారపడి ఉంది. ఓ తార ధరించిన దుస్తులు క్లిక్ అయితే ఆ డిజైనర్, వారిని స్పాన్సర్ చేసిన సంస్థలు, ఆ తారను పోషిస్తున్న సంస్థల ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఏర్పడుతుంది. మేకప్, ఫుడ్, కాస్మొటిక్స్ ఇలా ఎన్నో రంగాల అభివృద్ధి దీనిపై ఆధారపడుతుంది. అటు తారలకూ ఇది మంచి లాభసాటి వ్యాపారమే.
అందానికి అందం, డబ్బుకు డబ్బు ఈ వేడుకవల్ల వస్తాయంటే ఎవరికి ఇష్టం ఉండదు. భారత్ తరపున దీపిక పదుకొనె, ప్రియాంకచోప్రా, ఐశ్వర్యరాయ్, బిపాసబసు, కత్రినాకైఫ్ వంటి తారలు ఎన్నోసా ర్లు ఈ రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయిన విష యం తెలిసిందే.

శరీరాకృతి.. ఆహారం
సన్నగా, నాజూకుగా, అందమైన ఆకృతిలో కనిపించడానికి ప్రాధాన్యం ఇస్తారు. భుజాలు, నడు ము, పిరుదులు, ఛాతీ అందంగా కనిపించడానికి తగిన వ్యాయామం చేస్తారు. నెలరోజుల ముందు నుంచి ప్రత్యేక శిక్షకుల సహాయంతో ఇది కొనసాగిస్తారు. ఎప్పటికప్పుడు శరీర కొలతలు సరిచూసుకుంటూంటారు. పూర్తిగా శాకాహారం తీసుకుంటారు. పళ్లరసాలకు ప్రాధా న్యం ఇస్తారు. సేంద్రియ పంటలనే వినియోగిస్తారు. జంక్‌ఫుడ్ జోలికి వెళ్లరు. మొక్కలు, కూరగాయలతో కూడిన ఆహారం తింటారు. వాటివల్ల శరీ రం నాజూకుగా నిగనిగలాడుతూ ఉంటుందని అంటున్నారు డేనియల్ బ్లు బౌస్. రెడ్‌కార్పెట్‌పై పోటీపడే తారలకోసం రెడీ టు ఈట్ ఆహారాన్ని సరఫరా చేసే సంస్థల్లో ఒకటైన 3సకార2 నిర్వాహకురాలు ఆమె.

మేకప్
చర్మానికి హాని చేయని రంగులను, పౌడర్లను ఎంపిక చేస్తారు. ప్రదర్శనకు కొద్దిరోజుల ముందు ఒకటిరెండుసార్లు వేసి చూస్తారు. అవసరమైన మార్పులతో రెడ్‌కార్పెట్ ప్రదర్శనకు కొద్ది గంటలముందు ఫైనల్‌మేకప్ చేస్తారు. కేవలం ముఖం మాత్రమే కాకుండా, కురులు, కంఠం, చేతులు, పాదాలకూ మేకప్ టచ్ ఇస్తారు. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతుల మధ్య వీరి ప్రదర్శన ఉంటుంది. తారలకు వేసే మేకప్ ఈ కాంతుల్లో స్పష్టంగా కనిపించేటట్లు జాగ్రత్తలు తీసుకుంటారు.
హెయిర్‌స్టైల్
కురులను మూడు వారాల ముందు ట్రిమ్ చేస్తారు. అవసరాన్ని, ఆలోచనలను బట్టి తగ్గించుకోవడం చేస్తారు. సరిగ్గా మూడురోజుల ముందు తుది నిర్ణయం తీసుకుని అవసరమైన రంగులు అద్దుతారు. ముడి వేయాలా, కురులను వదిలేయాలా, వివిధ డిజైన్లలో తీర్చిదిద్దాలా అన్నది ఒక్కరోజు ముందు నిర్ణయిస్తారు. లేడిగగా వంటి ప్రఖ్యాత తారలకు హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేసిన సారా తన్నో ఈ మాటలు చెబుతున్నారు.