మెయిన్ ఫీచర్

ఇల్లే బడి.. ఇష్టమే పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి స్కూల్‌లో చదివిస్తే గొప్పని చాలామంది అనుకుంటారు...
లక్షలకు లక్షలు ఫీజులు కట్టి సాహసాలు చేస్తారు...
మంచి ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి తెస్తారు...
ఫలితం రాకపోతే అటు చిన్నారులు, ఇటు తల్లిదండ్రులు ఉసూరుమంటారు. అయితే నిజానికి పిల్లల ఆసక్తి, అభిరుచులకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తే, వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే వారికి ఇష్టమైన పని చేస్తే ఫలితం దానంత అదే వస్తుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం మాళవిక రాజ్‌జోషి. స్కూలులో చదువుకన్నా ఇంటినే బడిగా భావించి ప్రాథమిక విద్యపూర్తి చేసిన ఆమె ఎటువంటి ఉన్నత విద్యార్హతలు లేకుండా ప్రఖ్యాత విద్యాసంస్థలో ఉన్నత చదువులకు చేరడం విశేషం.
ఉన్నత విద్యలో ప్రపంచంలో మేటి విద్యాసంస్థ మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ సంస్థలో విద్యనభ్యసించాలని ప్రపంచంలోని విద్యార్థులందరూ కలలుకంటారు. అటువంటి విద్యాసంస్థలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చదవడానికి మాళవికకు ప్రవేశం లభించింది. పదవ తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఫస్ట్‌టూలు చదవకుండా మాళవిక ఈ విద్యాసంస్థలో ప్రవేశం పొందటం విశేషం.
ముంబాయికి చెందిన మాళవిక తండ్రి రాజ్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక సొంతగా వ్యాపారం మొదలెట్టారు. తల్లి సుప్రియా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేసేది. మాళవిక ముంబాయిలోని దాదార్‌లోగల పార్సీ యూత్ అసెంబ్లీ స్కూల్‌లో చదివేది. ఆమె ఏడవ తరగతికి వచ్చిన తరువాత, తన కుమార్తె చదువులో అంత ఆనందం పొందటం లేదన్న విషయాన్ని సుప్రియా గుర్తించింది. వెంటనే ఆమె మాళవికను 2012లో స్కూల్ మానిపించి, ఇంట్లోనే చదవుకొనే విధంగా ఏర్పాటు చేసింది. మాళవిక స్వేచ్ఛగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై అధ్యయనం ప్రారంభించింది. అనంతరం ఆమెను చెన్నై మేథమ్యాటికల్ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మాధవన్ ముకుంద్ ఆమెకు గణితంలో అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఇన్‌ఫర్‌మ్యాటిక్స్ పేరిట గణితం, భౌతిక శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రాలకు సంబంధించి పోటీలు జరుగుతాయి. ఈ పోటీలలో పాల్గొన్న మాళవిక రెండు రజత, ఒక కాంస్య పతకాలను గెలుపొందారు. మాళవికను స్కూల్ మానిపించిన ఆమె తల్లి సుప్రియ తన కుమార్తెకోసం ఒక ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందించారు.
మాళవిక తొలుత మన దేశంలోనే ఐఐటిలో చదువుకోవాలని భావించింది. అయితే మన దేశంలో ఐ.ఐ.టి.లో చేరాలంటే తప్పనిసరిగా పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లు చదవాల్సి ఉంటుంది.
అదే మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒలింపియాడ్‌లో పతకాలు సాధించినవారికి నేరుగా ప్రవేశం కల్పిస్తారు. ఈ కోవలోనే మాళవికకు ఎం.ఐ.టి.లో ప్రవేశం లభించింది. మాళవిక మాదిరిగా స్కూల్ మానివేసి, ఇంట్లోనే తమకు ఆసక్తికలిగిన అంశాలపై అధ్యయనం చేయడానే్న హోమ్‌స్కూల్డ్ లేదా అన్‌స్కూల్డ్ అంటారు. ఈ విధానం మన దేశంలో అంత ప్రాచుర్యం పొందలేదు. కాని పాశ్చాత్య దేశాలలో ఈ విధానం బాగా ప్రాచుర్యం పొందింది. తమ కుమార్తెను ఎంఐటిలో చేరే విధంగా చదవాలని ఎప్పుడు ఒత్తిడి చేయలేదని, మాళవిక ఇష్టపడే విధంగా చదువుకునే ఏర్పాట్లు మాత్రమే చేశామని సునంద చెబుతారు. ర్యాంక్‌లకోసం పిల్లలని వత్తిడి చేయకండి. వారు ఏ అంశంలో ఆసక్తి కలిగి ఉన్నారో, సదరు అంశంపై అవగాహన ఏర్పరచుకొని, అధ్యయనం చేసేలా ప్రోత్సహించండి. అప్పుడే పిల్లలు కష్టపడి కాకుండా, ఇష్టపడి చదివి, ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలా చేసినప్పుడు మన దేశంలో కూడ ఎందరో మాళవికలు ఉద్భవిస్తారు. పిల్లల ఇష్టాలను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తే వారు అద్భుతాలను సృష్టించగలరనడానికి మాళవిక ప్రత్యక్ష నిదర్శనం.

చిత్రం..మాళవిక, తల్లిదండ్రులు

- పి.హైమావతి