మెయిన్ ఫీచర్

కేజిహెచ్‌లో దోపిడీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హార్ట్ ఎటాక్ వచ్చిన ప్రతి రోగికి స్టెంట్ వేసి, జీవిత కాలాన్ని మరికాస్త పెంచగలుగుతున్నాం. దీంతో స్టెంట్ విలువ బాగా పెరిగిపోయింది. సాధారణంగా ఈ స్టెంట్‌లన్నీ ఐర్లాండ్ నుంచి దిగుమతి అవుతుంటాయి. ఈ స్టెంట్స్ షిప్పింగ్ అయ్యేటప్పుడు ఒక్కో స్టెంట్ ధర 15 నుంచి 25 వేల రూపాయల వరకూ ఉంటోంది. అదే స్టెంట్‌ను మన దేశంలోకి వచ్చేప్పటికి లక్షా 20 వేల నుంచి, లక్షా 30 వేల వరకూ విక్రయిస్తున్నారు. ఒక స్టెంట్ ధరను ఇంతగా పెంచడం శోచనీయం. స్టెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న రోజుల్లో కూడా కెజిహెచ్‌లోని రోగులకు ఒక్కో స్టెంట్ గరిష్టంగా 14 వేల రూపాయలకు సరఫరా చేసేవారు. అదే ప్రైవేటు ఆసుపత్రుల్లోని రోగులకు 1,20,000కు ఇచ్చేవారు. ఇందులో ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్షకు పైగా పలికిన స్టెంట్ ధర 30 వేలకు దిగిపోయింది. అదే కెజిహెచ్‌లోని రోగులకు 12 వేలకే సరఫరా అవుతోంది. దీనివలన రోగులు చాలా ప్రయోజనం పొందారు. స్టెంట్‌ల ధరలు తగ్గడాన్ని వీటిని మార్కెట్ చేసే వారు దిగమింగుకోలేకపోతున్నారు.
- డాక్టర్ రవికుమార్ కార్డియాలజిస్ట్, కెజిహెచ్

మధ్య తరగతికి మేలు
ప్రభుత్వం స్టెంట్ల ధరను తగ్గించటంతో మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుంది. ఆధునిక జీవనశైలితో ఎంతోమంది అతి చిన్న వయస్సులోనే గుండె జబ్బులతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. అసలు రోగం కన్నా స్టెంట్ల ధరలు వారికి పెద్దసమస్యగా ఉండేది. ఇప్పుడు వాటి ధరను బాగా తగ్గించడం వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది. ప్రస్తుతం ఇండియాలో తయారయ్యే స్టెంట్ల ధర గరిష్టంగా రూ. 30 వేల లోపు ఉంటాయి. అమెరికా సహా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టెంట్ల ధరనూ నియంత్రిస్తే పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.

- డా.సాయి సుధాకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, డైరెక్టర్ ఆఫ్ క్యాథ్ ల్యాబ్,
గ్లోబల్ హాస్పిటల్, లక్డీకాపూల్

స్వదేశీ స్టెంట్‌లే నాణ్యమైనవి
చాలామందిలో విదేశీ స్టెంట్‌లు మంచివని, స్వదేశీ స్టెంట్‌లు నాణ్యమైనవి కావన్న భావన ఉంది. దాన్ని విడనాడాలి. స్వదేశీ స్టెంట్‌లను పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురావాలి. స్టెంట్ ధర తగ్గిపోవడం వలన రోగులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. హార్ట్‌ఎటాక్ తీవ్రతను బట్టి ఒకటి, రెండు స్టెంట్‌లు వాడాల్సి వస్తుంది. గతంలో స్టెంట్ ధర అధికంగా ఉండడం వలన రోగి ఒకదానికి మించి, ఎక్కువ స్టెంట్‌లను కొనుగోలు చేసుకోలేకపోవడం వలన కేవలం ఒక స్టెంట్‌తో సరిపెట్టుకోవలసి వచ్చేది. గతంలో ఒక స్టెంట్ ధరకు ఇప్పుడు మూడు స్టెంట్‌లు వచ్చేస్తున్నాయి. దీనివలన రోగికి మేలు జరిగింది? రోగి జీవిత కాలాన్ని మరింత ఎక్కువగా పెంచడానికి ఆస్కారం కూడా లభించింది? స్టెంట్ ధరలు తగ్గించడం వలన దళారులు ఇబ్బంది పడక తప్పదు.
- డాక్టర్ జివి రెడ్డి కార్డియాలజిస్ట్, విశాఖపట్నం

అప్పులు తీరలేదు
సంగారెడ్డి జిల్లాలో నివాసముండే మేము మా మేనమామకు గుండెనొప్పి వస్తే స్టెంట్ వేయాలని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. ఇందుకు సుమారు లక్షా ఇరవై వేల రూపాయల వరకు ఖర్చయ్యింది. అసలే పేద కుటుంబం. లక్షా ఇరవై వేల రూపాయల స్టెంట్, ఆపై ఆపరేషన్ ఖర్చులు పెట్టుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డాం. ఆయనకు స్టెంట్ వేయించి నాలుగేళ్లు గడిచినా, నేటికీ ఆయన పూర్తి స్థాయిలో కోలుకోలేదు. తరచూ అసౌకర్యానికి గురవుతూంటారు. స్టెంట్ కోసం చేసిన అప్పులో సగం ఇంకా మిగిలే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాలాంటివారికి పునర్జన్ననిచ్చినట్లే.
- పిట్ల స్వప్న కుసంగి గ్రామం,
సంగారెడ్డి జిల్లా

సామాన్యులకు ఊరట
స్టెంట్ ధరలు తగ్గించడం మంచి నిర్ణయమే. సాధారణంగా పేద వాళ్లకు తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. వారికి ఎంత ఖరీదైన స్టెంట్ వేసినా, ఆ డబ్బు వాళ్లు చెల్లించరు కాబట్టి వారికి అంత పట్టింపు ఉండదు. ఎటువంటి రాయితీలు లేనివారు ప్రైవేటు ఆసుపత్రుల్లో స్టెంట్‌లు వేయించుకోవాలంటే, భారీ మొత్తాన్ని చెల్లించుకోవలసి వస్తోంది. ఇప్పుడు ధర తగ్గిపోవడం వలన సామాన్యులకు కూడా స్టెంట్ వలన ఆరోగ్య ప్రయోజనమే కాదు, ఆర్థిక వెసులుబాటు కూడా కలిగినట్టయింది.
- ఎన్.సత్యనారాయణ, యలమంచిలి

నాది పునర్జనే్మ
స్టెంట్ వేయటం వల్లే నేను బతికాను. ఏడాది క్రితం నాకు గుండె నొప్పి వస్తే కిమ్స్ ఆసుపత్రిలో స్టెంట్ వేయించుకున్నా. అందుకు రూ. 85వేల వరకు ఖర్చయింది. డబ్బు సమకూర్చుకోవడం కష్టమైపోయింది. ఎక్కువమందికి అంత ఖర్చు భరించే శక్తి ఉండదు. ఓ న్యాయవాది పోరాటం వల్ల ప్రభుత్వం సరైన చర్య తీసుకుంది. స్టెంట్ల ధరలు తగ్గింపు సక్రమంగా అమలైతే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
- సూరీటి కృష్ణ, ఫౌండర్ ట్రస్టీ,
శ్రీ మహంకాళి దేవాలయం