మెయన్ ఫీచర్

ఆర్ష సంస్కృతిపై అన్నివైపులా దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1835, ఫిబ్రవరి 3న ఒక బ్రిటీషు ఆఫీసర్, లండన్‌కు ఒక జాబు రాశాడు. ‘‘మనం ఎంత కష్టపడ్డా మన సంస్కృతిని ఈ జాతిలో నాటడం కష్టం. అందుకు అర్ష సంస్కృతి అడ్డం వస్తున్నది. అందుకని ఈ జాతివారికి ఇంగ్లీషు మీద ప్రేమ, ఆర్ష సంస్కృతి మీద ద్వేషం వ్యాపింపజేయాలి.’’ అదీ లేఖ సారాశం. ఆ తరువాత రాజమండ్రి వుడ్ వర్డ్ డిస్పాచ్ ప్రకారం ఆంగ్లవిద్యా ప్రణాళిక రూపొందింది. ఎఫ్.ఎ, బి.ఎ, ఎం.ఎ. విధానం అమల్లోకి వచ్చింది. సంస్కృతం చదువుకున్న వారిని అవమానకరంగా చూడటం మొదలు పెట్టారు.
---
ఋషుల చేత నిర్మించబడిన దానిని ఆర్ష సంస్కృతి అంటారు. ఋ షులు కులం దేశం, ఒక జాతి అని ఆలోచించలేదు. వీరు వసుధైవ కుటుంబకమ్ అన్నారు. ఈ ధర్మాన్ని ప్రచారం చేయ డం కోసం పుట్టిన కులాన్ని బ్రాహ్మణవర్గం అన్నారు. వీరికి సమాజం ఇచ్చిన బాధ్యత నిస్వార్థంగా ధర్మ ప్రచారం చేయడం. తర్వాతికాలంలో వీరే స్వాతంత్య్ర సమరయోధులై బలిదానాలు చేశారు. కొందరు మం త్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. తమిళనాడులో చక్రవర్తుల రాజగోపాలాచారి, ఆం ధ్రప్రదేశ్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు, ఉత్తర ప్రదేశ్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు దేశాన్ని పాలించారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి దశలో పురిటిదశలో ఉన్నప్పుడు జాతికి దశ దిశ నిర్దేశం చేశారు. వీరెవరూ స్వార్థపరులు కారు. తెనే్నటి విశ్వనాథం, వావిలాల గోపాలకృష్ణయ్య, కళా వెంకట్రావు, బూర్గుల రామకృష్ణారావు వంటి వారు చేసిన సేవలు అజరామరం. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలల్లో వసంతరావు వెంకట్రావు, విశ్వనాథ సత్యనారాయణ, పైడిపాటి సుబ్బరామ శాస్ర్తీ, తల్లావఝుల శివశంకర స్వామి వంటి దిగ్దంతులు సభ్యులుగా ఉండేవారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో శాఖాధ్యక్షులుగా గంటిజోగి సోమయాజి, పింగళి లక్ష్మీకాంతం, రాయప్రోలు సుబ్బారాలు, దివాకర్ల వెంటకావధాని, ఖండవల్లి లక్ష్మీనరసింహం, ఎస్.వి. జోగారావు వంటి వారుండేవారు. తర్వాత రాష్టప్రతులుగా సర్వేపల్లి రాథాకృష్ణన్, శంకర్‌దయాళ్ శర్మ వంటివారు విశేష సేవలందించారు. తర్వాతికాలంలో రాజ్యాధికారం దళితులు అందుకున్నారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయితే సుశీల్‌కుమార్ షిండే వంటివారు గవర్నర్లూ, భారత రాష్టప్రతులు కావడం ముదావహం. సినిమాల్లో నారాయణరావు, నాగయ్య, సిఎస్‌ఆర్ వంటి హీరోలు. పింగిళి, సముద్రాల రచయితలు ఇప్పుడు సూచించిన పేర్లన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవని గమనించండి. వీరివల్ల సమాజానికి అపకారం జరిగిందని కాని, వీరు సామాజిక న్యాయాన్ని పాటించలేదని కాని అనగలరా?
ఇంగ్లీషులో సోషల్ జస్టిస్ అనే పదానికి సమానార్థకంగా సామాజిక న్యాయం అనే పదాన్ని వాడుతున్నారు. దేశంలో భిన్న కుల మతాలున్నాయి. వర్గాలు, వర్ణాలు ఉన్నాయి. అందరికీ న్యాయం జరగాలనేది ఈ వాక్యం అర్థం. భారత రాజ్యాంగం అందుకు పూర్తి గా హామీ ఇచ్చింది. 1950కి ముందు ద్రవిడోద్యమం ఊపునందుకున్న సమయంలో కరుణానిధి వంటివారు సినిమాలను ప్రచార సాధనాలుగా మార్చుకున్నారు. ఆయన తన జీవితాన్ని స్క్రిప్టురైటర్‌గా మొదలు పెట్టాడు. తర్వాతి కాలంలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. ద్రవిడోద్యమం అంటే ద్రావిడ భాషా సంస్కృతులను కాపాడటం, ప్రోత్సహించడం అని అర్థం. బ్రాహ్మణ సంస్కృతిని వ్యతిరేకించడం ఈ ద్రవిడ విశేషార్థం. ద్రవిడోద్యమం తీవ్రస్థాయలో ఉన్నప్పుడు రెండు సంఘటనలను గుర్తు చేసుకోవాలి. ఒకటి వారి నాయకుడు సి.అన్నాదురై 1951లో ప్రత్యేక ద్రవిడ దేశం కోరడం, రెండవది కంచి నుండి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారిని తరిమివేయడం. ఈయన తమిళనాడులో సంస్కృత పదం వినబడకూడదు అని శాసించాడు. కావేరీ తీరంలో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్న విప్రులను హింసించారు. విచిత్రమేమంటే ఇవ్వాళ వారి టివి పేరు ఉదయన్ టి.వి! సూర్యారాధనపై ద్రవిడోద్యమం ఎందుకు కక్ష కట్టిందో తెలియదు. ఒక సినిమాలో ఒక కుక్కకు, సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టి ఎగతాళి చేశారు. దేవుడు లేనేలేడని బోర్డులు పెట్టారు.
రాజకీయంగా తమిళనాడులో బ్రాహ్మణుల ఓట్లశాతం చాలా తక్కువ. పోలైన ఓట్లు ఒక్కశాతంగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌లో ఈ శాతం ఎక్కువ. అందువల్ల యుపిలో రాజకీయాలు నిన్నటి వరకు ఎన్‌డి తివారి, కమలాపతి త్రిపాఠి, హేమవతి నందన్ బహుగుణ వంటి వారి చుట్టూ తిరిగాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయాధికారం పొందాలంటే కులం, ధనం.. రెండింటి బలం ఉండాలి. ఈ కారణం చేత తర్వాతి కాలంలో సామాజిక సమీకరణలు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి, కమ్మ కులాలు, కర్ణాటకలో లింగాయత్‌లు, వక్కళిగలు, భూమిపుత్రులు రాజ్యాధికారం చేజిక్కించుకున్నారు.
గాంధీజీ తాను వైశ్యుడినని ఎన్నడూ అనుకోలేదు. గాంధీజీ జీవితమంతా అస్పృశ్యుల ఉద్ధరణ, ముస్లింల సంతుష్టీకరణ అనే రెండు అంశాల చుట్టూ తిరిగింది. చివరకు రెండు ప్రయోగాలు వికటించాయి. హరిజనులు అనే మాటను ఒప్పుకోలేదు. తద్వాదా ‘దళిత’ అనే శబ్దం పుట్టింది. తర్వాతి కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్‌జీవన్‌రామ్‌లు జాతికి స్ఫూర్తిదాయక నేతలయ్యారు. జగ్జీవన్ రామ్ కుమార్తె మీరాకుమార్ లోక్‌సభ స్పీకర్ పదవిని చేపట్టారు. ఇలా నెహ్రూ యుగం తర్వాత జాతి మహత్తర పరివర్తనకు లోనైంది. ఈ దశలోనే సామాజిక న్యాయం అనే నినాదం బలపడింది. కార్మిక, కర్షక, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ, బడుగువర్గాల ఐక్యత వర్థిల్లాలి అని సామ్యవాదులు ఒక నినాదం సృష్టించారు. తర్వాతి కాలంలో కుల వ్యవస్థ లేదు కేవలం ‘వర్గ’ వ్యవస్థను మాత్రమే అంగీకరిస్తామని వారు మూల సిద్ధాంతాన్ని గుర్తు చేస్తున్నారు.
1835, ఫిబ్రవరి 3న ఒక బ్రిటీషు ఆఫీసర్, లండన్‌కు ఒక జాబు రాశాడు. ‘‘మనం ఎంత కష్టపడ్డా మన సంస్కృతిని ఈ జాతిలో నాటడం కష్టం. అందుకు అర్ష సంస్కృతి అడ్డం వస్తున్నది. అందుకని ఈ జాతివారికి ఇంగ్లీషు మీద ప్రేమ, ఆర్ష సంస్కృతి మీద ద్వేషం వ్యాపింపజేయాలి.’’ అదీ లేఖ సారాశం. ఆ తరువాత రాజమండ్రి వుడ్ వర్డ్ డిస్పాచ్ ప్రకారం ఆంగ్లవిద్యా ప్రణాళిక రూపొందింది. ఎఫ్.ఎ, బి.ఎ, ఎం.ఎ. విధానం అమల్లోకి వచ్చింది. సంస్కృతం చదువుకున్న వారిని అవమానకరంగా చూడటం మొదలు పెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1948 వరకు తెలుగుకు అస్తిత్వం లేదు. ఇదిలావుండగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జస్టిస్ పార్టీ బాగా బలపడింది. భారతదేశానికి స్వాతంత్య్రం వద్దనేది వీరి మూల సూత్రం! ఈవిధంగా 20వ శతాబ్దపు పూర్వార్థం గడిచింది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో జవహర్‌లాల్ నెహ్రూ పాలన ప్రారంభమైంది. అప్పటివరకు స్వాతంత్య్రం కోసం బలిదానాలు చేసిన దామోదర సావర్కార్, చంద్రశేఖర ఆజాద్, బాలగంగాధర తిలక్, మదన మోహన మాలవ్య, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి వారికి ఊరూపేరూ లేకుండా చేశారు. కనీసం వారి కుటుంబాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. కారణం వీరంతా బ్రాహ్మణ వర్గానికి చెందినవారు కావడమే. బ్రాహ్మణ వర్గాన్ని తిట్టిన వారిని వైస్‌చాన్స్‌లర్ చేసి పద్మా పురస్కారాలు ఇచ్చారు. శివలింగాలపై మూత్రం పోయండి అని పిలుపునిచ్చిన కలబరిగి అనే లింగాయత్‌ను హంపి విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ను చేశారు. ‘హిందూత్వం’పై యుద్ధం ప్రకటించిన జెఎన్‌యు విద్యార్థి నాయకులను అభినవ భగత్ సింగ్‌లుగా చిత్రించారు. రాముడు, హనుమంతుడు కౌగలించుకుంటే ‘హోమో సెక్సువల్’ అన్నారు. శ్రీమహావిష్ణువు పరమ దుర్మార్గుడు అంటూ ఏచూరి సీతారాం, రాజ్యభలో మాట్లాడితే, దుర్గామాత సెక్స్‌వర్కర్ అని కమ్యూనిస్టులు కలకత్తాలో కరపత్రాలు వేసి పంచిపెట్టారు. ఇదంతా సామాజిక న్యాయం, సమసమాజ నిర్మాణం పేరుతో జరిగింది.
మధ్యయుగాల్లో అరబ్బులు, మొఘలులు సమర్ఖండ్ నుంచి వచ్చి దేవాలయాలను నేలమట్టం చేసి భారతీయ సాంస్కృతిక చిహ్నాలను ధ్వంసం చేశారు. ఇవ్వాళ భారతదేశంలోని వివిధ వర్గాలు అదే పని చేస్తున్నాయి. దేనివల్ల సామాజిక న్యాయం సిద్ధిస్తుంది? బారతదేశంలో ఇవ్వాళ రాజ్యాధికారం బ్రాహ్మణుల చేతిలో లేదు. నరేంద్ర మోదీ చాయ్‌వాలా-సోనియా రోమన్ క్యాథలిక్. ఉమన్ చండీ, అఖిలేష్ యాదవ్,నితీశ్ కుమార్, సిద్ద రామయ్య, చంద్రబాబు నాయుడు, తరుణ్ గొగోయ్, మెహబూబా ముఫ్తీ వీరెవరూ బ్రాహ్మణులు కారు. కొన్ని రాష్ట్రాల్లో మంత్రివర్గంలో ఒక్క బ్రాహ్మణుడు కూడా లేడు. ఐనా మనువాదం నశించాలి, బ్రాహ్మణవాదం నశించలాని అంటూ కన్నయ్యకుమార్, రోహిత్ వంటి వారు ఎందుకు నినాదాలిచ్చారు? ‘‘నేను భారత దేశం ముక్కలు కావాలి అనలేదు. ఆ నినాదం ఎవరో నకిలీ వీడియోలో ప్రవేశపెట్టారు. నేను అన్నది బ్రాహ్మణవాదం నశించాలన్నది మాత్రమే. అని కోర్టులో కన్నయ్య చెబితే ఓహో! ఐతే ఇది చెడ్డ నినాదం కాదు అని ఆమోదించారు.
యూదులు మేధావి వర్గానికి చెందినవారు. జీసస్ క్రైస్ట్, కారల్ మార్క్స్, ఐన్‌స్టీన్..వీరంతా యూదులే. అందుకే వీరికి జన్మభూమి లేకుండా దాదాపు రెండు వేల సంవత్సరాలు కాందిశీకులుగా తిరిగేటట్లు చేశారు. 1948లో ఇజ్రాయిల్ పుట్టినప్పటినుండి దాన్ని ముస్లింలు నిర్మూలించే ప్రయత్నంలో పడ్డారు. సరీగ్గా భారత దేశంలో నేడు బ్రాహ్మణులు, వైశ్య, క్షత్రియులు మధ్య ప్రాచ్యంలోని యూదుల స్థానంలో ఉన్నారు.
భారతదేశంలో నేడు నేషనలిజం-సెక్యులరిజం అనే రెండు పదాల మధ్య ఘర్షణ మొదలైంది. ఇదిలావుండగా రోహిత్ ఆత్మహత్యకు అంతర్జాతీయ ప్రచారం ఇప్పించి కమ్యూనిస్టులు విజయం సాధించారు. కాని తిండిలేక వందలాది బ్రాహ్మణులు దిక్కులేని చావు చచ్చారు. ఒక్క తెలంగాణలోనే 1600 మంది కర్షకులు పురుగులమందు తాగి చనిపోయారు. మరి కార్మిక, కర్షక సంక్షేమం కోసం పుట్టిన పార్టీలకు ఈ మరణాలు కనిపించడం లేదా?
సాహిత్య సాంస్కృతిక రంగాల్లో దళిత క్రైస్తవ వాదం, మైనారిటీ వాదం, ప్రాంతీయ, ఉపప్రాంతీయ వాదాలు, జిహాదీ సానుభూతి వాదం, సామ్యవాదం, స్వతంత్ర కాశ్మీర్ వాదం వంటి అనేకం ప్రవేశించిన తర్వాత నన్నయ, పోతనలు కవులు కాదన్నారు. విశ్వనాథ, చిన్నయ సూరి వంటి వారిని అవమానించారు. కేంద్ర సాహిత్య పురస్కారాలు, పద్మ పురస్కారాలు తమకే ఇవ్వాలని పైరవీలు చేసుకున్నారు. ‘మీకున్న అర్హత ఏమిటి?’ అంటే ‘మేను యాంటీ నేషనలిస్టులం, నేషనలిజం అంటే ఫాసిజం అని చెప్పారు.

-ముదిగొండ శివప్రసాద్