మెయన్ ఫీచర్

వాళ్ల గురి మోదీపైనే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొన్ని రోజులుగా అన్ని ఇంగ్లీషు టీవీ చానళ్లలో ప్రైమ్‌టైమ్, నాన్ ప్రైమ్‌టైమ్ న్యూస్‌లో ఒకే ఒక వార్త అధికభాగం ఆక్రమించింది. మీరు మీ టీవీ చానల్ ఆన్ చేసిన తక్షణం ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి ఎలాంటి ఆడియో లేకుండా వరసగా ప్లకార్డులు చూపుతూ కనిపిస్తుంది. ఒకవేళ వేరే ఏదైనా వార్త చూపించినా టీవీ తెరపై ఓ పక్క ఆ అమ్మాయే ఆక్రమించుకొని ఉంటుంది. రాత్రికిరాత్రి ఆ అ మ్మాయి అంత ముఖ్యమైన వ్యక్తిగా ఎలా మారిపోయింది? ఆమె దిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని. ఆమె పేరు గుర్‌మెహర్ కౌర్. ఆమె తండ్రి కార్గిల్ యుద్ధం ముగిసిన వెంటనే వీరమరణం పొందాడు. ‘అయితే ఏమిటి?’ అని మీరు ప్రశ్నించవచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం జరుగుతున్న ఉద్యమం అగ్రభాగాన ఉన్నవారిలో ఆమె కూడా ఒకరు. ఆమె పోరాటం కొద్దిరోజులే జరిగింది. ఇంతలోనే ఆమె తిరిగి తెరవెనక్కి వెళ్లిపోయింది.
అయితే, ‘అసహనం’పై ఎడతెగని చర్చ కొనసాగుతూనే ఉంది. అంతేకాదు.. ఒకవేళ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా వస్తే- 2017లో ‘అసహనం’పై చర్చ మరింత తీవ్రం కావచ్చు. ‘అసహనం’పై ఉద్యమించే వాళ్ల లక్ష్యం భాజపా కాదు, వారి అంతిమ లక్ష్యం మోదీనే. ఎందుకంటే భారతదేశపు అసలైన వారసత్వానికి, సంస్కృతీ సంప్రదాయాలకు ఆయన ప్రతీక గనుక. వామపక్షాల వారి పడిగట్టు పదాల ప్రకారం మోదీ ‘హిందూత్వ’కు చిహ్నంగా నిలుస్తారు. దేశానికి ఇటీవల ఓ సమస్య వచ్చి పడింది. దేశ వ్యతిరేక నినాదాలు చేసేవారు అంతకంతకూ విస్తరిస్తున్నారు. ఈ ధోరణి ఏడాదికేడాది తీవ్రమవుతోంది. పాకిస్తాన్‌కు, జిహాదీలకు మద్దతుగా మాట్లాడే ‘తీవ్రవాద వామపక్ష’ విద్యార్థుల సంఖ్య వివిధ విశ్వవిద్యాలయాల్లో పెరుగుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలిచ్చే వారికి, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ఆరాటపడేవారికి మద్దతుగా మాట్లాడేందుకు ఇపుడు గుర్‌మెహర్ కౌర్ వేదికపైకి వచ్చింది. కన్హయ్య కుమార్ స్థానాన్ని ఆమె భర్తీ చేసింది. టీవీ చానళ్లలో కనిపిస్తూ గుర్‌మెహర్ చెప్పదలచుకున్నదంతా నిర్భయంగా చెబుతుండగా- ఆమెకు భావ ప్రకటనా స్వే చ్ఛ లేదని ఎవరు అంటారు? అసలు సమస్య ఇది కానేకాదు. ఎన్నికలు జరిగే కీలక సమయం గనుక మోదీ ‘అసహనం’ గురించి చర్చ జరగాలన్నది కొందరి ఆరాటం. ఇంతకుముందు దిల్లీ, బిహార్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగలేదా? అపుడు ఈ ‘అసహనం’ సంగతి గుర్తుకురాలేదా? నియంత అని, మతతత్వవాది అని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించడమే కొందరి ధ్యేయం. ‘జాతీయత’ ముసుగులో తమ భావ ప్రకటనా స్వేచ్ఛను మోదీ అణగదొక్కుతున్నారనేది వారి అభియోగం. ‘లౌకిక పండితుల’ దృష్టిలో ‘జాతీయత’ అనేది ఓ చెత్త పదం.
దిల్లీ సిఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అంతులేని భావ ప్రకటనా స్వేచ్ఛను అనుభవిస్తూనే ప్రధాని మోదీని- మానసిక రోగి, దొంగ, రక్తవ్యాపారి, హిట్లర్ అంటూ తీవ్ర పదాలతో ఆడిపోసుకున్నారు. ఇంతగా వ్యక్తిగత నిందలు వేసిన ఈ ఇద్దరు నేతలు ‘దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ లేదని, నియంత పాలన సాగుతోంద’ని గగ్గోలు పెడుతున్నారు. ‘ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పాకిస్తాన్ రచయిత తారిక్ తలనరికి తెచ్చిన వారికి పది లక్షల నగదు నజరానా ఇస్తామంటూ’ కొన్ని మతోన్మాద సంస్థలు మాట్లాడినపుడు- కేజ్రీవాల్, రాహుల్ వంటి నేతలు ఏం చేస్తున్నారు? బాబా రామ్‌దేవ్, భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామిని దిల్లీ జెఎన్‌యులోకి అనుమతించనపుడు, జెఎన్‌యు ఆచార్యుడు మకరంద్ పరాంజెపెను క్యాంపస్‌లోకి రాకుండా చేసినపుడు ‘్భవ ప్రకటనా స్వేచ్ఛ’ గుర్తుకురాలేదా? జాతి వ్యతిరేక కలాపాలను అడ్డుకునే వారి విషయంలో ఈ ‘స్వేచ్ఛ’ అక్కర్లేదా?
దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి, దేశాన్ని ముక్కలు చేయాలనుకునేవారికి బ హుశా మన రాజ్యాంగం ‘్భవ ప్రకటనా స్వేచ్ఛ’ను ప్రసాదించిందేమో? దేశ వ్యతిరేక కలాపాలను అడ్డుకునే వారిని నియంతలుగా, అసహనం మూర్త్భీవించిన వారిగా ముద్ర వేస్తారు. దిల్లీలోని రాంజాస్ కళాశాలలో ఇదే జరిగింది. దేశద్రోహం కేసులో నిందితుడైన ఒమర్ ఖలీద్ (జెఎన్‌యు)ను తీవ్రవాద వామపక్ష విద్యార్థి సంఘం ఓ సదస్సుకు ఆహ్వానించడంపై ఎబివిపి విద్యార్థులు నిరసన తెలిపారు. నిరసన చేపట్టిన ఎబివిపి విద్యార్థులపై ప్రత్యర్థి వర్గం దాడులకు దిగడంతో హింస చెలరేగింది. ప్రతి వర్సిటీలోనూ రెండు విద్యార్థి సంఘాలు ఘర్షణ పడినపుడే హింస ప్రజ్వరిల్లడం పరిపాటిగా మారింది. ఓ వర్గం వారు దాడి చేస్తే మిగతా వర్గం విద్యార్థులు ధ్యానం చేస్తూ కూర్చోలేరు గనుక వర్సిటీల్లో అలజడి తప్పదు. అయితే, మీడియా మాత్రం ఎంపిక చేసిన దృశ్యాలనే పదే పదే చూపుతోంది. ఎబివిపి విద్యార్థులు ప్రత్యర్థివర్గంపై దాడి చేయడం మాత్రమే విస్తృతంగా ప్రచారమవుతోంది. సంచలనాలు సృష్టించడానికి అలవాటు పడ్డ మీడియా ‘బుల్లితెర’పై విధ్వంసక దృశ్యాలను ఆవిష్కరిస్తూనే ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా- నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థిక నిపుణుడు అమర్త్యసేన్ తన ఉదార భావాలను వ్యక్తం చేస్తుంటారు. ఆయనను ఓ గొప్ప ఆస్తిగా, ఆయన వాక్కులను మహాప్రసాదంగా భావించే కొన్ని చానళ్లు ‘సంచలనాత్మక కథనాల’ను అందిస్తుంటాయి. రాంజాస్ కళాశాల ఉదంతం ఈ ‘మైనారిటీ ప్రభుత్వ’ అహంకార ధోరణికి నిదర్శనమని ఆయన ప్రవచిస్తుంటారు. అయితే, ఆయనకు దేశంలోని రాజకీయ వ్యవస్థపై ఎలాంటి అవగాహన ఉన్నట్లు కనిపించదు. ఇటీవలి కాలంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం 50 శాతం ఓట్లు సంపాదించపోయినా ‘మెజారిటీ ప్రభుత్వం’గా చెప్పుకోవడం ఆయనకు తెలియక పోవడం విడ్డూరం. ఇటువంటి అజ్ఞానికి నోబెల్ పురస్కారం ఇచ్చిన వారిని మనం ప్రశ్నించాలేమో? అయితే, ఆయన మాత్రం ఈ దేశంలోని వామపక్షాలకు, తీవ్రవాదులకు మహా మేధావి కావడం తెలిసిందే. ఇదే సందర్భంలో రాహుల్ మాత్రం వౌనంగా ఉంటారా? ‘అసహనం’ ఉన్నన్నాళ్లు గుర్‌మెహర్ లాంటి వాళ్లు గళం విప్పుతూనే ఉంటారని మోదీపై రాహుల్ దాడి చేస్తున్నారు.
దేశంలోని వర్సీటీల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎందుకు ఉద్యమాలు లేవదీస్తున్నారో ప్రశ్నించుకుంటే సమాధానం గురించి అంతగా ఊహించనక్కర్లేదు. మద్రాస్ ఐఐటి, జెఎన్‌యు, జాదవ్‌పూర్ వర్సిటీ, దిల్లీ వర్సిటీ ఇలా అనేక విద్యా ప్రాంగణాల్లో వరుస ఆందోళనలు. యాకూబ్ మెమన్, అఫ్జల్ గురు, కసబ్, బుర్హాన్ వనీ వంటి ఉగ్రవాదులే వర్సిటీల్లో హీరోలు. వీరు స్వాతంత్య్ర సమరయోధులు కాకున్నా వామపక్ష తీవ్రవాద సంఘాల ఆధ్వర్యంలో వీరికి సంస్మరణ దినోత్సవాలు జరుగుతాయి. పాకిస్తాన్ మతోన్మాదుల, కశ్మీర్‌లో విభజనవాదుల భాషను వీరు వినిపిస్తుంటారు. భారత్‌లోని అనేక వర్సిటీల్లో పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎంతోమంది విద్యార్థి నేతలు వౌనంగా తమ పని తాము చేస్తుంటారు. విద్యార్థుల్లో జాతి వ్యతిరేక భావాలను రగిలించేందుకు వీరు పనిచేస్తుంటారు. మోదీని రాజకీయంగా ఎదుర్కొనలేని విపక్ష పార్టీల నేతలు తీవ్రవాద విద్యార్థి సంఘాలకు మద్దతు పలుకుతుంటారు.
మోదీపై గురిపెట్టడంలో మరో కొత్తకోణాన్ని కూడా మనం చూడొచ్చు. మోదీ భావాలతో ఏకీభవించే రామ్‌దేవ్ బాబా, శ్రీశ్రీ రవిశంకర్, సద్గురు జగ్గీ వాసుదేవ్ వంటి ఆధ్యాత్మిక ప్రముఖులకు కొందరు ఇబ్బందులు కలిగిస్తుంటారు. మోదీపై వ్యతిరేకతతో సిద్ధాంతాలను గాలికొదిలేసి, అపవిత్ర బంధాలకు సైతం కొన్ని రాజకీయ పార్టీలు బరితెగిస్తున్నాయి. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌లో ‘మతోన్మాద’ శివసేన పార్టీకి స్నేహహస్తం అందించేందుకు కాంగ్రెస్, ఎన్‌సిపి, ఎస్‌పి నేతలు పరితపించడం ఇందుకు తార్కాణం.
ఇపుడు కొందరు విడ్డూరంగా ఓ ప్రశ్న వేస్తున్నారు. ‘జాతీయవాదులు? జాతి వ్యతిరేకులు?’ అన్నది నిర్ణయించేదెవరని కొందరి వాదన. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, దేశాన్ని ముక్కలు చేయాలనుకునేవారు జాతి వ్యతిరేకులు. మిగతావారంతా జాతీయవాదులే! ఇదే సందర్భంగా మనం మరో ప్రశ్న వేసుకోవాలి. ‘ఎవరు లౌకికవాదులో, ఎవరు మతోన్మాదులో నిర్ణయించే అధికారం ఉదారవాదులకు ఎవరు ఇచ్చారన్న’దే ఆ ప్రశ్న!
*

ఎస్‌ఆర్‌ రామానుజం, సెల్ : 80083 22206