మెయిన్ ఫీచర్

పాడకుండా బతకలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటలు రాకముందే కూనిరాగాలు తీసింది. పసి వయసులోనే ఆ గళం శాస్ర్తియ సంగీతకారులను మంత్రముగ్ధులను చేసింది. ఆరేళ్ల పసివయసులో ఆలయాల్లో గొంతెత్తి పాడితే ఆ భగవంతుడే పులకించిపోయేవాడు. చూపు లేకపోతేనేమి మూడు దశాబ్దాలుగా తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న ఈ పాటల పూదోటలో వికసించిన పుష్పం నేడు ప్రపంచ రికార్డును సైతం సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన అంధ గాయకురాలిగా అరుదైన ప్రపంచ రికార్డును సొం తం చేసుకుంది. ఆమే వైకోం విజయలక్ష్మి. ప్లేబాక్ సింగర్‌గా దక్షిణ భారతంలో వివిధ భాషల్లో పాటలు ఆలపించిన వైకోం విజయలక్ష్మి ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతంచేసుకున్న ఈమె జీవితంలో పెళ్లి అనేది చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. గుడ్డిది అనే సూటిపోటి మాటల తో చిన్నచూపు చూసిన సమాజం నుంచి దూరంగా జరిగింది. తన కంటూ ఓపాటల ప్రపంచాన్ని సృష్టించుకుని అందులోనే పదనిసలు పాడుతూ, ప్రయోగాలు చేస్తు ఈ రోజు ప్రంపంచ దృష్టిని ఆకర్షించిన విజయలక్ష్మి ప్రస్థానం ఆమె మాటల్లోనే...
అమ్మవారి అనుగ్రహంతో..
శక్తి స్వరూపిణి దుర్గా అమ్మవారి అనుగ్రహం నాకుంది. 35 ఏళ్ల క్రితం విజయదశమినాడు పుట్టాను. ఐదేళ్లు వచ్చేవరకు చెన్నైలో పెరిగాను. పుట్టుకతోనే అంధురాలిగా జన్మించినా ఏనాడు కళ్లులేవని బాధపడలేదు. శబ్దాలనే ఆలంబనగా చేసుకుని పరిసరాలను పసిగట్టటం అలవాటు చేసుకున్నా, చెవులు చక్కగా పనిచేయటం వల్ల చిన్నప్పటి నుంచి పాటలు ఎక్కువగా వినేదాన్ని. నిద్రపోయేటపుడు కూడా రేడియో పక్కనే ఉండేది.
జేసుదాసు దీవెనలే ప్రేరణ..
ఐదేళ్ల వయసులో మా కుటుంబం కేరళలోని కొట్టాయం జిల్లాలోని వైకోంనకు వచ్చాం. ఇదే మా స్వగ్రామం. ప్రముఖ గాయకుడు జేసుదాసు మానస గురువు. ఆయన పాటలు చిన్నప్పటి నుంచి పాడేదాన్ని. అమ్మమ్మకు కర్ణాటకా సంగీతం పాటలంటే ఇష్టం. ఆమె వద్ద ఎం.ఎస్ సుబ్బలక్ష్మి, శ్రీనివాసు అయ్యర్ స్వామి, బాల మురళీకృష్ణ వంటి సంగీత కళాకారుల పాటల మ్యూజిక్ ఆల్బమ్ ఉండేది. వారి పాటలు వింటూ ఉండేదాన్ని.
మనసులో జేసుదాసును గురువుగా భావించిన తాను ఆరేళ్ల వయసులో ఉండగా.. ఓసారి ఆయన వైకోం లోని గుడిలో పాటలు పాడటానికి వచ్చినపుడు కలిశాను. రెండు గంటల పాటు ఆయనకు వివిధ రాగాల కీర్తనలు ఆలపించాను. ఆ రోజు ఆ మహనీయుడు అందించిన దీవెనలే నాకు ప్రేరణగా నిలిచాయి. అలాగే కర్నాటక సింగర్ వి.దక్షిణామూర్తిగారిని కూడా కలవటం జరిగింది. పాటలు శ్రావ్యంగా పాడుతున్న సంగీత పరమైన తప్పిదాలు దొర్లకుండా ఉండాలంటే ఓ గురువును ఆశ్రయించాలని భావించి ఏడేళ్ల వయసులో గురువు వద్ద సంగీత పాఠాలు నేర్చుకోవటం ఆరంభించాను. ఈ సందర్భంలోనే కవలం శ్రీకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ఎం. జయచంద్రన్ తదితరులకు నా పాటలను ఫోన్‌లో వినిపించి వారి సూచనలు, సలహాలు తీసుకుంటుండేదాన్ని.
ఏడేళ్లకే తొలి కచేరి
ఏడేళ్ల వయసులో ఉండగా వైకోంనకు సమీపంలోని ఉదయనాపురం ఆలయంలో తొలి కచ్చేరి ఇచ్చాను. అలా అం దర్ని ఆశ్చర్యపరుస్తూ సం గీత ప్రయాణాన్ని ఆరంభించాను. ముంబయిలోని షణ్ముఖానంద హాలులో ఇచ్చిన కచేరి టర్నిం గ్ పాయింట్. తిరువనంతపురంలో వేడుకగా జరిగే సూర్య ఉత్సవం లో పాల్గొని పాటలు పాడటంతో ఆ సూర్యభగవానుని ఆశీస్సులు లభించటం వల్ల దేశ విదేశాల్లో కచేరీలు ఇవ్వటం ఆరంభించాను. ఒకేఒక తీగతో ఉండే గాయత్రి వీణ నేర్చుకుని, దాంతోనే ఎన్నో కచేరీ లు చేశాను. నేలలో 20 రోజులు కచేరీల్లోనే గడిపేదాన్ని.

పాటే శ్వాస.. సంగీతమే సాన్నిహిత్యం
సంగీతమే సాన్నిహిత్యం, పాటే శ్వాసగా చేసుకుని జీవించే నాకు 2012లో ప్లేబాక్ సింగర్ గా అవకాశం వచ్చింది. రా వాయిస్‌తో మలయాళంలో విజయలక్ష్మి పాడిన పాటలు ఉర్రూతలూగించేవి. దేవుడు ఇచ్చిన గాత్రంతో ఎన్నో అవార్డులు,రివార్డులు సొంతం చేసుకున్నాను. కేరళ చలనచిత్ర అకాడమీ ‘కట్టెకట్టె’ అనే పాటకు స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చింది. అలాగే 2014లో కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ప్లేబాక్ ప్రజాభిమానం సంపాదించినా..క్లాసికల్ సంగీతమే సంతోషాన్నిస్తుంది.
పాటే ధ్యానం
చీకటి నిండిన నాకళ్లతో ఆ భగవంతుణ్ణి ధ్యా నిస్తూ ఆర్తితో పాట పాడటం వల్ల చుట్టూ వేలాదిమంది శ్రోతలు ఉన్నా ఆ ప్రపంచానే్న మర్చిపోతాను. పాటపాడితే చాలు మనసు ప్రశాంతంగా, ఆ భగవంతుడే తన ముం దు ప్రత్యక్షమయ్యాడని పులకించిపోతాను.
విషం చిమ్మాడు
పెళ్లికి వ్యతిరేకం కాదు. ఇప్పటి వరకు 600 పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. భర్త అనే వ్యక్తి జీవిత భాగస్వామిగా ఉండటం వల్ల జీవితం సౌకర్యవంతంగా..సుఖంగా ఉండాలని భావించాను. కాని సంతోష్ అనే వ్యక్తి నా జీవితంలోకి రావటం నిజంగా సంతోషాన్నిస్తుందని ఆశించాను. అదే ఆశాభంగమే అయింది. ఎంగేజ్‌మెంట్ జరిగే వరకూ చక్కగా నా సంగీత సాధనకు సహకరించాడు. ఎంగేజ్‌మెంట్ జరిగిన పదిరోజుల తరువాత అతని నిజ స్వరూపం బయటపడింది. పాటలు పాడవద్దని ఆంక్షలు పెట్టాడు. ప్లేబ్యాక్ సింగర్‌గానూ, కచేరీలు చేయవద్దని తన మాటల్లో విషం చిమ్మాడు.
మ్యూజిక్ టీచర్‌గా స్కూల్లో పనిచేస్తే జీవిత చరమాంకంలో పెన్షన్ వస్తుందని చెప్పాడు. అతని మాటలు చెవిన పడిన మరుక్షణం నా శ్వాస ఆగిపోతుందేమోనని భయపడ్డాను. మనసును రాయి చేసుకుని ఇక అతనితో కలిసి జీవించటం అసాధ్యమని భావించి ఎంగేజ్‌మెంట్‌ను రద్దుచేసుకున్నాను. ఆరోజు రాత్రి ఆనందంగా పాట కచేరీలో పాటలు పాడాను. ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాను.