మెయిన్ ఫీచర్

ఆవులు ఆమె సిరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవుల పెంపకంతో అధిక ఆదాయం
సేంద్రియ సాగుతో సిరులపంట
ఉత్తమ రైతుగా పురస్కారాలు
మరో 15 అవార్డులు ఆమె సొంతం
అద్భుత ఫలితాలు రాబట్టిన మహిళారైతు
శాస్తవ్రేత్తలకూ సలహాలిస్తున్న మైథిలి
ఆమె ఒకప్పుడు విద్యాసంస్థలో ఉద్యోగి..
ఆవులంటే మమకారం..
పశుపోషణ అంటే ఇష్టం..
ఆ ఇష్టాన్ని వదులుకోబుద్ధికాలేదు..
పాఠశాల బాధ్యతలు వదులుకుంది..
ఓ ఆవును తెచ్చుకుని సాకింది..
ఆ పాలను అమ్మి కుటుంబాన్ని నడిపింది.
ఆ మొత్తంతో ఆవులకోసం గడ్డి పెంచింది..
ఆ గడ్డి విత్తనాలను తోటి రైతులకు ఇస్తోంది.
గోమూత్రాన్ని జోడించి గోబర్‌గ్యాస్ ఉత్పత్తి చేసింది..
ఒక ఆవుకు ఇప్పుడు మరో ఏడు తోడయ్యాయి.
ఉద్యానవన వర్శిటీకి, శాస్తవ్రేత్తలకు ఇప్పుడు సలహాలిస్తోంది.. ఆమె పెంచిన తొలి ఆవు రోజుకు రెండు లీటర్ల పాలు ఇచ్చేది. ఇంటి అవసరాలు తీరేవి. ఆదాయం పెంచుకోవాలనుకున్న మైథిలో మరో ఆవును తీసుకొచ్చింది. ఇంటి ఖర్చులు తగ్గాయి. ఆ ఆవుకామధేనువుగా మారిపోయింది. సిరులు కురిపించిన గోవుమాలక్ష్మికి దండాలు పెట్టే ఆమె పేరు గరిమెళ్ల మైథిలి. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట శివారు కోటేవారి అగ్రహారం వారి ఊరు. కుటుంబం, ప్రజల ప్రోత్సాహంతోనే అనుకున్నది సాధించానంటున్న మైథిలికి చిన్నప్పటినుంచి పశుపోషణపై ఆసక్తి ఎక్కువ. ఇంట్లో ఓ ఆవును పెంచేవారు. అది ఇచ్చే పాలు విక్రయించగా వచ్చే డబ్బు కుటుంబానికి ఎంతో అక్కరకొచ్చేది. పశుపోషణ అంటే కేవలం ఆవులు, గేదెలను కొనుగోలు చేసి పెంచడం కాదు. ఇంట్లో ఉన్న ఆవుకు జన్మించిన దూడలను పెంచి వాటి సంఖ్య పెంచడమే మేలని భావించారు. ప్రస్తుతం మైథిలి సంరక్షణలో 8 ఆవులున్నాయి. పెళ్లయిన తర్వాత భర్త ప్రోత్సాహంతో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసింది. ఏడేళ్లపాటు ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేశారు. పశుపోషణపై ఆసక్తితో ఆమె 2006లో ఉద్యోగాన్ని వదిలేశారు. అప్పటినుంచి సమయమంతా ఆవుల పోషణ, సంరక్షణకు కేటాయించారు. అంతేకాకుండా వాటి పోషణకు అవసరమైన గ్రాసాన్ని పెంచేందుకు కూడా కొత్త పద్ధతులు అవలంబించారు. తమకున్న ఎకరంన్నర పొలంలో పశువుల మేతకు పనికొచ్చే రకాలనే పెంచుతున్నారు. అంతేకాకుండా గ్రాసం విత్తనాలను కూడా పలువురు రైతులకు ఉచితంగా అందజేస్తుంటారు.
అంతర పంటలతో ప్రయోగం
అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం దిశగా ఆమె ప్రయత్నించారు. ఇంట్లోకి అవసరమైన ఆనబ, బీర, ఇతర కూరగాయలను సైతం పండిస్తుంటారు. కొబ్బరితోటలో అంతర పంటగా పోకచెట్లను సాగుచేస్తున్నారు. ఇలా చేయడంవల్ల ఒక పంట దెబ్బతిన్నా మరో పంటయినా దక్కుతుందంటున్నా రు మైథిలి. ఉదయం నుంచి సాయంత్రం వర కు అటు పొలంలోను, ఇటు ఇంటి వద్ద గోవు ల సంరక్షణలో ఆమె నిమగ్నమవుతున్నారు.
సేంద్రీయ సేద్యంతో లాభాలు
ప్రస్తుతం ఎరువులు, పురుగు మం దుల వాడకంవల్ల పంటలు విషపూరితంగా మారుతున్నాయి. దీని ప్రభా వం ఆరోగ్యంపై పడుతుంది. వీటి నుంచి కాస్తంత దూరంగా ఉండేందుకు పశువుల పేడ, వ్యర్థాలతో వర్మీ కంపోస్టు తయారు చేశారు. వాటిని పొలంలోని పంటలన్నింటికీ వినియోగించి ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన కల్పించి, సూచనలు, సలహాలను సైతం అందిస్తున్నారు.

గోమూత్రంతో గ్యాస్
వంటింట్లో అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది గ్యాస్. ప్రతి నెలా వంటకు బోలెడంత డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. సొమ్ము ఆదా చేసి వంట సులభంగా వండేదెలా అని ఆమె ఆలోచించారు. పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారీ విధానం మనకు తెలిసిందే. అయితే గోమూత్రం ద్వారా కూడా గ్యాస్ తయారు చేయవచ్చు కదా అని ఆమె భావించారు. అందుకోసం ఆవులు ఉన్న చోట నుంచి మూత్రం ఒకే చోటకు చేరేలా చిన్న సైజు డ్రెయిన్ మాదిరిగా నిర్మించారు. ఆ మూత్రం అంతా ఓ ప్లాంట్‌లోకి చేరేలా ఏర్పాటు చేశారు. ముందుగా ప్లాంట్‌ను పేడతో పూర్తిగా నింపుతారు. ఆ తర్వాత కేవలం గోమూత్రం ప్లాంట్‌లోకి పంపిస్తే చాలు. నేరుగా అక్కడినుంచి పైపుద్వారా వంట గదిలోకి గ్యాస్ చేరుతుంది. వంట సులభం. గ్యాస్ అయిపోతుందనే బెంగే వుండదు. 80 మంది ఆమెను ఆదర్శంగా తీసుకుని గోబర్‌గ్యాస్ ప్లాంట్లను నిర్మించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రామన్నగూడెం హార్టికల్చర్ కళాశాలలో మెంబర్‌గా కొనసాగుతున్నారు. అక్కడ యువ వ్యవసాయ శాస్తవ్రేత్తలకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అలాగే ‘ఆత్మ’లో ప్రోగ్రెసివ్ ఫార్మర్‌గా ఉన్నారు. 2012లో ఇంటర్నేషనల్ సొసైటీ ఎక్స్‌టర్నల్ ఎడ్యుకేషన్ సంస్థ కేంద్ర స్థాయి అవార్డు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఆదర్శ మహిళా రైతు అవార్డు అందుకున్నారు. పలు స్వచ్చంద, ప్రైవేటు సంస్థల నుంచి ఆమె 15 అవార్డులు పొం దారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన మైథిలికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందకపోవడం బాధాకరం.

చిత్రం..గవర్నర్ భార్య విమలా నరసింహన్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న మైథిలి

- నీలిమ సబ్బిశెట్టి