మెయిన్ ఫీచర్

బలపం పట్టిన బామ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసు మీద పడితే మనసు బరువెక్కుతుంది. కాటికి కాళ్లుచాచుకుని కూచున్నామన్న భావన కుంగదీస్తుంది. ఆశలు, ఊసులు మరుగునపడిపోతాయి. ఈ వయసులో ఎందుకులే అన్న నిరాశ నిరుత్సాహపరుస్తూంటుంది. కానీ మహారాష్టల్రోని ఓ గ్రామంలో వృద్ధ మహిళలు ఆ నిరాశను తరిమికొట్టారు. చచ్చిపోయేలోగా చదువుకోవాలని, రాయడం, చదవడం నేర్చుకోవాలని గొంతెత్తి అరచిన అమ్మమ్మలు, నాయనమ్మలకు అండగా ఓ ఉపాధ్యాయుడు నిలిచాడు. గ్రామప్రజలూ సై అన్నారు. మునిమనుమలు, చేతికర్ర సాయంతో పాఠాశాల మెట్లెక్కిన ఎందరో వృద్ధ మహిళలు ఇప్పుడు సొంతంగా సంతకాలు పెడుతున్నారు. లెక్కలు చేయగలుగుతున్నారు. బ్యాంకుపనులూ చక్కబెట్టుకుంటున్నారు. వారికోసం ఏర్పడిన బామ్మలబడి ఇప్పుడు ఓ సంచలనమైంది.
ప్రతిరోజూ పాఠశాల ప్రార్థనాగీతంతో ఆరంభమవుతుం ది. 29 మంది బామ్మలు చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా బ్లాక్‌బోర్డుపై మరాఠీ అక్షరాలు రాసి బిగ్గరగా చదువుతారు. లెక్కలకు సంబంధించిన ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. రెయిమ్స్ నేర్పిస్తారు. ఆ ఊళ్లో ఉన్న వృద్ధ మహిళలంతా ఒకచేతిలో కర్ర, మరో చేతిలో పలకాబలపం, భుజాన పుస్తకాల బ్యాగ్ పట్టుకుని వరుస క్రమంలో వెళుతుంటారు. అందరూ కూడా పింక్ కలర్ చీరే కట్టుకుంటారు. ఈ పింక్ కలర్ చీర ఎందుకు యూనిఫామ్‌గా పెట్టారని యోగేందర్‌ని అడిగితే..‘ భర్త చనిపోయిన మహిళలు తెల్లచీర ధరిస్తారు. ఈ చీర ధరించటం వల్ల వారిలో తమ జీవితానే్న కోల్పోయినట్లుగా భావిస్తారు. సంతోషఛాయలు ఉండవు. ఇలాంటి పాత ఆచారాలకు పాతరేస్తూ ఈ పింక్ చీర యూనిఫామ్ పెట్టినట్లు చెబుతాడు. విచిత్రమేమిటంటే యోగేందర్ ఈ స్కూలు ఏర్పాటు చేస్తానంటే గ్రామం మొత్తం అతని వెనుక నిలిచి వెన్నుతట్టి ప్రోత్సహించింది. మోతీరామ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు దిలీప్ దలాల్ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాడు. ఇపుడు గను క ఈ వృద్ధులు చదువుకోలేకపోతే జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఈ అమ్మమ్మలకు రాదు. అందుకే ఈ బోసి నవ్వుల బామ్మలు ‘తమకెందుకులే చదువు. ఉద్యోగాలు చేస్తామా? ఊళ్లేలతామా’ అని భావించకుండా బుద్ధిగా అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఏడాది పూర్తిచేసుకున్న ఈ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. అలాగే ఈ ఏడాది స్పోర్ట్స్ డే నిర్వహించుకోవాలని అనుకుంటున్నారు. ‘అమ్మో ఈ వయసులో ఆటలా అని అనుకోవద్దు. పరుగుపందాల వంటివి నిర్వహించం. మా వయసుకు తగ్గ ట్టు మ్యూజిక్, డ్యాన్స్ వంటి పోటీలు నిర్వహించుకుంటాం’ అని ఈ బామ్మలు సెలవిస్తున్నారు.
అతడి ఆలోచనతోనే అంతమార్పు
నీడలా నిత్యం వెన్నంటే ఉండాల్సిన అక్షరజ్ఞానం ఇన్నాళ్లకు దరిచేరటంతో వారి మోముల్లో బోసి నవ్వులు విరబూస్తున్నాయి. చెరగని చిరునవ్వులు చిందిస్తు క్రమశిక్షణగా తనవద్దకు రప్పిస్తున్న ఈ స్కూలు మహారాష్టల్రోని ఫహంగానే అనే కుగ్రామంలో ఉంది.అమ్మమ్మలకు, నాయనమ్మలకు అక్షరజ్ఞానం అందించేందుకు దేశంలోనే ఏర్పాటైన తొలి పాఠశాల ఇది. వారికి అక్షరాలు నేర్పిస్తున్నది యోగేందర్ బంగర్. నాలుగు పదులు దాటిన ఆ వ్యక్తి ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఓరోజు ఆ గ్రామంలో పం డుగ సందర్భంగా ఓ వేడుక జరుగుతోంది. అధికారులు ఆ ఉత్సవానికి వచ్చి ఓ మత గ్రంథాన్ని చదువుతుంటే.. ఇంతలో ఓ పెద్దావిడ లేచి ‘మాకే గనుక చదువొస్తే మొత్తం పుస్తకానే్న చదివేస్తాం. ఇతరులు చదువుతుంటే విని అర్థంచేసుకోవాల్సి వస్తోంది. గట్టిగా చదవండి’ అని అన్నది. ఆమె మాటలు ఆ యువకుడిని ఆలోచింపజేశాయి. అతని ఆలోచనల నుంచి పుట్టిందే ఈ వృద్ధుల పాఠశాల. తొలిరోజుల్లో ఈ పాఠశాల నిర్వహించేందుకు 75 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాడు.

సవితా దేశ్‌ముఖ్ (62) ఒకప్పుడు ఆమె కొడుకులు, కూతుళ్లు చదువుకుంటూంటే ఆ పుస్తకాలు వంక తదేకంగా చూసేది. నేడు మనవళ్లు, మనవరాళ్లు చదువుకుంటుంటే అదే చూపు. చదువులేకపోవటం వల్ల ఎన్నిసార్లు, ఎంతమంది ముందు చిన్న చిన్న విషయాలకు తలవంచాల్సి వచ్చిందోనని మదనపడేది. ఇపుడు ఆ పరిస్థితి లేదు. తలెత్తుకుని ధైర్యంగా బ్యాంక్‌కు వెళుతుంది. సంతకం పెట్టి మరీ డబ్బులు డ్రా చేసుకునే స్థాయికి చేరింది. చేతికర్ర ఊతంతో, మనవరాలి సాయంతో పుస్తకాల బ్యాగ్ చేతబట్టుకుని స్కూలుకు వెళుతోంది. ఆమె కూడా అదే పింక్ కలర్ చీర కట్టుకుని కనిపిస్తుంటుంది.
అనసూయ దేశ్‌ముఖ్ వయసు తొంభై ఏళ్లు. ఎప్పటికైనా నా పేరు నేను రాసుకుంటానా అని అనుకునేది. ఇన్నాళ్లకు ఆమె చిరకాల స్వప్నం నెరవేరింది. ఆమె పేరు ఆమే రాసుకుంటోంది. అప్పట్లో ఆమె కుటుంబం కడు పేదరికం అనుభవించేది. దీంతో స్కూలుకు పంపలేదు. ఇపుడు పేరు రాయగలుగుతోంది. ఇక చనిపోయినా ఫర్వాలేదు అని అంటోందిప్పుడు. ఆమెకు ఇద్దరు కుమారులు. మనవళ్లు, ముని మనవళ్లు మనవరాళ్లతో కలిసి ఉమ్మడి కుటుంబంలో హాయిగా ఉంటోంది. ముని మనవరాలు చేయి పట్టుకుని స్కూలుకు తీసుకువెళుతుంది. చేతిలో స్కూలు బ్యాగ్, పలకా బలపం, పింక్ కలర్ చీర కట్టుకుని వెళుతుంది.

ఎనభై ఏళ్ల రాంబాయి స్కూలు అంటేనే తెలియదు. నేడు ఆమె రాయగలుగుతోంది. అక్షరాలు గుర్తుపట్టి స్వయంగా చదవగలుగుతోంది. ఆ స్కూల్లో ఉన్న 28 మంది అవ్వల్లో అనసూయ దేశ్‌ముఖ్ అందరికంటే పెద్దది.