మెయన్ ఫీచర్

‘ప్రార్థన’పై ఇంత రభస అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మతాచారాలు, సంప్రదాయాల పాటింపు విషయంలో ఎంతో వైవిధ్యత కలిగిన హిందూమతానికి చెందిన వేలాది దేవాలయాల్లో స్ర్తిపురుషులకు సమానంగా ప్రవేశార్హత ఉన్నది. ఏవో అతి స్వల్ప సంఖ్యలోని దేవాలయాలను ఉదాహరణగా చూపుతూ గోరంతలను కొండతలు చేస్తూ నానా రభస చేయడం వెనుక నిగూఢమైన అజెండా దాగివున్నదనండంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఆలయం లోపలికి పురుషులనే అనుమతించనప్పుడు, నిరసనకార్లను ఏవిధంగా అనుమతిస్తామని శని సింగనాపూర్, త్రయంబకేశ్వర్ దేవాలయాలకు చెందిన అధికార్లు స్పష్టం చేస్తున్నారు.

హిందూయజం సంక్లిష్టతలమయం. మత విధానాలపై హిందువులకు మార్గదర్శనం చేసే గ్రంథం ఏదీ లేదు. ఫలితంగా మత గ్రంథాలు లేదా అసంఖ్యాంగా ఉన్న పవిత్ర గ్రంథాల్లోని అంశాలను ఎవరికి వారు తమకు తోచినవిధంగా వ్యాఖ్యానించుకునే అవకాశం ఏర్పడింది. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం..ఈ మూడు తాత్విక చింతనలు వేదాలనుంచే స్ఫూర్తి పొందాయి. కాని ఈ మూడు తత్వాల్లోని సారం ఒక్కటే.
విభిన్న తాత్విక చింతనా ధోరణులు ఉన్నట్టుగానే, ఆరాధనా విధానాలు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి, ప్రాంతం నుంచి ప్రాంతానికి మారుతుంటాయి. వేల సంవత్సరాల కాలగతిలో విభిన్న సంప్రదాయాలు, ఆచారాలు, మత విధానాలు పుట్టుకొచ్చినప్పటికీ, వీటన్నింటిని అనుసంధానించేది సనాతన ధర్మం మాత్రమే. రాజస్థాన్‌లో ఒక దేవాలయం ఉంది. అక్కడ ఎలుకలను పూజిస్తారు. నేడు దీన్ని ఛాందసత్వమంటూ కొట్టిపారేయడం కద్దు. ఈవిధంగా ఎలుకలను పూజించడం ఎంతమాత్రం హేతుబద్ధం కాదని మనం చేసే వాదన అక్కడి ప్రజల విశ్వాసాన్ని, సంప్రదాయాన్ని గౌరవించకుండా అడ్డుకోలేదు.
దక్షిణాదిలో అనుమతించేవి ఉత్తరాదిలో, ఉత్తరాదిలో అనుమతించేవి దక్షిణాదిలో అనుమతించకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తరాదిలోని చాలా దేవాలయాల్లోని గర్భగుడిలోకి భక్తుల ప్రవేశానికి అనుమతిస్తారు. అక్కడ వారు తమ పూజాదికాలను నిర్వర్తించుకోవచ్చు. కాశీ విశ్వనాథుడు, సోమనాధ దేవాలయాలే ఇందుకు ఉదాహరణ. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ ఆలయాల్లో శివలింగాలకు సాధారణ భక్తులు స్ర్తిపురుషులనే తేడా లేకుండా ఎవరైనా అభిషేకాలు నిర్వహించుకోవచ్చు. మరి అదే దక్షిణాదిలోని శ్రీకాళహస్తి, కంచీపురంలోని ఏకాంబరేశ్వర్ దేవాలయాల్లో స్ర్తిపురుషులెవరినీ గర్భగుడిలోకి అనుమతించరు. మరి అదే దక్షిణాదిలోని శ్రీశైలం గర్భగుడిలోకి స్ర్తిపురుషులను అనుమతిస్తారు. ఇక పండరీపురం విషయానికి వస్తే లింగభేదం లేకుండా ఎవరైనా గర్భగుడిలోకి ప్రవేశించడమే కాదు, భగవానునికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు. ఇది దక్షిణాదిలోని చాలా దేవాలయాల్లో నిషిద్ధం. ఇంతకుముందే చెప్పినట్టు ఆలయ సంప్రదాయాలు, విశ్వాసాల్లో ఎన్నో తేడాలు కనిపిస్తాయి. అయితే దేశం మొత్తంమీద 99.9% దేవాలయాల్లోకి స్ర్తిపురుషుల ప్రవేశానికి ఏవిధమైన ఆటంకాలు లేవు. ఈ ఆలయాల్లో ప్రార్థనలు జరుపుకునేందుకు స్ర్తిపురుషులకు సమాన హక్కులు పాటిస్తున్నారు. ఇక సత్యసంధులైన మన టివి యాంకర్లకు..దేవాలయాల్లోని గర్భగుడి పవిత్రత గురించి ఎంతమాత్రం తెలియదు. చాలా ఆలయాల్లోని గర్భగుడిలోకి సంప్రదాయిక పౌరోహితుడు తప్ప మరెవరూ ప్రవేశించ జాలరన్న సంగతి వీరికి తెలుసా?
క్రైస్తవ మతంలో మాదిరిగా ప్రార్థనకు ఉమ్మడి నిబంధనలు అమలు పరుస్తున్న మాదిరి నియమాలను అమలు పరచడానికి ఏ ఒక్క హిందూ గురువుకు అధికారం లేదు. హిందూమతం అనేక శాఖలు, ఉపశాఖలతో కూడి ఉంది. ఈ ప్రతి శాఖ, ఉపశాఖలో ఎవరి ఆచార వ్యవహారాలు వారివే. ఇదే హిందూమత విస్తృత చట్రం! హిందువులు నిర్వహించే కొన్ని ఉత్సవాల్లో కూడా ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. దక్షిణాదికి చెందిన చాలా దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మరి ఈ ఆచారం ఉత్తరాది దేవాలయాల్లో కనిపించదు. ఇక పల్లెల్లో గ్రామదేవతలను పూజిస్తుంటారు. చట్టవిరుద్ధమైనా ఇక్కడ నిర్వహించే పూజల్లో భాగంగా జంతుబలులు ఇస్తుంటారు. మరి అదే జంతు బలులను పూర్తిగా నిషేధించిన దేవాలయాలూ ఉన్నాయి!
తిరుమల దేవాలయాన్ని తీసుకుందాం. అక్కడ గర్భగుడిలోకి వెళ్లడానికి తనకు హక్కు ఉన్నదని.. ఎంత గొప్పవాడైనా, ఉన్నత కులానికి చెందిన వాడైనప్పటికీ ఎవరైనా అనగలరా? అక్కడ సంప్రదాయ పురోహితులు మాత్రమే ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక కేరళలో ఎవరైనా దేవాలయ ప్రవేశం చేయాలంటే శరీర పైభాగంలోని వస్త్రాలు తొలగించాల్సిందే. అయితే ఇది స్ర్తిలకు వర్తించదన్న సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొన్ని దేవాలయాల్లో సూటు ధరించిన వ్యక్తులను కూడా అనుమతిస్తారు. అదేవిధంగా తిరుమలలో కూడా వస్తధ్రారణపై కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అందువల్ల నచ్చిన వస్త్రాలు ధరించి దేవాలయంలోకి ప్రవేశించడం తన ప్రాథమిక హక్కు అని ఎవరైనా అనగలరా?
ఇక దసరా పండుగ పదోరోజును, రామ్‌లీలా మైదానంలో ఏవిధంగా నిర్వహిస్తారో మనకు తెలుసు. ఇవే ఉత్సవాలను తమిళులు ‘‘కొలువు’’ పేరుతో జరుపుకుంటారు. అంటే దసరా ఉత్సవాల్లో భాగంగా వీరు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. ఇది వారి ప్రత్యేకత. ఇక బెంగాలీలు దసరా ఉత్సవాలను ఏవిధంగా జరుపుకుంటారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక్కడ అసలు వాస్తవమేమంటే, హిందూ మతం భిన్న రూపాలను కలిగివున్న నేపథ్యంలో, ప్రాచీన సంప్రదాయాలను నియంత్రించడం కోసం రాజ్యాంగ నిబంధనలను ముఖ్యంగా 25వ అధికరణాన్ని ఆమంత్రించలేం. అతి హేయమైన సతీసహగమనం, బాల్య వివాహాల వంటి దురాచారాలను మనకు మనమే రూపుమాపాం. వితంతువులకు పునర్వివాహాలను అనుమతించాం. ఈ సంస్కరణలన్నీ మనం తెచ్చుకున్నవే. అంతే కాని టివి కెమేరాల ముందు నినాదాలిచ్చే ఎన్‌జిఓల వల్ల కాదు. ఒక నిగూఢమైన అజెండాతో ముందుకెళ్లే ‘‘కులీన ఉద్యమాల’’కు మీడియా ఆక్సిజన్‌గా పనిచేస్తోంది మరి.
శబరిమల, శని సింగనాపూర్, త్రియంబకేశ్వర్ దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం లేకపోచ్చు. కానీ దీన్ని పూర్తిగా వక్రీకరించి, తప్పుదోవ పట్టించారు. నిజానికి మహిళలు నిక్షేపంగా ఆలయ ప్రవేశం చేయవచ్చు. ఇటువంటి ఒకటి అరా అంశాలకు విపరీతమైన ప్రాచుర్యం కల్పించి, మతం పేరుతో మహిళల పట్ల వివక్ష చూపుతున్నారంటూ హిందూమతాన్ని అప్రతిష్టపాలు చేసే యత్నం తప్ప మరోటి కాదు. శని సింగనాపూర్‌లో నిరసనలో పాల్గొన్నవారిని ఒక్కసారి పరిశీలించండి. ఆలయంలో ప్రార్థన జరపాలన్న కోరిక వారిలో ఏ కోశానా ఉన్నట్టు కనిపించదు. వారు అధికార్లను, ప్రభుత్వాన్ని దూషిస్తూ, నినాదాలు చేస్తూ, ఆలయంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఇదంతా నిస్సహాయ స్థితిలో ఉన్న హిందూమతాన్ని చెడ్డదిగా చూపుతూ, హిందువులను తమవైపు ఆకర్షించడానికి యత్నించేవారి పనే ఇది.
మతాచారాలు, సంప్రదాయాల పాటింపు విషయంలో ఎంతో వైవిధ్యత కలిగిన హిందూమతానికి చెందిన వేలాది దేవాలయాల్లో స్ర్తిపురుషులకు సమానంగా ప్రవేశార్హత ఉన్నది. ఏవో అతి స్వల్ప సంఖ్యలోని దేవాలయాలను ఉదాహరణగా చూపుతూ గోరంతలను కొండతలు చేస్తూ నానా రభస చేయడం వెనుక నిగూఢమైన అజెండా దాగివున్నదనండంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఆలయం లోపలికి పురుషులనే అనుమతించనప్పుడు, నిరసనకార్లను ఏవిధంగా అనుమతిస్తామని శని సింగనాపూర్, త్రయంబకేశ్వర్ దేవాలయాలకు చెందిన అధికార్లు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లేనిది ఉన్నట్టు చెబుతూ తమ అజెండాను బహిర్గతం చేయడానికి అనుకూలంగా మాత్రమే నిరసనకార్ల ప్రవర్తన ఉన్నదనేది స్పష్టమవుతోంది.
ఇదిలావుండగా బొంబే హైకోర్టు రాజ్యాంగంలోని 15వ అధికరణను ఉటంకిస్తూ, లింగవివక్షకు తావుండటానికి వీల్లేదని పేర్కొంది. హైకోర్టు వ్యాఖ్య చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశమేమంటే.. హైకోర్టు ఈ వ్యాఖ్యను ఏవో కొన్ని దేవాలయాలను మాత్రమే ప్రత్యేకించి చేసింది కాదు. సాధారణీకరిస్తూ చేసిన వ్యాఖ్య అది. కాని కొన్ని దిన పత్రికలు, ఛానళ్లు అసలు విషయాన్ని దాచిపెట్టి, దాన్ని పూర్తిగా వక్రీకరించాయి. శని దేవాలయంలోకి మహిళలను ప్రవేశించనీయకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధమని, కోర్టు ధిక్కార నేరం కిందికి వస్తుందంటూ ఒకటే గగ్గోలు పెట్టాయి.
బొంబే హైకోర్టు చెప్పినదాన్ని ఒక ముఖ్య ఇంగ్లీషు దినపత్రిక ఏవిధంగా రిపోర్టు చేసిందో చూద్దాం: ‘‘పిటిషన్‌పై న్యాయమూర్తులు తీర్పు చెబుతూ, ఇటువంటి వ్యక్తిగత కేసులను పరిశీలించడం, ఎక్కడ తప్పు జరిగింది తేల్చడం కోర్టుకు సాధ్యం కాదు. అయితే వ్యక్తిగత ఫిర్యాదులను స్థానిక అధికార్లకు నివేదించవచ్చు. మేం సాధారణ మార్గదర్శకాలను జారీ చేయలేం. అన్ని ప్రభుత్వాలు చట్టాన్ని అమలు పరచాలి.’’ ఈ కోర్టు ఆదేశాలు మీడియాలో పూర్తి వక్రీకరణకు గురయ్యాయి.
అసలు మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నదెవరు? ముఖ్యంగా శని సింగనాపూర్ దేవాలయం వద్ద నానా హంగామా చేసిన ఈ ప్రత్యేక (మహిళా) దళాలను నిరోధించిందెవరు? పురుషులు కాదు! కేవలం స్థానిక మహిళలు మాత్రమే!! పురాతన కాలం నుంచి వస్తున్న ఆచార, సంప్రదాయాలను ఉల్లఘించకూడదన్న గట్టి విశ్వాసం ఉన్నవారు! మరి రాజ్యాంగంలోని 25వ అధికరణ మతస్వేచ్చ హక్కును వివరిస్తున్నప్పుడు, వీరికి తాము విశ్వసించే మతాచారాలను, సంప్రదాయాలను అనుసరించే హక్కు లేదా? సంప్రదాయాలు, ఆచారాలు లేని మతం ఉన్నదని ఈ అధికరణ చెప్పలేదు. మతం అంటే పవిత్ర గ్రంథాలు మాత్రమే కాదు. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు కూడా ఉం టాయి. వీటిని మతం నుంచి విడగొట్టడం సాధ్యంకాదు. మరి రాజ్యాంగంలోని ఈ రెండు అధికరణాల మధ్య సంఘర్షణ ఎక్కడ వస్తున్నది? రాజ్యాంగంలోని 15వ అధికరణకు లోబడి, తమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అనుసరిస్తున్న ఒక ప్రత్యేక మతం వారిపై, రాజ్యం కొరడా ఝళిపించడానికి, ఇదే సమయంలో ఇతర మతాల వారిని పట్టించుకోకుండా ఉండటానికి 25వ అధికరణ అనుమతిస్తున్నదా?
అందువల్ల శని సింగనాపూర్‌లో జరిగిన సంఘర్షణ కేవలం స్ర్తిపురుషుల మధ్య సమానత్వం కావాలని పోరాడేవారికి, సంప్రదాయాలను పాటించేవారికి మధ్య మాత్ర మే కొనసాగుతున్నది. ‘‘చట్టాన్ని గౌరవించండి’’ అని కోర్టు చెప్పిందంటే దానర్థం, ‘‘మహారాష్ట్ర హిందూ ప్రార్థనా ప్రదేశాల (అధీకృత ప్రవేశం) చట్టం-1956’’ చట్టాన్ని గౌరవించమని! ఇప్పుడు అతిముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతోంది. చట్టం కేవలం హిందూ ప్రార్థనా స్థలాలకే ఎందుకు పరిమితం? అంటే ఇతర మతాల్లో ప్రార్థనా హక్కు విషయంలో స్ర్తిపురుష సమానత్వం పాటిస్తున్నారనా అర్థం?