మెయిన్ ఫీచర్

క్రాకరీ క్వీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంటింటికే పరిమితం కాకుండా ఇటు ఇంటిని చక్కదిద్ది అటు వ్యాపారాన్ని అభివృద్ధిబాటలో పరుగుపెట్టించగల సత్తా తనకు ఉందని నిరూపించింది ఇనాచాబ్రా. నెలంతా కష్టపడితే వచ్చే సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఇంట్లో ఆర్థికమంత్రి పాత్రను చక్కగా నిర్వహిస్తోంది. ఇంటి వ్యవహారాలకు మాత్రమే పరిమితమైన ఆమె అనుకోకుండా భర్త చేసే వ్యాపారంలోకి ప్రవేశించింది. బ్రహ్మాండమైన ఐడియాలతో వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తూ ఏటా మూడు కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకువెళ్లింది.
ఇనాచాబ్రా ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన సాధారణ మహిళ. భర్తకు బెంగళూరులోని హూస్కోటి ఇండస్ట్రియల్ ఏరియాలో భర్తకు బటన్ మాన్యుఫ్యాక్చరింగ్ వెంచర్ ఉండేది. ఢిల్లీలో లంకంత ఇంటిలో ఉమ్మడి కుటుంబంలో ఓ కోడలిగా అడుగుపెట్టిన ఇనాచాబ్రా కొన్నాళ్ల తరువాత భర్త, పిల్లలతోపాటు బెంగళూరుకు రావాల్సి వచ్చింది. విశాలమైన ఇంటి నుంచి ఒక్కసారిగా ఇరుకుగదుల్లోకి మారిపోవటంతో ఇంటి పని అయిపోగానే ఆమెకు ఏమీ తోచేదికాదు. దీంతో భర్తచేసే బిజినెస్ వ్యవహారాలను ఆసక్తిగా గమనించటం ప్రారంభించింది. భర్త బటన్లు (బొత్తాలు) సరఫరా చేస్తున్న వ్యాపారంలోని మెళకువలన్నీ ఆకళింపు చేసుకుంది. ఇదే సమయంలో మార్కెట్లో క్రాకరీ బిజినెస్‌కు ఉన్న డిమాండ్ గురించి ఆరా తీసి భర్తను అడిగి ఆ వ్యాపారాన్ని ప్రారంభిస్తానని కోరింది. ఎందుకంటే క్రాకరీ వస్తువుల గురించి మహిళలకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. తొలుత ఆమె భర్త నీరజ్ సంశయించినా.. చివరకు అంగీకరించి బెంగళూరులో తన బటన్ ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే ఓ యూనిట్ పెట్టించాడు. కొద్ది మొత్తాన్ని పెట్టుబడిగా ఇచ్చాడు. ‘సాయి మెలమిన్ క్రాకరీ’ పేరుతో ప్రారంభమైన ఈ యూనిట్‌లో 200 మంది వర్కర్లు ఉండేవారు. వీరిలో తొంభైశాతం మంది మహిళలే కావటం విశేషం. స్వశక్తితో ముందుకు వెళుతూ రోజుకు 300 డిన్నర్ సెట్స్ తయారుచేస్తూ నెలకు 22 లక్షల రూపాయల బిజినెస్ చేసేది. పండుగుల సీజన్‌లోనైతే ఈ బిజినెస్ 70 లక్షల రూపాయల వరకు సాగేది. మార్కెట్లో పోటీని తట్టుకుంటూ వ్యాపారాన్ని ప్రారంభించిన అతికొద్ది కాలంలోనే దిగ్విజయంగా నిర్వహించే స్థాయికి తీసుకువెళ్లారు.
విజయ రహస్యాలు
ఇంటి వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక అంచనాలను రూపొందించుకుంటూ పూర్తి సమయాన్ని దీనిపైనే కేంద్రీకరించేది ఇనాచాబ్రా.
వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వారి అభిరుచులు, ఆకాంక్షలకు అనుగుణంగా డిన్నర్ సెట్లను తయారుచేయించేది. దీంతో డి మార్ట్, బిగ్ బజార్, మెట్రో వంట సంస్థల నుంచి ఆర్డర్లు వెల్లువలా రావటం ప్రారంభించాయి.
డిమాండ్ పెరగటంతో మార్కెట్‌ను అంచనావేస్తూ ఎక్కువ లాభాల కోసం ఆశపడకుండా నాణ్యమైన డిన్నర్‌సెట్లను అందించేందుకు సిద్ధపడేది. దీంతో కంట్రీక్లబ్, చాకొలెట్ రూం, పేరున్న రెస్టారెంట్లుకు సైతం చాబ్రా క్రాకరీ వస్తువులే సరఫరా అయ్యేవి.
స్టాక్ నిలువచేసుకోకుండా కొత్త కొత్త డిజైన్లతో వినియోగదారులకు అందుబాటులోకి తేవటంతో తొలుత రిటైల్ అవుట్‌లెట్ల్‌లో అమ్మే వ్యాపారం నే డు ఒప్పందాలు కుదుర్చుకునే స్థాయికి చేరుకుని అతికొద్ది కాలంలోనే స్పార్ హైపర్ సిటీలాంటి సూ పర్ మార్కెట్ దిగ్గజం క్లయింట్‌గా మారిపోయింది.
ఆర్థిక విషయాల్లో ఖచ్చితంగా ఉండటం, స్నేహితుల నుంచి ఆర్థిక వ్యవహారాలలో సలహాలు తీసుకోకపోవడం, అప్పులు కోసం వెళ్లకపోవడం ఆమె కు ఇష్టం. తాము తయారు చేసే వస్తువుల్లో వైవి ధ్యం, నూతనత్వం చూపిస్తూ మేడిన్ చైనా వంటి ప్రొడక్టుల పోటీని తట్టుకుంటూ ఏటా ఇప్పుడు మూడు కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి ఇనాచాబ్రా దూసుకుపోయారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని నిరూపిస్తూ ముందుకు సాగుతున్న చాబ్రా మూడు కోట్ల రూపాయల కంపెనీకి అధిపతి అయ్యారు. విమెన్ విల్ పవర్ అంటే ఏమిటో నిరూపిస్తూ సూపర్ మార్కెట్ దిగ్గజాలను తన కంపెనీకి క్యూకట్టేలా చేసుకున్నారు.