మెయన్ ఫీచర్

సార్వభౌమత్వ పరిరక్షణకు మోదీ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించబోమని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. భారత్‌లోని అంగుళం భూ మిని కూడా శత్రుదేశాలు వినియోగించుకోకుండా కట్టడి చేస్తూ అత్యంత కీలకమైన ‘శత్రు సంపత్తి 2017’ బిల్లును పార్లమెంట్‌లో మోదీ సర్కారు ఆమోదింపచేసింది. మైనారిటీ సంతుష్ఠీకరణ, ఓటుబ్యాంకు రాజకీయాలకు లొంగిపోయిన గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తాము ప్రవేశపెట్టిన బిల్లులకు తామే అడ్డుపడుతూ దేశ సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేశాయి. తమ భూభాగాలపై శత్రు దేశాలు వ్యాపార వ్యవహారాలు కొనసాగకుండా ప్రపంచ దేశాలన్నీ చట్టాలు చేసుకున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా శత్రుదేశాలు ఆస్తులు సంపాదించుకోవడాన్ని ప్రపంచంలోని ఏ దేశమూ అనుమతించదు. దురదృష్టమేమంటే శత్రుదేశాలు లేదా శత్రుదేశాల పౌరులు మన దేశంలో ఆస్తులపై హక్కులు కోరడం, ఇందుకు న్యాయ, రాజకీయ పోరాటాలు చేయడం భారత్‌లోనే జరుగుతోంది. 14 మార్చి 2017న ‘శత్రు సంపత్తి బిల్లు’ను ఆమోదింప చేయడంతో మోదీ ప్రభుత్వం ఈ ప్రక్రియకు అంతం పలికింది.
శత్రు సంపత్తి చట్టం (ఉశళౄక -్యఔళూఆక షఆ) లో మొదటగా ‘శత్రువు’ అంటే ఎవరు? అన్న ప్రశ్న తలెత్తుతుంది. మన దేశంపై దండయాత్ర చేసిన దేశం కానీ ఆ దేశ పౌరులను కానీ ‘శత్రువు’గా పేర్కొంటున్నారు. 1962లో చైనా, 1965, 1971లలో పాకిస్తాన్ మనపై దాడి చేశాయి. యుద్ధాలు జరిగాయి. శత్రుదేశాలు మన భూభాగంపై ఆస్తులు సంపాదించుకోకుండా నిరోధించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. యుద్ధంలో శత్రువును బలహీనపరచాలనే ప్రయత్నిస్తాం తప్ప శత్రువులకు ఊతం ఇవ్వం. మన దేశంలో శత్రుదేశాల వ్యాపార వాణిజ్యాలను కూడా బలహీనపరచాలి. శత్రుదేశాలకు ఎటువంటి సహాయం చేయకూడదు. 1962, 1965లో యుద్ధాలు జరిగినపుడు ‘డిఫెన్స్ ఆఫ్ ఇండియా’ చట్టం అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారం మన దేశంలోని శత్రుదేశాల లేదా ఆయా దేశాల పౌరుల పేరిట ఉన్న ఆస్తులన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోతాయి. శత్రుదేశాల ఆస్తులకు కేంద్ర ప్రభుత్వమే సంరక్షక బాధ్యత వహిస్తుంది. 1968లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలో కీలకమైన ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. యుద్ధం జరుగుతున్నప్పుడు మనపై దాడిచేసిన దేశం, ఆ దేశ పౌరుల ఆస్తులను శత్రు ఆస్తులుగా పరిగణించి వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చన్నది ఈ చట్టం సారాంశం. దీని ప్రకారం చైనా, పాకిస్తాన్ దేశాలు లేదా ఆయా దేశాల పౌరుల ఆస్తిపాస్తులన్నీ కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. అప్పట్నుంచీ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది.
ఈమధ్యలో ఒక చిత్రమైన కేసు జరిగింది. 1947లో దేశ విభజన తరువాత మహ్‌మూదాబాద్ రాజా తనకున్న ఆస్తులన్నీ వదిలిపెట్టి స్వచ్ఛందంగా పాకిస్తాన్ వెళ్ళిపోయి ఆ దేశపు పౌరసత్వం తీసుకున్నాడు. లక్నో, దాని సమీప ప్రాంతాలతో పాటు ఉత్తరాఖండ్, ఢిల్లీలో మహ్‌మూదాబాద్ రాజాకు విపరీతమైన ఆస్తులున్నాయి. అయితే ఇవేవీ ఆయన కష్టపడి సంపాదించుకోలేదు. మహ్‌మూదాబాద్ రాజు అమలుచేసిన దేశద్రోహక చర్యలకు మెచ్చి బ్రిటీష్ వారు పెద్దమొత్తంలో ఈ ఆస్తులను ఆయనకు బహుమానంగా ఇచ్చారు. 1857లో ప్రారంభమైన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, తదనంతర కాలంలో ఎగసిన స్వాతంత్య్ర జ్వాలలను ఆపివేస్తూ బ్రిటీష్ వారికి సహకరించినందుకు ఆయనకు నజరానాగా బ్రిటీష్ పాలకులు ఈ ఆస్తులు అందచేశారు. 1948లో పాకిస్తాన్ ఏర్పాటుకు తీర్మానాన్ని సమర్ధించిన వారిలో మహ్‌మూదాబాద్ రాజా ఒకరు. దేశాన్ని విభజించి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయాలంటూ ముస్లిం లీగ్ నాయకుడు మహ్మద్ అలీ జిన్నాతో రాజా కలిసి పనిచేశాడు. దేశమంతా తిరిగి పాకిస్తాన్ ఆవిర్భావానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశాడు. ఈ చర్యల్లో భాగంగా మహాత్మా గాంధీని, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించాడు.
1957లో పాకిస్తాన్ పౌరసత్వం స్వీకరించి మహ్‌మూదాబాద్ రాజా ఆ తర్వాత లండన్ చేరి భారత్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ సెంటర్‌ను ప్రారంభించారు. 1965 డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం, 1968ఎనిమీ ప్రాపర్టీ చట్టం ఆధారంగా ఈ ఆస్తులన్నీ కేంద్రం అధీనంలోకి వచ్చాయి. 1973లో రాజా మరణించారు. ఆయన తాను బతికి ఉన్నప్పుడే భార్యను, కుమారుడిని భారత్‌కు పంపించి ఇక్కడి పౌరసత్వం పొందేలా చూశాడు. ఆ తరువాతి కాలంలో కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగిన రాజా కుమారుడు ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా గెలిచి తన తండ్రి ఆస్తులన్నీ తనకు అప్పచెప్పాలంటూ వివాదం మొదలుపెట్టాడు. 1968లోనే అప్పటి చట్టాల ప్రకారం రాజా మహ్‌మూద్ ఆస్తులు కేంద్రం అధీనంలోకి వెళ్ళిపోయాయి. 1973లో రాజా మరణించే నాటికి భారత్‌లో ఆయనకు ఆస్తులు లేవు. అయినా తన తండ్రి ఆస్తులను అప్పగించాలంటూ రాజా కుమారుడు వివాదం లేవనెత్తాడు. తండ్రికి లేని ఆస్తులపై కొడుక్కి ఎలా అధికారం వస్తుందన్నది సమాధానం లేని ప్రశ్న. ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరిన తరువాత- కొడుకు భారతీయ పౌరుడే కాబట్టి ఆస్తుల నుంచి ఆయనను ఎందుకు వేరుచేయాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ అభిప్రాయం ప్రకారం వేల కోట్ల రూపాయల ఆస్తులు రాజా కుమారుడికి అప్పగించాలి.
ఇందుకు భిన్నమైన పరిస్థితులు పాకిస్తాన్‌లో జరిగాయి. 1965లో యుద్ధం తరువాత 1966లో తాష్కెంట్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం ఆయా దేశాల్లో వ్యక్తుల ఆస్తిపాస్తులను తిరిగి అప్పగించే వ్యవహారంపై చర్చలు కొనసాగించాలని తీర్మానించారు. ఇది జరిగిన కొద్ది సంవత్సరాలకు 1971 నాటికే పాకిస్తాన్‌లోని హిందువుల ఆస్తులన్నింటినీ పాకిస్తాన్ ప్రభుత్వం అమ్మివేసింది. భారత్ మాత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వారి ఆస్తులను పరిరక్షిస్తూ వచ్చింది. మహ్‌మూదాబాద్ రాజా ఆస్తులను తిరిగి అప్పగించాలంటూ ఆయన కుమారుడు చేసిన వాదనలను ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు చిదంబరం కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకువచ్చింది. ఆ తరువాత కాంగ్రెస్‌లో అంతర్గత వ్యవహారాల కారణంగా ఈ ఆర్డినెన్స్ చట్టం కాలేకపోయింది. పలుమార్లు ఆర్డినెన్స్‌లు జారీచేస్తూ చట్టంగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలయత్నాలు చేశాయి.
తండ్రి పాకిస్తాన్ పౌరుడు అయినప్పటికీ కుమారుడు భారత పౌరుడే కాబట్టి ఆస్తులు అప్పగించవచ్చునన్న సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని అమలుచేసిన పక్షంలో రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉన్నది. 1947 కాలంలో పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడి పౌరసత్వం స్వీకరించిన వారు వారి కుటుంబంలోని ఒక సభ్యుడిని భారత్‌కు పంపించి ఇక్కడి పౌరసత్వం ఇప్పించి తరువాత ఆస్తులు అప్పగించమని కోరే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని సవరించడం కోసం బిజెపి ప్రభుత్వం మరొకసారి ఆర్డినెన్స్ తీసుకువచ్చి దానికి చట్టరూపం కలిగించింది. సవరించిన చట్టం ప్రకారం ‘శత్రు ఆస్తుల’పై భవిష్యత్‌లో ఎటువంటి వాద వివాదాలకు తావులేకుండా ఉంటుంది. లేనిపక్షంలో పాకిస్తాన్ పౌరులు తిరిగి భారత్‌కు వచ్చి లక్షల కోట్ల రూపాయల ఆస్తులను అప్పగించాలని డిమాండ్ చేస్తారు. పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చి ఇక్కడి పౌరసత్వం పొందిన వ్యక్తులు స్వదేశంలో వదిలి వచ్చిన తమ ఆస్తులను తిరిగి ఇమ్మని అడిగితే ఆ ప్రభుత్వం వాటిని ఎప్పుడో అమ్మివేసింది. ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 1,519 ఆస్తులు ఇటువంటి వివాదంలో చిక్కుకున్నాయి. ఇందులో 622 ఆస్తులు కస్టోడియన్ల పరిధిలోకి చేరుకోగా మిగిలిన 897 ఆస్తులు స్వాధీన ప్రక్రియలో ఉన్నాయి. కొత్తగా అమలుల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఈ ఆస్తులను అమ్మే అధికారం ‘కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ’కు లభిస్తుంది.
పార్లమెంట్ సెలక్ట్ కమిటీ అందచేసిన వివరాల ప్రకారం దేశంలో 11,882 ఎకరాల్లోని 9,280 స్థిరాస్తులు ఈ కోవలోకి వస్తాయి. దాదాపు 2,600 కోట్ల విలువ చేసే షేర్లు వివిధ కంపెనీలలో ఉన్నాయి. ఇవికాక 177 కోట్ల బ్యాంక్ డిపాజిట్లున్నాయి. చైనా దేశీయుల ఆస్తులు ఎక్కువగా పశ్చిమ బెంగాల్, అసోమ్, మేఘాలయ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఢిల్లీలలో ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం ఈ ఆస్తులను అనధికారికంగా అనుభవిస్తున్న వారి నుంచి ఖాళీ చేయించే అధికారం కూడా కస్టోడియన్‌కు లభిస్తుంది.
దేశ విభజన కాలంలో స్వచ్ఛందంగా భారత్‌ను వీడి, పాకిస్తాన్ వెళ్ళిపోయి అనేక దశాబ్దాల తరువాత తిరిగి వచ్చి ఇక్కడి ఆస్తులను ఇమ్మనడం విడ్డూరం. పాకిస్తాన్ వదిలి వచ్చిన ఆస్తులను ఆ దేశం ఎప్పుడో అమ్మి వేసుకుంది లేదా ఆక్రమించుకున్నది. మనం మంచితనానికి పోయి వారి ఆస్తులను ఇంకా కాపాడుతున్నాం. ఇటువంటి డిమాండ్లను ఆమోదించిన పక్షంలో కొరివితో తల గోక్కున్నట్లే.
ఇప్పటికే ఐఎస్‌ఐ, ఐఎస్‌ఐఎస్ తీవ్రవాద కార్యక్రమాలతో దేశం అట్టుడికి పోతున్నది. ఇపుడు పాకిస్తానీలకు, చైనీయులకు ఆస్తులను అప్పచెప్పినట్లయితే దేశ విచ్ఛిన్నతకు బీజాలు వేసినట్లే. ఇది కేవలం ఆస్తులకు సంబంధించిన విషయం కాదు. దేశ సార్వభౌమత్వం, దేశ రక్షణ, అభివృద్ధికి సంబంధించిన అంశం. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా దేశం దెబ్బతింటుంది. ఇంతకాలంగా మైనార్టీ సంతుష్టీకరణ విధానాల కారణంగా ఇటువంటి చర్యలు కొనసాగాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక సంతుష్ఠీకరణ రాజకీయాలు తగ్గుముఖం పట్టాయి. ఇపుడు అమలులోకి వచ్చిన ‘శత్రు సంపత్తి 2017’ చట్టం ఈ దిశలో మరో ముందడుగు. దేశ సార్వభౌమత్వాన్ని పటిష్ఠం చేసే మరో చర్య. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113