భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్.రవికుమార్, పెద్దగంట్యాడ, వైజాగ్
ప్ర : అబ్బాయి మొండితనం- ఎలా తగ్గాలి?
సమా: క్రమక్రమంగా మారతాడు. అనుభవాలు పాఠాలు నేర్పుతాయి. మొండితనం సమస్య కాదు కాని ప్రమాదాలనుండి అబ్బాయిని జాగ్రత్తగా చూడండి. వీలయితే అబ్బాయికోసం ఉత్తమ బ్రాహ్మణునితో సుందరాకాండ పారాయణ- అబ్బాయికోసం తల్లిదండ్రులుగా మీరు ఆంజనేయస్వామి ముందు జిల్లేడు వత్తితో దీపం వెలిగించి జిల్లేడు (తెల్ల జిల్లేడు) పూలతో పూజించండి.
డి.శేషగిరి, మంగళవారంపేట
(బరంపురం)
ప్ర : ప్లాటు అమ్మకం
సమా: ప్లాటులో కొంత వాస్తు దోషం గోచరిస్తోంది. వాస్తు పండితునికి చూపించండి. వివాదాస్పదంగా మారే అవకాశం వుంది.
ఎన్.శ్రీదేవి శర్మ, ఆత్మకూరు, కర్నూలు
ప్ర:స్వగృహయోగం - పొలాలు అమ్మకం
సమా: మీవారి జాతకం ప్రకారంగా కాని, మీ జాతకం ప్రకారంగా కాని అనుకూలత తక్కువగా ఉంది. దోష నివారణకు పాంచాసిద్ధికి- ‘సర్వార్థసిద్ధి’ రామాయణంలోని ఐదవ సర్గ పారాయణం చేసి అందులో చెప్పిన విధంగా నైవేద్యం పెట్టండి.
కె.శ్రీనివాస్, కరీంనగర్ (తెలంగాణ)
ప్ర:ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతుందా? వివరించగలరు?
సమా:క్షేత్రస్వామి అయిన రాజ రాజేశ్వర స్వామికి పంచాకృతాభిషేకం సోమవారాలు చేయించండి.

కర్రి సూర్యశంకరం - విజయనగరం (ఎ.పి)
ప్ర : ఆర్థికాభివృద్ధికి ఏం చేయాలి? ఎలాంటి పూజలు చేయాలో చెప్పగలరు?
సమా : ప్రతిరోజూ రాత్రింబవళ్ళు నిరంతరంగా వెలిగే విధంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు, ఉత్తరం ముఖంగా దీపం వెలిగే విధంగా నెయ్యితో దీపారాధన చేయండి. ప్రతి శనివారం బూందీ లడ్డూ స్వామికి నివేదన చేసి చిన్న పిల్లలకు పంచిపెట్టండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువుదీరుతుంది.
ఎస్.వి.ఆదం, కొండపల్లి, కృష్ణా జిల్లా
ప్ర : చేను అమ్మకం కావాలి?
ఏం చేయాలి?
సమా:చేను అమ్మకానికి కొన్ని వివాదాలు కనపడుతున్నాయి. పరిష్కారానికి ఇంకా ఆలస్యముంది. గోవుకు ప్రతి మంగళవారం దాణా పెట్టండి. బుధవారం పావురాలకు గింజలు వేయండి. కోరిక నెరవేరుతుంది.
యు.లక్ష్మి, తుని (తూ.గో.)
ప్ర: గృహయోగం ఉంటుందా?
సమా: మీకు స్వగృహ యోగం ఉంది- తూర్పు, ఈశాన్య దిశల్లో.
ఎస్.వి.రామారావు, పుట్టపర్తి,
అనంతపురం
ప్ర:బాకీపడిన డబ్బులు రావాలి. ఏం చేస్తే బాకీని రాబట్టుకోగలను?
సమా: నలభై రోజులు చెరువులో చేపలకు నూట ఎనిమిది చొప్పున ప్రతిరోజూ పాలు - శర్కర- గోధుమ పిండి కలిపి గోలీలుగా చేసి చేపలకు వేయండి.
కె.నాగభూషణం, కమలానగర్, అనంతపురం
ప్ర:్ఫ్లట్ అమ్మకాలు?వాస్తు నివారణలు గురించి తెలియజేయగలరు?
సమా: అమ్మకం విషయంలో డాక్యుమెంట్ల సంబంధంగా ఏదో బలహీనత కనబడుతోంది. బహుశా ఇరువురి పేరున ఉందేమో, వాస్తు నివారణ ‘అవాంతర నివారణ మహాగణపతి’ యంత్ర పూజ వలన విఘ్నాలు రాకుండా ఉంటాయి. వాస్తు దోష ప్రభావం తగ్గుతుంది.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ