మెయిన్ ఫీచర్

మల్లియలారా..మాలికలారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మగువ సిగలో ఎన్ని రకాల పువ్వులు ఒదిగినా మల్లెపువ్వు ముందు దిగదుడుపే. వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంటా మల్లెపూల వాన కురుస్తుంది. మల్లెపూల వాసన చూస్తే లయతప్పని గుండె ఉండదు. ప్రతి మగువని దాసోహం చేసే మల్లెపూలను తమిళనాడులోని మదురైలో కేవలం పుష్పంగానే పరిగణించరు. సమకాలీన సంస్కృతిలో భాగంగా చూస్తారు. మల్లెపూలు పెట్టుకోవటం అదృష్టంగా భావిస్తారు. అందుకే వారు ధరించే ఆభరణాలు సైతం మల్లెపూల డిజైన్లలో రూపొందించుకుంటారు. ఏ పెళ్లిమండపంలోకి అడుగుపెట్టిన రెండు కళ్లు చాలవన్నట్లు మల్లెపూలతో అలంకరిస్తారు. వాటి పరిమళానికి పరవశించని ఆహూతులు కనిపించరు. తమిళనాడులోని పురాతన ఆలయాల శిల్పాలు, చిత్రలేఖనాలలో సైతం మదురై మల్లె దర్శనమిస్తుంది.
అరుదైన ఘనత సొంతం..
మధురై మల్లి నవ్వితే ఆ తోటంతా సువాసనలే. దేశంలో ఏ పువ్వుకు దక్కని అరుదైన ఘనత దీని సొంతం. తొలిసారి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సంపాదించిన తొలి పువ్వు మదురై మల్లె. మందపాటి రేకులు కలిగి సువాసనలు విరజిమ్ముతూ విచ్చుకుంటుంది. పువ్వు తొడిమ దాని రేకుతో సమానంగా ఉంటుంది. ఒక్కో పువ్వుకు ఆరు నుంచి తొమ్మిది రేకులు ఉంటాయి. ఆకుపచ్చ-తెలుపు కలగలసి ఉంటుంది. ఉదయం వేళలో ఈ పువ్వును కోస్తే మధ్యాహ్నానికి పాల నురుగు తెలుపులో కనువిందు చేస్తుంది. సాయంత్రానికి వెండి వెనె్నల కనిపిస్తూ విరబూయటం దీని ప్రత్యేకత అని వ్యవసాయ శాస్తవ్రేత్తలు సైతం చెబుతారు. మదురై జిల్లాలో వందలాది ఎకరాల్లో సాగుచేయబడుతున్న ఈ పువ్వు ఎకరంలో మూడువేల మొగ్గలు తొడుగుతాయి.
మదురై మల్లి...
మదురై మల్లిగా పిలిచే ఇక్కడి మల్లెపూలు దీర్ఘచతురస్రాకారంలో ఉండి, రేకులు మందంగా తేమతో రెండు రోజుల వరకు తాజాగా కనిపిస్తాయి. ఈ పూల సువాసన సుగంధానికి పరవశించని మనసే ఉండదంటే అతిశయోక్తి కాదు. మదురైకి సమీపంలోని ఏ పల్లెకు వెళ్లినా అక్కడ ఆడవాళ్లు మల్లెపూలను మాలలుగా అల్లుతూ కనిపిస్తారు. ప్రతి ఇంటిలోనూ తులసి మొక్క ఉన్నట్లు మల్లెపొద ఉండాల్సిందే. మార్చి నుంచి మే వరకు ఇక్కడి మహిళలు తమ జీవనాధారంగా మల్లెసాగును మలుచుకున్నారు. మల్లెపూలు కొనుక్కోవటానికి వచ్చిన ప్రతి వినియోగదారుడు కనీసం రూ.50లకు తక్కువ కాకుండా బాస్కెట్‌లో మల్లెపూలను నింపుకుని వెళతాడు. తెల్లవారు జామున 5 గంటల నుంచి మహిళలు మల్లెపూల వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. దేశంలో ఎక్కడా లభించని సువాసనలు వెదజల్లే మల్లెపూలు ఇక్కడ లభిస్తాయని ధన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ లీడర్ మదన్ కుమార్ అంటున్నారు. ముత్తువణిలో పూల మార్కెట్‌కు చుట్టుపక్కల నుంచి మల్లెపూలు వస్తుంటాయి. రోజువారీ అమ్ముకునేవారు ఇక్కడకు వచ్చి పూలను తీసుకువెళ్లి మాలలను కట్టి అమ్ముతుంటారు.
రోజుకు కనీసం రూ.10వేల ఆదాయం
మా తాతముత్తాతల కాలం నుంచి మల్లెపూలనే అమ్ముకుని బతుకుతున్నామని రాజేంద్రన్ అనే యువకుడు చెబుతున్నాడు. ఇది సీజన్ కాబట్టి రోజుకు కనీసం రూ.5000 నుంచి 10,000 వరకు ఆదాయం ఉంటుందని అంటున్నాడు. ఇక్కడ కిలో రెండు నుంచి మూడు వేల రూపాయల ధర పలుకుతుందంటే మదురై మల్లికి ఉన్న డిమాండ్‌ను తెలుసుకోవచ్చు.
* * *
ఏదిఏమైనా తన తేజస్సు ముందు ఆ నిండు పున్నమి చంద్రుడు సైతం బోసిపోతాడంటూ హొయలు పోయే మదురై మల్లి మూడు నెలల పాటు మురిపిస్తూ మదురై మహిళల కష్టాలను తీరుస్తూ వారి సిగలో ఒదిగిపోతుంది.
**

ధాన్ ఫౌండేషన్ శిక్షణ
మల్లెపూల వల్ల మహిళలకే కాదు మగవారికి కూడా ఉపాధి కలుగుతుంది. కమిషన్ ఏజెంట్లుగా మగవారే ఉంటారు. ధాన్ ఫౌండేషన్ మహిళలకు శిక్షణ ఇవ్వటమే కాకుండా వారికి మల్లెపూల వ్యాపారం చేసుకునేందుకు సూక్ష్మ రుణాలను సైతం అందజేస్తోంది. స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి మల్లెపూలు వ్యాపారం చేస్తుంటారు. ధాన్ ఫౌండేషన్ ఇచ్చిన శిక్షణ తనకు ఎంతో ఉపయోగపడిందని దీనివల్ల తాను రోజుకు కనీసం రూ.2000లు సంపాదించగలుగుతున్నానని మల్లెపూల దండలు అల్లి అమ్మే మహాలక్ష్మి అనే మహిళ తెలియజేస్తోంది. ఇపుడు తన ముగ్గురు కుమార్తెలు, మేనల్లుడు సైతం ఇదే వ్యాపారం చేస్తున్నారని వెల్లడించింది.
మల్లెపూలను అందమైన డిజైన్లలో సృజనాత్మకంగా అల్లటం మహిళలకే సాధ్యమని, కాబట్టి చాలామంది భర్తలు వారిపట్ల వివక్షత ప్రదర్శించకుండా శిక్షణ ఇప్పిస్తే మహిళలకు ఉపయోగపడుతుందని కన్నన్ అనే మల్లెపూల వ్యాపారి అభిప్రాయపడ్డాడు. వేసవి కాలంలో జరిగే మల్లెపూల వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో పలు స్వచ్ఛంద సంస్థలు వర్క్‌షాపులు ఏర్పాటుచేసి వేలాది మంది మహిళలకు శిక్షణ ఇస్తుంటాయి. మల్లెపూల వ్యాపారంలో మహిళలు లేకుండా మనుగడ సాగటం అసాధ్యం కనుక దీనిని ఓ మహిళా పరిశ్రమగా గుర్తించాల్సిన అవసరం ఉందని మహాలక్ష్మి అంటుంది.
**

మదురైలోని బస్టాండ్ నుంచి బయటకు వస్తే ఎర్ర చీర కట్టుకుని కమలా త్యాగరాజన్ కనిపిస్తుంది. ఆమె చేతిలో గడ్డిబుట్ట. అందులో పచ్చటి అరటి ఆకులో తెల్లటి మల్లెపూలు రారామ్మని ఆహ్వానిస్తుంటాయి. ఎన్నో ఏళ్ల నుంచి
మల్లెపూలను అమ్ముతోంది.