మెయిన్ ఫీచర్

అనాథ రక్షకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన ఒక అనాథ. రైల్వే స్టేషన్లు, రైళ్లలో చెత్త ఏరడం, పాల ప్యాకెట్లు విక్రయిస్తూ ఉండేవారు. ఒక సేవాసదన్ సహాయంతో ఉన్నత స్థితికి ఎదిగాడు. తన మాదిరిగా ఉన్న అనాథలకు స్ఫూర్తి కలిగించే విధంగా, తన ఆత్మకథను పుస్తక రూపంలో తీసుకువచ్చాడు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వినూత్న తరహాలో ముంబాయిలో ఒక హోటల్‌ను ప్రారంభించాడు. హోటల్‌లో తాను పెరిగిన అనాథ ఆశ్రమంలోని 19 మందిని నియమించాడు. అనాథ నుంచి హోటల్ యజమానిగా ఎదిగిన ఒక యువకుడి విజయ ప్రస్థానం ఇది.
‘జీవితం జీవితమే, నేను మీవాడినే’ (లైఫ్ ఈజ్ లైఫ్, ఐయామ్ బికాజ్ ఆఫ్ యూ) పేరిట తన ఆత్మకథకు పుస్తక రూపం కల్పించి, ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన యువకుడు షేక్ అమీన్. అమీన్ ఒక అనాథ. ముంబాయిలోని రైల్వే స్టేషన్లు, రైళ్లలో చెత్త ఏరుకోవడం, పాలు విక్రయించడం ద్వారా జీవనం గడిపేవాడు. 1988లో దాదర్ రైల్వే స్టేషన్‌లో చెత్త ఏరుకొంటున్న అమీన్ ముంబాయిలో స్నేహసదన్ పేరిట ఒక అనాథ ఆశ్రమం నిర్వహిస్తున్న సిస్టర్ పెర్‌ఫైన్ దృష్టిలో పడ్డారు. ఆమె వెంటనే అమీన్‌ను తమ స్నేహ సదన్‌కు తీసుకువెళ్లింది. అనంతరం, అమీన్ ముంబాయిలో రేడియోస్ అడ్వర్టైజింగ్ కంపెనీని నిర్వహిస్తున్న యుస్టేస్ ఫెర్నాండెజ్ వద్ద చేరారు. పని పట్ల అమీన్ చూపుతున్న నిబద్ధతను చూసి ఫెర్నాండెజ్ అతడిని ప్రోత్సహించాడు.
స్పెయిన్‌లోని బార్సిలోనాకు వెళ్లాలనే కోర్కెను అమీన్ వ్యక్తపర్చగా 2003లో ఫెర్నాండెజ్ అతనిని బార్సిలోనా తీసుకువెళ్లారు. స్పెయిన్ దేశంలోని పలు ప్రాంతాలలో వున్న లైబ్రరీ కేఫ్‌లు ఆయనను విశేషంగా ఆకర్షించాయి. అటువంటివాటిని ముంబాయిలో కూడా ప్రారంభించాలనే తలంపు అమీన్‌కు కలిగింది.
లైబ్రరీ కేఫ్ ఏర్పాటుకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి ఆయన సన్నాహాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో పలువురికి స్ఫూర్తి కలిగించే విధంగా తన ఆత్మకథకు పుస్తకరూపం కల్పించాడు. పుస్తకాలు విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బు, స్పెయిన్‌లోని తన స్నేహితులు అందజేసిన ఆర్థిక సహాయంతో ముంబాయిలోని అంధేరిలోగల మరోల్ అనే ప్రాంతంలో ‘బాంబే టు బార్సిలోనా లైబ్రరీ కేఫ్’ పేరిట ఒక వినూత్నమైన హోటల్‌ను ఏర్పాటు చేశాడు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న దానిని ప్రారంభించాడు. ఈ హోటల్‌లో ఉద్యోగులుగా స్నేహసదన్‌కు చెందిన 19 మందిని నియమించారు. అందరికీ సమాన వేతనం. వంట చేయడం, బేకింగ్ చేయడం, క్లీనింగ్, కంప్యూటర్ బిల్లింగ్, ఎలక్ట్రికల్ వర్క్ ఆ విధంగా ఎవరి నైపుణ్యాన్ని బట్టి వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ హోటల్‌లో కాఫీ, టీ, టిఫిన్‌లతోపాటు, వివిధ రకాల పుస్తకాలు కూడా ఉంటాయి. ఆసక్తి కలవారు పుస్తకాలు చదువుకోవచ్చు. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారికి ఈ లైబ్రరీ బాగా ఉపయోగపడుతుంది. లైబ్రరీకి పుస్తకాలను దాతలనుంచి సేకరించారు. హోటల్ ముందు ఒక బోర్డును ఏర్పాటు చేశారు. నిరుద్యోగులు తమ పేర్లు, విద్యా అర్హతలు, ఫోన్ నెంబర్లు ఈ బోర్డులో ప్రదర్శిస్తారు. ఈ వివరాలను బట్టి వారికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. అవసరం ఉన్నవారు నిరుద్యోగుల అర్హతలను బట్టి, వారికి ఉపాధి కల్పిస్తున్నారు. అనాథ అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఉన్న స్థాయికి ఎదిగిన అమీర్ అభినందనీయుడు. కొసమెరుపు ఏమిటంటే, అమీన్ ఆత్మకథను ఇంగ్లీషులో వ్రాయగా అది ఇప్పటికే మరాఠి, స్పానిష్, జర్మన్ భాషలలో కూడా అనువదించబడింది. భవిష్యత్తులో అమీన్ మరికొంతమందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఆశిద్దాం.

- పి.్భర్గవరామ్