మెయిన్ ఫీచర్

అందాల పొదరిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మేడంటే మేడాకాదు గూడం టే గూడూ కాదు పదిలంగా అల్లూకున్న పొదరిల్లూ మీది’’ అంటూ మరిచిపోతున్న పల్లె సొగసులను ప్రతిష్టిస్తున్నారు ఈ జంట. ప్రపంచమంతా కాం క్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో మూడు లక్షలకే పొదరిల్లును అల్లిపెడతామని ముందుకు వస్తున్నారు అరుణ, ప్రశాంత్ జంట. హైదరాబాద్‌లో బాంబూ హౌజ్ ఆఫ్ ఇండియా పేరుతో సంస్థను ఏర్పాటుచేసి వెదురుతో ఇల్లు కట్టిపెడతారు. ఈ సంస్థ ఏర్పాటు వెనుక వ్యాపారమే కాదు పల్లె అందాలను ప్రతిష్టించాలనే సామాజిక బాధ్యత ఉం దని చెబుతున్నారు.

ఎలా వచ్చింది ఈ ఆలోచన
అరుణ- ప్రశాంత్ జంట పెళ్లయిన కొత్తలో తమ ఇంటికి కావల్సిన ఫర్నిచర్ కోసం మార్కెట్‌కు వెళ్లారు. వారికి ఆధునిక ఫర్నిచర్ అసలు నచ్చలేదు. సహజత్వం ఉట్టిపడే వెదురు బొంగులతో తయారుచేసిన ఫర్నిచర్ వారికి నచ్చింది. ఈ ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు వారు ఇండో-బంగ్లాదేశ్ బోర్డర్‌కు సైతం వెళ్లారు. అక్కడ వాళ్లతో మాట్లాడిన తరువాత వారికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
అందమైన ఈ కళతో తట్టలు, బుట్టలు, కుర్చీలు, సోఫాలు తయారుచేసే బదులు అందమైన ఇల్లు కడితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. ఆలోచన రావటమే తరువాయి రెండేళ్లపాటు ఆటవీ ప్రాంతాల్లో తిరిగి స్టడీ చేశారు. వెదురుతో వివిధ వస్తువులు తయారుచేసే కళాకారులు ఇండియా అంతా ఉన్నారని తెలుసుకున్నారు. వీరికి ఏ ఆర్గనైజేషన్ సరైన ఉపాధి కల్పించటం లేదని తెలుసుకుని అదే పని తాము చేస్తే ఎలా ఉంటుందని భావించారు. అనుకున్నదే తడువుగా 2010లో బాంబూ హౌజ్ ఆఫ్ ఇండియా సంస్థను ఏర్పాటుచేశారు.
ముప్పయేళ్ల పాటు చెక్కుచెదరదు
వెదురు బొంగులతో నిర్మించిన ఇల్లు దాదాపు ముప్పయేళ్లపాటు చెక్కు చెదరదు. స్క్వేర్ ఫీట్‌కు ఆరువందల రూపాయల ధర నిర్ణయించారు. వీటితో ఇల్లు కడితే సహజత్వం ఉట్టిపడటమే కాకుండా రెండు డిగ్రీల వరకు చల్లగా ఉం టుంది. వెదురులో సిలికా ఉంటుంది. వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకునేలా వెదురుకు ప్రత్యేకంగా కెమికల్స్ పూస్తారు. రూఫ్ ఓవర్ హ్యాంగ్స్ ఇస్తారు. అందమైన పెయింటింగ్ వేస్తారు. రుషులు నివశించే ఆశ్రమం వంటి ఇల్లు తయారుచేసి ఇస్తారు. ప్రశాంతంగా జీవించవచ్చంటారు అరుణ. ఇప్పటి వరకు 200 ఇల్లు నిర్మించి ఇచ్చారు. వినియోగదారులు కూడా ఎంతో సంతృప్తిని వ్యక్తంచేసినట్లు వీరు చెబుతున్నారు. వెదురు ఉత్పత్తితో ముడిపడి ఉన్న దాదాపు 24 మంది ఉద్యోగులు వీరి వద్ద పనిచేస్తున్నారు. వేసవి కాలంలో చల్లగా ఉంటుంది. చక్కటి ఆక్సిజన్ అందుతుంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ పొదరిల్లు మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఖర్చవదు. సిమెంట్ ఇంటిని ఎలా చూస్తామో దీన్ని కూడా అలాగే చూస్తే
సరిపోతుందంటారు.
ఇతర రాష్ట్రాలకు విస్తరించిన నిర్మాణం
బాంబూ హజ్ ఆఫ్ ఇండియా స్థాపించి ఏడేళ్లు కూడా కాలేదు. కాని వీరి పొదరిల్లు నిర్మాణం చూసిన ఇతర రాష్ట్రాలవారు సైతం ఆర్డర్సు ఇవ్వటం ప్రారంభించారు. మహారాష్ట్ర, తమిళనాడులలో కూడా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. గూగుల్ ఆఫీసువారికి బోట్ హౌస్ నిర్మించి ఇచ్చారు. హైదరాబాద్ యూనివర్శిటీలోనూ వెదురుతో కొన్ని నిర్మాణాలు చేశారు. విమానరెక్కల నుంచి కంప్యూటర్ హార్డ్‌వేర్‌కు ఇలా 1500 వస్తువుల వరకు ఏదైనా వెదురుతో అల్లేస్తామని అంటున్నారు. ప్రపంచంలో చైనా తరువాత వెదురు అత్యధికంగా ఉత్పత్తిఅయ్యే దేశాలలో ఇండియా రెండవ స్థానంలో ఉంది. ఇలాంటి వెదురు పట్ల అవగాహన లేక సరిగా వినియోగించుకోలేకపోతున్నాం. ఇటాలియన్ లెదర్ సోఫాలతో నూ, ప్లాస్టిక్ ఫర్నిచర్‌తో ఇళ్లను నింపేస్తున్నాం. కాయితపు పూలల్లోనే కృత్రిమ నవ్వులను వెతుక్కుంటున్నాం. సహజత్వానికి దూరంగా బతుకుతున్న మనకు పల్లె సోయగాలను మనింట్లో ప్రతిష్టించే గొప్ప సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్న ఈ జంట ఆరోగ్యపరంగా ఎన్ని సమస్యలు ఎదురైనా వెనుకడుగు వేయం అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ జంటకు ఓ చిన్నారి పుట్టింది. ప్రెగ్నెసీ సమయంలో అరుణకు ఆరోగ్య సమస్య తలెత్తినా.. తనకు కాలు చీలమండలానికి దెబ్బతగిలి ఏడాది పాటు విశ్రాంతి తీసుకున్నా, వెరవకుండా పొదరిల్లు నిర్మాణంలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నామని ప్రశాంత్ అంటున్నారు.

పదివేలకే టాయిలెట్

ప్రభుత్వాలు సహకరిస్తే స్కూళ్లలో వెదురుతో పదివేల రూపాయలకే టాయిలెట్లు నిర్మిస్తామని కూడా చెబుతున్నారు. బాంబూ హౌజ్‌తో పాటు ఏడాది కిం దట ఒక రీసైక్లింగ్ యూనిట్‌ను సైతం ఏర్పాటుచేశారు. ఈ యూనిట్‌లో డ్రమ్స్, టైర్లు ఇలాంటి వేస్ట్ మెటీరియల్‌తో కుర్చీలు తయారుచేస్తున్నారు. పార్కులకు, కార్పోరేట్ ఆఫీసులకు సైతం సరఫరా చేస్తున్నారు.