మెయన్ ఫీచర్

మీడియాలో పలచబడ్డ విశ్వసనీయత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఎప్పుడూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటాం.. భారతీయ మీడియా, ప్రత్యేకించి దేశ రాజధానిలోని ప్రసార మాధ్యమాలు ‘అవిశ్వసనీయత’ తో, తీవ్రమైన దురభిప్రాయాలతో, నిశ్చితాభిప్రాయాలను కలిగి పనిచేస్తున్నాయన్న వాదన బలంగా ఉంది. అవాస్తవాలకు, అక్రమాలకు ఆలవాలంగా మారడంతో మీడియాపై జనబాహుళ్యంలో విశ్వసనీయత నానాటికీ పల్చబడుతోంది. మీడియా తీరును విమర్శించేవారిపై ‘మతోన్మాదులు’ అనే ముద్ర వేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే- మీడియాలో విపరీత పోకడలు నిజమేనని నిగ్గుతేల్చే ఓ ధ్రువీకరణను మనం పరిశీలించాలి. ఎవరూ అభిశంసించడానికి వీలులేని ఆ ధ్రువీకరణ ‘ది వరల్డ్ ఎకనమిక్ ఫో రం’ అనే అంతర్జాతీయ వేదిక నుంచి రావడాన్ని మనం గమనించాలి. ‘అవిశ్వసనీయ వ్యవస్థ’లకు సంబంధించి భారతీయ మీడియా ప్రపంచంలోనే రెండో ర్యాంకు పొం దినట్లు ‘ది వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ ధ్రువీకరణలో తేటతెల్లమైంది. ‘ఎడెల్‌మాన్ ట్రస్టు’ నిర్వహించిన సర్వే ప్రాతిపదికగా విశే్లషిస్తే మీడియాపై విశ్వసనీయత సన్నగిల్లిన దేశాల్లో ఆస్ట్రేలియా ప్రథమ స్థానంలో, భారత్ ద్వితీయ స్థానంలో నిలిచాయి.
మొత్తం 28 దేశాల్లో సర్వే నిర్వహించగా, 17 దేశాల్లో మీడియాపై బలమైన ‘అపనమ్మకం’ వ్యక్తమైంది. సర్వే సందర్భంగా మూడింట రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు మీడియా పాత్రపై తీవ్ర విమర్శలు చేయడమే కాదు, ప్రసార మాధ్యమాల్లో విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందన్నారు. స్వార్థపూరిత ఉద్దేశాలు, టిఆర్‌పి రేటింగ్‌లను పెంచుకునేలా పరిస్థితులను వాడుకోవడం వంటి ధోరణులు పెచ్చుమీరడంతో మీడియా కథనాలను నమ్మే స్థితిలో జనం లేరని స్పష్టమైంది. ఇది ‘ప్రపంచ వ్యాప్తంగా ఆకస్మిక పెరుగుదల’ రూపంలో కనిపిసోందని కూడా సర్వే నిపుణులు తేల్చారు. భారతీయ మీడియాను ఆసక్తిగా గమనిస్తూ, దిల్లీ కేంద్రంగా వచ్చే త ప్పుడు కథనాలను తెలుసుకునేవారిని పలకరిస్తే మీడియాపై వారి విశ్వసనీయత ఏమిటన్నది తెలుస్తుంది. జాతీయ మీడియా తీరు ఇలా ఉండగా, ప్రాంతీయ మీడియా మెరుగ్గా ఉందని చెప్పలేం. ‘జాతీయ దృష్టి’ని ఆకట్టుకోవడంలో ప్రాంతీయ మీడియా విఫలమవుతోంది. ప్రతి చిన్న విషయాన్నీ సంచలనాత్మకం చేయడం ద్వారా జాతీయ విషయాలను తామే నిర్దేశిస్తున్నట్లు కొంతమంది ‘చురుకైన జర్నలిస్టులు’ భావిస్తుంటారు. తాము సమర్పించే కథనా లు జాతి ప్రయోజనాలకు, భద్రతా దళాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ- ‘మీడియా ప్రతినిధులు’గా మారువేషంలో ఉన్న వామపక్ష కార్యకర్తలకు ఏ మాత్రం పట్టదు.
దిల్లీలో మోదీ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి మీ డియాలో విపరీత పోకడలు మనం చూస్తూనే ఉన్నాం. మోదీ వ్యక్తిత్వం, పనితీరుపై విమర్శలు చేయడమే కాదు, అభివృద్ధి గురించి, అంతర్జాతీయ విషయాల గురించి ఆయనకు అవగాహన లేదని మీడియా ప్రచారం చేస్తోంది. గుజరాత్ అనే ఓ చిన్న రాష్ట్రం నుంచి వచ్చిన మోదీ విదేశీ వ్యవహారాల్లో ఎలా నెగ్గుకురాగలడని మీడియా అనుమానాలు వ్యక్తం చే సింది. రాజకీయ ఆర్థిక అంశాల్లో ఆయనకు ఉన్న అవగాహన ఏమిటి? ఇతర దేశాల అధిపతులతో ఎలా వ్యవహరిస్తారు? ... ఇవన్నీ మీడియా మేధావుల అనుమానాలే!
ఇక, ‘అసహనంపై చర్చ’ విషయానికొద్దాం. ఆర్థికమంత్రి జైట్లీ అన్నట్లు ఇదంతా ముందే ‘తయారుచేసిన’ చర్చ! ఓ ‘మతతత్త్వ నాయకుడు’ అశేష జనవాహినితో కదలిపోతుండడాన్ని జీర్ణించుకోలేక- ‘అవార్డులను వాపసు చేసే’ ఉదారవాదులే ‘అసహనం’పై చర్చకు గతంలో తెరతీశారు. ఈ ఉదారవాదులు, కుహనా లౌకిక వాదులు ఇప్పు డు ఎక్కడున్నారు? ‘సహన’ స్ఫూర్తి తిరిగి నెలకొందా? ‘దాద్రీ’ సంఘటనను ఈ ఉదారవాదులే జాతీయ సమస్యగా దుష్ప్రచారం చేశారు. ఎక్కడో గోవధకు పాల్పడిన వారిపై దాడి జరిగిందంటే దాన్ని జాతీయ సమస్యగా చిత్రీకరించారు. విద్యాసంస్థల్లో ‘బీఫ్ ఫెస్టివల్స్’ నిర్వహించి కొంతమంది వామపక్ష ఉదారవాదులు, జాతి వ్యతిరేకులు సరస్వతీ నిలయాల్లో ప్రశాంతతను భగ్నం చేశారు.
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో యాకూబ్ మెమన్, కసబ్, అఫ్జల్ గురు వంటి తీవ్రవాదులకు మద్దతుగా నినిదాలిస్తూ జిహాదీ ఉగ్రవాదులకు కొందరు విద్యార్థి నేతలు మద్దతు పలికారు. ఇంతలా బరితెగించి ఉగ్రవాదులకు వీరు సంఘీభావం ప్రకటిస్తే మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో కొందరు విద్యార్థి నేతలు జాతి వ్యతిరేక ప్రసంగాలు చేశారు. జెఎన్‌యులో ఉగ్రవాదులకు మద్దతు పలికిన విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్‌ను ‘రైజింగ్ స్టార్’గా ఓ మీడియా ప్రతినిధి అభివర్ణించాడు. జెఎన్‌యులో జాతి వ్యతిరేకుల సంబరాలకు టీవీలు, పత్రికల్లో వచ్చిన కథనాలకు అంతే లేదు. మిడిమిడి జ్ఞానంతో టీవీ చర్చల్లో పాల్గొనే వారికైతే ‘జాతీయత’ అన్నది ఒక మురికి పదం. కన్నయ్య కు మార్, ఖలీద్ మహమ్మద్, బుర్హన్ వనీ వంటి జాతి వ్యతిరేకులకు మీడియా యథాశక్తిన విస్తృత ప్రచారం చేసింది. చర్చాగోష్టుల్లో పాల్గొనేవారు, టీవీ యాంకర్లు చెప్పేవి అద్భుత విషయాలన్నట్లు ప్రచారం జరిగింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో వారు హద్దులు మీరి మాట్లాడారు. కొందరైతే ‘దేశ విభజన’ జరగాల్సిందేనని తమ స్వేచ్ఛా వాదాన్ని వినిపించారు.
తప్పుడు వార్తలను ప్రచారం చేసినా- ఏం జరగాలో అదే జరుగుతుంది, మీడియా నిర్దేశించినట్లు ఏదీ జరగదు. ఇది ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రుజువైంది. ‘ప్ర జలతో సంబంధాలు తెగిన’ మీడియా పట్ల విశ్వసనీయత తగ్గుతుందని యుపి ఎన్నికలు తేల్చాయి. టీవీ స్టూడియోల్లో ‘చర్చల’ పేరిట తరచూ హాజరయ్యే ‘విశే్లషకులు’ చెప్పేదేమిటి? సంబంధిత మీడియా అభిప్రాయాలనే ఈ ‘విశే్లషకులు’ ప్రకటిస్తుంటారు. తమకు ఎలాంటి పరిజ్ఞానం లేకున్నా వీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎంలు)పై తమ వాదనలను వినిపిస్తుంటారు. ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు నేతలు కూడా జనం దృష్టిని మరల్చేందుకు మీడియా సరసన చేరి అసత్యాలను ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి అర్థరహితమైన చర్చలను ప్ర సారం చేయడంలో చానళ్లు తెగ పోటీ పడుతుంటాయి.
యుపి ఎన్నికల్లో ముస్లింలు బిజెపిని బలపరచలేదన్న వాదాన్ని వినిపించేందుకు ఇటీవల ఓ ‘లౌకిక’ పార్టీ వినూత్నంగా వ్యవహరించి విస్తతృ ప్రచారం పొందాలని తపన పడింది. బిజెపికి ఓటు వేయలేదని 750 మంది ముస్లింల చేత అఫిడవిట్లు ఇప్పిస్తామని ఆ రాజకీయ పార్టీ ఎన్నికల కమిషన్‌కు సవాల్ చేసింది. ఇంతకన్నా అర్థరహితమైన చర్చ ఉంటుందా? ఓటు అన్నది పూర్తిగా రహస్యం గనుక కొంతమంది ముస్లిం ఓటర్లు బిజెపికి ఓటు వేయలేదని ఎలా చెప్పిస్తారు? దీనిపై టీవీల్లో చర్చలకు అంతే లేదు. ఎందుకంటే- ఓటమి చెందిన పార్టీలకు ఇలాంటి చర్చలే ఇపుడు ఏకైక అజెండా గనుక.
యుపి ఎన్నికల సందర్భంగా కొందరు సీనియర్ పాత్రికేయులు సైతం సొంత ఉద్దేశాలతో చేసిన ‘ట్వీట్లు’ విడ్డూరంగా అనిపిస్తాయి. ‘పెద్దనోట్ల రద్దుపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు నా యుపి పర్యటనలో తేలింది.. దిల్లీలోని విశే్లషకులు ఈ వాస్తవాలను ఎలా విస్మరిస్తారు..’ అని ఓ సీనియర్ జర్నలిస్టు ‘ట్వీట్’ చేశాడు. ‘పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే జాతీయ రాజకీయాల్లో మార్పులు తథ్యం’.. ‘యుపిలో ఎలాంటి గాలి లేదు.. హంగ్ అసెంబ్లీ ఖాయం’.. ఇలా జర్నలిస్టులు, విశే్లషకులు, టీవీ యాం కర్లు తమకు తోచినట్లు వివిధ రూపాల్లో ప్రచారం చేశారు. ఇదంతా భావ ప్రకటనా స్వేచ్ఛే...!
యుపి సహా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా ‘విస్తృతం’గా పర్యటించిన సీనియర్ పాత్రికేయులు, సంపాదకులకు ఓ కీలక ప్రశ్న. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అంచనా వేయడంలో వారు ఎందుకు విఫలమయ్యారు? ఎందుకంటే- వీరిలో చాలామంది పక్షపాత ధో రణితో, దురభిప్రాయంతో పర్యటించారు గనుక. మోదీని వ్యతిరేకిస్తూ... ‘ద్వేషపు కళ్లద్దాల’ నుంచి చూసే వాళ్లకు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవు. ఇందుకు ఓ బలమైన ఉదాహరణ ఏమంటే- మోదీని ద్వేషించే ఓ సీనియర్ టీవీ యాంకర్ బనారస్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వద్దకు వెళ్లి- ‘మోదీ వెంట మీరు ఎన్నికల ప్రచారంలో ఎం దుకు పాల్గొన్నారు..?’ అంటూ చెడామడా ప్రశ్నించాడు. చివరికి తాను పొరబడ్డానని గ్రహించి, ఆ వైస్ చాన్సలర్‌కు ఆ యాంకర్ క్షమాపణ చెప్పాడు. ఇలాంటి విషయాలేవీ మనకు అద్భుతాలు కాదు... ఎందుకంటే- భారతీయ మీడియా అవిశ్వసనీయతతో, అబద్ధాల ప్రచారంతో తరిస్తోందని ఇప్పటికే ఓ అంతర్జాతీయ సర్వే కుండ బద్దలు కొట్టింది కదా..! *

ఎస్‌ఆర్‌ రామానుజం, సెల్ : 80083 22206