మెయిన్ ఫీచర్

ధర్మాచరణే జగత్ కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశరథుని యజ్ఞ సమాప్తి చేశారు. సంవత్సరం గడిచింది. నవనవోనే్మషముగా చైత్రమాసం వచ్చింది. సృష్టిలోని సర్వ ప్రాణులల్లో చైతన్యం వచ్చినట్లుగా ఉంది. ప్రకృతి వసంతాగమనంతో పులకరిస్తోంది. అందులో శ్రీరాముని జననం. కౌసల్యాదశరథులతోపాటుగా సర్వలోకాలు, ప్రకృతి అంతా ఆనందమయంగా శ్రీరాముని పుట్టుకకు ఎదురుచూస్తున్నాయ. మంచి మూ హూర్తం రానేవచ్చింది. అంతఃపురంలో కౌసల్య శ్రీరామునికి జన్మనిచ్చింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. దేవదుందుభులు మోగాయ. దశరథుడు అయోధ్యలో మంగళభేరులు మోగించాడు. అయోధ్య అంతా మంగళ తోరణా లు సంతోష వదనాలతో పులకరించిపోతోంది.
శ్రీమన్నారాయణుడు దేవతలకు అభయం ఇచ్చినట్లుగానే దశరథునికి శ్రీరామునిగా జన్మించాడు. రాక్షస బాధలు పడలేని తాపసులు, సజ్జనులు అందరూ శ్రీరాముని జననవేళ అమితానందం పొందారు. ఇక రాక్షస బాధ త్వరలోనే దూరవౌతుందని నిశ్చయించుకున్నారు. ఎన్నో యేండ్లు ఎదురుచూసి కన్నబిడ్డను ఎత్తుకున్న కౌసల్య తన కష్టాలను ఈడేర్చే కొడుకు తనకు లభించాడని ఆనందించింది. రామునితో పాటుగా లక్ష్మణ, భరత, శత్రుఘు్నలు పుట్టారు. అయోధ్యాపతి తన నలుగురి పుత్రుల జనన మహోత్సవాలు అంబరాన్నంటేలా జరిపించారు. ఇదంతా ఆనాడు... అది త్రేతాయుగం. ఇది కలియుగం...
నేడు రామజయంతిని పురస్కరించుకుని వాడవాడల శ్రీరామ జననంతోపాటుగా శ్రీరాముని కల్యాణ్యాన్ని అంగరంగ వైభోగంగా జరుపుతున్నారు. 32 శుభ సాముద్రికా లక్షణాలతో, 34 శుభ సుగుణాలతో, పుట్టిన కొడుకును పొందిన కౌసల్యాదశరథులను తలుచుకుంటూ రామునిలాగా తమ తమ పుత్రులు ఎదగాలని నేటి తల్లులందరూ రామునికి కైమోడ్పుచేస్తున్నారు. తండ్రులంతా శ్రీరామునిలాగా తమ పుత్రులు ధైర్యసాహసాలతోపాటుగా సత్యధర్మాలను ఆచరించాలని శ్రీరాముని జీవనాన్ని కథకథలుగా తమ వాళ్లకు చెప్తున్నారు.
అటు ఇండ్లల్లోను, దేవాలయాల్లో శ్రీరాముని జనన విశేషాలు వైభోగంగా జరుపుతున్నారు. కౌసల్య ధరించిన గర్భంలోని చివరి తొమ్మిదిరోజులను గర్భనవరాత్రుల పేరిట పూజాధికాలను చేస్తున్నారు. ఈ వసంతమాసంలోని తొమ్మిదిరోజులను శ్రీరాముని నవరాత్రులని రామలీలా విశేషాలను చెబుతూ రామాయణ పఠనం చేస్తున్నారు.
తనకు నాగేటి చాలులో దొరికిన పసిపాపను అమూల్యమైన ఫలంగా భావించి సీతమ్మ నామం తో జనకుడు అతిగారాబంగా పెంచాడు. సీతమ్మ ఆటపాటల్లోను, ధైర్యసాహసాలల్లోను తానే మేటి అనిపించుకున్నది. జనకుడు ఆ సీతమ్మకు తగిన వరుడిని వెదకాలని అనుకుంటుంటే విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ చేసిన శ్రీరామ లక్ష్మణులను వెంటబెట్టుకుని మిథిలానగరానికి విచ్చేసాడు. రాముని చూచిన వెంటనే జనకుడు తనకు అల్లుడైతే బాగుండుననుకొన్నాడు. దైవానికి తన ఆశను నివేదించాడు. శతానందుల సలహాలతో విశ్వామిత్రులతోపాటుగా రామలక్ష్మణులను సీతాస్వయంవరానికి జనకుడు ఆహ్వానించాడు.
అక్కడ రాముడు శివధనుర్భంగం చేశాడు. సీతమ్మ రామునికిచ్చి పెండ్లి చేయడానికి జనకుడు సంసిద్ధుడయ్యాడు. తన మంత్రులను పంపి దశరథాదులను మిథిలకు ఆహ్వానించాడు. వారి అనుమతితో సీతారాముల కల్యాణాన్ని జరిపించాడు. అట్లాగే ఊర్మిళ, మాండవి, శుత్రకీర్తులకు లక్ష్మణ, భరత, శత్రుఘు్నలకిచ్చి పెండ్లి చేశారు.
ఆ ఘట్టానంతా పునశ్చరణ చేసుకొంటూ నేటి శ్రీరామాలయాలన్నీ శ్రీరాముని కల్యాణాన్ని జరిపిస్తారు. ప్రభుత్వాధినేతలు కూడా శ్రీరాముని తమ అల్లుడుగాను, సీతమ్మ తల్లిని తమ బిడ్డగాను భావిస్తూ తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొని పెళ్లికి తరలివెళ్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతిరామాలయంలోను అసలు ప్రతివైష్ణవాలయంలోను శ్రీరాముని జనన, కల్యాణ వైభోగాలను విశేషంగా జరుపుతారు. కుల మత విచక్షణ లేకుండా ప్రతి ఇండ్లల్లోను శ్రీరాముని స్మరిస్తూ రామ జననాన్ని, రామ కల్యాణ ఘట్టాలను తలుస్తారు.
దీనికంతటికి కారణం రాముడు చేసిన ధర్మాచరణే. రామునిలోని నాయకత్వ లక్షణాలు ఒక్కటే కాదు ఆయనలోని మితభాషి, మృధు మధుర సత్య, హితభాషిత్వం, సేవాభావం, శాంత స్వభావం, విధాన నిర్ణయ చాకచక్యం, అహింస, సత్ప్రవర్తన, సానుకూల దృక్పథం, ధర్మాచరణ, త్యాగం, ప్రేమ, సోదరులతో ఉన్న అనురాగం, అమేయమయిన పరాక్రమం, మహాశ్వర్యమైన వైరాగ్యం, ప్రజారంజకపాలన, స్నేహశీలత, భార్యాభర్తల అనుబంధం, మాతాపిత పాదసేవ, శత్రువైనా మిత్రుడిగా భావించడం, ఏకపత్నీవ్రతం, పితృ వాక్యపరిపాలనం, సమ దృష్టి, ఇలా ఎన్నో సుగుణాల రాశిగా ఉన్న రాముని వ్యక్తిత్వమే. ఆ శ్రీరాముడు 11వేల సంవత్సరాలు ధర్మపాలన చేశాడు. ఆనాటి రామరాజ్యం నేడు కూడా సర్వులకూ వాంఛనీయం.
‘శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
శ్రీ సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే’ అనే రామనామాన్ని జపిస్తూ పవిత్రతకు సీతాదేవి, శౌర్యానికి, సోదరమైత్రికి లక్ష్మణుడు, వినయానికి భరతుడు, విశ్వాసానికి గుహుడు, స్నేహానికి సుగ్రీవుడు, జ్ఞానానికి జటాయువు, భక్తికి శబరి, లోకకల్యాణానికి మహర్షులు, కర్తవ్యదీక్ష, ప్రభుసేవ, వాక్చాతుర్యానికి హనుమంతుడు ఇలా ప్రతిపాత్రా మహోన్నత విలువలతో మానవులను ఆదర్శజీవులు కమ్మని ప్రబోధించే రామాయణాన్ని చదువుదాం. అందులోని అంతరార్థాన్ని గ్రహించుదాం. రాముని ధర్మాచరణను మనమూ అనుకరిద్దాం.

- చివుకుల రామమోహన్