మెయన్ ఫీచర్

పదాలు వేరైనా పరమార్థం ఒక్కటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి భాష బాగా ఉపయోగపడుతుందని మొదట గ్రహించినవారు తమిళులు. ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అన్నట్లు ఎవరి భాష వారికి తియ్యగా అనిపిస్తుంది. ‘తమిళం’ అంటే తియ్యని భాష అని అర్థం. నిజానికి తెలుగు భాష ఒక్కటే అజంతమైన తియ్యని భాష. దీనిని ఎవరు ఒప్పుకుంటారు? తమిళానికి రెండువేల సంత్సరాల చరిత్ర ఉంటే తెలుగుకూ ఉంది. కానీ, శ్రేష్ఠ్భాష హోదా (క్లాసికల్ లాంగ్వేజి స్టేటస్) తమిళానికి ముందు వచ్చింది.. సంతోషం! తెలుగుకు రాకూడదని తమిళులు అడ్డుపడటం దారుణం. తమిళానికి ఆ హోదా ఇచ్చితీరాలని దెబ్బలాడింది తెలుగు పెద్దాయన భద్రిరాజు కృష్ణమూర్తి. తెలంగాణ ఉద్యమం మొత్తం ‘జై తెలంగాణ’ అనే నినాదం మీద సాగింది. ‘తెలంగాణమునకు జయము కలుగుగాక’ అని ఈ నినాదానికి అర్థం. ఇందులో అభ్యంతరం చెప్పవలసింది ఏముంది?? తెలంగాణ ఏడువందల ఏళ్లు విదేశీయుల పాలనలో అవిచ్ఛిన్నంగా ఉంది. 1947లో రెండు లక్షల మంది తెలంగాణ ప్రజలు చంపబడటమో, కాందిశీకులుగా తరమబడటమో జరిగింది. ఈ పని చేసింది ఇత్తెహాదుల్ మజ్లిస్ అనే సంస్థ. వీరు 1947 తర్వాత పాకిస్తాన్‌తో చెలిమిచేసి భారత్ యూనియన్‌ను గుర్తించలేదు. మరి ‘జై తెలంగాణ’ నినాదం సాకారం కావాలంటే ‘మజ్లిస్’ను ప్రోత్సహిస్తే జరుగుతుందా?? కాస్త విశ్రాంతిగా కూర్చోని ఆలోచించండి.
21-8-2015న హైదరాబాద్‌లో ఒక సంఘటన జరిగింది. ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ పేరును ‘తెలంగాణ సారస్వత పరిషత్’గా మార్చారు. సి.నారాయణరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్‌కు సుదీర్ఘచరిత్ర ఉంది. ఈ సంస్థవారు ఒక ఓరియంటల్ కళాశాల నడుపుతున్నారు. ఎన్నో విలువైన గ్రంథాలను అచ్చువేసి భాషాసేవ చేసిన ఆంధ్ర సారస్వత పరిషత్ ఒక సంస్థకాదు, ఒక ఉద్యమం. దేవులపల్లి రామానుజరావు వంటివారు తమ శక్తియుక్తులంతా ఉపయోగించి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడ్డారు. ఈ సంస్థ స్థాపన వెనుక ఒక కథ ఉంది. 1921 నవంబర్ 11వ తేదీన హైదరాబాదులో జరిగిన ఒక సభలో వక్తలు హిందీ, ఉర్దూ, మరాఠా భాషలలో మాట్లాడుతున్నారు. ఒకాయన తెలుగులో మాట్లాడబోతే అంతా ఎగతాళిచేశారు. దాంతో ఖిన్నులైన కొందరు తెలుగువారు తెలుగుభాషా రక్షణకు ఈ సంస్థను, మరికొన్ని సంస్థలనూ ప్రారంభించారు.
గణపతి దేవుడు తాను ఆంధ్ర చక్రవర్తిని అని చెప్పుకున్నాడు. తనది ‘త్రిలింగ ధరిత్రి’ అని శాసనములలో వ్రాయించుకున్నాడు. త్రిలింగ అనే మాటనుండి తెలింగ-తెలుంగు-తెలంగాణ పదాలు పుట్టాయి. కాకతీయులు త్రిలింగ దేశాధిపతులు. ఈ దేశం దక్షిణాన కంచి, ఉత్తరాన దేవగిరి (ఔరంగాబాదు) ఈశాన్యాన ఒరిస్సా వరకు వ్యాపించి ఉండేది.
ప్రతాపరుద్ర యశోభూషణము అనే సంస్కృత అలంకార శాస్త్రంలో విద్యా నాథుడు రాసిన శ్లోకంలో ఇలా ఉంది. ‘ఓ గుజరాతు ప్రాంతం సైనికులారా! ఓ మహారాష్ట్ర ప్రాంత వీరులారా! ఓ తమిళనాడు వీరులారా! ఇదుగో మా ఓరుగల్లు ఆంధ్ర సైనికులు ప్రతాపరుద్రుని నాయకత్వంలో వస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి.’ అంటే ఆంధ్ర- త్రిలింగ (తెలంగాణ) పదాలు పర్యాయ పదములుగా ఉపయోగించారు. ఇవి ఒక దశలో జాతి వాచకములు, మరొక దశలో భాషా వాచకములు అని పండితులు గంటి జోగిసోమయాజి తమ ఆంధ్ర భాషావికాసము అనే భాషాశాస్త్ర గ్రంథంలో వివరించారు. దేవులపల్లి రామానుజరావునేతృత్వంలో పనిచేసిన ఆంధ్ర సారస్వత పరిషత్తు నిజానికి తెలంగాణ సారస్వత పరిషత్తే. అది వేరు- ఇది వేరు కాదు. కాని ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసం దీని పేరును మార్చారు.
‘పిల్లి’ అన్నా ‘మార్జాలం’ అన్నా ఒకటే!! ఆ మధ్య కంచె ఐలయ్య ‘నేనెట్ల హిందువునవుతా?’ అని ఓ పుస్తకం వ్రాశాడు. మాయావతి, ఐలయ్య, కత్తిపద్మారావులు దళితులు. హిందువులు కాదు అంటున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే నినాదం. హిందూ శబ్దం చాలా విశాలార్థంలో ఉపయోగింపబడింది. హింసను దూషించేవారంతా హిందువులేనని ఈ మాటకు అర్థం. ఆస్తికులే కాదు నాస్తికులు (సాంఖ్యులు) జైనులు, బౌద్ధులు, సవర్ణులు అందరూ హిందువులే. అమెరికాలో రంగు భేదం వలెనే ఇండియాలో కులభేదం వెర్రి తలలు వేసింది. హిందూ శబ్దం పరిమితమైనదని నిర్ధారించటం సరికాదు. గిరిజనులూ వనచరులూ దళితులూ బంజారా సంచార జాతులూ అందరూ హిందువులే. రాముడు హిందువు, రావణుడు ద్రవిడుడు అనే ప్రచారం తమిళనాడులో మొదలైంది. ఇంతకన్నా చారిత్రిక అసత్యం మరొకటి ఉండదు. శ్రీరాముడు క్షత్రియుడైతే రావణుడు వేదాంతం చదువుకున్న బ్రాహ్మణుడు. జనాలను వెర్రివెంగళప్పలు చేయడానికి భాషోన్మాదం ప్రాంతీయ దురభిమానం ఎలా రాజకీయవేత్తలు ఉపయోగించుకుంటారో ఈ ఉదాహరణలనుబట్టి తెలుసుకోవచ్చు. వీరికి చరిత్రతో సంబంధం లేదు. భాషాశాస్త్రాల పరిశీలన అక్కరలేదు. ఓట్లు పడితే చాలు అధికారంలోకి వచ్చి ప్రజలను దోచుకుంటారు. ఉస్మాన్ ఆలీఖాన్ (ఏడవ నిజాము) ఒక హిందూ మార్వాడీ నర్తకి కొడుకు. జుల్ఫికర్ అలీ తల్లి హిందువు. వీరు హిందువులను (పాకిస్తాన్)లో నిజాం రాష్ట్రంలో ఎంత అణచివేశారో అందరికీ తెలుసు! ‘పాక్’ అనే మాటకు పవిత్రమైన అని అర్థం. పాకీజా అంటే పవిత్ర జన్మకలది అని అర్థం. హింద్ అంటే హింస చేయని పవిత్రుడు అని అర్థం. హిందూస్థాన్ అనే పేరును తొలగించి తమ భూభాగానికి పాకిస్తాన్ అని పేరుపెట్టుకోవటం మూర్ఖత్వాన్ని సూచిస్తుంది.
పురుషపురం- సంస్కృతం- పెషావర్
గాంధారం (గాంధారి) - సంస్కృతం - కాందహార్
వరాహవైష్ణవ క్షేత్రం- బారాముల్లా
సూర్య నమస్కారాలు- నమాజు
పిల్లి కాదు.. మార్జాలం అంటే ఇదే!
కృష్ణశబ్దం క్రైస్తు అయింది. కంసుడు హీరోదు అయినాడు. గోపాలుడు గుడ్ షెఫ్పర్డ్ అయినాడు. పురుష సూక్తంలోని తలాప స్తంభం శిలువ అయింది. అంటే కృష్ణకథ మొత్తం క్రైస్తవం అయింది- యాదవులు యూదులు అని మధ్యప్రాచ్యంలో పిలువబడ్డారు.
ఇకమీద పరీక్షలలో పోతన రచించిన గ్రంథము పేరేమిటి?? అంటే ‘ఆంధ్ర మహాభాగవతము’అని వ్రాస్తే మార్కులు ఇవ్వరు. మనం గర్వపడదగ్గ తెలంగాణ ప్రాంతానికి చెందిన పరిశోధకుడు ఆదిరాజు వీరభద్రరావు చాలా సంవత్సరాల క్రితం ‘మన ప్రాచీనాంధ్ర నగరములు’అనే పరిశోధనాగ్రంథం వ్రాసిన సంగతి మీకు తెలుసు. అందులో ఓరుగల్లు, భువనగిరి, కొండాపురం, అమరావతి వంటి ప్రాచీన నగరాల చరిత్ర ఉంది. శ్రేష్ఠ్భాష అనే పదాన్ని ప్రాచీన భాష క్లాసికల్ లాంగ్వేజి అనే అర్థంలో ప్రొఫెసర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ వాడారు. అదే పదంలో ఒక ప్రామాణిక శాస్త్రగ్రంథం కూడా రచించారు. అందులో 26వ పుటలో ఇలా ఉంది.
‘‘ఒక జాతి సామాజికంగా రాజకీయంగా బలపడ్డాక ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించాక వారి పేరునుబట్టి వారి భాషకు ప్రాంతానికి పేరురావటం ఉంది. ఆంధ్ర శబ్దం ఇలా తదనంతర కాలంలో చారిత్రక యుగంలో వచ్చిన పేరు.
తెనుగు=దక్షిణ దేశ భాష
టెంకాయ= దక్షిణ దేశపుకాయ (కొబ్బరికాయ)
తెనుగు తెలుగు ఆంధ్రా- భాషా వాచకములుగా త్రిలింగ. ఆంధ్ర శబ్దములు కాకతీయ రాజుల జాతి వాచకాలుగా ప్రతాపరుద్ర యశోభూషణం (క్రీ.శ.1300) నాటికి స్థిరంగా కన్పడుతున్నది. భారతదేశ సహజ చరిత్ర అంటే ఇక్కడి హిందువుల చరిత్రయే కాని ముస్లిముల, బ్రిటీషువారి చరిత్ర కాదు. తెలంగాణ చరిత్ర అంటే స్థానిక హిందువులైన తెలుగువారి చరిత్రయే కాని దురాక్రమణదారులైన మొగల్ అసఫ్ జాహీల చరిత్ర కాదు.
దాక్షిణాత్య భాషలకు కేంద్ర బిందువు తెలుగు కాని తమిళం కాదు. త్రిలింగ- తినగ శబ్దాలు శైవ సంబంధాలు మూడు లింగాలు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలలో నేడు ఉన్నాయి. రాజకీయంగా 2014లో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డా భాషాపరంగా సంస్కృతిపరంగా రెండూ ఒకటే. తెలి అంటే శుద్ధమైన అని మరో నిర్వచనం చెప్పి తెలీవాహ గోదావరి అన్నారు. అంటే కృష్ణ నల్లగాను గోదావరి తెల్లగాను ఉందని చెప్పి ఇలా తెలుగు శబ్దోత్పత్తి కొందరు సాధించారు. కోటిలింగాల ప్రాచీన శాతవాహన రాజధాని అని సంగనభట్ల నరసయ్యగారు తన తెలివాస గోదావరి అనే గ్రంథంలో నిరూపించారు. తమిళం అంటే చల్లని భాష అని అర్థం- దీని ప్రాచీనరూపం ద్రవిడం. తుంగభద్ర లోయ-సింధు లోయల నాగరికత భాష లిపి పరిశోధనలపై మలయాండీ వంటివారు ప్రచురించిన వ్యాసాలు తెలుగు ప్రాచీనతపై ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలకు హేతుభూతములైనాయి. ఇలా తమిళ ప్రాచీనతలో తెలుగు పోటీపడ్డడి. వరంగల్‌లోని త్రిలింగాలు విదేశాలకు వెళ్తే తైలింగాలు అయినారు.
తెల్ల- తెలుపు- తూర్పు- తెలి- తెలుగు ఇలా భాషాశాస్తవ్రేత్తలు ఆలోచించారు. తెలి శబ్దానికి తేట (స్వచ్ఛమైన) అని కూడా అర్థం చెప్పారు. యదువృష్ణి భోజ అంధకుల ప్రస్తావన ప్రాచీనమైనది. అంటే ఈ అంధకులే ఆంధ్రులు అని ఒక వ్యాఖ్యానం. తెలుగువారే తమిళులు- మలయాళీలుగా మారారు. (పుట: 65 శ్రేష్ట భాష.) వీరే తిరునాడు వారు కరునాడువారు. సారాంశం: తెలంగాణలోని పది జిల్లాలలోని వారే తెలుగువారు కాదు. సీమాంధ్రులే తెలుగు పదానికి పరిమితమైన వారు కారు. మొత్తం దక్షిణాపథమూ (వింధ్యకు దిగువ భాగం) ఆనాటి తెలుగువారే. వీరే తొలుత మగధకు లోబడి జీవించినా తర్వాత వీరు మగధను జయించారు. ‘‘తెలివాహ అంటే గోదావరి. దీనిని దాటి (పరివాణియ జాతక కథ ప్రకారం) తెలంగాణలోని ఆంధ్రనగరమైన కోటిలింగాలకు వారు వచ్చారని అన్నారు సంగనభట్ల నరసయ్య. ఇది చర్చనీయాంశము.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ అనే పేరును తెలుగుగా మార్చడానికి ఎట్టి అభ్యంతరం లేదు అన్నారు. తెలంగాణ అనేది ఒక ప్రాంతము పేరు. తెలుగు అనేది ఆ ప్రాంతములో మాట్లాడే భాష పేరు. కాబట్టి కెటిఆర్ ప్రకటన సమంజసమైనదే. భాషాపరంగా ఇందుకు ఎట్టి విప్రతిపత్తి లేదు. ఎవరూ అభ్యంతరం చెప్పకూడదు. తెలుగుల మాగాణము తెలంగాణము. తెలుంగు+ఆణ= తెలంగాణము. తెలుగు- తెనుగు- ఆంధ్రము- తెలంగాణము- రేనాడు (రాయలసీమ) ఇవన్నీ చరిత్రలో సమానార్థకాలుగానే వాడబడ్డాయి. తెడ్= దక్షిణము (తెనాలి- టెంకాయ తెంగళ) (వైష్ణవశాఖ). ‘‘నాడు’’అంటే ప్రాంతము. మహానాడు= అంటే పెద్దసభ అనే అర్థంలో నేడు వాడుతున్నారు. తమిళనాడు- తెలుగునాడు- మహానాడు. (మహా సంస్కృతం) నాడు తెలుగు పదం- ఇది వైరి సమాసం)
ఆదిరాజు వీరభద్రరావుగారు 1940వ దశకంలో హైదరాబాదులోని చాదర్‌ఘాట్ హైస్కూలులో పనిచేశారు. వీరు ప్రాచీనాంధ్ర నగరములు అనే గ్రంథాన్ని రచించారు. ఇది 1950లో విజ్ఞాన చంద్రికా గ్రంథముల వారి పక్షాన వెలుగులోకి వచ్చింది. ఇందులో భువనగిరి ఓరుగల్లు జఫర్‌గఢ్ (వేల్పుకొండ) కొలనుపాక,. గోలకొండ, అమరావతి వంటి అనేక ప్రాచీనాంధ్ర నగరముల చరిత్రను సంక్షిప్తంగా ఐతిహ్యములలో వివరించారు.
ఈ గ్రంథాన్ని ఆంధ్ర భాషాపోషకులైన శ్రీ రాజానాయని వెంకట రంగారావుగారికి (పుట 2) అంకితం చేస్తున్నట్లు వ్రాయబడి ఉంది. అంటే తెలుగు భాష-ఆంధ్ర భాష అనే పదాలు సమానార్థకాలు అని ఆదిరాజు వీరభద్రరావుగారు భావించారు. ఇందుకు అభ్యంతరం ఏముంటుంది?

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్