మెయన్ ఫీచర్

తమిళ ఉద్యమాలు.. దేనికి సంకేతాలు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్ బాటలో పశ్చిమ బెంగాల్ మాత్రమే ‘ఇస్లామీకరణ’ వైపు కదులుతోందని భావిస్తే మనం పొరబడినట్లే! తమిళనాడు సైతం ‘ఇస్లామీకరణ’కు ఏమంత దూ రంగా లేదనే చెప్పాలి. ‘జల్లికట్టు’ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ తమిళనాట జరిగిన ఉద్యమం దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది. ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించి ‘జల్లికట్టు’పై తమిళులు పట్టు నిరూపించుకున్నారని అంతా భావిస్తున్నప్పటికీ, ఆ ఉద్యమ నేపథ్యంలో పరిణామాలను పరిశీలిస్తే కొన్ని విషయాలు మనకు అవగతమవుతాయి. ‘జల్లికట్టు’ పునరుద్ధరణకు జరిగిన ఉద్యమంలో చట్టాన్ని ఏమార్చాలన్న కసరత్తు కనిపించింది. శాంతియుతంగా ఉద్యమించామంటున్న వారు కొంత మేర తప్పుడుబాటలో వెళ్లారని కూడా మనకు అర్థం అవుతుంది.
మెరీనా తీరాన్ని ఉద్యమకారులు ఆక్రమించారంటే ఎం తోకొంత విధ్వంసం చోటు చేసుకోవడం సహజ పరిణామం. మీడియా, ఉదారవాదులు ప్రచారం చేసినంత ‘పవిత్రం’గా నిరసన జరగలేదన్నది నిజం. తమిళుల సాంస్కృతిక హక్కులకు మించి, 1960ల నాటి ‘తమిళ జాతీయవాదం’, వేర్పాటువాద సరిహద్దులకు దగ్గరగా ‘జల్లికట్టు’ పోరు సాగింది. ఈ నిరసనోద్యమంలో ‘ముదాలిల్ మాడు.. అప్పురం తాని తమిళనాడు’ (ముందుగా ఎద్దు.. తర్వాత తమిళనాడు విభజన) అనే నినాదం మార్మోగింది. ‘ఉత్తరాది అణచివేతలో దక్షిణాది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యితిరేకంగానూ నినాదాలు వినిపించాయి. ఇలాంటి నినాదాలే 1960 ప్రాంతంలో ‘దురుద్దేశ పూరిత వేర్పాటు వాదం’తో జరిగిన ద్రవిడ ఉద్యమంలోనూ చోటుచేసుకున్నాయి. అలనాటి పరిస్థితిని ఇపుడు పునరుద్ధరించేందుకు డిఎంకె వ్యూహరచన చేస్తోంది.
తాజాగా తమిళనాడు రైతులు దిల్లీలోని జంతర్ మం తర్ వద్ద పుర్రెలు పట్టుకుని, ‘కపాల మాలలు’ మెడలో వేసుకుని నిరసన చేపట్టడం మనం చూశాం. గతంలో ఎమర్జెన్సీ విధించినపుడు పశ్చిమ బెంగాల్‌లో ఆనందమార్గ్ కార్యకర్తలు ఇలా పుర్రెలు పట్టుకున్న ఘటనలు ఇపుడు గుర్తుకొస్తున్నాయి. దోషపూరితమైన ఆధ్యాత్మిక నమ్మకాలతో ఆనంద మార్గీయులు పుర్రెలు ధరించడం వింతేమీ కాదు. ఎమర్జన్సీలో నిషేధం విధించినందుకు ఇందిరాగాంధీపై వ్యతిరేకతతో కాదు, తమ స్వాభావికమైన తప్పుడు విధానాలతోనే వారు అలా పుర్రెలు ధరించి నిరసనకు దిగారు. ఈ సంగతలా ఉంచితే- దిల్లీలో నిరసనకు దిగిన రైతులు తమ వెంట తెచ్చిన పుర్రెల గురించి చెప్పిన విషయాలు వింతగా అన్పిస్తాయి. వ్యవసాయ సంక్షోభం వల్ల ఆత్మహత్య చేసుకున్న లేదా అనారోగ్యంతో మరణించిన కర్షకుల పుర్రెలను తాము దిల్లీకి తీసుకువచ్చామని వారు చెప్పారు. ఇది నిజం కావచ్చు.. శుద్ధ అబద్ధం కావచ్చు.. అయితే, ‘ఆ పు ర్రెలు మరణించిన రైతులవే అని ఎలా నిర్థారించారు?’ అ ని ఆందోళనకారులను అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఎవరైనా మరణిస్తే మృతదేహానికి సంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారం చేస్తారు. మృతదేహాన్ని దహనం చేయడం లేదా ఖననం చేయడం ద్వారా అంతిమ సంస్కారం పూర్తవుతుంది. చితిమంటల్లో కాలిపోయి బూడిదయ్యాక పుర్రె భాగం ముక్కముక్కలై పోతుంది. ఖననం చేశాక సుమారు రెండు వారాల తర్వాతైనా పుర్రె లభిస్తుంది. శ్మశానంలో మృతదేహాలను పూడ్చిపెట్టిన గోతులను తవ్వి పుర్రెలను తీసుకురావడం నేరం. కేవలం అనుమానాస్పద మృతి సందర్భంలో- అదీ న్యాయస్థానం ఆదేశిస్తేనే మృతులకు సంబంధించిన పుర్రెలు, ఎముకలను పోలీసులు సేకరిస్తారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రైతులు తెచ్చిన పుర్రెలు ఎవరివి? కర్షకుల ఆత్మహత్యలను నిరూపించేందుకు పుర్రెలను తెస్తే- ఈ నిరసన వెనుక ఉన్న సూత్రధారులెవరు? ఇలాంటి విపరీత, వికృత నిరసనలకు దిగాలని అమాయక రైతులెవరూ అనుకోరు. ఈ విషయం పక్కన పెట్టి- నిరసనకు దిగిన రైతుల్ని నిశితంగా పరిశీలిస్తే మనకు వింతగా తోస్తుంది. ‘బాన కడుపు’లతో సుష్టుగా ఉన్న ఇలాంటి రైతులను మనం జంతర్ మంతర్ వద్ద మాత్రమే చూడొచ్చు. వ్యవసాయదారులకు ఏ సమస్యలూ లేవని దీని అర్థం కాదు. మరోవైపు- రైతుల ఆందోళన వెనుక మావోయిస్టు- జిహాదీల ప్రమేయం ఉందన్న అనుమానాలకు ఆధారాలు లేకపోలేదు. ‘జల్లికట్టు’ ఉద్యమంలోనూ కొంతమేరకు మావోయిస్టు- జిహాదీల ప్రభావం ఉందన్న వాదనలూ ఉన్నాయి. రాజకీయ పార్టీల వేషంలో ఉన్న ‘కరడుకట్టిన మతతత్త్వ శక్తుల’కు తమిళనాడులో కొదవలేదు. ఈ రాష్ట్రంలో 63 రాజకీయ పార్టీలు ఉండగా, అందులో కొన్ని ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయినవి కాగా, ఇంకొన్ని ఎలాంటి అధికారిక గుర్తింపులేనివి ఉన్నాయి. ఇలాంటి వాటిలో ‘మనిదా నేయ మక్కల్ కచ్చి’- ఎంఎన్‌ఎంకె- (మానవ హ క్కుల ప్రజాపార్టీ) ఒకటి. ‘సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం’ అనే నినాదంతో ఏర్పడిన ఈ పార్టీలో కార్యవర్గ సభ్యులంతా ఓ మైనారిటీ మతస్థులే. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత 2011 ఎన్నికల్లో ఈ పార్టీకి మూడు స్థానాలు కేటాయించగా, 2016 ఎన్నికల్లో ఇదే పార్టీకి డిఎంకె నాలుగు సీట్లు కేటాయించింది. ఎంఎన్‌ఎంకె పార్టీ బహిరంగంగానే జిహాదిజాన్ని బోధిస్తుందని తెలిసినా, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి డిఎంకె, అన్నా డిఎంకె సీట్లు కేటాయించాయి. జాతీయ ప్రయోజనాల కంటే ఎన్నికలే ముఖ్యమనుకునే పార్టీలు ఇలా మతోన్మాద సంస్థలతో చేతులు కలపడం విడ్డూరం కాదు.
‘తమిళనాడు తొహీద్ జమాత్’ అనే మరో జిహాదిస్టు పార్టీ ‘బాబ్రీ మసీదు’ నిర్మాణమే తన ఏకైక అజెండా అని చెబుతోంది. ‘ఇండియన్ క్రిస్టియన్ ఫ్రంట్’ అనే పార్టీ 2004, 2009 ఎన్నికల్లో యుపిఎ కూటమికి మద్దతుగా నిలిచింది. దళిత క్రైస్తవులను ఎస్‌సి జాబితాలో చేర్చాలన్నదే ఈ పార్టీ ధ్యేయం. ‘తమిళనాడు ముస్లిం మునే్నట్ర కజగం’ (టిఎంఎంకె) పార్టీ పలు విధ్వంసక చర్యలకు పాల్పడుతోంది. 1998లో భాజపా అగ్రనేత అద్వానీని లక్ష్యంగా చేసుకుని కోయంబత్తూరులో జరిగిన పేలుళ్లకు, ఇతర దాడులకు సంబంధించి టిఎంఎంకె కార్యకర్తలను గతంలో పోలీసులు అరెస్టు చేశారు. ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’ (సిమి)పై నిషేధాన్ని ఎత్తివేయాలని టిఎంఎంకె డిమాండ్ చేస్తోంది. తమిళనాట అనేక జిహాదీ-మావోయిస్టు సంస్థలు చాలా చురుగ్గా పనిచేస్తూ, జాతి వ్యతిరేక సిద్ధాంతాలపై తమ కార్యకర్తలను రెచ్చగొట్టేలా బోధనలు చేస్తున్నాయి. తమిళనాడులో ఓ వైపు జిహాదీలు, మావోయిస్టుల బెడద ఉండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులను అడ్డుకునే వారు ఉద్భవిస్తున్నారు. పర్యావరణ కారణాల నెపంతో వీరు అభివృద్ధి కార్యక్రమాలను ఆటంకపరుస్తున్నారు. కేంద్రం తమిళనాడుకు ఏమీ చేయడం లేదన్న భావాన్ని జనంలో కలిగించడమే వీరి లక్ష్యం. రాష్ట్రం కోసం పోరాటమే తమ ధ్యేయమని నమ్మబలుకుతున్నారు. నెడువాసల్‌లో హైడ్రో- కార్బన్ ప్రాజెక్టుపై వ్యతిరేకత రగిలించడం ఇందుకు ఓ ఉదాహరణ. అభివృద్ధిని అడ్డుకునే ఈ ‘కార్యకర్తల’ ప్రోద్బలంతో మీడియా తెగ హడావుడి చేస్తోంది. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించకుండా ఇలాంటి పరిస్థితులు అడ్డుతగులుతున్నాయి. కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంలో ఏం జరిగిందో మనకు తెలిసిందే. జాతి వ్యతిరేక మావోయిస్టుల అండతో ఇక్కడ ఉద్యమం జరిగింది.
ఇక- డిఎంకె కోశాధికారి, కరుణానిధి రాజకీయ వారసుడు ఎంకె స్టాలిన్ హిందీపై, కేంద్రంపై, ముఖ్యంగా మోదీపై వినిపిస్తున్న తిట్ల పురాణం ఇక్కడ ప్రస్తావించాలి. తమిళనాడులో రైతులకు అన్యాయం జరిగిందన్న వాదనను రాజేసేందుకు డిఎంకె తన శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. రైతులకు అన్యాయం, అభివృద్ధి లేమి.. అన్నింటికన్నా హిందీని బలవంతంగా తమపై రుద్దుతున్నారని ప్రచారం చేయడమే డిఎంకె ఏకైక ధ్యేయంగా కనిపిస్తోంది. తమిళనాడులో బిజెపి బలపడుతుందన్న భయంతోనే ఈ వాదనలను డిఎంకె తెరపైకి తెచ్చింది. ‘హిందీ వ్యతిరేకత’ను రగిలించడం ద్వారా మోదీని అడ్డుకోవాలన్నదే ఈ పార్టీ నేతల వ్యూహం. 1967 నాటికి, 2017 నాటికి పరిస్థితిలో ఎంత తేడా ఉందో ‘తెలివైన’ స్టాలిన్‌కు అర్థం కావడం లేదు. శశికళ శిక్ష అనుభవిస్తున్న బెంగళూరు జైలు నుంచి తమిళ ప్రభుత్వం నడస్తుండగా, సరికొత్త రాజకీయ పథాన్ని నిర్దేశించాల్సిన తరుణం ఇది. ఈ దిశగా చొరవ చూపేందుకు, ఒకప్పటి నిజమైన తమిళ జాతీయవాదాన్ని తిరిగి వినిపించేందుకు బాధ్యత గల నే తలు ఎందుకు యత్నించరు? రాజకీయంగా డిఎంకె వ్యూ హం ఏమిటో? ఆ పార్టీ నిజంగా ‘పని’ చేస్తుందా? లేక ‘్ధ్వని’ చేస్తుందా? కాలమే ఆ విషయం చెప్పాలి. *

ఎస్‌ఆర్‌ రామానుజం, సెల్ : 80083 22206