మెయిన్ ఫీచర్

ఆమె పయనం.. స్ర్తీ సాధికారత కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను ఎదుగుతూ.. తన చుట్టూ ఉన్నవారి కోసం ఆలోచించేవారు కొంతమంది మాత్రమే ఉంటారు. ఇటువంటి కోవకు చెందినవారు త్రిషీతా తేజ్. స్ర్తికి స్ర్తినే శత్రువు అనే నానుడ్ని ఒమ్ము చేస్తూ సాటి స్ర్తి సాధికారత కోసం కృషిచేస్తున్నారు. నేను చేయగలను అనే ధీమాతో ఆమె వేసిన ముందడుగులో నేడు ఎంతో మంది అతివలు అడుగులు వేస్తున్నారు. అందుకే బ్రిక్స్ ఇంటర్నేషనల్ సెమినార్‌కు హైదరాబాద్ నగరం నుంచి యువ మహిళా ప్రతినిధిగా ఆమె ఎంపికయ్యారు. ఈ సెమినార్‌లో పాల్గొనేందుకు మనదేశం తరపున ఐదుగురు ఎంపికవ్వగా.. అందులో దక్షిణాది నుంచి త్రిషీతా తేజ్ ఒకరు కావటం విశేషం. ఇలాంటి అంతర్జాతీయ సెమినార్లకు ఆహ్వానం రావటం అరుదైన గౌరవంగా భావిస్తారు. రష్యాలో ఈనెల 20 నుంచి 27 వరకు వారం రోజుల పాటు జరిగే సెమినార్‌లో త్రిషీతా తేజ్ యువ నాయకత్వంపై తన గళాన్ని వినిపిస్తారు.
ఎవరీ త్రిషీతా తేజ్?
హైదరాబాద్ నగరానికి చెందిన రచయత, వ్యాపారవేత్త. పలు కార్పోరేట్ సంస్థల్లో పనిచేసిన అనుభవంతో తేజ్ 2006లో అడ్వర్టయిజ్‌మెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను స్థాపించారు. అదే ఆమె కలల ప్రాజె క్టు ‘ పెన్సిల్ 9’గా రూపుదిద్దుకుంది. కొత్త విషయాలను నేర్చుకోవటం, కొత్త సవాళ్లను అంగీకరించటం అభిరుచిగా మలుచుకోవటం వల్లే తేజ్‌ను ఓ వ్యాపారవేత్తగా..అడ్వర్టయిజిం గ్ ప్రొఫెషనల్‌గా.. ఓ క్లినికల్ పౌష్టికాహార నిపుణురాలిగా..రచయిత్రి.. బ్లాగర్‌గా.. పాత్రికేయురాలిగా తీర్చదిద్దింది.
బ్రిక్స్‌లో ఆలోచనలు పంచుకుంటాం..
ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ సెమినార్‌లో ఒకరినొకరం అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటామని తేజ్ చెబుతున్నారు. ప్రపంచ మహిళా సాధికారిత, సాంస్కృతి రంగ వికాసం, మానవతా విలువల పరిరక్షణ తదితర అంశాలపై ఈ సెమినార్‌లో చర్చిస్తామని త్రిషీతా తేజ్ చెబుతున్నారు.

ముగ్గురితో ఆరంభం..

అత్తవారింట్లో ఎలాంటి ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా జీవిస్తున్న ఎంతోమంది ఆడవాళ్లను చిన్నప్పటి నుంచి త్రిషీతా తేజ్ చూసింది. అలాగే కెరీర్‌ను, కుటుంబాన్ని సమన్వయం చేసుకోలేక మహిళలు పడుతున్న ఇబ్బందులను సైతం గమనించింది. పెళ్లి అనే బంధం ఆనందంగా మలుచుకునేందుకు, మాతృత్వ మమకారాన్ని ఆస్వాదించేలా, కుటుంబ బంధాన్ని పదిలం చేసుకుంటూ వారు ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దేలా ఈ పెన్సిల్ 9 సంస్థను తీర్చిదిద్దారు. ఓ గృహిణి ఇంటి నుంచే పని చేసుకునేలా ఈ పెన్సిల్ 9 వేదికగా మారింది. సరదాగా భర్తతో చాటింగ్ చేస్తుండగా త్రిషీతా తేజ్‌కు మెరుపు వలే ఈ ఆలోచన రావటం భర్త ప్రోత్సాహంతోనే ఈ వేదికను ఏర్పాటు చేయటం జరిగింది. తొలుత ఇద్దరితో కలుపుకుని ఆరంభమైన ఈ పెన్సిల్ 9 సంస్థ నేడు 235 మంది మహిళలు ఇంట్లో ఉంటూ పనిచేస్తున్నారు. ఆర్థిక చేయుతనిస్తుంది. సాంకేతికంగా అభివృద్ధిపథంలో పయనిస్తున్నాం. నిత్యజీవితంలో భాగమైన ప్రసార రంగాన్ని మనం సొంతం చేసుకుని కేవలం 12 గంటలు పనిచేస్తే చాలు మీరు కూడా ఓ వ్యాపారవేత్తగా మారటం తేలికేనంటారు తేజ్. లీడర్‌షిప్ అవార్డు ను సైతం సొంతం చేసుకున్న తేజ్ ఎంబీఏతో పాటు హెచ్‌ఆర్, మార్కెటింగ్‌లో రెండు డిగ్రీలు చేశారు. సరికొత్త ఆలోచనలతో సాటి స్ర్తి సాధికారత కోసం కృషిచేస్తూ ముందుకు సాగుతుంది.

*తొలుత ఇద్దిరితో ఆరంభమైన ఈ పెన్సిల్ 9 సంస్థ నేడు 235 మందికి ఆర్థిక చేయుతనిస్తుంది. మహిళల కోసం మహిళలు ఏర్పాటుచేసిన వెబ్‌సైట్ ఇదే!