మెయిన్ ఫీచర్

కుంగుబాటు నుంచి బయటపడేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాకు ఉద్యోగం రాదు, నా కుటుంబాన్ని నేను చక్కబరచలేను. నేను తప్పు చేస్తాను, నాకు చావు తప్ప మరే మార్గం లేదు’’ -కుంగుబాటుకు గురైన వ్యక్తిలో మనసులో అనుకునే మాటలు. మేధావి సైతం తాను అసమర్ధుడినని అనుకుంటాడు. కోటీశ్వరుడు కూడా తన కుటుంబాన్ని పోషించలేనని ఆందోళన చెందుతాడు. సౌందర్యరాశిలాంటి అమ్మాయి తాను అందంగా లేనని మనోవేదనకు గురవుతుంది. డిప్రెషన్ మనిషిని స్వర్గంనుండి నరకానికి సునాయాసంగా నెట్టేస్తుంది. ఇతిహాసాలైన రామాయణం, భాగవతాలలో కూడా డిప్రెషన్ చాయలనుండి మహానుభావులు కూడా తప్పించుకోలేకపోయారు.
రెండురకాలు
1 పరిస్థితులు ప్రభావం వల్ల వచ్చేదానిని రియాక్టివ్ డిప్రెషన్ అంటారు. దీనినే న్యూరోటిక్ డిప్రెషన్ అని పిలుస్తారు. చదువు, ప్రేమ, బిజినెస్, ఆత్మీయుల మరణం, సర్దుబాటు లేకపోవడం, దాంపత్య సమస్యలు, ఉద్యోగం లేకపోవడం మొదలైనవి కారణంకావచ్చు.
2. అంతర్గత రసాయనాలు సెరటోనిన్, నార్ పినెఫ్రైన్ రసాయనిక మార్పుల వల్ల వచ్చే కుంగుబాటుకు యాంటి డిప్రసెంట్స్ మందులు సైకియాట్రిస్టు పర్యవేక్షణలో వాడితే జబ్బు నయం అవుతుంది. కుంగుబాటుకు చికిత్స ఉంది. కుటుంబ తోడ్పాటు, వైద్య చికిత్సలతో, వ్యక్తిగత అలవాట్లు, అభిరుచులతో, సంఘ జీవనంతో దీన్ని పూర్తిగా అదుపు చేసుకోవచ్చు.
కుంగుబాటుకు కారణాలు
వంశపారంపర్యంగా, మానసిక వత్తిడి కారణంగా, శారీరక వ్యాధులవల్ల, వివిధ రకాల మందులు వాడడంవల్ల ఇతర మానసిక వ్యాధులలో భాగంగా రావచ్చు.
డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తి లక్షణాలు
అలసట, నిస్త్రాణంగా, నీరసంగా ఉండడం, శరీరమంతా నెప్పులు, బాధలు.
తీవ్ర విచారం. ఒంటరిననే భావనలు, బ్రతకాలనిపించకపోవడం, పనిమీద ఆసక్తి లేకపోవడం, కుటుంబ సామాజిక సంబంధాలకు దూరమవ్వడం.
భవిష్యత్తుపై ఆశను కోల్పోవడం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, ఆత్మగౌరవాన్ని కోల్పోవడం, చనిపోవాలనిపించడం, ఏకాగ్రత లేకపోవడం, ఒంటరిగా ఉండాలనిపించడం. ఇష్టమైన విషయాలను కూడా పక్కన పెట్టడం.
నిద్ర పట్టకపోవడం లేదా అతిగా నిద్రపోవడం. ఆకలి తగ్గిపోవడం లేదా విపరీతంగా తినడం. లైంగిక ధోరణులలో మార్పు.
కుంగుబాటును గుర్తించే అంశాలు
ముఖంలో కళ ఉండదు. మెరుపు కనిపించదు. పె దవులపై న వ్వు మాయం. చిన్న చిన్న విషయాలకు బాధపడడం , ఏడవడం, బాధవల్ల అసహ నం. ఆందోళన, చికాకు, కోపం, భయం భావనలు వస్తుంటా యి.
ఆత్మస్థయిర్యం ఉండదు. అపనమ్మకం పెరుగుతుంది. ఇన్‌ఫీరియారిటీ. నెగిటివ్‌గా ఆలోచిస్తుంటారు. తమను తాము నిందించుకుంటారు. విమ ర్శించుకుంటారు. ఆత్మహత్య ఆలోచనలు. బతుకుపై విరక్తి, ఆత్మహత్యలకు పథకాలు వేయ డం, ప్రయత్నా లు కూడా చేస్తా రు. రోగిని ఇంటివద్ద వుంచాలా, హాస్పిటల్‌లో ఉంచాలా అనేది నిర్ణయించుకోవాలి. యాంటి డిప్రసెంట్స్ వాడడం ద్వా రా కుంగుబాటును అదుపు చేయవచ్చు. సైకాలజిస్టు సహాయంతో కౌన్సిలింగ్, సైకోథెరపీ, బిహేవియర్ మోడిఫికేషన్, సిబిటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అందించడం ద్వారా మామూలు స్థితికి రప్పించవచ్చు. సైకియాట్రిస్టుల ఆధ్వర్యం లో మందులతో పాటు షాక్ ట్రీట్‌మెంట్ కూడా ఇస్తుంటారు.
దూరం చేసే చిట్కాలు
ఆశావాదంతో జీవించడం, నేను చేయగలను, సాధించగ
లను అనే విధంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి.
నవ్వుతూ రోజును ప్రారంభించాలి. అందరినీ నవ్విస్తూ తాను నవ్వుతూ ఉండే సన్నివేశాలను సృష్టించుకోవాలి.
మత్తుమందులు, చెడు వ్యసనాలకు చెక్‌పెట్టాలి. వాటిస్థానంలో మంచి అలవాట్లను పెంచుకోవాలి.
సమిష్టి సంఘ జీవనంలో కుటుంబం, పిల్లలతో గడపడం, స్నేహితులు, బంధువులతో పండుగలు, ఫంక్షన్లలో కలుస్తుండాలి.
అలసటనుండి ఆనందంవైపు అడుగులు వేయాలి.
జ్ఞానేంద్రియాల ద్వారా పొందే అనుభూతులు ఆహ్లాదంగా ఉండేలా జాగ్రత్తపడాలి.
పుస్తక పఠనం, సినిమాలు, వినోద కార్యక్రమాలు, చిత్రాలు గీయడం, రంగులు వేయడం, చల్లని నీటితో ముఖం కడగడం చేస్తుండాలి.
యోగ, ధ్యాన, ప్రాణాయామ ప్రక్రియలు చేయడంవల్ల తొందరగా కుంగుబాటును జయించవచ్చును.
అత్తరులు, స్ప్రేలు, సువాసనల అగరబత్తి, రూమ్‌ఫ్రెష్‌నర్స్ మనసుకు ఆహ్లాదాన్నిచ్చి ఉత్సాహ పరుస్తాయి.
ఇష్టమైన ఆహారాలను తీసుకోవడం, ఆరుబయట ప్రాంతాల్లో తిరగడం కుంగుబాటునుండి బయటపడే విధంగా పనిచేస్తాయి.
పాటలు పాడడం, సంగీ తం, ప్రకృతి శబ్దాలు, గతంలోని సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, తోటపని, జంతువులతో గడపడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, దైవ చింతనలో పాల్గొనడం చేయాలి. పైన సూచించిన వ్యక్తిగత ప్రవర్తనా మార్పులు చేసుకుని సైకాలజిస్టు ద్వారా కౌనె్సలింగ్, సైకియాట్రిస్టు ఆధ్వర్యంలో మందులు వాడినట్టయితే అసాధారణ డిప్రెషన్‌లు కూడా మటుమాయం అవుతాయి.

- అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్