మెయిన్ ఫీచర్

అదనపు వ్యాపకాలపై ఆరాటమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛనిస్తే ఎన్నో విజయాలు మూటగట్టి అందిస్తారు. కాని మాటలు సరిగా రాని పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని వాటిని వారిద్వారా సాధించుకోవాలను కుంటారు. అదనపు వ్యాపకాల పేరుతో వారిని వేసవి శిక్షణా శిబిరాలకు, శాస్ర్తియ నృత్యాలు నేర్చుకోమని పంపుతారు. ఐదేళ్లలోపు పిల్లలు అదనపు వ్యాపకాల వల్ల అనవసర ఒత్తిడికి గురవుతారు. అంతేకాదు వారి విలువైన సమయాన్ని, జ్ఞానాన్ని హరించినవారవుతారంటున్నారు మానసిక నిపుణులు.
ఎదిగే పిల్లలకు ప్రపంచంపై అవగాహన కల్పించటంతో పాటు అవసరమైన స్వేచ్ఛనిస్తే దానికి అనుగుణంగా వారి ఆలోచనాధోరణిలో మార్పు వస్తుంది. అవగాహన పేరుతో పసి వయసులోనే పిల్లలను అదనపు వ్యాపకాల పేరుతో క్షణం తీరిక లేకుండా సంగీతం, నృత్యం అంటూ శిక్షణ ఇప్పిస్తారు. చిట్టిపొట్టి మాటలతో నట్టింట సందడి చేసే పిల్లలపై ఒత్తిడి తెచ్చి ఇలాంటివి నేర్పించటం అవసరమా ? అని అంటే పిల్లల మానసిక నిపుణులు ఖచ్చితంగా వద్దనే చెబుతారు. నాలుగేళ్లు కూడా నిండకుండానే ప్లేస్కూల్‌లో వేస్తున్నారు. పేరుకే ప్లేస్కూల్‌గానీ అందులో స్వేచ్ఛగా ఆటలు ఆడుకునే అవకాశం లేని గదుల్లో బందీఖానా చేస్తున్నాం.
వేసవికాలం వచ్చిందంటే ఇద్దరూ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు తమ పిల్లల్ని అదనపు వ్యాపకాలపేరుతో నాలుగేళ్ల చిన్నారికి బరువైన గజ్జలు కట్టించి పంపుతారు. డ్యాన్స్ అంటే వారికి ఇష్టమో కాదో తెలుసుకుని చేర్పించండి. వారికి నచ్చిన పని ఇష్టంగా చేస్తే అందులో లభించే సంతృప్తే వారికి విజయం సాధించటం దిశగా వెళ్లటానికి సాయపడినవారవుతారు.
పసి వయసులో మెదడు చురుకుగా ఉంటుంది కాబట్టి దానికి పదును పెడితే మరింత రాటు తేలుతుందనే ఆరాటంలో ఆ చిన్నారులను వేసవి శిబిరాలకు పంపకండి. వారికి మానసికంగా దగ్గరగా ఉంటే ఇంకా వారు పరిపక్వత దిశలో వెళతారు. భరత నాట్యం వంటి వాటికి అలవికాని నృత్యాలు నేర్చుకోమని పంపటం ఏమాత్రం మంచిదికాదని అంటున్నారు. నాలుగేళ్ల అమ్మాయికి ప్రతిరోజూ కాళ్లకు బరువైన గజ్జె కట్టించి నృత్యం చేయిస్తుంటే ఎంతో బాధేస్తుందని టీచర్లే చెబుతున్నారు. నడక వచ్చిందని ఆ పసి కాళ్లకు అంత బరువైన గజ్జెలు కట్టి ఒత్తిడికి గురిచేసే నడవడిక నేర్పించటం అవసరమా?
పిల్లలు స్కూలు నుంచి రాగానే ఆనందంగా గడిపే పరిస్థితులు ఇంట్లో కల్పించాలి. ఇపుడే వాళ్ల కెరీర్‌కు పునాదులు వేయాలనే తపనలో వారు ఎన్నో విజయాలు సాధించాలనే ఆరాటంలో నాలుగేళ్లకే వేసవి శిబిరాలు, వివిధ శిక్షణా కేంద్రాలకు పంపటం వల్ల విపరీతమైన అసహనానికి గురవుతుంటారని మానిసిక నిపుణులు సూచిస్తున్నారు.
స్కూలు నుంచి రాగానే వారిని చక్కగా ఆడుకోనిస్తే వారుపొందే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఇలాంటి అనుభూతిని వారికి అందించాలంటే వారికి ఇష్టమైనవి ఏమిటో తెలుసుకోవాలి.
ఈ వయసులో వారికి చెప్పే ప్రతి మాట నాటుకుపోతాయి. కాబట్టి వారికి మంచి విలువలను చెప్పండి. ఇలా చెప్పటం వల్ల పిల్లలకి మంచి ప్రవర్తన అలవడటంతో పాటు ఏది తప్పు ఏది ఒప్పో తెలుసుకునే విచక్షణా జ్ఞానం అలవడుతుంది. * మనం నేర్పించే విలువైన మాటలే వారికి సమాజంలో బలమైన పునాది పడేలా జీవితాంతం బాసటగా నిలుస్తాయి.
ప్రతి ఏటా వచ్చే వేసవి సెలవుల్లోనూ, స్కూలు నుంచి ఇంటికి రాగానే మనం వారికి నేర్పించే అదనపు వ్యాపకాలు వారి మనసుకు నచ్చినవైతే హృదయంలో సమాంతరంగా ఎదుగుతూ ఆత్మవిస్వాసంతో ఉన్న త లక్ష్యాలను చేరుకోవటానికి బాటలు వేస్తాయి. వస్తా యి.

పిల్లల్ని అర్థంచేసుకోవటానికి ప్రయత్నించండి. పిల్ల లు ఐదు నిమిషాలు కూడా కు దురుగా కూర్చోవటానికి ఇష్టపడకపోతే వారిచేత బొమ్మలు కూడా వేయించవద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలకు సాయంత్రం వేళల్లో లేదా వారాంతరాల్లో వారికి నచ్చిన ఆటలు లేదా ఏదైనా తేలికపాటి కళను నేర్పించేలా ప్రోత్సహించండని చెబుతున్నారు.
అపుడపుడే స్కూలుకు వెళుతున్న పిల్లలకు బొమ్మల పుస్తకాలు ఇచ్చి కథలు చెప్పటం వల్ల వారు కాస్తంత పెద్దయిన తరువాత పాఠ్యపుస్తకాలతో పాటు కథల పుస్తకాలు కూడా చదివే అలవాటు వస్తోంది.
తల్లిదండ్రులు పిల్లలతో సన్నిహితంగా ఉంటూ అదనపు వ్యాపకాల లిస్ట్ తయారుచేసి వారికి విడమర్చి చెబితే ఆ చిట్టి మనసులు అర్థంచేసుకుని నేర్చుకుంటారు. ఇలాంటి అదనపు వ్యాపకాల వల్లే జీవితాంతం పులకరింతల్ని సొంతం చేసుకుంటారు.