మెయిన్ ఫీచర్

వాననీరే కల్పతరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షపు నీటిని ఒడిసిపడుతున్న మాజీ శాస్తవ్రేత్త
బోరు లేదు.. నల్లాలతో పనేలేదు
ఇంటి అవసరాలన్నీ నిల్వచేసిన నీటితోనే
స్ఫూర్తినిస్తున్న ప్రయోగం

వేసవి భయపెడుతోంది.. ఎక్కడ చూసినా నీటి ఎద్దడే.. మంచినీటి కోసం ఎదురుచూపులూ తప్పడం లేదు. కానీ ఓ మాజీ శాస్తవ్రేత్తకు ఈ విషయంలో ఏ చీకూచింతా లేదు. కనీసం బోరు లేదా మున్సిపల్ నల్లా కనెక్షన్ కూడా లేని అతడికి అంత ధీమా ఎలా వచ్చింది? అదే విశేషం. వర్షాకాలంలో వానలు పడ్డప్పుడు నీటిని వృధా పోనివ్వకుండా నిల్వచేసి మిగతా రోజుల్లో వాటినే వాడుకోవడం ఆయన చేస్తున్నపని. ఆయన చేసిన గొప్ప ప్రయత్నం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ సృష్టిలో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. అసాధ్యాలను సుసాధ్యాలు చేసే శక్తి ఆ ప్రకృతే మనకు అందించిందంటారు మాజీ శాస్తవ్రేత్త మురళీశర్మ. అలాంటి ప్రకృతి శక్తే తన ఇంటిలో జలధార రూపంలో నిక్షిప్తమై ఉందంటారు. చుక్క చుక్క కలిస్తే మహా ప్రవాహం అయినట్లు వాననీటిని ఒడిసిపట్టి ఇంటి అవసరాలకు వాడుకుంటున్న ఈ మాజీ ఇక్రిశాట్ సైంటిస్ట్ మురళీ శర్మ విజయ ప్రస్ధానం ఇది.

నీళ్లు.. నిజాలు

ప్రపంచవ్యాప్తంగా ఏటా నీటికి సంబంధించిన వ్యాధుల వల్ల 57.5 కోట్ల మంది చనిపోతున్నారు.
డయేరియా వల్ల 43శాతం మరణాలు
సంభవిస్తున్నాయి.
0-14 సంవత్సరాల లోపు పిల్లల్లో మరణాలు 84శాతం వరకు నీటికి సంబంధించినవాటి వల్లే సంభవిస్తున్నాయి.
అభివృద్ధిచెందిన దేశాల్లో సైతం 98శాతం మరణాలు నీటి వల్ల కలుగుతున్నాయి.
8.84 కోట్ల మంది ప్రజలు వ్యాధులుబారిన పడటానికి ప్రధాన కారణం నీటి సమస్య.
ఆసుపత్రులలో చేరే పేషెంట్లలో సగం మంది నీటికి సంబంధించిన వ్యాధుల వల్లే చేరుతున్నారు.
ఒక్కశాతం స్వచ్ఛమైన నీటిని వాడుతున్నామనే సత్యాన్ని మరువరాదు.

హైదరాబాద్ నగరంలో వేసవి కాలం వచ్చిందంటే వచ్చేపోయే వాటర్ ట్యాంకర్లతో రోడ్లన్నీ సందడి చేస్తుటాయి. కొన్ని ప్రాంతాల్లో వేల రూపాయలు ఖర్చుపెట్టినా ఇంటికి సరిపడా నీళ్లు దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మురళి శర్మ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన ఈయన ఇక్రిశాట్ సైంటిస్ట్‌గా రాజస్థాన్‌లో పనిచేసి వచ్చారు. ఏడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో కూడా నీటి కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదని అనుకున్నాడు. ఆయన తల్లి ఈ నీటి కష్టాలు చూసి ఎంతో బాధపడేది. వర్షాలు సరిగా కురవని రాజస్థాన్ కంటే హైదరాబాద్ చాలా బెటర్ అని ఇక్కడకు వస్తే.. ఇక్కడ కూడా నీటి కోసం ఇబ్బందులు పడటమేమిటని అనుకున్నారు. ఆలోచనలకు పనిచెప్పారు. ఓ శాస్తవ్రేత్తగా పరిష్కారం కోసం ప్రయత్నించారు. తల్లికి నీటి మీద భరోసా కల్పించాలని సంకల్పించారు. ఆయన సంకల్పం నుంచే పుట్టిందే వాటర్ హార్వెస్టింగ్ విధానం.
నీటిని ఒడిసిపట్టేలా ఇంటి నిర్మాణం
హైదరాబాద్‌లో సెటిల్ అవ్వాలనుకున్న ఆయన ఇక్కడ 1995లో సొంతిల్లు కట్టుకునే సందర్భంలోనే సనాతన పద్ధతికి శ్రీకారం చుట్టారు. సిమెంట్ శాతం తక్కువ, మట్టి ఎక్కువ కలిపి చల్లగా ఉండేట్లు ఇంటిని నిర్మించారు. అంతేకాదు ఇంటి పైకప్పు నుంచి వాననీరు వృథాగా పోకుండా ఒక పివీసీ పైప్ అమర్చారు. ఓ పెద్ద సంప్ కట్టి అ నీరంతా పైపు ద్వారా సంప్‌లోకి వెళ్లేలా నిర్మించారు. వర్షాకాలంలో ఇంటి పైకప్పు నుంచి ఏడాదికి 1.25 లక్షల లీటర్ల నీళ్లు సంప్‌లోకి వెళతాయి. పైకప్పు నీళ్లు మురికిగా ఉంటాయని అనుకోవద్దు అని అంటారు మురళి శర్మ. మున్సిపల్ నీటికంటే ఎంతో స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంటాయని ఆయన ఛాలెంజ్ విసురుతారు. కనీసం ఆ నీటిని వేడి చేసుకుని కూడా ఆ కుటుంబ సభ్యులు తాగరు. దీన్నిబట్టి చూస్తే అవి ఎంతో పరిశుభ్రమైనవో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒడిసిపట్టిన వాననీటి పథకంతో ఆయన తన ఇంటి అవసరాలకు, తాగునీటికి ఉపయోగించుకుంటున్నారు. గత ఇరవై ఏళ్లగా ఇంటి కింద ఉన్న ట్యాంక్ నీటినే ఏడాది పొడవునా పొదుపుగా వాడుకుంటున్నారు.
ప్రకృతిని రక్షిస్తే మేలు
ప్రకృతిని మనం కాపాడుకుంటే అదే మనల్ని కాపాడుతుంది. ప్రకృతి లేకపోతే మనిషి మనుగడ లేదని గుర్తెరిగిన ఈ శాస్తవ్రేత్త తాను నీటిని ఒడిసిపట్టే విధానాన్ని చుట్టుపక్కలవారికి తెలియజేస్తున్నారు. అంతేకాదు వర్క్‌షాపులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.