మెయిన్ ఫీచర్

పెళ్లి వద్దన్నారు... చదువు ముద్దన్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆడపిల్లకు చదువే ఆభరణం’-స్కూల్లో టీచర్ చెప్పే ఈ మాటే వారికి వేదమంత్రమైంది. పెద్దలకు భయపడి తలవంచలేదు. తెగువ చూపారు. పుత్తడి బొమ్మలం కాదు చదువుల సరస్వతులం అని నిరూపించారు. వారే హైదరాబాద్‌కు చెందిన వి.సంధ్య, కె.సంధ్య. ఆత్మవిశ్వాసం, దృఢచిత్తంతో ముందుకుసాగుతూ.. భావి జీవితానికి బంగారు బాట వేసుకోవాలని కలలు కంటున్న ఈ ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షల్లో 90, 92శాతం మార్కులు సాధించి కాలేజీ టాపర్లుగా నిలిచారు. పెళ్లి నుంచి బయటపడి చదువుల బాట పట్టడానికి దారితీసిన పరిస్థితులు వారి మాటల్లోనే..
పదవ తరగతిలోనే పెళ్లి
నేను పదవ తరగతి పరీక్షలు రాస్తుండగానే తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. మాది హైదరాబాద్ శివార్లని ఎంజాల్ అనే వూరు. నలుగురు సంతానంలో మొదటిదాన్ని. మా ఇంటి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటంతో పరాయిదానిలా భావించి పెళ్లి చేసి వదిలించుకోవాలని కన్నవారు భావించారు. పెద్దల బలవంతం మీద పెళ్లికి తలవంచాను. వారం రోజుల తరువాత ఓ రోజు బాలల హక్కుల సంఘం అధికారులు వచ్చారు. వాళ్లు కౌనె్సలింగ్ చేసేసరికి పెద్దవాళ్లు పెళ్లి చేయం కానీ చదివించలేమని చేతులెత్తేశారు. అధికారులు చదివిస్తామంటూ హామీ ఇచ్చారు. కాలేజీలో చదువుకునే అవకాశం కల్పించారు. ఈరోజు తలెత్తుకునేలా నిలబడేలా చేశారు.
స్నేహితులే కాపాడారు..
స్నేహమంటే భుజం మీద చెయ్యివేసి నడవటమే కాదు. నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనుక నేనున్నా అని భరోసా ఇచ్చేవారే అని నిరూపించారు వీరి స్నేహితులు. నిజానికి తమ పెళ్లిని అడ్డుకుని మళ్లీ కాలేజీ బాట పట్టటానికి వారే కారకులు అని వీరిద్దరు చెబుతారు. తమ స్నేహితులు పెళ్లి విషయాన్ని టీచర్లకు చెప్పటం. వారు అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేయటంతో పెళ్లి అనే బందీఖానా నుంచి బయటపడగలిగామంటారు.
ఇరు కుటుంబాల్లోనూ ఆనందమే..
ఇపుడు ఈ ఇరువురు సంధ్యల కుటుంబాల్లోనూ ఆనందం వెల్లివిరుస్తుంది. తమను ధిక్కరించినా.. జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటున్నారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదువు పట్ల తమ కుమార్తెలకు ఉన్న మమకారాన్ని అర్థం చేసుకున్నాం.
చదువే సాధికారిత కల్పిస్తుందని గ్రహించామని అంటున్నారు. పెళ్లి చేయాలనే పొరపాటును అర్థం చేసుకున్నామంటున్నారు. అయితే పెళ్లి ఏర్పాట్లు చేసుకుని లక్ష రూపాయల వరకు ఆర్థికంగా నష్టపోయామని, అధికారులు తమకు ఈ నష్టపరిహారాన్ని అందించాలని కె. సంధ్య తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే సాయాన్ని వి. సంధ్య సోదరుడు సైతం కోరుతున్నాడు. తమకు ఉండటానికి ఇళ్లు కూడా లేదని, అధికారులు ఇంటి వసతిని కల్పించాలని కోరుతున్నాడు.
*
ఒత్తిడికి బలయ్యేదాన్ని
-వి. సంధ్య
మాది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బ్రాహ్మణపల్లి. మా ఆర్థిక పరిస్థితి చూసి బంధువుల పెళ్లిచేసేయాలని ఒత్తిడి చేసేవారు. ఆడపిల్లకు చదువెందుకని అనేవారు. పదవ తరగతి పరీక్షలు రాస్తుండగానే పెళ్లి కుదిర్చారు. నాకే మో చదువుకుని ఆర్థికంగా స్థిరపడాలనే అభిలాష ఉండేది. ఓ రోజు ప్రభుత్వ, ఎన్జీఓ అధికారులు వచ్చారు. పెళ్లి ఆపుచేసి రక్షించారు. నన్ను 17 రోజుల పాటు రెస్యూ హోమ్‌లో ఉంచారు. అధికారు లు చదువుకునే అవకాశం కల్పించారు. 92 శాతం మార్కులోతో పాసయ్యాను. పెళ్లి చేద్దామని పెద్దలు నిర్ణయించినపుడు నిజంగా భావోద్వేగానికి గురయ్యాను. ఒక వైపుకుటుంబ పరిస్థితులు, మరోవైపు చదువ. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ, ధైర్యా న్ని కూడగట్టుకుని అడుగు ముందుకు వేస్తున్నా ను. ఇబ్బందులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకం ఉంది.

చిత్రాలు.. కె.సంధ్య, వి. సంధ్య