మెయన్ ఫీచర్

వివక్ష ఎరగని వారికి రిజర్వేషన్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1920 వ దశకం నుంచి బ్రిటీష్ వారి పాలనలో వున్న భారతదేశంలో ముస్లింలకు కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో వారి జనాభా దామాషాకు 50 శాతాన్ని మించి ప్రాతినిధ్యం కల్పించబడింది. అప్పటి మద్రాసు రాష్ట్రంలో 7 శాతానికి త క్కువగా వున్న ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో 16 శాతం రిజర్వేషన్లు ఉండేవి. చట్టసభలకు ముస్లిం ప్రతినిధులను ముస్లింలే ఎన్నుకునేవారు. దళితులకు సైతం ఇంత పెద్దమొత్తాన రిజర్వేషన్లు ఉండేవి కావు. తెలంగాణ ప్రాంతంలో నైజాం పాలనలో 10 శాతం జనాభా ఉన్న ముస్లింలకు 90 శాతం పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేవి. పైపెచ్చు తెలంగాణలో ముస్లిం ప్రభువులు 600 ఏళ్లపాటు హిందువులను పాలించి వేధించారు. బ్రిటీష్ ప్రభుత్వం కొన్ని దశాబ్దాల పాటు జనాభాకు మించిన దామాషాలో రిజర్వేషన్లు ఇచ్చినా, 1948 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణలో ముస్లింల ఉర్దూయే రాజభాషగా వున్నా, విద్యాబోధన ఉర్దూ మాథ్యమం ద్వారానే జరిగినా, 1948 వరకు వెనుకబడని ముస్లింలు తెలంగాణ విమోచన తర్వాత.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ఎలా వెనుకబడ్డారు? రిజర్వేషన్ల వల్లగాని, తమకు ప్రత్యేకంగా ఉన్న ఎలక్టోరేట్ ద్వారాగాని- వెనుకబాటుతనం నుంచి విముక్తి పొందలేకపోయారా? తెలంగాణలో సుమారు 600 ఏళ్లుగా సాగిన దోపిడీ, దౌర్జన్యం 1948లో అంతం కావడం వల్లనే ఒక్కసారి ‘వెనుకబాటుతనం’ వచ్చిందా?
మన రాజ్యాంగం ప్రకారం సామాజికపరంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వవచ్చని, సహస్రాబ్దాలుగా వివక్షకు, దారిద్య్రానికి గురైన దళితులకు, ఆదివాసులకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వవచ్చునని, అది కూడా కాలపరిమితికి లోబడి ఉండాలని ఉన్నది నియమం. 600 ఏళ్లపాటు రాజ్యాన్ని ఏలినవారు, 90 శాతం పైగా విశేష ప్రయోజనాలు పొందిన ముస్లింలు- నైజాం పాలన పోగానే వెనుకబడిపోయారంటే, అంతకుముందు దోపిడీ ద్వారానే వెనుకబాటుతనం లేకపోయిందన్నమాట! ప్రజాస్వామ్యంలో ఏ వర్గమూ- తన మ తాన్ని బట్టిగాని, కులాన్ని బట్టిగాని, వారసత్వాన్ని బట్టిగాని విశేష ప్రయోజనాలను పొందలేదు, పొందకూడదు. ముస్లింల వెనుకబాటుతనానికి, అందులో కొందరి బీదతనానికి సంపూర్ణంగా వారే బాధ్యులు. వారి విశ్వాసాలను బట్టి వారు కొన్ని రంగాలలో వెనుకబడడానికి వారే కారణం. ఈ సందర్భంగా పలు గణాంకాలను పరిశీలిద్దాం. మన దేశంలో ముస్లింల జనాభా హిందువుల జనాభాకన్నా అతి త్వరితగతిన పెరుగుతోంది.
మనం గమనించవలసిన విషయాలు- బహుభార్యాత్వం, అధిక సంతానం- ముస్లింలలో పేదరికానికి ముఖ్యకారణాలు. వాటితోపాటు ఉద్యోగార్హతలకు పనికివచ్చే చదువుపట్ల, భాష పట్ల అభిమానం తక్కువ, పరిమిత జ్ఞానాన్నిచ్చే, ఉద్యోగార్హతలు పెంచని మదరసా సంస్థలలో, ఇతరత్రా ఉర్దూ మా థ్యమం పట్ల మక్కువ వుండడం వలన, ముస్లిమేతరుల కన్నా, వారికి తక్కువ అర్హతలు వారే ప్రేమించి, పోషించుకుంటున్నారు. ముస్లింలలో మతం మా ర్చుకుని ప్రవేశించిన హిందూ కులాలవారు, తమ పూర్వపు వృత్తి మీదే ఆధారపడుతున్నారు. వెనుకబడిన హిందూ కులాలవారి మాదిరిగానే మతం మార్చుకున్న ఆ కులస్థులు వెనుకబడిన వారని చెబుతున్నారు. మరి మతం మార్చుకున్నదానికి ప్రయోజనం ఏమిటి? మతం మార్పించిన ముస్లిం బోధకులు, సంపన్నులు ఈ ముస్లిం సముదాయాలను తాము పాలించిన 600 సం.లలో ఎందుకు ఉద్ధరించలేదు. వారందరూ తిరిగి తమ మాతృక కులాలకు వెళ్లిపోవాలా?
ముస్లింల ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనానికి ముస్లిమేతర పాలకుల వివక్ష, ఉదాసీనత కారణాలు కావు. భారత్ నుంచి విడిపోయి ముస్లింల చేతనే పాలింపబడుతున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని ముస్లింలు భారతదేశంలోని ముస్లింలకన్నా ఆర్థికంగా, విద్యాపరంగా ఎక్కువ స్థాయిని సంపాదించగలిగారా? లేదు. ముస్లింల వెనుకబాటుతనం ఒక్క భారతదేశంలోనే కాదు, ముస్లిమేతర దేశాలతో పోల్చి చూస్తే, ముస్లిం దేశాలు ఆర్థికంగా, విద్యాపరంగా, మేధోపరంగా వెనుకబడి వున్నాయి. ఈ విషయం ‘యుఎస్ ఎయిడ్’ అనే అమెరికన్ సంస్థ అధ్యయనం చేసి ఈ కింది విషయాలను ఒక వ్యాసం ద్వారా ప్రచురించింది. ‘ఇస్లామిక్ దేశాలు ఆర్థికాంధయుగంలో ఉన్నాయి. డోనాల్డ్ మేక్ లేలెండ్, పేటర్ టిమ్మర్ అనే పరిశోధకులు ముస్లిం ప్రపంచంలో ఆర్థికాభివృద్ధిని శోధించి, ప్రపంచ జనాభాలో ముస్లింలు 15 శాతం ఉన్నారని తేల్చారు. కేవలం 6 శాతం ప్రజల ఆర్థిక సంపత్తికి, వారి మతానికీ సంబంధం వుంది. 37 ముస్లిం దేశ ప్రజల సగటు ఆదాయం 3,375 డాలర్లు. ఇది 70 ముస్లిమేతర దేశ ప్రజల సగటు ఆదాయం. 5,937 డాలర్లలో 57 శాతం మాత్రమే. 1990-2000 సం.ల మధ్య ముస్లిం దేశాల ఆర్థికాభివృద్ధి ముస్లిమేతర దేశాల అభివృద్ధి రేటుకన్నా 9 శాతం తక్కువగా ఉంది. గత 16 సంవత్సరాలలో మరీ క్షీణించింది. మేధావులను, శాస్తజ్ఞ్రులను గాక, ఉగ్రవాదులను, పాషాండులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా వంటి దేశాలు పరిణమించాయి! (ఆధారం.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో 16-6-2017నాటి ప్రభుచావ్లా వ్యాసం)
కొన్ని వందల సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే, ముస్లిం దేశాలలో బౌద్ధికంగా ప్రగతి ముస్లిమేతర దేశాలకన్నా తక్కువగా వుంది. తెలంగాణలో ముస్లిమేతర దేశాలకన్నా తక్కువగా వుంది. తెలంగాణలో ముస్లింల వక్ఫ్ సంస్థకు 77,000 ఎకరాల భూమి ఉన్నది. దాని ఆదాయాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? వెయ్యి మదరసాలున్నాయి. వీటివల్ల ప్రభుత్వంలోగాని, వ్యాపార సంస్థలలోగాని ఉద్యోగాలు లభించగలవా? హిందూ సమాజంలో సతి, బాల్య వివాహాలు, వితంతు వివాహ నిషేధం, అంటరానితనం మొదలగు దురాచారాలను ఖండించి, సంస్కర్తలు హిందూ సమాజ ప్రగతికి తోడ్పడుతూ వచ్చారు. 1824లో అప్పటి బ్రిటీష్ పాలకులు కలకత్తాలో ఒక సంస్కృత కళాశాలను స్థాపించబోతే రాజా రామమోహన్‌రాయ్ నాయకత్వంలో హిందూ ప్రముఖులు ‘మాకు సంస్కృత కళాశాల కాదు కావలసినది, ఇంగ్లీషు కళాశాల స్థాపించమ’ని డిమాండ్ చేశారు. 1835లో పాఠశాలల్లో ఇంగ్లీషును నిర్బంధంగా బోధించే బ్రిటీష్ పాలకుల ఆజ్ఞకు వ్యతిరేకంగా 8000 మూల్వీలు ‘మాకు ఇంగ్లీషు భాష వద్దు, ఇంగ్లీషు నేర్చుకుంటే క్రిస్టియన్‌లు అయిపోనట్లే’ అంటూ ఉద్యోగానికి అర్హతనిచ్చే ఇంగ్లీషు భాషా బోధనను వ్యతిరేకించారు. ఆ మనస్తత్వం ఇప్పుడు కూడా పోలేదు. అందుకే మదరసాలు, ఉర్దూ విద్యాలయాలు పెరుగుతూ వస్తున్నాయి.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం జనాభాలో 12 శాతం వున్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిశ్చయించింది. 52 శాతం వున్న హిందూ బిసిలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పూనుకోలేదు. అనగా- హిందువులపట్ల ఉదాసీనత, ముస్లింలకు బుజ్జగింపు ధోరణి కనిపిస్తోంది. ఈ బుజ్జగింపు చర్యల క్రమంలోనే రూ.40 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఇంటర్నేషనల్ ఇస్లామిక్ ఇన్‌స్టిట్యూట్‌ను, మరో రూ.20 కోట్లు ఖర్చుతో ముస్లింల సంక్షేమ సంస్థను ప్రభుత్వం స్థాపిస్తోంది. ముస్లింలకు ఎక్కువ సంఖ్యలో గురుకుల విద్యాలయాలను స్థాపిస్తోంది. మతపరమైన ఈ చర్యలు, ఈ ఖర్చులు హిందువుల సొమ్ముతోనే తలపెట్టిన రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధం. హిందువులకు తీరని అన్యాయం. మనం రాజ్యాంగాన్ని రచించుకున్న సమయంలోనే ముస్లింల రిజర్వేషన్ చర్చకు వచ్చింది. ఆంధ్ర ప్రాంతాన్నించి ఎన్నికైన రాజ్యాంగ సభ సభ్యుడు, దళిత నాయకుడు ఎస్.నాగప్పగారి ఈ మాటలు భారతీయుల దృఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయి. ‘అంటరానితనానికి, వివక్షకు, బీదరికానికి గురి అయిన మా దళితులకు రిజర్వేషన్లు వుండవలసిందే కానీ, ముస్లింలు ఈ దేశంపై దండయాత్ర చేసి వచ్చినవారు, దోచుకున్నవారు, ఈ ప్రజల యొక్క మంచిని పట్టిచుకున్నవారు కాదు. ఈ దేశం యొక్క సంపద సృష్టికి శ్రమించింది మేము. వారు కాదు. ముస్లింలకు రిజర్వేషన్లు అనుచితం’ అని చెప్పారు. కొద్దిమంది ముస్లిం సభ్యులు కూడా ముస్లింలకు బ్రిటీష్‌వారు ప్రసాదించిన రిజర్వేషన్లు స్వతంత్ర భారతంలో ఉండకూడదని వాదించారు. అందుకే అప్పటివరకు ముస్లింలకున్న రిజర్వేషన్లు తీసివేయబడ్డాయి. వాటిని పునరుద్ధరించడం దేశ క్షేమానికి మంచిది కాదు. రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్చరించినట్లు- ఇటువంటి తుష్టీకరణ చర్యలు దేశం యొక్క, జాతియొక్క సమగ్రతకు, స్వాతంత్య్రానికి, ప్రగతికి, అఖండతకు తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. ప్రతి భారతీయ పౌరుడు, దేశభక్తుడు, మత ప్రాతిపదికపై చేయపూనుకున్న ముస్లిం రిజర్వేషన్లను ఖండించాలి. ఈ చర్యకు అడ్డుపడాలి.

-డా. త్రిపురనేని హనుమాన్ చౌదరి