మెయిన్ ఫీచర్

పైకప్పు.. పూలపాన్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలు ముదురుతున్నాయి. ఇంట్లో చల్లగా ఉండాలని కూలర్‌లు, ఏసీలు పెట్టుకుంటారు. కృతిమ ఫ్యాన్ల గాలికి అలవాటుపడిపోయి వేలల్లో కరెంటు బిల్లులు కట్టటానికి కూడా హైదరాబాద్ నగరవాసులు వెనుకాడటం లేదు. ఏసీ వల్ల పర్యావరణానికి ముప్పు, ఆరోగ్యానికి దెబ్బ. అదే టెర్రస్ పై చక్కటి పూలవనాన్ని పెంచుకుంటే మనసుకు సేదతీర్చే గాలి, ఎండ వేడి కిందకు దిగకుండా ఇల్లం తా కూల్‌గా ఉంటుంది. పల్లెటూళ్లలో పూరి గుడిసెల్లో ఉండేవారు ఎండాకాలంలో చల్లగా హాయిగా ఉంటారు. ఎంత ఎండలు కాచినా వారి ఇంట్లో ఉక్క అనేదే కనిపించదు. దీనికి కారణం తాటాకు, రెల్లుగడ్డి అయినందు వల్ల వారికి ఎలాంటి ఎండ అనిపించదు.
పట్టణాల్లో ఆసక్తి
పసుపు, ఎరుపు, నీలం- ఇలా ప్రకృతిలోని రం గులన్నీ ఒకచోట ఉంటే ఎంత అందంగా ఉం టుంది. ఊహల్లోనే ఆహ్లాదాన్ని అందిస్తున్న ఈ పూల సంబరాన్ని పట్టణవాసులు సైతం తమ సొం తం చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిపాటి పెట్టుబడి, కాస్తంత శ్రమ పడితే చాలు ఇంటి పైకప్పు పూలవనంగా తయారవుతుంది. వేసవికాలం వచ్చిందంటే పైకప్పు ఖాళీగా ఉండటం వల్ల ఇంట్లోకి సీలింగ్ ద్వారా వచ్చే వేడికి తట్టుకోలేక కూలర్లు, ఏసీలు బిగించుకోవాలని ఆరాటపడేవారు టెర్రస్ మీద పూల గార్డెన్‌ను పెంచుకుంటే చాలు ప్రకృతి ప్రసాదించిన చల్లటి గాలి, చల్లదనం ఇంట్లోకి వస్తుంది. పగలు ఎంత ఎండలు కాసినా ఇళ్లు మాత్రం ఏసీ బిగించినట్లు కూల్‌గా ఉం టుంది. బాల్కానీలు, టెర్రస్‌ల మీద ఎక్కడ కాస్తంత ఖాళీ స్థలం కనిపించినా పూల మొక్కలు పెంచటానికి సిద్ధమవుతున్నారు. పైకప్పు అంటే చాలామందికి చిన్నచూపు. పనికిరాని వస్తువులు వేసుకోవటానికి, బట్టలు ఆరేసేందుకే ఉపయోగపడుతుందనే అపోహ చాలామందిలో ఉంది. కాని ఓ ప్రణాళిక ప్రకారం ఈ స్థలాన్ని వినియోగించుకుని ఫ్లవర్ గార్డెన్ పెంచితే ఎండాకాలంలో ఎంతో సేదతీరుతారు. కూరగాయ మొక్క లు పెంచటం ద్వారా కాకుండా పచ్చ పచ్చగా ఉండేటట్లు చేస్తే వేలాది రూపాయల కరెంటు బిల్లుల మోత నుంచి బయటపడతారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
టెర్రస్ మీద పూల గార్డెన్‌ను పెంచాలనుకునే వారు అందుకు అవసరమైన ప్రణాళికను భవన నిర్మాణం ప్రారంభించే ముందు ఇంజనీర్‌ను సంప్రదించాలి.
అంతస్తు పైకప్పును పటిష్టంగా నిర్మించాలి. రాళ్లులేని మట్టితో పాటు కొంత ఒండ్రు మట్టి కలిపితే బాగుంటుంది.
పైభాగం పటిష్టంగా నిర్మించితే మొక్కల వేర్లు, నీళ్లు ఇందులోకి ప్రవేశించకుండా ఉంటాయి. స్లాబ్ బరువు పెరిగి నీళ్లు ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది. నిపుణులైన లాండ్‌స్కేప్ డిజైనర్ల సలహాలతో ప్లాన్ చేసుకోవటం మంచిది.
టెర్రస్ గార్డెన్ వల్ల స్వచ్ఛమైన గాలి విడుదల అవుతుంది. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న అనుభూతి కలుగుతుంది.
పూల మొక్కలు, పూల తీగలు వంటి సీజనల్ ప్లాంట్స్ పెట్టుకోవటం వల్ల పైకప్పుకు శోభ వస్తుంది. ఈ గార్డెన్‌కు విద్యుద్దీపాలు అమర్చుకుంటే ఆకాశంలో ఉండే నక్షత్రాలు నేలకు దిగివచ్చాయా? అనే అనుభూతి సొంతం చేసుకోవచ్చు.
స్థలాన్ని బట్టి ఊయల లేదా సిమెంట్ బెంచీలు ఏర్పాటుచేసుకుంటే సాయంత్రం వేళలో సేదతీరవచ్చు. మరింకెందుకు ఆలస్యం టెర్రస్ మీద రకరకాల పూల మొక్కలు పెంచటానికి సిద్ధంకండి.