మెయిన్ ఫీచర్

మన జీవితం.. మన చేతుల్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన జీవితం మన చేతుల్లోనే ఉందంటున్నారు ర్యాండీ పౌష్. ఆయన కార్నెగీ మెల్లాన్ విశ్వవిద్యాలయంలో (అమెరికా) హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అండ్ డిజైన్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. కంప్యూటర్ విజన్‌లో ఆయన నిపుణులు. ఎడోబ్, గూగుల్, వాల్ట్ డిస్నీ వంటి ప్రసిద్ధి చెందిన కంపెనీలతో ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం పనిచేశారు.
ప్యాంక్రియాటిక్ కేన్సర్ కారణంగా ర్యాండీ పౌష్ 2008లో మరణించేరు. విశేషమేమిటంటే అ భయంకరమైన ఆ కేన్సర్ వ్యాధివల్ల చనిపోతానని తెలిసినా, నిత్యం నరకం అనుభవిస్తూ కూడా ఆ వ్యాధిని గురించి ఒక వైద్యుడు చేసినంత లోతైన అధ్యయనం చేసేరు. తనకు వచ్చిన వ్యాధే గురువుగా, తాను అనుభవించే బాధలే పాఠాలుగా ఆ వ్యాధిని గురించి ఎన్నో విషయాలను లోతుగా అధ్యయనం చేశారు.
కార్నెగీ మెల్లాన్ విశ్వవిద్యాలయంలో ఎవరైనా ప్రొఫెసరు పదవీ విరమణ చేసేటప్పుడు ‘ది లాస్ట్ లెక్చర్’ పేరుతో వారి చేత ఒక ప్రసంగం ఏర్పాటుచేయడం ఆనవాయితీ. ర్యాండీపౌష్ కొద్ది రోజుల్లో చనిపోతారనగా వారిచేత కూడా ఒక ప్రసంగం ఏర్పాటుచేసేరు. అది నిజంగానే వారి జీవితంలో ఆయన చేసిన ఆఖరి ప్రసంగం. ఆ ప్రసంగం ‘ది లాస్ట్ లెక్చర్’ పేరుతోనే ప్రచురితమయ్యింది.
తన ప్రసంగంలో ర్యాండీ పౌష్ చెప్పిన మాటలు యువతకి చక్కటి మార్గదర్శనం చేస్తాయి. ఆయన చెప్పిన మాటలలో కొన్ని:
మనకి పేకాటలో పంచబడ్డ ముక్కలను మనం మార్చలేం. ఆ ముక్కలతో ఎలా ఆడాలనేది మార్చగలమంతే. జీవితం కూడా అంతే. మనకు ఎదురయ్యే పరిస్థితులను మార్చలేం. వాటిని ఎదుర్కొంటూ మనం ముందుకు పోగలిగే మన ధోరణినే మార్చుకోగలం.
ఎవరైతే మనల్ని ఆత్మావలోకనం చేసుకోవటానికి ప్రేరేపిస్తారో, అలాంటివారు జీవితంలో చాల అవసరం.
ఈ ప్రపంచంలో బైట మనం చూస్తున్నవన్నీ మనలోనే ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం గమనించుకుంటే చాలు. మన భావోద్వేగాలను గమనించుకొంటూ మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి.
మనకి ఉన్న దానిని మిగుల్చుకోవాలి. ఊరికినే ఖర్చు చేయకూడదు. తరవాతి తరాల కోసం కొంతైనా మిగల్చాల్సిన బాధ్యత మనపై ఉంది.
మనం డ్రైవర్ సీట్లో ఉన్నంత మాత్రాన వేరేవాళ్లపైకి బండి నడిపించనక్కర్లేదు.
పట్టుదల సుగుణమే కానీ, ప్రతి ఒక్కరికీ మనం ఏ విషయంపై ఎంత శ్రద్ధ కనబరుస్తున్నదీ తెలియాల్సిన అవసరం లేదు. మనకు కనబడిన ప్రతిదానినీ సరిచేయాల్సిన అవసరం లేదు.
జీవితమంటే మన కలను నిజం చేసుకోవడం. ఒక లక్ష్యాన్ని హృదయపూర్వకంగా కోరని వాళ్ళని ఆపడానికే అడ్డుగోడలుంటాయి.
మనం పెద్ద పెద్ద పనులను చేపట్టాలి. వైఫల్యాల గురించి ఆందోళన పడకూడదు. ఫలితం కన్నా ప్రయత్నం గొప్పది. మనం జీవించి ఉండగా మన ఆశలు నెరవేరకపోవచ్చు. కానీ మన ఆశలే రేపటి తరాలకు ఊపిరి అవుతాయి. మన ఆశే మన కర్తవ్యాని కి ప్రేరణ. మన ప్రయత్నమే
మన పనికి బలము.
కష్టపడి పని చేయడం మన అర్హతకు తగనిపని కాదు.
గెలవడమూ, ఓడిపోవడమూ కాదు ముఖ్యం. పనిచేసే ప్రాథమిక సూత్రాలన్ని ఎలా పాటిస్తున్నావనేదే ముఖ్యం. నీ ప్లాన్‌ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కానీ ప్లానంటూ ఉండాలి నీకు.
మనం ఘోరంగా పనిచేస్తున్నపుడు ఎవరూ ఏమీ అనకపోతే దానర్థం వాళ్ళు మన మీద ఆశ వదులుకున్నారని.
ఫిర్యాదులు చేయడం అనేది మన లక్ష్యాన్ని చేరేందుకు ఏ విధంగానూ సహాయపడదు. ఫిర్యాదులు చేయడానికి వినియోగిస్తున్న సమయంలో పదో శాతాన్ని సమస్యలు పరిష్కరించడానికి వెచ్చిస్తే, సమస్యలు మాయమవటం మనం గమనిస్తాం.
మనం దెబ్బకొట్టడమనేది కాదు, మనమెంత గట్టి దెబ్బతిన్నామనేది.. తిని ముందుకు పోతున్నామనేది ముఖ్యం.
మనం ఎప్పుడో చేద్దామనుకున్న ఇష్టమైన పనులను ఇపుడే చేయాలి. వాయిదా వేయకూడదు. కార్యాన్ని ముందుకి నడిపించడానికి దోహదం చెయ్యగలిగితే, మనకి ఆహ్వానం అదే లభిస్తుంది.
రిలాక్స్ అవుదామనుకుంటే పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ, మెస్సేజ్‌ల కోసం ఇంటికి ఫోను చేసుకుంటూ వుంటే అది రిలాక్స్ ఎలా అవుతుంది? హాలీడే ఎలా అవుతుంది?
మనకి ప్రశ్నలంటూ వుంటే మనమే సమాధానాలను వెతుక్కోవాలి. ఎవరో చెప్పే అభిప్రాయాలకోసం వెంపర్లాడకూడదు. ఎవరికీ నచ్చకపోయినా సరే మనం మనంగానే ఉండాలి.
ఒక్కోసారి దారుణమైన భవిష్యత్తులోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. అయినా మనం నిబ్బరంగా వుండాలి. ఊరికినే ఆందోళన చెందడం వలన ప్రయోజనం ఉండదు. రాబోయే మరుసటి రోజు గురించి భయపడుతూ ప్రతి రోజూ జీవించడంవల్ల ఉపయోగంలేదు.
ఒకరు మనకు చేసిన ఉపకారాన్ని మనం మరొకరికి చెయ్యాలి.
జీవితంలో మనకున్నది ఒక్క టైం మాత్రమే. ఒకానొక రోజు అది కూడా తక్కువగా వుందని గ్రహిస్తాం.

-దుగ్గిరాల రాజకిశోర్