మెయన్ ఫీచర్

ప్రగతి గీతంలో సంక్షేమ స్వరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తల్లీకొడుకుల’ రాజ్యం అంతరించిపోయి, ఓ పేద మహిళ కుమారుడైన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు గడిచాయి. మోదీ మూడేళ్ల పాలనలో దేశవ్యాప్తంగా ఓ ఆశావహ వాతావరణం నెలకొంది. యుపిఎ నేతల పదేళ్ల నిర్వాకం ఫలితంగా ఖాళీ అయిన ప్రభుత్వ ఖజనా మోదీ వచ్చాక క్రమంగా నిండడం మొదలైంది. ఆర్థిక వ్యవస్థ కుదుటపడడంతో అనేక ప్రజోపకరమైన పథకాలు రూపుదిద్దుకున్నాయి. తన మాతృమూర్తి కట్టెల పొయ్యి మీద వంట చేయడం, ఆమెకు కళ్లు మండడం చూసిన మోదీ- ‘వంటగది నుంచే మహిళలకు గౌరవం దక్కాలి’ అని భావించారు. పేద మహిళల కోసం వంట గ్యాస్‌ను అందించాలనుకున్నారు. వంట గ్యాస్‌పై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అర్హులకే అందాలని ఆయన ఆరాటపడ్డారు. సంపన్నులు వంటగ్యాస్‌పై సబ్సిడీని వదులుకోవాలని ఆయన పిలుపుఇవ్వడంతో సుమారు 2 కోట్ల మంది స్పందించారు. మే 1, 2016న యుపిలో ‘ఉజ్వల యోజన’ను ప్రారంభిస్తూ 2019 వరకు 5 కోట్ల మంది పేద మహిళలకు వంట గ్యాసు కనెక్షన్లు ఇస్తామని మోదీ ప్రకటించారు. 10 నెలల్లో ఆయిల్ కంపెనీలు 17.3 మిలియన్ వంట గ్యాస్ కనెక్షన్లను పేద మహిళలకు అందించాయి. యుపిలోనే 5.31 మిలియన్ మంది మహిళలు లబ్ది పొందారు. ఇటీవల యుపి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయానికి దారితీసిన కారణాల్లో ఇది ఒకటి. యుపిలోని బోబినాకు చెందిన ‘డూల’ అనే మహిళ ‘రోజూ రెండుమూడు కిలోమీటర్లు నడిచి వంట చెరకు తెచ్చుకునేదాన్నని, తనకు వంట గ్యాస్ లభించడంతో ఆ బాధ తప్పిందని, తమ కుటుంబంలో తానే మొదటిగా గ్యాస్ స్టౌ వాడుతున్నాన’ని ఆనందంగా చెప్పింది. యుపిలో 2019 అంతానికి 50 లక్షల ఎల్‌పిజి కనెక్షన్లు ఇవ్వాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.
2016-17, 2017-18 వార్షిక బడ్జెట్‌లలో పేదవారికి, వ్యవసాయదారులకు అనుకూలంగా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. అందులో ‘ప్రధానమంత్రి కృషి యోజన’ చాలా ముఖ్యమైంది. గ్రామాల్లో వౌలిక వసతుల కల్పన, ప్రజలకు సొంత గృహాల ఏర్పాటు, గ్రామీణుల ఆదాయం పెంచే మార్గాలపై కేంద్రం కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే ముందుగా 28 కోట్ల మంది గ్రామీణులు ‘జన్ ధన్ యోజన’ కింద బ్యాంకు ఖాతాలు తెరిచారు. 18వేల గ్రామాలకు విద్యుత్తు, రోడ్లు, ఇతర వౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా ఇంకా వేలాది గ్రామాలకు విద్యుత్తు అందకపోవడం ఎవరికైనా ఆవేదన కలిగించే విషయం. తాను అధికారం చేపట్టిన 1,000 రోజుల్లో ఈ పని పూర్తిచేస్తానన్న మోదీ గత మూడేళ్ళలో 13,000 గ్రామాలకు విద్యుత్తు అందేలా కృషి చేశారు. ‘మహాత్మాగాంధీ గ్రామీణ హామీ ఉపాధి హామీ’ పథకానికి కేటాయింపులు పెరిగాయి. ఈ పథకాన్ని ‘ఆధార్’తో అనుసంధానం చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు చేరే వెసులుబాటు వల్ల అవినీతి తగ్గింది. ‘జన్ ధన్ యోజన’లో భాగంగా లక్ష రూపాయల ప్రమాద బీమా, రూ.30,000 జీవిత బీమా, 6 నెలలకు ఓవర్‌డ్రాఫ్టు సౌకర్యం, రూపే డెబిట్ కార్డు వంటి సౌకర్యాలున్నాయి. ఈ వినూత్న పథకం ‘గిన్నీస్ బుక్’లో చోటు సంపాదించుకుంది. దేశ ఆర్థికవ్యవస్థతో గ్రామీణులను భాగస్వాములను చేసిన బృహత్తర ప్రయత్నమిది. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటివి ప్రజలకు సామాజిక రక్షణను కల్పించేందుకు రూపుదిద్దుకున్నాయి. ప్రధానమంత్రి ‘ముద్ర’ యోజన ద్వారా దేశంలో 7కోట్ల మందికి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎలాంటి హామీ లేకుండా స్వయం ఉపాధి కోసం బ్యాంకులు రుణాలిచ్చాయి. ఆ ఏడు కోట్ల మంది కనీసం ఇద్దరికి ఉపాధి కల్పించినా మొత్తం 14 కోట్ల మందికి ఉపాధి కల్పన జరిగినట్లే. వౌలిక వసతులు, టూరిజం, గృహ నిర్మాణం వంటి రంగాల ద్వారా మరెంతో మందికి ఉపాధి లభిస్తుంది.
మూడేళ్ల క్రితం తన ప్రభుత్వం ఏర్పడినపుడు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో మోదీ మాట్లాడుతూ మూడు విషయాలు స్పృశించారు. మొదటిది- తమది పేదోళ్ళ ప్రభుత్వమని, రెండోది- అవినీతికి దూరంగా ఉంటామని, మూడోది- ప్రపంచ పటంపై భారత్ గౌరవం ఇనుమడించేలా ప్రవర్తిస్తామన్నారు. ఈ మూడు విధాన నిర్ణయాలకు అంకితమై మూడేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు సాగుతున్నాయి. స్వచ్ఛ భారత్ పథకం అందరి ఆరోగ్యానికి సంబంధించింది. గత మూడేళ్ళలో నాలుగున్నర కోట్ల టాయిలెట్లను నిర్మించారు. వీటిలో ఎక్కువ భాగం గ్రామాలలోనే నిర్మించారు. బహిరంగ మల విసర్జనను అంతం చేసి, గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణం ఏర్పరచాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. టాయిలెట్ల నిర్మాణం ఫలితంగా ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు కేంద్రం ప్రయత్నించింది. ‘బేటీ పడావో, బేటీ బచావో’లో భాగంగా ‘సుకన్యా సమృద్ధి ఖాతా’ రూపుదిద్దుకుంది. రూ.1000తో మొదలై 1.5 లక్షల వరకు ఎంతైనా ఆడపిల్ల పుట్టగానే ఇందులో జమ చేయవచ్చు. 9.2 శాతం వడ్డీతో 21 ఏళ్లు నిండిన ఆడపిల్లకు మొత్తం డబ్బును అందజేస్తారు. ‘కిసాన్ వికాస పత్ర’ ద్వారా రైతులను ఆదుకునేందుకు మదుపుచేసిన మొత్తాన్ని 100 నెలల్లో కేంద్రం రెట్టింపు చేస్తుంది. 8.7 శాతం వడ్డీతో దీన్ని అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామ సించాయి యోజన ద్వారా ప్రతి పొలానికీ నీరందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. భూసార పరీక్షలకు రైతులు చేసే ఖర్చును తిరిగి చెల్లించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి.
‘దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన’ పేర యువతను పనిమంతుల్ని చేసేందుకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన క్రింద రబీ, ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం బీమా కల్పించింది. ప్రస్తుతం 4 కోట్ల హెక్టార్లలో పంటలకు ఇది వర్తిస్తుంది. కానీ, 2016లో ప్రారంభించిన ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ విపణి పథకాలకు ఇంకా మహర్దశ పట్టలేదు. దీనికి అనేక కారణాలున్నా, ప్రభుత్వ చిత్తశుద్ధిని మాత్రం శంకించాల్సిన అవసరం లేదు. పేదవాడికి ఆత్మస్థైర్యం కల్గించే మరో పథకం ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన’. పార్లమెంటు సభ్యులకు పేదల పథకాలపై అవగాహన కల్గించి, వారికి కేటాయిస్తున్న నియోజకవర్గ నిధులను పేదల సంక్షేమం కోసం వినియోగించేలా ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశం. నల్ల కుబేరుల భరతం పట్టేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా లెక్క చూపని తమ ఆదాయానికి ఇతర పన్నులతోబాటు సదరు వ్యక్తి 25 శాతం పన్ను గరీబ్ కళ్యాణ్ యోజన కింద కట్టాలని ప్రభుత్వం షరతు విధించింది. ఆ విధంగా కోట్లాది రూపాయలు బీదల పథకాల కోసం వెచ్చించే వెసులుబాటు ప్రభుత్వానికి కలిగింది. పెద్దనోట్ల రద్దుతో 14.5 లక్షల కోట్ల ధనం బ్యాంకులకు చేరింది. అంతకుముందు చెలామణిలో వున్న 15.5 లక్షల కోట్లలో లక్ష కోట్ల ధనం చిత్తయిపోయింది. పన్ను వసూళ్ళు 16 శాతం పెరిగాయి. పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి వరకు ప్రజాభివృద్ధి పనులకు ధనం సమకూరింది. కార్మిక శాఖలో అనేక సంస్కరణలు జరిగాయి. అనేక ప్రోత్సాహకాలు లభించాయి. ఈసారి పద్మశ్రీ అవార్డులు పొందిన వారిలో గిరిజన జానపద కళాకారిణి సుక్రిబొమ్మ గౌడ వంటి సామాన్యులు వున్నారు. బిసి కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పిండం మరో విజయం.
ఒడిశాలో గత నెలలో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పెట్రోలియం, సహజ వాయువుశాఖల మంత్రి దేవేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ప్రధాని ఒడిశాను పేదల పథకాల అమలు కోసం ప్రయోగశాలగా తీసుకున్నారని అభివర్ణించారు. గ్రామీణ ఒడిశా అభివృద్ధికి కేంద్రం 3000 కోట్లు కేటాయించింది. గత మూడేళ్ళలో 20 లక్షల ఎల్‌పిజి కనెక్షన్లు ఇచ్చారు. జనవరి 1, 2017న ప్రధాని ఓ సభలో మాట్లాడుతూ, గ్రామాల్లో ఇళ్ల ఋణాలపై 2 లక్షల వరకు 3 శాతం పన్ను మినహాయిస్తామని, 30 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే కార్డులుగా మారుస్తామని, నాబార్డుకు రూ.20,000 కోట్లు ఇవ్వడం ద్వారా గ్రామీణ సహకార సంఘాలు రుణం పొందేలా చూస్తామని అన్నారు. నగరాల్లోని పేద ప్రజలకు ఇంటి రుణాలపై 9 లక్షల వరకు 4శాతం పన్ను మినహాయింపు, 12 లక్షల వరకు 3 శాతం పన్ను మినహాయింపును ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు 7.5 లక్షల వరకు డిపాజిట్లపై 8 శాతం వడ్డీని 10 ఏళ్ళవరకు వర్తింపజేశారు. శిశు మరణాలను తగ్గంచేందుకు పేద గర్భిణులకు రూ.6000లను బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమ చేస్తుంది. ఇటీవల గుజరాత్ ప్రభుత్వం పేదల కోసం 11 కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రధాని మోదీతో గాంధీనగర్‌లో ప్రారంభోత్సవం జరిపించింది. గిరిజన మహిళలకు సహకారం, పాల సహకార సంఘాల నిర్వహణకై పేద మహిళలకు సహకారం, పేదలకు ప్రజారోగ్యం, విత్తన గిడ్డంగులకై రైతులకు సహాయం, ఐటిఐ విద్యార్థులకు టాబ్లెట్లు, కంప్యూటర్ల పంపిణీ, నిర్మాణరంగ కార్మికులకు సహకారం వంటి పథకాలు ఇందులో వున్నాయి.
12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు నెరపిన 10 ఏళ్ళ యుపిఎ సర్కారును సాగనంపి మోదీ పగ్గాలు చేపట్టిన తరువాత వివిధ రూపాప్లో అభివృద్ధి జరిగింది. ఒక్క రూపాయి కుంభకోణం కూడా మోదీ మూడేళ్ల పాలనలో జరగలేదు. ‘అదానీ, అంబానీలకు కొమ్ముకాసే ప్రభుత్వం’ అని కాంగ్రెస్ పార్టీ చేసిన వాదన శుద్ధ అబద్ధమని రుజువైంది. కోట్లకు పడగలెట్టిన పారిశ్రామికవేత్తల నుంచి- 2జి, 3జి స్ప్రెక్టమ్‌ల కేటాయింపులు, బొగ్గు గనుల కేటాయింపుల వేలంపాటలో లక్షల కోట్లు రాబట్టింది మోదీ ప్రభుత్వం. 125 కోట్ల మంది ప్రజల్లో ఎక్కడా అసహనం, హింసకు తావివ్వని విధంగా నోట్లరద్దు సమయంలో జనామోదం పొందింది. ఇందుకు కారణం సామాన్య ప్రజలు మోదీని మనసారా నమ్మారు. తమ జీవితాలు బాగుపడతాయని విశ్వసించారు. తాత్కాలిక కష్టాన్ని సహించారు. ఈ విశ్వాసమే గెలుపుమీద గెలుపును మోదీకి, ఆయన పార్టీకి కట్టబెట్టాయి. 15.5 శాతం వున్న ద్రవ్యోల్బణం 2.8 శాతానికి దిగి వచ్చింది. జిడిపి వృద్ధి అనుకున్న స్థాయిలో లేకపోయినా అదుపులోవున్న ద్రవ్యోల్బణం మంచి మార్పునే ఆశించవచ్చని చెబుతోంది. కమ్యూనిస్టు ప్రభుత్వాలు సైతం చూపని దృష్టిని మోదీ పేదోల పట్ల కనబరచారు. ఆయన ప్రతి మాట పేదవాడి గుండె చప్పుడు. ఆయన స్వరం పేదోడికి వరం.

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్