మెయిన్ ఫీచర్

మానసిక వికాసానికి మార్గాలివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీర్థ యాత్రలు ఛేస్తే పుణ్యం అంటూ పెద్దలు ఎందుకు చెప్పారంటే అక్కడ ఇదివరలో పవిత్రమైన నదీ నదాలు పచ్చని ప్రకృతి శోభ విరాజిల్లుతూ వుండేవి.
అవన్నీ తిరిగి చూసి ఆ ఓషథులతో కూడిన నదీ జలాల్లో స్నానమాచరిస్తే ఆరోగ్యానికి మంచిది. ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ వుంటే అలౌకికానందం కలుగుతుంది. సహజ సిద్ధమైనది స్వచ్ఛమైనది చల్లని గాలి పీల్చుకుంటే అంతకన్నా శరీరానికి ఆరోగ్యకరమైనది ఏముంటుంది?
అదీకాక దేవుని విగ్రహాలు కొన్ని సహజసిద్ధంగా వెలిసినవైతే కొన్నిచోట్ల ఋషీశ్వరులు ప్రతిష్టించిన ఆ యంత్ర మహిమలు జగత్ప్రసిద్ధాలు. పైన చూపరుల కోసం ప్రతిష్టించిన విగ్రహాలు రాతి బొమ్మలే కావచ్చు. వాటి యంత్రమహిమలు మనకి నిజ దేవతా రూపాలని మనసులోప్రత్యక్షమయ్యేలా చేస్తాయి. మనసు పవిత్రతతో ప్రశాంత స్థితిని పొందుతుంది. అక్కడ వున్న ఆ స్వల్ప కాలమైనా మన మనసు అల్లకల్లోలాలనుండి మళ్లింపబడుతుంది.
మనసులు మహా చెడ్డవి. మన ఇంట్లో దేవుని విగ్రహం ఎదుటో పటం ఎదుటో కూర్చున్నా చేతిలో పువ్వులు దేవునిపై వేస్తున్నా మనసు మాత్రం అక్కర్లేని ఎన్నో విషయాల మీదకి వెళ్లి తిరిగి వస్తుంటుంది. పవిత్ర దేవాలయాలకి వెళ్లి దర్శించుకుంటే అక్కడి యంత్ర మహిమలు వల్ల మనసులు పవిత్రతనొంది ప్రశాంతత కలుగుతుంది. ఇవన్నీ చెప్తే ఎవ్వరికీ అర్ధం కాదు కనుక తీర్థయాత్రలు చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పేస్తారు. సాధారణులకు పుణ్యమంటే మంచి జరుగుతుందని, పాపమంటే చెడుజరుగుతుందని అభిప్రాయం. ప్రతివారు మంచి జరగాలనే కోరుకుంటారు కనుక పుణ్యం కోసం తీర్థయాత్రలు చేస్తారు.
తీర్థయాత్రలవల్ల మరొక ప్రయోజనం వుంది. ఏమిటంటే కూపస్థమండూకంలగా ఉంటూ ఎవరికి వారు మేధావులమనీ గొప్పవారమనీ అనుకుంటుఉంటారు.ఎపుడైతే బయటకు వెళ్లి యాత్రలలో నలుగుర్ని చూస్తూ వారితోకలిసి తిరుగుతు మాట్లాడుతుంటే ఎంత ప్రపంచముందో ఎంతమంది ఎన్నిరకాల మనుషులు, ఎన్ని రకాల మనస్థత్వాలు ఉంటాయో తెలుస్తుంది. పైగా ఒకే వాతావరణం కాక పలుచోట్ల పలురకాలైన వాతావరణాలు, ఆ యా పరిస్థితులు వారి వారి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు సంప్రదాయాలు అన్నీ అర్ధమవుతాయి. కొంత మానసిక వికాసం వీటివల్ల జరుగుతుంది.
‘తీర్థం’ అంటే నదులు. ఆ రోజుల్లో నదులు పరిశుభ్రతతో ప్రవహించేవి. అందుకే ఆ ప్రాంతాలలో ఋషీశ్వరులు ఆశ్రమాలు నిర్మించుకుని నివశించేవారు. ఇప్పటికీ హిమాలయ ప్రాంతాల్లో ఎన్నో పుణ్యాశ్రమాలు వున్నట్టుగా చూసి వచ్చినవారు చెప్తుంటారు. మనం తీర్థయాత్రలు చేసినప్పుడు అటువంటి పుణ్యాత్ముల దర్శనం కూడా చేసుకుని వారి ఆశీస్సులు పొందవచ్చు. అంతే కాదు వారు దేని వల్ల మేధాశక్తిని, ఏకాగ్ర చిత్తాన్నిఏవిధంగా సాధించారో మనకు విపులంగాతెలుసుకొనే మార్గం ఏర్పడుతుంది.
ఈతీర్థయాత్రల వలన ఎంతో పుణ్యాన్ని లాభాన్ని పొందవచ్చు అని మనకు అనేకపురాణగాధలు చెబు తాయ.
త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు, ద్వాపర యుగంలో ధర్మరాజాదులు అడవులలో ఎన్నో పుణ్యాశ్రమాలను, నదీ నదాలను దర్శించి ఋషీశ్వరులవద్ద ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వారి ఆశీర్వాదాలు పొందుతూ అరణ్యవాస కాలాన్ని ధన్యం చేసుకున్నారు. ఎంతో జ్ఞానాన్ని ఆర్జించుకున్నారు.
ఈనాడు తీర్థయాత్రల పేరుతో మనం వెళ్లినదులల్లో ను, అక్కడి వాతావరణంలోను, పరిసరాల్లోను కలుషితంచేసేవారే ఎక్కువగా ఉన్నారు. నాటి తీర్థయాత్రల వల్ల పుణ్యాన్ని మూటకట్టుకుంటేఇపుడుచేసేయాత్రల వల్ల పదుగురిని వాచాదోషంతో మాట్లాడుతూ మరింత పాపాన్ని మూటకట్టుకుంటున్నామా అన్న సందేహానికితావునిస్తున్నారు చాలా మంది.
నిజానికి దేవుడు లేని చోటులేదు. ఇందుగలడు అందు గలడా అన్న సందేహం లేశ మాత్రమైనా లేకుండా అన్నింటిలోను అంతటా సర్వేశ్వరుడు చివరకు మనలోరః వున్నాడు. దీన్ని తెలుపటానికి అనేక పురాణగాధలూ ఉన్నాయ. కనుక వాటిని చదివి అందులోని అంతరార్థాన్ని తెలుసుకొంటే తీర్థయాత్రవల్ల లాభం ఏమిటో అర్థమవుతుంది. ఇవి తెలియడానికే ఆనాడు గజరాజుకి విష్ణుమూర్తి మోక్షమిస్తే ఆపద్భాంధవునిగామహావిష్ణువు ఖ్యాతి పొందితే పరమశివుడు శివుడు పాముకి సాలె పురుగుకి ఏనుగుకి మోక్షమిచ్చి అపార కృపాజలనిధిగా పేరుగాంచాడు.
తీర్థయాత్రలు ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ప్రశాంత వాతావరణంలో జన సమర్ధం లేని దేవాలయాలు దర్శించి ప్రశాంత చిత్తంతో భగవంతుడి ధ్యానంలో గడిపినపుడే వాటివల్ల సార్ధకత ఏర్పడుతుంది.

-ఆర్.ఎస్.హైమవతి