మెయన్ ఫీచర్

విశ్వ వేదికపై భారత్‌కు జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వ వేదికపై భారతదేశం తన నాయకత్వాన్ని నెమ్మది నెమ్మదిగా బలపరుచుకుంటోంది. ఏ రంగమైనా, ఏ అంశమైనా భారత్ పాత్ర లేకుండా, భారత్ అభిప్రాయం తెలుసుకోకుండా, భారత్ ప్రమేయం లేకుండా ప్రపంచంలో కీలక నిర్ణయాలు జరగడం లేదు. అయితే, ఈ ముఖ్య అంశాన్ని గుర్తించడంలో మనం వీలైనంత ఎక్కువ జాప్యం చేస్తున్నామేమో అని అనిపిస్తున్నది. ఇటీవల జరిగిన రెండు అంతర్జాతీయ అంశాలు ప్రపంచంలో భారత్ ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియచేస్తాయి.
‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్’ (డ్ద్ఘశద్ఘజ ష్య్యఔళ్ఘూఆజ్యశ యూఘశజఒ్ఘఆజ్యశఢ్ళ్జ) లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. 1996లో ‘ఎస్‌సిఓ’ను కజగిస్తాన్, క్రిజిగిస్తాన్, రష్యా, చైనా, తజకిస్తాన్ దేశాలు కలిపి ఏర్పాటు చేసుకున్నాయి. వివిధ అంతర్జాతీయ విషయాల్లో భారత్‌కు అడుగడుగునా అడ్డం పడుతున్న చైనా కూడా ‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనేజేషన్’లో భారత్ ఉండాలని పట్టుబట్టడం గొప్ప పరిణామం. ఎస్.సి.ఓలో భారత్ చేరిక వల్ల ఈ ప్రాంతపు ఆర్థికాభివృద్ధి, రవాణా సహా ఇతర వౌలిక సౌకర్యాల ఏర్పాటు, తీవ్రవాద వ్యతిరేక పోరాటంతోపాటు ఇతర అంశాలలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రపంచంలోని 40 శాతం జనాభాకు, ప్రపంచ జిడిపిలో 20 శాతానికి ఎస్.సి.ఓ. ప్రా తినిధ్యం వహిస్తోంది. కజగిస్తాన్‌లోని ఆస్తానాలో జరుగుతున్న ఈ సదస్సుకు మరొక ప్రాముఖ్యత ఉన్నది. భారత్-పాకిస్తాన్‌లో సంయుక్త సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తారు. రీజనల్ యాంటీ-టెర్రరిజం స్ట్రక్చర్ (ఆర్‌ఎటిఎస్) ఆధారంగా ఈ సైనిక విన్యాసం కొనసాగుతుంది. 2005 సంవత్సరం నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో పరిశీలక హోదాలో భారత్ కొనసాగుతూ వస్తున్నది. దిగువ స్థాయి సమావేశాలలో పాల్గొంటూ, రక్షణ ఆర్థిక అంశాలలో చర్చలు జరుపుతూ వస్తున్నది. ఇపుడు పూర్తిస్థాయి సభ్యత్వం రావడం వల్ల ఈ ప్రాంతపు సమగ్ర అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకమవుతుంది. మొదట్లో 5-6 దేశాల సరిహద్దుల వెంట శాంతిభద్రతలు కాపాడుకునే లక్ష్యంతో ఏర్పడిన ఎస్.సి.ఓ. తదనంతర కాలంలో తన పరిధిని విస్తృత పరుచుకుంటూ వచ్చింది. ఇపుడు భారత్ చేరికతో ఈ సంస్థ ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ఈ సంస్థలో భారత్ చేరిక వల్ల మధ్య ఆసియా క్షేత్రంలో అభివృద్ధితోపాటు సరిహద్దుల వెంట రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి.
అయిదు దేశాల సరిహద్దుల వెంబడి బలమైన సైనిక విశ్వాసం ఒప్పందంపై షాంఘైలో సంతకాలు చేయడంతో 26 ఏప్రిల్ 1996లో ఎస్.సి.ఓ. ప్రాణం పోసుకుంది. ఆ తరువాత మాస్కోలో జరిగిన మరొక సదస్సులో ఈ సరిహద్దుల వెంట సైనిక పటాలాన్ని తగ్గించుకోవాలని మరొక ఒప్పందం చేసుకున్నారు. ‘మానవత్వం’, ‘మానవ హక్కుల పరిరక్షణ’ తదితర అంశాలను సాకుగా చూపిస్తూ ఒక దేశం మరొక దేశపు అంతర్గత విషయాలలో తలదూర్చకూడదని నిర్ణయించుకున్నారు. 2001లో ఉజ్బెకిస్తాన్ కూడా ఇందులో చేరడంతో ఆరు దేశాలు అయ్యాయి. ఇపుడు భారత్, పాకిస్తాన్‌లు చేరడంతో 8 సభ్య దేశాలు అయ్యాయి.
మధ్య ఆసియా క్షేత్రంలో తీవ్రవాదం, వేర్పాటువాదం, సాయుధ పోరాటాలకు వ్యతిరేకంగా పనిచేయాలన్నది ఎస్.సి.ఓ. ప్రథమ లక్ష్యం. 2006లో జరిగిన సదస్సు ఈ దిశలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సభ్య దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆగని పక్షంలో అంతర్జాతీయ తీవ్రవాదాన్ని అడ్డుకోవడం కష్టమని ఈ స దస్సు అభిప్రాయపడింది. ‘అంతర్జాల యుద్ధం’ (్ళకఇళూ జ్ఘీచ్ఘిళ) కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కూడా ఎస్.సి.ఓ నిర్ణయించుకున్నది. అంతర్జాల యుద్ధం కారణంగా ఆయా దేశాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నైతిక విలువలు దెబ్బతింటున్నాయని దీన్నికూడా ఒక ప్రమాదంగానే భావించాలని ఈ దేశాలు అభిప్రాయపడ్డాయి. ఎస్.సి.ఓ. ఏర్పడిన తరువాత మధ్య ఆసియా ప్రాంతంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలపడింది. దేశాల మధ్య నిఘా విభాగపు సమాచారం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ బలపడింది. తీవ్రవాదంపై ఉమ్మడి దాడులు ప్రారంభమయ్యాయి. ఎస్.సి.ఓ. ఏర్పడిన తరువాత ఉమ్మడి విద్యుత్ ఉత్పాదక కేంద్రాల ఏర్పాటు కూడా ఊపు అందుకుంది. గ్యాస్, చమురు క్షేత్రాల అభివృద్ధికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. దేశాల మధ్య జల వినియోగంలో అవగాహన పెరిగింది. ‘ఎనర్జీ క్లబ్’లు ఏర్పాటయ్యాయి. ఆహార భద్రతపై చర్చలు విస్తృతంగా జరిగాయి. అంతర్జాతీయంగా ఇప్పుడున్న బ్యాంకింగ్ వ్యవస్థలకు భిన్నంగా సభ్య దేశాలు ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థికంగా కుదేలవుతున్న దేశాలను రక్షించుకోడానికి ఇటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం అని గుర్తించాయి. ఇపుడున్న ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) సంస్థలు కొన్ని దేశాలకు వత్తాసు పలుకుతూ, వారి ప్రయోజనాలు మాత్రమే కాపాడుతూ పెత్తందారీ తనాన్ని చెలాయిస్తున్నాయి. కాబట్టి సొంతంగా బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, పెంచుకోవడం, పొరుగుదేశాలతో పంచుకోవడం కోసం వీలైనన్ని ఎక్కువ చర్చలు చేపట్టాలని ఎస్.సి.ఓ. నిర్ణయించింది. మధ్య ఆసియా క్షేత్రంలో కీలకమైన ఎస్.సి.ఓలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించింది. భారత్ ప్రవేశంతో ఈ క్షేత్రం విస్తృతంగా అభివృద్ది చెందుతున్నదన్న విశ్వాసం ప్రస్ఫుటమవుతున్నది.
అంతరిక్షంలో భారత్ వరుస విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యచకితులను చేస్తున్నది. దాదాపు 640 టన్నుల బరువున్న రాకెట్, 3,136 కిలోల బరువున్న సమాచార వ్యవస్థకు చెందిన ఉపగ్రహం గగనంలో విజయ విహారం చేయనున్నాయి. నాలుగు టన్నుల బరువున్న సమాచార ఉపగ్రహాలను సొంతంగా ప్రయోగించుకోగలగడంతో విలువైన విదేశీ మారకం ఆదా కావడంతోపాటు ఇతర దేశాలపై మనం ఆధారపడే దౌర్భాగ్య పరిస్థితులు తొలగిపోతాయి. ఈ సమాచార ఉపగ్రహం పది సంవత్సరాలపాటు సమర్ధవంతంగా పనిచేయగలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట ‘సతీష్ ధావన్ స్పేస్ సెంటర్’ నుంచి ఈ ప్రయోగం జరిగింది. బరువైన ఈ ఉపగ్రహ ప్రయోగం తరువాత ‘హెవీ లిఫ్ట్ రాకెట్ క్లబ్’లో భారత్‌కు సభ్యత్వం లభించింది. ఇప్పటికే ఇందులో ఉన్న అమెరికా, రష్యా, చైనా, జపాన్, కొన్ని ఐరోపా దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా సగర్వంగా నిలబడుతున్నది.
ఇటీవల భారత్ ప్రయోగించిన ఉపగ్రహం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినదే. భారత మేధావులు, శాస్తవ్రేత్తలు దాదాపు 20 సంవత్సరాలపాటు ‘ఇస్రో’ నేతృత్వంలో జరిపిన సుదీర్ఘ పరిశోధనల కారణంగా మన దేశం నేడు ప్రపంచ దేశాల మధ్య నిలబడగలిగింది. మొదటి దశ క్రయోజనిక్ ఇంజన్ల ప్రయోగం 2001లో జరిగింది. మొదట్లో జరిగిన అనేక ప్రయోగాలు విఫలం చెందాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మన శాస్తవ్రేత్తలు పోరాడి ఈరోజున పూర్తి స్వయం సిద్ధత సాధించారు. 2002లో 2300 కోట్ల అంచనాలతో క్రయో ప్రయాణం ఊపందుకుంది. మధ్యలో అంతర్జాతీయంగా మనపైన పడ్డ ఒత్తిడులు, ఈ ఒత్తిడులకు లొంగిపోయిన గతంలోని బలహీన ప్రభుత్వం కారణంగా వీటి పరిశోధనల్లో మనం వెనుకబడిపోయాం. 2014-2016 మధ్యలో అతివేగంగా జరిగిన పరిశోధనల కారణంగా అంతరిక్ష రంగంలో భారత్ గర్వంగా తలెత్తుకు నిలబడగలుగుతోంది. అనేక వర్ధమాన దేశాలతోపాటు అభివృద్ధి చెందిన దేశాలు కూడా మనల్ని అనుకరిస్తున్నాయి. మన సహాయం అర్థిస్తున్నాయి. గతంలో ఒకసారి 106 ఉపగ్రహాలను గగన వీధిలోకి పంపిన ‘ఇస్రో’ ఇపుడు ఈ ప్రయోగంతో తిరుగులేని సంస్థగా పేరుగాంచింది. ఒక పక్క పరిశోధనలు కొనసాగిస్తూనే మరొక పక్క ఇతర దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతూ ఆదాయం కూడా పొందుతున్నది. అతి క్లిష్టతరమైన ప్రయోగాలను కూడా పూర్తిశ్రద్ధతో, విజయవంతంగా ప్రయోగించగల నైపుణ్యం ‘ఇస్రో’ సంపాదించుకున్నది.
భారతదేశం వేగంగా అభివృద్ధి దిశలో నడుస్తున్నది. అనేక రంగాలలో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా కీలకపాత్ర పోషిస్తున్నది. ఇవాళ భారత్ భాగస్వామ్యం లేని ప్రపంచ నిర్ణయాలు, ప్రపంచ విధానాలు కనపడవు. అది ఏ రంగమైనా- భారత్ తన వంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వహిస్తున్నది. ప్రభావవంతమైన ఫలితాలు సాధించగలుగుతున్నది. ప్రపంచ ప్రజల జేజేలు అందుకుంటున్నది. మనమే వాటిని కొద్దిగా ఆలస్యంగా గ్రహించగలుగుతున్నాం. గ్రహించగలిగినా, ఎంతోకొంత సంశయం, సందేహం వాటికి జోడిస్తున్నాం. ఈ మానసిక స్థితి నుంచి బయటపడితే భారత్ ఉజ్వల భవిష్యత్ స్పష్టంగా కనపడుతుంది. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113