మెయిన్ ఫీచర్

సహజమైతే అది ధర్మమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్ధరణాత్ ధర్మః’ అన్నారు. ‘్ధృ’- ధరించు అను ధాతువునుండి ‘్ధర్మము’ అనే పదము ఏర్పడినది. దేనివలన ఈ విశ్వమంతా ఇలా నిలిచి ఉన్నదో, మానవ జాతి సంఘటితంగా మనగలుగుతున్నదో, దానిని ‘్ధర్మము’ అంటారు.
ఏదైనా సరే, దాని సహజ లక్షణములను, అది ఉండవలసిన తీరును దాని ధర్మము అంటారు. మానవ జీవిత పరమ ప్రయోజనమును, జీవిత లక్ష్యమును పురుషార్థ సాధనగా చెప్పారు. పురుషార్థములు- ధర్మము, అర్థము, కామము మరియు మోక్షము అని ఋషులు చెప్పారు. నాలుగింటిలోకీ ప్రధానమైనది, ప్రథమమైనది ‘్ధర్మము’. ధర్మమును ఆచరించటమువలన అర్థమును, కామమును, మోక్షమును కూడా పొందగలము.
అయితే ‘్ధర్మము’ అంటే ఏమిటి? అన్నదానిని గురించి తెలుసుకోవాలి. నిశితంగా పరిశీలించాలి. ధర్మము అంటే ఏమిటి అన్నది మహర్షులు అనేక విధాలుగా చెప్పారు. వేదములలో ధర్మం గురించి చెప్పారు. పురాణాలలోనూ, ఇతిహాసాలైన శ్రీమద్రామాయణ, శ్రీమహాభారతములోను, శ్రీమద్భగవద్గీతలోను, ధర్మశాస్తమ్రులలోను అనేక విధాలుగా వివరించారు.
పరమాత్మ శాశ్వత విశ్వనియమాలను ఏర్పరచాడు. శాశ్వత ధర్మాన్ని గురించి వేదము చెప్పింది. దానినే ‘ఋతము’ అంటాము. ఎవ్వరూ దాటలేని, ఎదుర్కోలేని విశ్వనియమాలే ‘ఋతము’. పరమాత్మ సంకల్పము చేత సర్వప్రాణికోటి సంక్షేమం కోసం దైవశక్తులు, ప్రకృతి శక్తులు పాటించే నియమానే్న ‘ఋతము’ అంటాము. ఈ శాశ్వత విశ్వనియమాలు దేనియందు ప్రతిష్ఠితమై ఉన్నాయో, అదే సత్యము. త్రికాలలోను మారనిది సత్యము. ‘సత్యం త్రికాలాబాధితమ్’ సత్యమే ధర్మము. ప్రకృతి శక్తుల శక్తే ధర్మము. సూర్యుడు వేడిమిని వెలుతురును ఇస్తాడు. చంద్రుడు వెనె్నలను చల్లదనాన్ని ఇస్తాడు. వాయువు జీవుల జీవనానికి ఆధారమై ఉంటుంది. నీరు చల్లగా ఉంటుంది. క్రిందికి ప్రవహిస్తుంది. అగ్ని కాల్చుతుంది. పైకి ప్రాకుతుంది. ప్రకృతిలోని ఋతువులు ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. ప్రపంచంలో ఋతు ధర్మాలు గోచరిస్తాయి. ప్రకృతిమాత ఆయా కాలాలకు తగిన పూలు పళ్ళను, ఎండను, వేడిమిని, చల్లదనాన్ని ఇస్తుంది. రాత్రి పగలు వస్తుంటాయి. ఇదంతా ఇలా ప్రవర్తించటమే ‘ఋతము’ అనబడుతుంది. సూర్యచంద్రులు, ప్రకృతి శక్తులు అందరూ వాటి వాటి ధర్మాలను కలిగి ఉంటారు, పాటిస్తారు. దేవతలకు దేవతా ధర్మాలుంటాయి. స్థావర జంగమాలకు వాటి ధర్మాలుంటాయి. అలాగే జంతువులకు సర్వప్రాణికోటికీ వాటి వాటి ధర్మాలుంటాయి. పశువులకు పశుధర్మం ఉంటుంది. మానవులకు వారి ధర్మాలుంటాయి. సృష్టిలోని సర్వప్రాణికోటిలో మానవ జన్మ సర్వోత్కృష్టమైనది కనుక మానవుల ధర్మాలు విశిష్టమైనవి. వారికి సార్వకాలికలు, సార్వదేశికాలు, సార్వజనీనాలు అయిన శాశ్వత ధర్మాలుంటాయి. అవి- సత్యము, ధర్మము, సమత, ప్రేమ, అహింస, భూతదయ, యజ్ఞాచరణ, మాతా పితృసేవ మొదలైనవి. అందరి సుఖాన్ని కోరటాన్ని ‘దయ’ అంటారు. సర్వభూతముల సుఖం కోరటం భూతదయ.
కొన్ని ధర్మాలు దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి. అవి సాధారణ ధర్మాలు. ఈ సాధారణ ధర్మాలు అనేక రకాలుగా ఉంటాయి. అందులోనూ అందరికీ వర్తించే సామాన్య ధర్మాలుంటాయి. వ్యక్తి వ్యక్తికీ భిన్నంగా ఉండే ధర్మాలుంటాయి. ప్రతి వ్యక్తికీ అనేక రకాల సాధారణ ధర్మాలుంటాయి. దైవ సంబంధమైన ధర్మాలు, సాంఘిక ధర్మాలు, వైయక్తిక ధర్మాలు, బంధు ధర్మాలు మొదలైనవి. వీటన్నింటికంటే మిన్నయైనది దేశ పౌరునిగా దేశము పట్ల ధర్మము.
జీవితంలో ఏ ప్రయోజనాన్ని ఆశించి, ఏ పని చేసినా, ధర్మమార్గంలోనే సాధించాలి. అప్పుడే అది శ్రేయోదాయకమవుతుంది. అధర్మంతో సంపాదించినది పేకమేడలా కూలిపోతుంది.
మనిషి ఐహితమన, ఆముష్మికమైన ఏ కోరికలను పొందగోరినా, వాటిని ధర్మబద్ధమైన మార్గంలోనే పొందటానికి ప్రయత్నించాలి. లేనప్పుడు ఆ కోరికలే విషనాగులలా కాటువేస్తాయి. పాపహేతువులయి బంధనానికి కారణవౌతాయి. ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేవారికి ఏ లోటూ రాకుండా పరమాత్మ చూసుకుంటాడు.

- టి.విశాలాక్షి